Sunday, February 24, 2013

Tips to lessen Backbone pain ,వెన్నునొప్పి తగ్గడానికి చిట్కాలు

  •  
 ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Tips to lessen Backbone pain ,వెన్నునొప్పి తగ్గడానికి చిట్కాలు  - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

వెన్ను నొప్పి (దీన్నే డోర్సాల్జియా అని అంటారు) అనేది వీపులో వచ్చే నొప్పి. ఇది సాధారణంగా కండరాల నుండి కాని, నరాల నుండి కాని, ఎముకల నుండి కాని, కీళ్ళ నుండి కానీ, వెన్నుపాములోని ఇతర నిర్మాణాల నుండి కాని పుడుతుంది.ఈ నొప్పిని తరచుగా మెడనొప్పి, వెన్ను పై భాగపు నొప్పి, వెన్ను దిగువ భాగపు నొప్పి) , హలాస్థి నొప్పి గా విభజిస్తుంటారు. ఇది ఆకస్మికంగా గానీ, ఎడతెగని నొప్పిగా గానీ ఉండొచ్చు. స్థిరంగా కానీ, విడతలు విడతలుగా వస్తూ పోతూ కానీ, ఒకే చోట కానీ, అనేక ప్రదేశాలకు విస్తరిస్తూ కానీ ఉండొచ్చు. అది కొద్ది పాటి నొప్పిగా కానీ, పదునుగా, చీల్చుక పోతున్నట్టుగా కానీ, మంటతో కానీ ఉండొచ్చు. మోచేతి లోకి, చేతి)లోకి, వెన్ను పై భాగానికి, వెన్ను దిగువ భాగానికి కానీ నొప్పి వ్యాపించవచ్చు(కాలు, లేదా పాదంలోకి వ్యాపించవచ్చు). నొప్పితో సంబంధం లేని బలహీనత, మైకము, తిమ్మిరి కనిపించవచ్చు.

వెన్నునొప్పి అనేది మనుషులలో చాలా తరచుగా ఏర్పడే సమస్యలలో ఒకటి. U.S.లో వైద్యుడిని కలవడానికి తరుచుగా చెప్పే కారణాలలో, వెన్ను దిగువ భాగాన తీవ్రంగా వచ్చే నొప్పి (దీన్నే నడుం నొప్పి) అంటారు) ఐదవది. పెద్ద వాళ్ళలో ప్రతి పది మందిలో తొమ్మిది మందికి, జీవితంలో ఎప్పుడో ఒకసారి వెన్ను నొప్పి వస్తుంది. ప్రతి పదిమంది శ్రామికులలో ఐదు మందికి, ప్రతి సంవత్సరమూ వెన్ను నొప్పి కనపడుతుంటుంది.వెన్ను పాము అనేది నరాలు, కీళ్ళ, కండరాలు, స్నాయువు, అస్థి సంధాయకాలతో కూడిన సంక్లిష్టమైన అంతఃసంధాయక యంత్రాంగం. ఇవన్నీ నొప్పిని కలిగించే సామర్ధ్యం కలవి. వెన్నుపాము నుండి పుట్టిన పెద్ద నరాలు కాళ్ళలోకి, మోచేతులలోకి ప్రయాణించి నొప్పిని శరీరంలోని సుదూర ప్రాంతాలకు వ్యాపింపచేస్తాయి.

కాసేపు కదలకుండా కూర్చుంటే చాలు, కొంతమంది మహిళల్లో వెన్ను నొప్పి మొదలవుతుంది. దీనిని మొదట్లో నిర్లక్ష్యం చేస్తే తరవాత సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది. కనుక నొప్పి అనిపిస్తున్నప్పుడే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
  •  ఆఫీసులో గంటల కొద్దీ ఒకే భంగిమలో శిల్పంలా కూర్చోకూడదు. తరచూ కుర్చీలో అటూఇటూ కదలడం, అప్పుడప్పుడు ఒకవైపు ఒరగడం చేయాలి. లేకపోతే వెన్నెముకలో ఒకేచోట ఒత్తిడి పడి, ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశముంది.
  • వెన్ను నొప్పి తరచూ వచ్చే వాళ్లు తలని దాటి(తలకు మించిన -మోయలేని) బరువులు ఎత్తకపోవడమే మంచిది. అలాగే మీ శక్తి స్థాయిని బట్టి బరువులెత్తే ప్రయత్నాలు సరదాకి కూడా చేయొద్దు.

  • పడుకునే విధానం కూడా నొప్పికి కారణమవుతుంది. మీరు పొట్టపై భారం పడేట్టు పడుకునే వారయితే పొట్ట భాగంలో పల్చటి మెత్తటి దిండుని పెట్టుకుని పడుకోవాలి.
  •  విటమిన్‌ 'డి' తక్కువగా అందే వారిలోనూ వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. రోజూ ఉదయాన్నే ఎండలో పది నిమిషాలు నిల్చుంటే కావాల్సిన 'డి' విటమిన్‌ అందుతుంది. చేపలూ, పాలూ, సోయా, కోడి గుడ్ల నుంచీ ఈ విటమిన్‌ లభిస్తుంది.

  •  స్విస్‌బాల్‌పై రోజూ ఇరవై నిమిషాల పాటు కూర్చోవాలి. దీనివల్ల వెన్ను కండరాలు బలంగా తయారవుతాయి. నొప్పి వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

  •  తరచూ క్రంచ్‌ ఎక్సర్‌సైజ్‌ చేస్తూ ఉంటే డెబ్భై ఐదు శాతం నడుం నొప్పి తగ్గుతుంది.

  • ========================
 Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.