Tuesday, October 2, 2012

Meniere's Disease-మీనియర్స్ డిసీజ్

 

  •  Courtesy with : http://american-hearing.org/
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మీనియర్స్ డిసీజ్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


చెవిలో గుయ్‌మనే శబ్దం, చెవిలో పూర్తిగా ఏ శబ్దమూ వినిపించదు.  చెవిలో ఎప్పుడూ హోరులాగా శబ్దం వినిపిస్తుంటుంది. దీనికి తగ్గట్లు  తరచుగా వాంతులు, వికారం వంటివి కూడా ఇబ్బంది పెడుతున్నాయి.  సమస్యతో తీవ్రంగా నలిగిపోతారు.  ఈ వ్యాధి వయసుమళ్లిన వారిలోనే కనిపిస్తుంది. 40-50ఏళ్ల వయసులో ఎక్కువగా ఈ వ్యాధిని చూస్తుంటాము. చిన్న వయసువారిలో కనిపించదు. ఇది చెవి లోపలి భాగంలో తలెత్తే సమస్య. దీర్ఘకాలిక వ్యాధిగా పరిగణించే ఈ వ్యాధి లక్షణాలు అన్ని వేళలా కనిపించవు. "మినియర్స్ డిసీజ్"  చెవిలోపలి భాగంలో వచ్చే సమస్య. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇందులో వ్యాధి లక్షణాలు ఎల్లప్పుడూ ఉండవు. అప్పుడప్పుడు లక్షణాలు అధికమవుతుంటాయి. లక్షణాలు సాధారణంగా 20 నిమిషాల నుంచి 2 గంటల పాటు ఉండవచ్చు. సాధారణంగా ఈ వ్యాధి ఒక చెవికే వస్తుంది. ఇది ప్రాణాలకు హాని కలిగించే వ్యాధి కాదు.

కారణాలు :
ఇది లోపలచెవి సంభందించిన వ్యాధి. సాధారణంగా చెవి లోపలి భాగంలో ఉండే ద్రవపదార్ధం ఎక్కువ కావడం వల్ల వస్తుంది.ఈ వ్యాధిని ఒక ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుని " Prosper Ménière,''పేరున  పిలుస్తారు . దీనికి సరియైన కారనము తెలీదు . . . కాని ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్ ములాన వచ్చే లోపలచెవి వ్యాధి. వర్టిగో రావడానికి ఒక ముఖ్యకారణము . ఇది 1860 ప్రాంతములో గుర్తించినా చాలాకాలము వరకూ ఎదోతెలియని వినికిడి జబ్బు గా పరిగణించబడినది. దీని లక్షణాలు ఒక్క సారిగా (సడన్‌) కనిపించవు .. ఒకటి ఒక్కటిగా క్రమేపీ ... వస్తూ పోతూ ... అప్పుడప్పుదు ఎపిసోడ్స్ లాగా ఉంటాయి.

లక్షణాలు :
తల తిరగడం, నడుస్తున్నప్పుడు లేదా పనిచేస్తున్నప్పుడు కళ్లు తిరగడం వలన అదుపు తప్పి సరిగా నడవలేకపోవడం, చెవి లోపలి భాగంలో ఏదో బరువుగా ఉన్నట్లు, నిండినట్లు అనిపించటం, చెవిలో నుంచి శబ్దాలు వినిపించటం, బయటి శబ్దాలు సరిగా వినిపించకపోవటం, వికారంగా అనిపించటం, అది ఎక్కువై ఒక్కోసారి వాంతులు కావడం, చెమట పట్టడం (వ్యాధి తీవ్రత ఎక్కువైనపుడు).  తలనొప్పి, చిన్న శబ్దాలు కూడా తట్టుకోలేరు. సమస్యలు కళ్లు మూసినపుడు, వాహనంలో ప్రయాణిస్తున్నపుడు శబ్దాలకు ఎక్కువగా ఉంటుంది.  చిరాకు, నీరసం, వినకిడి కష్టంగా ఉండడం, నములుతున్నపుడు చెవిలో శబ్దాలు రావడం,

వ్యాధి నిర్ధారణ పరీక్షలు
చెవి వినికిడి శక్తిని పరీక్షించేందుకు ప్యూర్ టోన్ ఆడియోమెట్రి పరీక్ష, రక్త పరీక్షలు, ఎమ్‌ఆర్‌ఐ, సీటీ స్కాన్. ఈ పరీక్షల వలన చెవి అంతర్భాగం, తలలో ఉండే సమస్యలను గుర్తించవచ్చు. చెవి డాక్టర్ ని సంప్రదించి ఆడియో మెట్రీ పరీక్షలు చేయించుకోవాలి .

తీసుకోవలసిన జాగ్రత్తలు
ఆహారంలో ఉప్పు మోతాదు తగ్గించటం, పొగ, మద్యపానం లాంటి అలవాట్లు మానుకోవటం, కాఫీని పరిమితంగా మాత్రమే తీసుకోవటం, యోగా, ధ్యానం లాంటి పక్రియల ద్వారా మానసిక ఆందోళనను తగ్గించుకోవటం.

సమస్య అధికంగా ఉన్పప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వెల్లకిలా పడుకోవటం, తల తిరిగినట్లు అనిపించినప్పుడు ఏదైనా ఒక వస్తువుపై దృష్టి కేంద్రీకరించటం, చెవిలో శబ్దాలు వినిపించటాన్ని తగ్గించుకోవటం కోసం దూది పెట్టుకోవటం.

చికిత్స :
లోపల చెవిలో నీటి వత్తిడి కారణం గా వచ్చే వ్యాధి కనుక ... బి.పి. పెరగకుండా ఉప్పు తగ్గించి ఆహారము తీసుకోవాలి .
మధ్యపానము , ధూమపానము , కెఫినేటెడ్ పానీయాలు ఎక్కువగా తీసుకోరాదు . ఇవి మీనియర్స్ వ్యాధి లక్షణాలను బలోపేతము చేస్తాయి... హోరు ఎక్కువగా అనిపించును .
వికారము ,వాంతి తగ్గడానికి .. meclozine or dimenhydrinate, trimethobenzamide and other antiemetics, betahistine, diazepam, or ginger root, మున్నగునవి వాడవచ్చును .
యాంటిహెర్పిస్ మందు : "ఎసివిర్ " వాడే చరిత్ర ఉంది.

మీనియర్స్ వ్యాధి ఇబ్బంధికరమైన , అసహనానికి గురిచేసే వ్యాది కనుక మానసికం గా డిస్టర్బ్ అవకుండా '' యోగా''  అరోమా థిరఫీ వాడవచ్చును.

Intratympanic steroid treatments వాడే పద్దతి కూడా బాగా ప్రాచుర్యములోనికి వచ్చినది .
 labyrinthectomy సర్జరీ చేయడము ద్వారా హోరు తగ్గి ఉపసమనము ఇచ్చినా వినికి లోపము శాస్వితముగా కలుగును.


  • ============================

Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.