Thursday, October 4, 2012

Arthritis medicine from sea plant,సముద్రపు మొక్క నుంచి ఆర్థరైటిస్‌ మందు,


  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సముద్రపు మొక్క నుంచి ఆర్థరైటిస్‌ మందు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

 సముద్రపు మొక్క నుంచి ఆర్థరైటిస్‌ మందు--దుష్ఫలితాలు లేని మెరుగైన చికిత్స October/2012

కీళ్ల అరుగుదల (ఆర్థరైటిస్‌) వ్యాధితో బాధపడుతున్న రోగులకు మంచి ఉపశమనం కలిగించేలా సముద్రపు కలుపు మొక్క (సీ వీడ్‌) నుంచి తాము తయారు చేయించిన ఔషధం మంచి ఫలితాలను ఇస్తోందని 'కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ' (సి.ఎం.ఎఫ్‌.ఆర్‌.ఐ.) డైరెక్టర్‌ డాక్టర్‌ జి.సైదారావు వెల్లడించారు. మేరి కల్చర్‌ పేరుతో కొత్తగా సముద్రంలో చేయబోయే ప్రయోగాలను సమన్వయపరచే ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం ఆయన కోచి నుంచి విశాఖకు వచ్చారు. 'ఈనాడు-ఈటీవీ' ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

పచ్చ ఆల్చిప్పల నుంచి తీసిన న్యూట్ర సీడికల్‌ను ఉపయోగించి ఆర్థరైటిస్‌కు మందును తొలుత తయారు చేసి ప్రయోగించాం. అది మంచి ఫలితాలనే ఇచ్చింది. అయితే అది మాంసాహారమనే ఉద్దేశంతో కొంతమంది రోగులు దానిని తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. దీంతో శాకాహారం నుంచి దీనిని తయారు చేయాలనే ఉద్దేశంతో సముద్రంలో లభ్యమయ్యే ఒక రకమైన కలుపుమొక్కని ఎంచుకున్నాం. దీని నుంచి తీసిన న్యూట్ర సీడికల్‌ను ఉపయోగించి తయారు చేసిన మందును వెయ్యి మంది రోగులకు ఉచితంగా ఇచ్చి పరీక్షింపజేశాం. 95% మంది మంచి గుణం ఇచ్చిందని చెప్పారు. ఇదో అద్భుతం. ఇంతటి విజయం గతంలో ఎవరికీ లభించలేదు. సాధారణంగా ఆర్థరైటిస్‌ రోగులకు నొప్పిని నివారించే మందుల్ని ఇస్తారు. దానివల్ల ఇతర సమస్యలు వస్తుంటాయి. మేం తయారు చేయించిన మందువల్ల అలాంటి సమస్యలు లేవు.

  • =======================
 Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.