Friday, September 28, 2012

Vertigo - వర్టిగో

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Vertigo - వర్టిగో-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


నిద్రలేచినప్పడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ, ఒక పక్కకు తిరిగే ప్రయత్నంలో కానీ, ముందుకు వంగి పనిచేయడంలో కానీ, ఉన్నట్టుండి తల తిరగడం తద్వారా పడిపో వడం, వాంతులవడం వంటి లక్షణాలుంటే ఆ సమస్యను వర్టిగో అంటాం. ఇది డిజినెస్ (Dizziness) వ్యాధి ఉప విభాగము లలో ఒకటి . ఒక వ్యక్తి  స్థిరముగా ఉన్నప్పుడు తిరుగు తున్నట్లు అనుభూతిని పొందే దాన్నే వర్టిగో అంటాము . లోపల చెవి లోని వెస్టిబ్యులార్ సిస్టం లో పనిలో అసమతుల్యము వలన కలుగుతూ ఉంటుంది.


వర్టిగో చెవికి సంబంధిన వ్యాధి . చెవికి సంబంధించిన వ్యాధుల గురించి తెలుసుకోవడానికి ముందు చెవి చేసే పనులు ఏమిటనేది తెలుసుకోవడం కూడా ముఖ్యమే. చెవి ప్రధానంగా వినికిడిని అంటే ధ్వనిని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మనం సరిగ్గా నిట్టనిలువుగా నిలబడటానికి, అటూ ఇటూ తూలకుండా నడవడానికి కూడా చెవి ఉపయోగపడుతుంది. చెవిని వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి  అనే  భాగాలుగా విభజించొచ్చు.ఒక్కోక్క విభాగములో అనేక అవయవాలు సముదాయము ఉంటుంది.
మూడు రకాల వర్టిగో లుగా విభజించడం జరిగింది .
ఆబ్జక్టవ్ (Objective) రకము : ఇందులో వ్యక్తి తనచుట్టూ వస్తువులు తిరుగుతున్నట్లు అనుభూతిని పొందుతాడు .
సబ్జక్టివ్ (Subjective) రకము : ఇందులో వ్యక్తి తనే తిరుగుతున్నట్లు అనుభూతిని పొందుతాడు .
సూడోవర్టిగో(Pseudovertigo) రకము : వ్యక్తి తన తలలో ఒకరకమైన విపరీతమైన తిరుగుడు అనుభూతిని పొందడము.
Dizziness మరియు  Vertigo అన్ని వయసులవారిలోనూ కనిపెస్తూ ఉంటుంది. జనాభా లో సుమారు 20-30 శాతము ఉంటుంది . పిల్లలలో కంటే పెద్దవారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది.

వివిధ కారణాల వల్ల వర్టిగో రావొచ్చు.
ముఖ్యము గా :
బినైన్‌ పారాక్షిస్మల్ పొజిషనల్ వర్టిగో(benign paroxysmal positional vertigo) , 
కంకషన్‌ (concussion),
వస్టిబ్యులార్ మైగ్రైన్‌ (vestibular migraine),
అరుదుగా : (rarely)
మినియర్స్ డిసీజ్ (meniere's disease),
వెస్టిబ్యులార్ న్యూరైటిస్ (vestibular nuritis),
అతిగా మద్యపానము (excessive alcohol intake),
చిన్నపిల్లలు తిరుగు ఆట (spinning game of children) , మున్నగునవి .

వర్టిగో వర్గీకరణ :
1)బాహ్య పరమైన వర్టిగో ,2)కేంద్ర పరమైన వర్టిగో .

బాహ్య పరమైన వర్టిగో : లోపల చెవి లేదా వెస్టిబ్యులార్ సిస్టం సమస్యల వలన అనగా సెమిసర్క్యులార్ కెనాల్ , ఆటోలిత్ మరియు వెస్టిబ్యులార్ నరము లతో కూడుకున్న సమస్యల వలన ముఖ్యము గా " బినైన్‌ పరాక్షిసమల్ పొజిషనల్ వర్టిగో() 32 శాతము , మీనియర్స్ సిండ్రోం , సుపీరియర్ కెనాల్ డెహిసెన్‌సు సిండ్రోం , లాబెరింతైటిస్ మరియు వీటి సంబంధిత జబ్బులు మూలాన కలుగును.  ఇది ఎక్కువగా జలుబు, ఫ్లూ జరాలు , లోపల చెవి లో తగిలిన గాయాలు అనగా రసాయనిక లేదా బయటి కపాలానికి తగిలిన గాయాలు , కొన్ని సమయాలలో ప్రయాణము ద్వారా వికారము వలన సంభవించును.  అసమతుల్యము , వికారము , వాంతి, వినికిడి లోపము , చెమిలో హోరు , చెవినొప్పి మున్నగు బాదలు కలుగును. పెరిఫెరల్ వర్టిగో సర్దుబాటు గుణము మూలంగా కొన్ని రోజులలో తగ్గి;ఫోవును లేదా అదుపులొనే ఉండును.

కేంద్ర పరమైన వర్టిగో .> ఇది చెవి సంబంధిత మెదడు భాగాలు సమస్యలు వల్ల కలుగును .కపాలము ఎముల ఫ్రాక్చర్స్ , మెదడులో రక్తస్రావము , మెదడులో కంతులు , మూర్చ , మెడ భాగం వెన్నుపూస సమస్యలు , మైగ్రైన్‌ తలనొప్పులు, లేటరల్ మెడుల్లరీ సిండ్రోం , మల్టిపుల్ స్క్లీరోసిస్ , పార్కి్న్‌సోనిజం మొకలైన వ్యాదుల ప్రబావము వలన కలుగును.  కేంద్రపరమైన వర్టిగో లో నరాలకు సంబందించిన ... మాటమేస , వస్తువు రెండుగా కనిపించడము , అసమతుల్యము కొన్ని సమయాలలో వ్యక్తి నవలేక పోవడము ... తూలిపోవడము జరుగును .

లక్షణాలు :
తూలిపోవడము , నడవలేకపోవడము , వికారము , వాంతి , నిలబడడములో సంతుల్యము లేకపోవడము , ఎక్కువ చెమట పోయడము , నినికిడి లోపము , చూపులోపాలు(డబుల్ విజన్‌) , మాటమేస , పరిసరాల గమనిక లోపము  మఒదలైనవి ఉంటాయి.

జాగ్రత్తలు

కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తలతిరుగుడు సమస్య నుంచి బయటపడొచ్చు. వెర్టిగోతో బాధపడేవారు ఈత కొట్టకూడదు. మంట దగ్గర ఉండకూడదు. వాహనాలు నడపకూడదు. జంతువులతో ఆడకూడదు. బాత్‌రూంకు వెళ్లినప్పుడు తలుపు గడియపెట్టకూడదు. ఎందుకంటే ఈ సమయంలో కళ్లు తిరిగి పడిపోతే, సహాయం చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి. మానసిక ఒత్తిడి తగ్గంచుకోవాలి. ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి. రక్తపోటు (బీపి), మధుమేహం ఉన్నవారిలో సెంట్రల్‌ వర్టిగో వచ్చే అవకాశం ఎక్కువ. అందుకని వీటిని నియంత్రణలో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వీటిని చెక్‌ చేసుకుంటుండాలి. ధూమాపానం, ఆల్కహాలు అలవాటు వల్ల సెంట్రల్‌ వర్టిగో వచ్చేందుకు ఆస్కారముంది. వీటిని వెంటనే మానాలి. జీవన శైలిలో మార్పులు రావాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. కనీసం రోజుకు 30 నుంచి 45 నిమిషాలు వాకింగ్‌ చేయాలి. రక్తంలో కొలెస్ట్రాల్‌ సాధారణ స్థాయిలో ఉండేట్లు చూసుకోవాలి. కొలెస్ట్రాల్‌ ఎక్కువున్న వారు పాలు, మీగడ, వెన్న, నెయ్యి వాటిని మితంగా తీసుకోవాలి. ఆహారంలో ఆకు కూరలు, కూరగాయలు ఉండాలి. రోజుకు రెండు నుంచి ఐదు రకాల పండ్లు తీసుకోవాలి.

వర్తిగో లక్షణాలు గల ఇతర వ్యాధులు : 

Benign paroxysmal positional vertigo,

Vestibular migraine,

Ménière's disease,

Vestibular neuritis,

Motion sickness.


Vertigo - వర్టిగో చికిత్స (మందులు):for general purpose->
  • సిన్నర్జిన్‌ – 25 మిల్లీ గ్రాముల నుండి 75 మిల్లీగ్రాముల వరకు రోజూ రెండు సార్లు వాడాలి.
  • డోమ్‌పెరిడోన్‌ – 10 నుండి 20 మిల్లీగ్రాములు రోజూ రెండు సార్లు వాడాలి.
  • బీటా హిస్టిన్‌ హైడ్రోక్లోరైడ్‌ – 8,16,24 మిల్లీగ్రాముల డోసులు రోజుకు 2 లేక 3 సార్లు వాడాలి.
  • యాంటి హిస్టమిన్‌సు అనగా సిట్రజైన్‌ 1-2 మాత్రలు రోజూ 10 రోజులు వాడాలి , 


  •  =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.