Saturday, September 8, 2012

మానసిక ఆంధోళనతో లైంగిక సమస్యలు(Psychological Sexual problems)



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



నవీనయుగంలో పోటీతత్వం మనిషిని అనుక్షణం తేరుకోకుండా కాలంతో పరుగులు తీయుస్తుంది. పని ఒత్తిడి మనసు ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడంలేదు. ప్రతిక్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, సమయపాలనా లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు ‘లైంగికపరమైన’ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేడు ‘డయాబెటిస్’ వ్యాధిగ్రస్తులు 50 నుండి 60 శాతం మంది సెక్స్ సమస్యలతో బాధపడుతున్నారు.

నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యధిక శాతం మానసిక దుర్భలత్వం, భయం , డయాబెటిస్‌వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధ వ్యాధుల లోపాలవలన, అంగస్తంభన, శీఘ్రస్కలన సమస్య, సెక్స్ కోరికలు తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి గల కారణం హార్మోన్ల లోపాలు, డయాబెటిక్ న్యూరోపతి, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం. లైంగిక సామర్థ్యం మానసిక శక్తిమీద ఆధారపడి ఉంటుంది. భయం, ఆందోళన, అనుమనాలు, శీఘ్రస్కలనాలు, స్తంభన లోపాలు వంటి సమస్యలు మనిషిని మానసికంగా బలహీనపరిచి లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. ఇటువంటివారికి మొదటగా ఆత్మవిశ్వాసం పెంచటానికి కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత సమస్యకు అనుగుణంగా మందులు ఇవ్వడంవలన లైంగిక వైఫల్యాలనుండి విముక్తి పొందవచ్చును.

సామర్థ్యం తగ్గకుండా ఉండాలంటే...
మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు, పాలు, గ్రుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి. కీర దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్‌తో తయారుచేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి. యాపిల్, జామ, దానిమ్మ, ద్రాక్ష, నేరేడు వంటి తాజా పండ్లు తీసుకోవాలి.
మద్యపానం సేవించుట, స్మోకింగ్, గుట్కాలు, పాన్‌పరాగ్, నార్కోటిక్స్ తీసుకోవటంవంటి వ్యసనాలను వదిలివేయాలి. తక్షణ లైంగిక సామర్థ్యం కోసం ‘స్టిరాయిడ్స్’ నిత్యం వాడటంవలన లైంగిక పటుత్వం క్రమేపి తగ్గిపోవును.
తీవ్ర మానసిక ఒత్తిళ్లు హార్మోన్లపై ప్రభావం చూపి లైంగిక సామర్థ్యాన్ని తగ్గించును. కావున మానసిక ఒత్తిడి నివారణకు నిత్యం యోగా, మెడిటేషన్‌తోపాటు ఒత్తిడిలేని మంచి జీవన విధానమును అలవరచుకొనుటకు ప్రయత్నం చేయాలి. ప్రతి రోజు ఉదయం వేకువ జామున 30ని. నుండి 45ని.ల వరకు నడవటంవలన మానసిక ప్రశాంతత ఏర్పడి ఒత్తిళ్లను అధిగమించవచ్చు.

చికిత్స: ‘డయాబెటిస్’ వ్యాధిగ్రస్తులలో లైంగిక సమస్యలను రూపుమాపే శక్తివంతమైన ఔషధాలెన్నో వైద్యంలో కలవు. వ్యక్తి యొక్క మానసిక వ్యక్తిత్వ, శారీరక లక్షణాలను ఆధారం చేసుకొని వైద్యం చేసినచో లైంగిక సమస్యలను త్వరితంగా నివారించవచ్చు.డయబిటీస్ పూర్తి కంట్రోల్ లో ఉంచుకోవాలి.

మందులు
Fludac caps :- నీరసం, నిస్త్రాణ ఎక్కువ శీఘ్రస్కలన సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నవారికి , శీఘ్రస్కలన నివారణకు ఈ మందు బాగా పనిచేయును. అలాగే అంగం పూర్తిగా ఉద్రేకం చెందక ముందేగాని, లేదా అంగ ప్రవేశం అయిన వెంటనే స్కలనం అవుతూ, మధుమేహంతో మాధపడేవారికి ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చును.

Tryptomer tablets: వీరికి లైంగిక వాంఛ అధికం. కాని సంభోగించు శక్తిని త్వరగా కోల్పోయి, లైంగిక వాంఛ మాత్రం మిగులుట గమనించదగిన లక్షణం. మానసిక స్థాయిలో వీరు సన్నిత స్వభాలు. ఎదుటివారి సానుభూతిని కోరుకుంటారు. ప్రతిదానికి తేలికగా ఆకర్షితులవుతారు. భయం, ఆందోళన ఎక్కువగా కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలు ఉండి ‘డయాబెటీస్’ వ్యాధితో బాధపడేవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.

Awagandha : ఈ మందు యువకుల్లో వచ్చే నపుంసకత్వానికిది ముఖ్యమైనది. అతిగా కామకలాపాల్లో పాల్గొనడంవల్ల, హస్తప్రయోగానికి గురై లైంగిక సామర్థ్యం కోల్పోయిన వారికి ఈ మందు ప్రత్యేకమైనది. వీరు మానసిక స్థాయిలో దిగులుగా, ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ద్వేషం, అహం పిరికితనం కలిగి ఉంటారు. ముసలితనం ముందుగానే వచ్చినట్లుగా నుదుటిపై ముడతలు పడతాయి. ఎవరైనా కృతజ్ఞతలు తెలిపితే వెంటనే కంటతడిపెడతారు. ఇటువంటి లక్షణాలు ఉండి డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు లైంగిక సామర్థ్యం కొరకు ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చును.

Viagra (sildenafil citrate): వీరు పూర్తిగా నపుంసకత్వంతో బాధపడుతూ ఉంటారు. కామవాంఛ తక్కువగా ఉండి అంగస్తంభన జరుగదు. అలాగే స్కలనం కూడా తెలియకుండానే తరచుగా జరుగును. వీరికి సంభోగవాంఛ కూడా ఉండకపోవుట గమనించదగిన లక్షం. ఇలాంటి లక్షణాలున్న మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ మందు ప్రయోజనకారి.

Neurokind Gold caps : నిత్యం మద్యం సేవిస్తూ, సరైన నిద్ర లేక నరాల బలహీనత ఏర్పడి, సంభోగశక్తిని కోల్పోయిన డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకి ఈ మందు బాగా ఉపకరిస్తుంది.

Fluoxetine:మానసికంగా కామవాంఛ కోరిక ఉన్నా శారీరకంగా అంగస్తంభన జరుగక తెలియకుండానే స్కలనం జరిగిపోవును. స్కలనం అనంతరం తీవ్ర నీరసంతో బాధడేవారికి ఈ మందు ఆలోచించదగినది.

  • ================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.