Friday, September 30, 2011

ఆశ - ఆరోగ్యము , Longing and Healthఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఆశ తో ఆరోగ్యము , Longing and Health- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ఆశ అనేది ప్రతిజీవికి ఉంటుంది . ఉండాలి . ఆశలేనిదే బ్రతుకు లేదంటారు . ఆశ ... అత్యాశ కాకూడదు . ఆశ , నిరాశ ఒక జీవితం లో కలిసే ఉంటాయి . ఆశకి ఆరో్గ్యానికి సంబంధము ఉన్నది . గుండెజబ్బులకు , పక్షవాతం వంటివాటికి గురయ్యే వారిలో అధికశాతము నిరాశావాదులని తేలింది . వారి మనసుల్లో గూడుకట్టుకునే నిరాశావాదము వారి రక్తపోటు ను పెంచుతుంది . నిరాశావాదులు ఏ పనిని ఉత్సాహముగా చేయలేరు . నిరాశావాదం తో నిండితే నడక తగ్గుతుంది , వ్యాయామము చేయరు , ఆహారము సరిగా తీసుకొనే తీరులో మార్పువస్తుంది ... ఇవన్నీ అనారోగ్యాన్ని తెస్తాయి. దీనికి భిన్నమైనది ఆశావాదుల పరిస్టితి . వీరి జీవితం ఉత్సాహముగా సాగుతుంది . ఆరోగ్యము మెరుగా ఉంటుంది . ఆహారము , వ్యాయామము , కుటుంబ సంబంధాల విషయములో జాగ్ర్ర్రత్తలు తీసుకుంటారు . . . కాబట్టి ఆశావాదుల రక్తపోటు ,మధుమేహము అదుపులో ఉండి రక్తనాళాలు మెరుగాపనిచేస్తూ గుండెజబ్బులు రానివ్వవు .

జీవితం పట్ల ఆశాభావము పెంపొందించుకుంటే ఆరోగ్యము బాగుంటుంది . పతి వారు పొజిటివ్ గా ఉండాలి . ప్రతి విషయాన్ని పొజిటివ్ గా తీసుకోవాలి . నిరాశ ,నిస్పృహలు దరికి రానీయకూడదు . ఆశ అనేది మనస్తత్వ శాస్త్రంలో మరియు నిరాశావాదానికి వ్యతిరేకంగా ఉపయోగించే ఒక చికిత్స.
 • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, September 28, 2011

ఘాటైన వాసనలు-ఆనారోగ్యము , Strong smelling-illhealthఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఘాటైన వాసనలు-ఆనారోగ్యము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మామూలుగా సబ్బులు , షాంపూలు కొనుక్కొనే సమయములో మంచి సువాసనలు వెదజల్లుతున్నాయా లేదా అని పరిశీలించుకుంటాము . గుబాళింపులు బావుంటేనే వాటి ఎంపిక - లేకుంటే లేదు . అయితే ఎగ్జిమా , ఎలర్జీ వచ్చే గుణము గలవారు మాత్రం ఘాటైన వాసలను లేని ఉత్పత్తుల్ని మాత్రమే ఎంచుకోవాలి.

సబ్బులు , షాంపూలు , కండిషనర్లు ఇతర కాస్మోటిక్స్ లోని పదార్ధాలు ఎలర్జీలకు లేదా అప్పటికే గ ల ఎగ్జిమాను ఎక్కువ అవడానికి కారణమవుతాయి. నికెల్ , లినాలూల్ , కోబాల్ట్ మున్నగు పదార్ధాలు ఎలర్జీ కారకగుణాలు కలిగివుంటాయి. ఆక్షిడైజ్డ్ లినాలూల్ ఎగ్జిమా రావడానికి ఎక్కువగా కారణమవుతుంటుంది . ఇది అనేక ఉత్పత్తుల్లో కనిపిస్తుంది . లెవెండర్ , మింట్ లలో సహజముగా కనిపించే సువాసన పదార్ధమైన లినాలూల్ ఆక్షిజన్‌ తో్ కలిసినప్పుడు ఎలర్జీకి దారితీస్తుంది . ఆక్షిడైజ్డ్ లినాలూల్ ఎక్ష్పోజర్ ను తగ్గించేందుకు సోప్ , షవర్ క్రీమ్ పెద్దపెద్ద ప్యాక్స్ కొనుగోలుని తగ్గించుకోవాలి . సీసా వాడిన ప్రతిసారీ టాప్ మార్చితే ఆక్షిడైజ్డ్ ప్రభావము కొంత తగ్గుతుంది లేదా కార్క్ మూతలు వాడాలి .

ఆధునిక యుగంలో చాలామంది రకరకాల అలర్జీ వ్యాధుల బారిన పడుతున్నారు. కొందరికి ఆహార పదార్థాల సరిపడకపోవటం, రోగ నిరోధక శక్తి తక్కువుగా ఉండటంవలన, మరికొందరికి దుమ్ము, ధూళి, చల్లని పదార్థాలు మొదలైన వాటివల్ల అలర్జీ కలుగుతుంది. ఏ మనిషినైనా అలర్జీ కలిగించే పదార్థాలను అలర్జెన్స్ అంటారు. ఒక వ్యక్తి తనకు సరిపడని పదార్థం (అలర్జెన్) తీసుకున్నప్పుడు అతడి శరీరంలోని రక్షణ వ్యవస్థ తేలికగా ఎక్కువుగా స్పందించి అలర్జీని కలిగిస్తుంది.
లక్షణాలు : అలర్జీవలన ముక్కునుండి నీరు కారడం, ముక్కు బిగుసుకొని పోయి శ్వాస ఆడక పోవడం, ఉదయం లేవగానే ఆగకుండా తుమ్ములు రావటం, దగ్గుతోపాటు ఆయాసం రావటం, ఛాతి బరువుగా అనిపించటం, కళ్ళు ఎర్రబడి నీరు కారడం, ఒంటిపై దద్దుర్లు, చర్మం పొడిగా మంటగా అనిపించటం, దురద రావటం, ఘాటైన వాసనలు పడకపోవడం, కడుపు ఉబ్బరంగా ఉడటం.
 • =========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, September 16, 2011

గర్భిణీ స్త్రీలు తెలుసుకోవలసిన విషయాలలు , Things to know by pregnent women
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గర్భిణీ స్త్రీలు తెలుసుకోవలసిన విషయాలలు , Things to know by pregnent women- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


స్త్రీలు బహిష్టు కాకుండా నెల గడిచింది అంటే ఆవిడ గర్భిణీ అని అర్ధం(ప్రెగ్నెంట్ అని అంటారు. ). ప్రేగ్నేన్సి అయిందనడానికి మొదట గ్రావిండెక్స్ టెస్ట్ చేస్తారు. స్త్రీ గర్బవతి అంటే ఆమె యురిన్లో 'గోనడోట్రోఫిన్' అనే హార్మోన్ అదికంగా వుంటుంది. దీన్ని గ్రావిండెక్స్ టెస్ట్ ద్వార గర్భిణీ అని నిర్ధారణ జరుగుతుంది. ఋతుక్రమం ఓ నెల ఆగిపోవడం గర్భం ధరించినట్లే లెక్క. నిజానికి ఆమె అప్పటికే రెండు వారాల గర్భానిగా వుంటుంది.


పిండం కొంచెం కొంచం పెరుగుతుంది. యామ్నియోసెంటిసిస్ టెస్ట్ (Amniotic fluid test-AFT)చేసుకోవాలి. ఈ పరీక్ష రెండు సార్లు చేస్తారు. 11 - 14 వారాల లోపు లేధా 14 - 18 వారాల లోపు పరీక్ష చేసి ఆరోగ్య అనారోగ్య వివరాలను తెలుసుకుంటారు. క్రోమోజోమల్ లేదా అనువంశిక వ్యాధల విషయాలను తెలుసుకోవచ్చును . ముఖ్యము గా ఈ క్రింది వ్యాధులు నిర్ధారణ కోసం చే్స్తారు .
 • డౌన్స్ సిండ్రోమ్‌(Down syndrome),
 • ట్ర్రైసోమి 13(Trisome 13),
 • ట్రైసోమి 18(Trisome 18),
 • ఫ్రాజిలీ ఎక్ష్ (Fragle X),
ఈ 12 వారాలు నిండే సరికి పిండానికి మనిషి రూపు రేఖలు వస్తాయి. అవయవాలు ఏర్పడి గుండె కొట్టుకోవడం జరుగుతుంది. స్కానింగ్ వచ్చినతరువాత పై పరీక్ష చేయడము లేదు .


గర్భిణీ స్త్రీలకు వేవిళ్ళు సర్వసాధారణం. నిస్త్రానం. గుండెల్లో మంట, మలబద్దకం, నడుము నొప్పి, కాళ్ళ కండరాలు చిక్కపట్టినట్లున్డుట, వారికోజ్ వేయిన్స్(varicose veins) , గజ్జలో నొప్పి, కాళ్ళు-చేతులు తిమ్ముర్లు వుంటాయి. డయాబిటీస్ పరీక్ష చేసుకోవాలి. గ్లుకోస్ పరిమాణం తెలుసుకోవాలి. ఎందుకంటే వీరికి 'జెస్టేషనల్ డయాబిటీస్' అనే ప్రత్యేక వ్యాది వస్తుంది.


ఏడు మాసాలు నిండిన తరువాత ఒక పర్యాయము వైద్యునికి చూపించాలి. ఎనిమిదవ నెలలో రెండుసార్లు, తొమ్మిదవ నెల వారానికి ఒకసారి డాక్టర్ని కలవాలి.


ప్రసవం జరగబోయే ముందు రోజులో యోనిలో తిమ్ముర్లు, పిండం బరువుకు యోని నరాలపై వొత్తిడి కలిగి త్తిమ్ముర్లు వస్తాయి. స్తనాల బరువుకు చేతులు, వ్రేళ్ళులో తిమ్ముర్లు వస్తాయి. చివరి నెలలో గర్భిణిల చేతులు, మోహము వాపు , తలనొప్పి, చూపు మసక, పొట్టపై భాగంలో నొప్పి వుంటే డాక్టరు సలహా తీసుకోవాలి. ఈ పరిస్థితిని ప్రీ-ఎక్లాంప్సియా (pre-eclampsia) అంటారు. ఇది ఎక్లాంప్సియా(eclampsia) గా మారకుండా వైద్య సలహా , చికిత్స తీసుకోవాలి.


మలబద్దక సమస్య గర్భినీస్త్రీలకు సహజం. కనుక పండ్లు, కూరగాయలు, ద్రవపదార్ధాలు, పాలీష్ చేయని బియముతో అన్నము, గోధుమలు తినాలి. స్తనాల బరువు పెరగడం వల్ల నడుంనొప్పి, గర్భకోశం బరువు పెరగడం వలన నడుం క్రింద భాగంలో నొప్పి వుంటుంది. సామన్యవ్యాయామం
చేస్తే మంచిది. కుర్చునేటపుడు నడుముకు ఆనుడు వుండేలా చూసుకోవాలి.

కొంతమందికి స్రావాలు కనిపిస్తాయి. అందుకు కారణం కాస్డీడా, ట్రైయ్కొమోనాస్ ఇన్‌ఫెచ్షన్స్, గనేరియా, సిఫిలిస్ లాంటి సుఖ వ్యాధుల మూలంగా కనిపిస్తుంటాయి. అందుకు చికిత్స చేయించుకోవాలి. అపుడే తల్లి బిడ్డ ఆరోగ్యంగా వుంటారు.


గర్భకోస గజ్జల్లో ఒక్కోసారి బాధ ఎక్కువగా వుంటుంది. ఇందుకు వేడి కాపటం మంచిది. పడుకొని మోకాళ్ళు పోత్తపైకి ముడుసుకోవటం ద్వారా ఉపసమనం కలుగుతుంది.


మొత్తానికి గర్భిణి స్త్రీలకు, నిద్రలేమి తప్పదు. పడుకోపోయే ముందు వేడిపాలు త్రాగాలి. పగలు కొంచెం వ్యాయామం చేస్తే రాత్రి బాగా నిద్ర పడుతుంది. స్త్రీలకు ఆహార విహారాలలో కావలసినంత స్వేచ్చ ఇవ్వాలి.


గర్భిణి స్త్రీలు తమ బరువు పెరుగుతున్నారా? లేదా? గమనించుకోవాలి. తొమ్మిది నెలలో గర్భిణి-ఎనిమిది లేక తొమ్మిది కిలోల బరువు పెరగాలి. పెరగనిచో ఏదో సమస్య ఉన్నట్లే. కనుక డాక్టర్ను సంప్రదించాలి. చివరి నెలలో అకస్మాత్తుగా బరువు పెరగడం మంచిది కాదు. తల్లికాబోయే ఆమెకు
మంచి పోషకాహారం ముఖ్యం. పచ్చటి ఆకుకూరలు, గుడ్లు, పండ్లు, మాంసము మొదలగు ఆహరం తీసుకోవాలి.


సాధారణంగా మన ఆహారంలో ఎక్కువగా పిందిపదర్దాలున్న పప్పులు, ధాన్యాలు, గోదుములు, బియ్యం, జొన్నలు, రాగులు, బంగాళ దుంపలు, కర్రపెండలం, చిలగడదుంపలు, అరటి, బ్రెడ్, పండ్లు వీటితో పాటు మాంసకృత్తులు ఎక్కువగా వున్నఆహారం తీసుకోవాలి.పప్పులు, చిక్కులు, వేరుశనగలు, సోయబీన్సులు, పచ్చటి ఆకుకూరలు, పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, మాంసము వీటిలో వుంటాయి. సోయబీన్సు, వేరుసనగలో మాంసకృత్తులు ఎక్కువగా వుంటాయి. ప్రతిరోజు గుప్పెడు వేరుసనగలు తింటే శరీరానికి సరిపడా మాంసకృత్తులు లభిస్తాయి.


గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువ స్వేదము అలుము కోవడం అనేది సహజము . ఈస్ట్రోజన్‌ స్థాయిలు తగ్గి , ఉష్ణోగ్రత మార్పులకు సెన్సిటివిటీ పెరగడం వల్ల ఇలా జరుగుతుంది . ఆహారము లో చక్కని మార్పులు చేసుకోండి . ప్రోటీన్లు , పీచు పదార్దాలు , ఖనిజాలు , విటమిన్లు అధికం గా తీసుకోండి . రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు త్రాగండి . కొబ్బరి నీరు , నిమ్మరసము , తాజాపండ్ల రసాలు ఎక్కుమగా తీసుకోండి . ధైరాయిడ్ ఫంక్షన్‌ పరీక్షలు చేయించుకోండి ... థైరాయిడ్ పనిలో ఎచ్చు తగ్గులు వలన చెమటలు పట్టె ఆస్కారము ఉన్నది .


ప్రీఎక్లంప్సియా (Pre-eclampsia) అనేది గర్భము ధరించి ఉన్న సమయములో పెరిగే రక్తపోటు ( ప్రెగ్నెన్సీ ఇన్ద్యూస్డ్ హైపర్ టెన్షన్) , పాదాల వాపు తో పాటుగా మూత్రములో పెద్ద మొత్తములో ప్రోటీన్లు ఉండడం అనే ఒక వైద్య పరిస్థితి. ప్రీఎక్లంప్సియా అనేది ఒక రోగ కారకం కంటే కొన్నిరోగ చిహ్నముల సమాహారముగా చెప్పబడుతుంది, ఈ స్థితికి కారణమైన వేరు వేరు కారణములు చాలానే ఉన్నాయి. గర్భస్థమావి లోని కొన్ని పదార్ధములు వలన ఈ ఇబ్బందికి గురికాబోతున్న, తల్లి కాబోతున్న స్త్రీ యొక్క రక్త నాళములలో ఎండోలెథియమ్ పనితీరు సరిగా లేనట్లుగా కన్పిస్తుంది. ఈ జబ్బులో రక్తపోటు బాగా పెరుగుతూ ఉండడం అనేది బాగా తెలుస్తూ ఉండే ఒక గుర్తు, అలాగే అది మాములుగా మాతృ సంబంధిత ఎండోలెథియమ్, మూత్రపిండాలు మరియు కాలేయములను దెబ్బ తీస్తుంది మరియు వాసోకన్స్ట్రి క్టివ్ కారణములు వాటికి తోడుగా రెండవ ప్రభావముగా ఉంది.

ప్రీఎక్లంప్సియా గర్భధారణ జరిగిన 20 వారముల నుండి పెరగడం మొదలు అవ్వవచ్చు(ఇది అంతగా పెరుగుదల లేని మొదటి 32 వారములకు ముందుగా ఉంటే త్వరగా వచ్చింది అని భావిస్తారు). రోగులలో ఇది ఎదిగే విధానము మారుతూ ఉంటుంది; చాలా మందిలో ఇది ముందుగానే కనుగొనబడినది. అలాంటి సందర్భములలో శస్త్రచికిత్స చేయడము లేదా బలవంతముగా ప్రసవము అయ్యేలా చేయడము-తప్ప మరొక చికిత్స మార్గము లేదు. ఇది చాలా కష్టము అయిన ప్రసవములలో మాములుగా వచ్చే పెద్ద ఇబ్బంది; ఇది తల్లి మరియు ఇంకా పుట్టని బిడ్డ పై కూడా ప్రభావము చూపిస్తుంది. ప్రీఎక్లంప్సియా అనేది ప్రసవము అయిన ఆరు వారముల తరువాత కూడా రావచ్చును.


 • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, September 15, 2011

Typhoid Fever , టైఫాయిడ్ జ్వరముఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Typhoid Fever , టైఫాయిడ్ జ్వరము - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

వర్షాకాలపు అనారోగ్యాలు ఒక జాబితాలోకి తీసుకురావడం కష్టతరం. టైఫాయిడ్‌ జ్వరం లేదా టైఫాయిడ్‌ అనేది ఈ వ్యవధిలో తీవ్ర ఆందోళనకు గురిచేసే అలాంటి ఒక వ్యాధి.ఒక్క మాటలో చెప్పాలంటే, టైఫాయిడ్‌ అనేది అతిసారం మరియు దద్దుర్లు కలుగజేసే ఒక అంటువ్యాధి. టైఫాయిడ్‌ మరియు టైఫిస్‌కు సాధారణంగా కలిగే న్యూరోసైకియాట్రిక్‌ లక్షణాల నుండి మరియు గ్రీక్‌ పదానికి అర్థం వచ్చే ''Stupor - స్తబ్దత'' నుండి టైఫాయిడ్‌ అనే పేరు వచ్చినది . ఇది నీటి-జనిత వ్యాధి. ఇది వ్యాధి సోకిన వ్యక్తి యొక్క మలంతో కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం ద్వారా వ్యాపిస్తుంది.

టైఫాయిడ్‌ అనేది సాల్మొనెల్లా టైఫి బ్యాక్టీరియా ద్వారా సర్వసాధారణంగా సోకుతుంది. ఈ S.టైఫి త్వరితగతిన మరియు భారీసంఖ్యలో వృద్ధి చెందుతుంది. తీసుకున్న ఆహారం మరియు నీటినుండి ఈ బ్యాక్టీరియా ప్రేగునాళాల ద్వారా వ్యాపించి ప్రేగు గోడలలోకి చొచ్చుకొని పోయి రక్తంలో ప్రవేశిస్తుంది మరియు దీనిని మలం మరియు రక్తనమూనాల ద్వారా రోగ నిర్ధారణ చేయవచ్చు. పారిశ్రామిక నగరాలయొక్క పేదలుండే ప్రదేశాలలో మరియు సులభంగా నీరు కలుషితమయ్యే ప్రాంతాలలో టైఫాయిడ్‌ ఎక్కువగా ప్రబలుతుంది. కోస్తా తీర ప్రాంతాలలో నివశించే ప్రజలకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. అధికంగా పిల్లలపై మరియు 5మరియు 19సంవత్సరాల మధ్య వయసుగల యుక్తవయస్కులైన పిల్లలపై మరియు వయసు పైబడిన వృద్ధులపై మరియు రోగనిరోధక శక్తి కోల్పోయిన వ్యక్తులపై దీని ప్రభావం ఉంటుంది.

టైఫాయిడ్‌ వలన 104 డిగ్రీలF వరకు వదిలిపెట్టని జ్వరం, ముచ్చెమటలు, అతిసారం కలుగుతుంది మరియు కొంతమందిలో శరీరం మీద ఎర్రటి మచ్చలు ఏర్పడవచ్చును. లక్షణాలు ముదిరి స్పృహ కోల్పోవచ్చును. చికిత్స చేయకుండా వదిలివేస్తే ప్లీహం మరియు కాలేయం పెరగవచ్చును. ఈ సందర్భంలో, ఇది నాలుగు వారాల వరకు ఉంటుంది మరియు ప్రాణాంతకం కూడా కావచ్చును. కావున, ఈ వ్యాధి బారినపడిన వ్యక్తికి చికిత్సనందించే చర్యలు చేపట్టడం చాలా ముఖ్యం. 'చికిత్స కంటే నివారణే ఉత్తమం' అనే విషయం మనకు తెలిసిందే. ఇలాంటి భయంకరమైన వ్యాధులకు చికిత్సనందించే ప్రయత్నంకన్నా ఇవి ప్రబలకుండా నివారించటానికి తీసుకొనే చర్యలు ఎంతో సులువైనవి. దాదాపు 3%-5% మంది రోగులు తీవ్రంగా ఈ వ్యాధి బారినపడిన తర్వాత ఈ బ్యాక్టీరియాను వ్యాప్తిచేసే వాహకులవుతారు మరియు ఈ అంటువ్యాధి యొక్క నిధిగా వ్యవహరిస్తారు. వీరు తమ మలంలో ఈ బ్యాక్టీరియాను విడుదల చేస్తూ ఉంటారు. ఇది ఆహారాన్ని మరియు నీటిని కలుషితం చేస్తుంది మరియు ఈ వ్యాధి ఇతరులకు సంక్రమింపజేస్తుంది.

 • టైఫాయిడ్ జ్వరములో స్టేజీలు :
ఫస్ట్ స్టేజ్ : ఈ సమయము లో తీవ్రమైన జ్వరము , నీరసము , తలనొప్పి , కడుపు నొప్పి, చర్మముపై దద్దుర్లు ఉంటాయి.

సెకెండ్ స్టేజ్ : బరువు తగ్గిపోవడము , జ్వరము , విరోచనాలు లేదా మందము , కడుపుబ్బడము ఉంటాయి.

థర్డ్ స్టేజ్ : 2-3 వారాలు చికిత్స లేని టైఫాయిడ్ లో మనిషి బాగా నీరసించి , అపస్మారక స్థితిలోనికి జారుకుంటాడు . పేలాపన , తీవ్రమైన జ్వరము ఉండి ... మరణానికి దగ్గరగా ఉంటాడు .
 • రోగ నిర్ధారణ

* వైడాల్ పరీక్ష (Widal test) ద్వారా సాల్మోనెల్లా ప్రతిరక్షకాలను గుర్తించడం జరుగుతుంది.
* రక్తం మరియు మల పరీక్ష (Blood and Stool culture) ద్వారా సాల్మోనెల్లా క్రిములను ప్రయోగశాలలో వృద్ధిచెందించి గుర్తిస్తారు.

నివారణ వ్యాక్సిన్లు లభ్యమవుతున్నప్పటికీ, ఇవి 60-80%మాత్రమే సురక్షితం మరియు ముఖ్యంగా ఈ వ్యాధి ప్రబలినప్పుడు ఉపయోగపడతాయి. మలవిసర్జన తర్వాత మరియు ఆహారాన్ని హ్యాండిల్‌ చేసేముందు ఆరోగ్య సబ్బుతో మీ చేతులు కడుగుకోవటం అనేది ఈ అంటువ్యాధిని మరియు మరిన్ని ఇతర రోగాలను నివారించటానికి దోహదపడటంలో ఎంతో మేలు చేస్తుంది. బయటనుండి ఇంటికి వచ్చిన తర్వాత చేతులను కడుగుకోవటం కూడా చాలా ముఖ్యం. ఇలాంటి అలవాట్లు చిన్నతనం నుండే అలవడితే ఇంతకన్నా మంచిదేముంటుంది. మానవ మల మూత్రాలు ఆహారం మరియు త్రాగునీటితో కలిసిన ప్రదేశాలలో టైఫాయిడ్‌ ప్రబలుతుంది. సరిగ్గాలేని లేదా సక్రమంగా వండని ఆహారం మరియు పచ్చి ఆహారంను తినుట లేదా పచ్చిపాలను త్రాగుటవలన ఈ వ్యాధి విస్తరిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మరియు ఈ వ్యాధి ప్రబలినప్పుడు త్రాగునీటిని తప్పనిసరిగా కాయాలి మరియు తెరచి ఉన్న పాత్రలనుండి త్రాగునీటిని త్రాగకుండా ఉండటం ఒక మంచి ఆలోచన అవుతుంది.

మీ చేతులను శుభ్రంగా ఉంచుకోవటం అనేది రోగాలకు దూరంగా ఉండే అత్యంత సులభమైన మార్గం. అసలు మిమ్మల్ని ఆరోగ్యకరంగా ఉంచే మంచి మార్గం. మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోవటం మరియు బ్యాక్టీరియా నుండి విముక్తి అవటం. సురక్ష ద్వారా తందురుష్టి.

మీ ఆరోగ్యానికి రక్షణ ఇస్తాయి ఒక మంచి హెల్త్‌ సోప్‌ మరియు మీ శుభ్రమైన చేతులు.

చేయవల్సినవి మరియు చేయకూడనివి
* పచ్చి లేదా సరిగ్గా వండని ఆహారానికి దూరంగా ఉండండి.
* వ్యాధిసోకిన వ్యక్తితో ఆహారాన్ని పంచుకోవద్దు.
* బయటినుండి వచ్చిన తర్వాత మరియు టాయ్‌లెట్స్‌ తర్వాత మంచి ఆరోగ్య సబ్బుతో మీ చేతులను మరియు ముఖాన్ని కడుక్కోండి.
* గోళ్లు కొరికే అలవాటును మానండి.
* యాక్టివ్‌ 5 లాంటి రక్షిత పదార్థాలను కలిగిన సబ్బు సాధారణ సబ్బుకు విరుద్ధంగా అదనపు రక్షణను ఆఫరు చేస్తున్నది.

చికిత్స : పెద్దవారికి ->

Tab.Ciprofloxin(500mg) +Tinidazole(600mg) -- combination two times/day for 7-10 days .
Tab.paracetamol 500mg three times / day for fever controle 7-10 days,
Rest for10 days.

1960 లో ఓరల్ రిహైడ్రేషన్‌ చికిత్స కనుగొన్న తర్వాత టైఫాయిడ్ జ్వరము , విరోచనాలు వలన చనిపోయేవారి సంఖ్య బాగా తగ్గిపోయినది . మంచి అధునాతన యాంటీబయోటిక్స్ అందుబాటులోనికి రావడము వలన దీని చికిత్స చాలా సునాయాసము అయిపోయినది . సమయానికి యాంటీబయోటిక్స్ వాడడము వలన సుమారు 99% మరణాలు నుండి బయటపడడము జరుగుతూ ఉన్నది .

సాదారణము గా సిఫ్రోఫ్లోక్షాసిన్‌ , 3వ తరము సెఫలోస్పోరిన్స్ బాగా పనిచేస్తాయి. 2 వారాలు పాటు చికిత్స చేయాలి .

--- డా.అజిత్ కుమార్ MD DM.హైదరాబాద్ .
 • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

ఆరోగ్యానికి పీచుపదార్ధము , Role of Fiber in Healthఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - ఆరోగ్యానికి పీచుపదార్ధము , Role of Fiber in Health - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మనకు ఆహారమంటే శక్తి! పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, నూనెలు, విటమిన్లు, ఖనిజాలు... వీటి గురించే ఎక్కువగా మాట్లాడతాం.. వీటి గురించే ఎక్కువగా వింటుంటాం. కానీ ఇంతే ప్రాధాన్యం ఉన్న 'పీచు' గురించి మాత్రం పెద్దగా పట్టించుకోం!
'పీచు' అంటే మనకు చిన్నచూపు! అందుకే తరచుగా 'వాళ్లేం తింటారు.. పచ్చిగడ్డి!' అనీ.. 'ఏదో తిన్నాం లెండి, గడ్డీగాదం..!' అనీ రకరకాలుగా వెటకారాలు ఆడుతుంటాం. పీచు అంటే అదేదో పనికిమాలినదని భావిస్తుంటాం. కానీ ఇది వట్టి అపోహ. పైగా మన ఒంటికి చేటు తెచ్చే అపోహ! మన ఆరోగ్యానికి ప్రాణంలాంటిది పీచు. వైద్యరంగం ఈ విషయాన్ని నానాటికీ బలంగా చెబుతోంది. వైద్య పరిశోధనలన్నీ... ఇప్పుడు పీచు పరమావశ్యకతనే చాటిచెబుతున్నాయి. క్యాన్సర్లు రాకుండా.. గుండె జబ్బులు రాకుండా.. కొలెస్ట్రాల్‌ పెరక్కుండా.. మధుమేహం రాకుండా.. వూబకాయం రాకుండా... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పీచు ప్రయోజనాల జాబితాకు అంతుండదు. మన అన్నం పళ్లాన్ని నానా రకాల 'జంక్‌ ఫుడ్‌' ఆక్రమించేస్తున్న ఈ ఆధునిక కాలంలో పనిగట్టుకుని మరీ 'పీచు'ను ఎంచుకోవాల్సిన అవసరం పెరిగిపోతోంది.

* పీచు శాకాహారంలోనే ఉంటుంది. మాంసాహారంలో ఉండదు.

* పీచుపదార్ధాలు తీసుకున్న ప్రతిసారీ తగినంతగా నీరు కూడా తాగాలి.

* పిల్లలకు కూడా పీచు అవసరమేగానీ మరీ పీచుపదార్ధాలే ఎక్కువగా పెడితే.. త్వరగా కడుపునిండినట్త్లె ఎక్కువ ఆహారం తీసుకోలేరు. దాంతోశక్తి చాలక ఎదుగుదల ప్రభావితం కావచ్చు. కాబట్టి పిల్లలకు పీచు పదార్ధాలు మరీ ఎక్కువ కాకుండా సమతులంగా ఉండేలా చూడాలి.వీరికి పండ్లు, కూరగాయలు విరివిగా పెడితే ఆ పీచు సరిపోతుంది.

* పైకి పెద్దగా ఏమీ కనబడదుగానీ అనాస పండులో కంటే సపోటా పండ్లలో పీచు అధికంగా ఉంటుంది. అలాగే కాయగూరల్లో కంటే ముడిధాన్యం, పొట్టు పప్పుల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటి గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవటం అవసరం.

* పప్పులతో పోలిస్తే కూరగాయల్లో పీచు కొంత తక్కువ ఉంటుందిగానీ.. మనం పప్పుల కంటే పరిమాణంలో కూరగాయలను ఎక్కువగా తీసుకోగలం కాబట్టి మన ఆహారంలో కూరగాయల ద్వారానే ఎక్కువగా పీచు వస్తుంది.

పోషకాహారమంటే.... పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాల వంటివే కాదు.. 'పీచు పదార్ధాన్ని' కూడా ముఖ్యమైన 'పోషక వనరు'గా గుర్తించాల్సిన అవసరం వచ్చేసింది. గత 20, 30 ఏళ్ల నుంచీ మన ఆహారంలో 'పీచు'కు ప్రాముఖ్యం పెరుగుతూ వస్తోంది. పీచు పదార్థానికీ 'పోషక ప్రాధాన్యం' ఉందని, జీర్ణ ప్రక్రియలోనూ, జీవ క్రియల్లోనూ దీని పాత్ర అమూల్యమని అధ్యయన పూర్వకంగా గుర్తిస్తున్నారు.

పీచు - పలు రకాలు
పిండిపదార్ధాలు, కొవ్వు పదార్ధాలు, మాంసకృత్తులు.. వీటన్నింటినీ మన శరీరం పచనం చేసుకుని.. జీర్ణం చేసేసుకుంటుంది. కానీ పీచు ఇలా పూర్తిగా 'జీర్ణం' అయిపోదు. అందుకే దీనివల్ల 'మలం' పరిమాణం పెరుగుతుంది. ఈ పీచు- జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగుల ద్వారా ప్రయాణించి మలం రూపంలో బయటకు వెళ్లిపోతుంది. ఆహార నిపుణులు చాలాకాలం పాటు ఈ 'పీచు'ను.. ఓ 'ముడి పీచు'గానే భావిస్తూ.. అది ఎందుకూ పనికి రాదని నమ్మేవారు. అందుకే చాలాకాలం పీచు మీద పెద్దగా అధ్యయనాలూ జరగలేదు, మన అవగాహనా అంతగా పెరగలేదు. అయితే పీచు ప్రయోజనాలు బయటపడుతున్న కొద్దీ మరింత లోతుగా అధ్యయనాలు చేసి.. పీచులో ప్రధానంగా 2 రకాలు ముఖ్యమైనవని నిర్ధారణకు వచ్చారు.

* కరగని పీచు: మన ఆహారంలోనే ఉంటుందిగానీ.. నీటిలో కరగని రకం పీచు ఇది. దీన్ని 'ఇన్‌సాల్యుబుల్‌ ఫైబర్‌' అంటారు. ఇది జీర్ణం కాదు, విసర్జన ద్వారా అలాగే బయటకు వెళ్లిపోతుంది. ముడిధాన్యం, పప్పులు, కాయగూరల్లో ఉండే 'సెల్యులోజ్‌' అనే ముతకరకమైన పీచు, దాని కన్నా కొద్దిగా పల్చగా ఉండే హెమీసెల్యులోజ్‌, లిగ్నన్స్‌ వంటివి ఈ తరహావి. దీనివల్ల మలం పరిమాణం పెరుగుతుంది, జీర్ణ వ్యవస్థలో ఆహారం కదలికలూ పెరుగుతాయి.

* కరిగే పీచు: ఇది బాగా నీటిని పీల్చుకుని ఉబ్బి, ఒక రకమైన జిగురులా తయారయ్యే రకం పీచు. దీన్నే 'సాల్యుబుల్‌ ఫైబర్‌' అంటారు. ఓట్స్‌, బార్లీ, చిక్కుళ్లు, బఠాణీల వంటి గింజలు, సపోటా వంటి పండ్లు.. ఇలాంటి వాటిలో ఉండే జిగురుగా తయారయ్యే గమ్స్‌, పెక్టిన్స్‌, మ్యూసిలేజస్‌.. ఇవన్నీ ఈ తరహావి. ఈ రకం పీచుకు ఆరోగ్యపరంగా చాలా ప్రాధాన్యం ఉంది. రక్తంలో కొలెస్ట్రాల్‌, చక్కెర స్థాయుల వంటివి తగ్గించటం వంటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇది వీటన్నింటిలో ఎక్కువగా ఉంటుంది.

- ఈ కరిగే పీచు, కరగని పీచుల స్థాయులు.. ఒక్కో పదార్థంలో ఒక్కో మోతాదులో ఉంటాయి. మొత్తానికి మన ఆరోగ్యానికి రెండూ ముఖ్యమైనవే.

నేటి అవసరం.. పీచు!
ఆధునిక కాలంలో తిండి దగ్గర నుంచి శారీరక శ్రమ వరకూ మన అలవాట్లన్నీ మారిపోయాయి. గతంలో ముతక ధాన్యాలు, తృణ ధాన్యాలు, రకరకాల పండ్లు, ముడి పప్పుల వంటివన్నీ తినేవారు. వాటితో తగినంత పీచు అందేది. కానీ ఇప్పుడు బాగా పాలీష్‌ పట్టిన ధాన్యాలు, పొట్టు తీసిన పప్పులు, రిఫైన్డ్‌ పదార్ధాలు తీసుకోవటం పెరిగింది. దీంతో ఆహారంలో పీచు మోతాదు తగ్గిపోతూ వస్తోంది. ఇలా ఆహారంలో పీచు మోతాదు తగ్గిపోవటం వల్ల చాలామంది ఆరోగ్య సమస్యలనూ ఎదుర్కొంటున్నారు. అలాగని మళ్లీ పూర్తిగా ముతక ధాన్యాలు, దంపుడు బియ్యం, రొట్టెల్లాంటి వాటికి పూర్తిగా మారిపోవటం కష్టం కాబట్టి.. మనం తినే ఆహారంలోనే 'పీచు' మోతాదు పెంచుకునేదెలా? అన్న అవగాహన పెంచుకుని.. అందుకు తగ్గట్టుగా మంచి అలవాట్లు పెంచుకోవటం ముఖ్యం!

ఎంత పీచు అవసరం?
మనం తీసుకునే ఆహారంలో రోజుకి 40-45 గ్రాముల పీచు ఉండటం అవసరం. ఇందులో కరిగే పీచు ఎక్కువగా ఉంటే మంచిది. పీచు అందరికీ అవసరమే కానీ.. కొందరు ప్రత్యేకించి ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. మలబద్ధకంతో బాధపడేవారు, మధుమేహులు, గుండె జబ్బున్నవాళ్లు, స్థూలకాయులు, కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండేవాళ్లు, మాంసాహారం తరచూ తీసుకునేవారు తప్పకుండా పీచు ఎక్కువగా తీసుకోవాలి. తరచూ విరేచనాలకు వెళ్లాల్సి వచ్చే.. ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌, ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ సిండ్రోమ్‌ బాధితులకు సబ్జాగింజల వంటివి బాగా ఉపయోగపడతాయి. ఇవి వెంటనే మల విసర్జన జరగకుండా కొంతసేపు పట్టి ఉంచటానికి దోహదం చేస్తాయి. త్వరత్వరగా విరేచనం కాకుండా, నీటిని పట్టి ఉంచటం వల్ల నీళ్ల విరేచనాలూ ఎక్కువ కావు. గర్భిణులకు మలబద్ధకం తలెత్తే అవకాశం ఎక్కువ. వీరికి పీచు ఎంతో మేలు చేస్తుంది.

పీచు.. ప్రత్యేకత ఏంటి?
* మల బద్ధకం వదులుతుంది: ఆహారంలో మనం తిన్న పీచు- నీటిని, ఇతర పోషకాలను పట్టి (బైండ్‌) ఉంచుతుంది. కరగని పీచు- పదార్ధాలతో నీటిని పట్టి ఉంచుతుంది, మల పరిమాణం పెంచటానికి ఉపయోగపడుతుంది. కరిగే పీచు.. నీటిని గ్రహించి ఉబ్బుతుంది. దాంతో మల పరిమాణం (బల్క్‌) పెరిగి, అది మృదువుగా కూడా తయారవుతుంది. మల విసర్జన సాఫీగా జరగటానికి ఈ ప్రక్రియలు ఎంతో దోహదం చేస్తాయి. దీనివల్ల మలబద్ధకం, మొలలు, పేగుల్లో తిత్తులు రావటం వంటి సమస్యలు బాగా తగ్గుతాయి.

* పేగుల ఆరోగ్యం: సబ్జాగింజలు, మెంతుల వంటివి ఉబ్బి, జిగురుగా మారతాయి. వీటివల్ల లోపల జీర్ణపదార్ధాల కదలికలు మృదువుగా, పేగుల్లో మృదువైన వాతావరణం నెలకొంటుంది. పెద్దపేగుల్లో సమస్యలు (క్రాన్స్‌ డిసీజ్‌, ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌, ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజ్‌) వంటివి తలెత్తకుండా, ఉపశమనంగా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి.

* గ్లూకోజు, కొలెస్ట్రాల్‌ నియంత్రణ: పీచు నీటితో పాటు గ్లూకోజు వంటి పిండి పదార్ధాలనులు, స్టిరాల్స్‌ వంటి కొవ్వుల వంటివాటినీ పట్టి ఉంచి.. అవి త్వరగా రక్తంలో కలిసిపోకుండా చూస్తుంది. కరిగేపీచు.. గ్లూకోజు వెంటనే రక్తంలో కలవకుండా చూస్తుంది. ఇది మధుమేహులకు చాలా మంచిది. కరగని పీచు- మధుమేహం రాకుండా నివారించటంలోనూ కీలకం. అందుకే మధుమేహుల ఆహారంలో పీచు ఎక్కువగా ఉండేలా చూడటం అవసరం. అలాగే రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్‌ మోతాదూ పెరగకుండా చూడటంలో కరిగే పీచుకు ప్రాముఖ్యం ఉంది. ఈ పీచుపదార్ధాన్ని మాంసాహారంతో కలిపి తీసుకుంటే అందులోని కొలెస్ట్రాల్‌ను కూడా పట్టి ఉంచుతుంది. బైల్‌ యాసిడ్స్‌ను పట్టి ఉంచి- శరీరంలో సహజంగాఉండే కొలెస్ట్రాల్‌ కూడా విడుదల కాకుండా ఆపుతుంది. కొన్ని రకాల పీచు అయితే కొలెస్ట్రాల్‌ తయారు కాకుండానూ అడ్డుకుంటుంది.

* బరువు నియంత్రణ: పీచు త్వరగా కడుపు నిండిన భావన కలజేస్తుంది. అందువల్ల ఎక్కువ ఆహారం తీసుకోలేం. పీచు పూర్తిగా జీర్ణమైపోదు కాబట్టి దీన్నుంచి శరీరానికి వచ్చే శక్తీ చాలా చాలా తక్కువ. ఆ కొద్దిపాటి శక్తి కూడా నెమ్మదిగా విడుదలవుతుంది, ఇది కొవ్వుగా మారటానికి అవకాశం తక్కువ. వీటన్నింటివల్లా బరువు తగ్గటానికి, బరువు పెరగకుండా ఉండటానికి పీచు దోహదం చేస్తుంది.

* గుండెకూ మేలు: ట్రైగ్లిజరైడ్లు, కొలెస్ట్రాల్‌ వంటి వాటినీ పీచు పట్టి ఉంచి మల విసర్జన ద్వారా బయటకు వెళ్లేలా చేస్తుంది. గుండె రక్తనాళాలు త్వరగా దెబ్బతినకుండా కాపాడుతుంది. రక్తపోటు తగ్గించటానికి, గుండెపోటు రాకుండా, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండానూ చూస్తున్నట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది.

* క్యాన్సర్ల నివారణ: మలద్వారం, పెద్దపేగు క్యాన్సర్లే కాదు.. శరీరంలో రకరకాల క్యాన్సర్ల నివారణలో పీచు ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు అధ్యయనాల్లో గుర్తిస్తున్నారు.

పీచు దేనిలో ఎక్కువ దొరుకుతుంది...?
ఈ ప్రశ్న ఎవరిని అడిగినా వెంటనే.. బీరకాయ, పొట్లకాయ, బీన్స్‌, చిక్కుళ్లు, అనాసపండు.. ఇలా పీచుపీచుగా కనబడే పదార్ధాల పేర్లు టకటకా చెప్పేస్తారు. కానీ వాస్తవానికి పైకి పీచుపీచుగా కనిపించే వాటిలోనే పీచు ఎక్కువగా ఉంటుందనుకోవటం సరికాదు.


-- డా. కె.ఉమాదేవి-- ప్రొఫెసర్‌, న్యూట్రిషన్‌, కాలేజ్‌ ఆఫ్‌ హోంసైన్స్‌,-- ఎన్‌జీరంగా వర్సిటీ, హైదరాబాద్‌

Some fiber giving Vegetables -->

పీచు లభించే పదార్థాలు

 రోజు ౩౦ గ్రాముల పీచు అవసరమని వైద్యులు అంటున్నారు .అందులో కరిగే పీచు ఉంటె మంచిది .సాదారణంగా ప్రతి ఒక్కరు పీచు ఉండే పదార్థాలు  తినడం మంచిది.మధుమేహం ,గుండె జబ్బులు ,మలబద్దకం బాధ పడేవారు  ఎక్కువగా పీచు పదార్థాలు తీసుకుంటారు .    పీచు లభించే పదార్థాలు     గోధుమలు ,రాగులు, జొన్నలు,సజ్జలు,కొర్రలు ..వీటిలో కరిగేరకం పీచు ఎక్కువగా ఉంటుంది .మనమే గోదుమలు తెచ్చుకొని పిండి పట్టిచడం మంచిది.మిగతా ధాన్యాలతో పోలిస్తే ఓట్స్ లో పీచు ఎక్కోవగా ఉంటుంది.పప్పుల్లో ముడి సెనగలు ,పెసలు ,మినుమలు ,అలసందలు బతనిలు..వీటిలో ఎక్కోవ పీచు ఉంటుంది.

 • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, September 14, 2011

గర్భిణీ స్త్రీలకు సలహాలు , Advises to Pregnent women

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గర్భిణీ స్త్రీలకు సలహాలు , Advises to Pregnent women- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


గర్భం అనేది సృష్టి రహస్యం. ఇది మహిళలకు దేవుడిచ్చిన ఓ అపురూపమైన కానుక. కొన్ని సూచనలు పాటిస్తే ప్రసవం సులభతరమౌతుంది . గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. ఆరోగ్యమైన శిశువు కొరకు పౌష్ఠిక ఆహారం: పాలు, పండ్లు, ఆకు కూరలు ,పప్పు, మాంసము ,చేపలు తీసుకోవాలి .

గర్భధారణకు మొట్టమొదటి సంకేతం సరయిన సమయంలో రావలసిన ఋతుస్రావం కాకపోవడం. కొందరిలో కడుపులో వికారం, వాంతులు వంటివి అనిపించవచ్చును. దీనిని తేదీ(నెల) తప్పడం అంటారు. క్రితం ఋతుచక్రం రోజుకు ఒక వారం కలుపుకుంటే ఇంచుమించుగా గర్భధారణ సమయం లెక్కించవచ్చును. ఈ తేదీల ఆధారంగానే వైద్య నిపుణులు అంచనా వేసి ఎప్పుడు పురుడు పోసుకునేదీ లెక్కకడతారు. దీనిని నేగలీ సూత్రం (Naegele's rule) అంటారు.EDD = LMP +9 months ,7 days.

గర్భ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా జరాయువు(placenta) నుండి తయారయ్యే హార్మోన్లు ఆధారంగా పనిచేస్తాయి. వీటిని రక్తంలో గాని, మూత్రంలో గాని కొద్ది రోజులలోనే గుర్తించవచ్చును. గర్భాశయంలో స్థాపించబడిన తరువాత, జరాయువు చే స్రవించబడిన కోరియానిక్ గొనడోట్రోఫిన్ స్త్రీ అండాశయంలొని కార్పస్ లుటియమ్ నుండి ప్రొజెస్టిరోన్ స్రావాన్ని ప్రేరేపిస్తాయి. దీని మూలంగా ఎండోమెట్రియమ్ మెత్తగా వాచి, రక్తనాళాలు వృద్ధిచెందుతాయి. దీని మూలంగా పిండాభివృద్ధికి కావలసిన ఆహార పదార్షాలు సరఫరా చెందుతాయి.

ప్రారంభ దశలో స్కానింగ్ పరీక్ష గర్భధారణ మరియు పిండం యొక్క వయస్సును కూడా తెలియజేస్తుంది. దీని ద్వారా పురుడు జరిగే సమయం కూడా నేగలీ సూత్రం కన్నా సరిగ్గా అంచనా వేయవచ్చును. శాస్త్రబద్ధంగా పురుడు ప్రారంభమైన సమయం ఋతుచక్రం యొక్క తేదీల ప్రకారం 3.6 శాతం కేసులలో మాత్రమే జరుగుతుంది. అయితే స్కానింగ్ ద్వారా అంచనా కూడా 4.3 శాతంలో మాత్రమే సరైనదిగా తెలిసినది.

స్త్రీ, పురుష ప్రాకృతిక సంభోగంలో, పురుషుని వీర్యకణాలు స్త్రీ అండాన్ని ఫలదీకరించిన తరువాత ఏర్పడిన పిండం స్త్రీ గర్భాశయంలో పెరగడం ప్రారంభిస్తాయి. దీనిని గర్భం (Pregnancy) అంటారు. గర్భం ధరించిన స్త్రీని గర్భవతి అంటారు. కొంతమందిలో ఒకటి కన్నా ఎక్కువ పిండాలు తయారౌతాయి. ఫలదీకరణం తరువాత తయారైన పిండం పెరుగుతూ ఉండే కాలాన్ని గర్భావధి కాలం అంటారు. దీని తరువాత శిశువు జన్మింస్తుంది. దీనిని పురుడు అంటారు. క్షీరదాలన్నింటిలో క్షుణ్ణంగా పరిశోధన మానవులలో జరిగింది. ఈ వైద్య శాస్త్రాన్ని ఆబ్స్టెట్రిక్స్ (Obstetrics) అంటారు. గర్భావధి కాలం తరువాత శిశువు జననం సాధారణంగా 38 - 40 వారాలు అనంతరం జరుగుతుంది. అనగా గర్భం ఇంచుమించు తొమ్మిది నెలలు సాగుతుంది.(9 lunar month * 30 days = 270 days).

ఫలదీకరణం తరువాత ప్రారంభ దశను 'పిండం'(Embryo) అంటారు. 'శిశువు'(Foetus) అని ఇంచుమించు రెండు నెలలు లేదా 8 వారాల తర్వాత నుండి పురిటి సమయం వరకు పిలుస్తారు. చాలా దేశాల్లో మానవుల గర్భావథి కాలాన్ని మూడు ట్రైమిస్టర్(3*3 months) కాలాలుగా విభజిస్తారు. మొదటి ట్రైమిస్టర్ కాలంలో గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండవ ట్రైమిస్టర్ కాలంలో శిశువు పెరుగుదలను సులభంగా గుర్తించవచ్చును. మూడవ ట్రైమిస్టర్ కాలంలో శిశువు గర్భాశయం బయట స్వతంత్రంగా బ్రతకగలిగే స్థాయికి పెరుగుతుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు :
 • ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువపాలు , పండ్లు , ఆకుకూరలు , పప్పు , మాంసము , చేపలు వగైరా తీసుకోవాలి .
 • మొదటి ఆరునెలలు .... నెలకొకసారి , ఏడు -ఎనిమిది నెలల్లో నెలకు రెండు సార్లు , తొమ్మిదోనెలలో వారానికొకసారి వైద్యపరీక్షలు అవసరము .
 • సొంతముగా మందులు వాడడము , ఎక్షురేలు తీయించుకోవడము చేయకండి.
 • ఎత్తుమడమల చెప్పులు వాడకంది ,
 • గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది.
 • మొదటి మూడునెలలు , చివరి నెలలో దూరప్రయాణాలు , కారు స్కూటరు నడపడము , చేయరాదు .
 • రాత్రులు 8-10 గంటలు , పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి . నిద్రపోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు ) తిరిగి పడుకోవాలి .
 • స్త్రీలు గర్భము దాల్చిన మూడు మాసముల తరువాత, ప్రసవించిన మూడు మాసముల వరకు యోగ విద్య నభ్యసించ రాదు. ఉదయము నడక మాత్రము చేయవలయును.
 • ధనుర్వాతం బారినుండి రక్షణకోసము టెటనస్ టాక్షాయిడ్ ఇంజక్షన్‌ లు తీసుకోవాలి .
 • రక్తస్రావము , ఉమ్మనీరు పోవడము , శిశువు కదలిక తగ్గినట్లు అనిపించినప్పుడు , కడుపు నొప్పి వచ్చినా డాక్టర్ని సంప్రదించాలి .
 గర్భవతులకు - పోషకాహారం-- గర్భస్త సమయంలో ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు -

భారతదేశంలో, ముఖ్యంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న జనాభాలో స్త్ర్రీ గర్భవతిగా లేని సమయంలోను, గర్భవతిగా ఉన్న సమయంలోను, ఓకే విధమైన ఆహారం తీసుకుంటున్నట్లు లెక్కల్లో తేలింది. బిడ్డకు, తల్లికి ఇద్దరికీ సరిపడా లేక ఎక్కువ ఆహారం తీసుకోవలసిన - అవసరం చాలా ఉంది.

నష్టాలు -
 • 1. గర్భవతి తీసుకోవలసిన దానికంటే తక్కువ ఆహారం తీసుకోవటంవలన, తక్కువ బరువుతో శిశువు జన్మించడం - ఇది - తల్లీ/బిడ్డల మరణాలకు దారితీయటం ఎక్కువగా కనిపిస్తుంది.
 • 2. శిశువు బరువు వృధ్ది చెందడంలోను, తల్లికికూడా కొవ్వు శరీరంలో పెరిగేటందుకు అదనపు ఆహారం చాలా దోహద పడుతుంది.
 • 3. పాలిచ్చే తల్లులు (బాలింతలు) సంపూర్ణ ఆహారం తీసుకుంటే, శిశువుకు కావలసినంతగా పాలు వచ్చే అవకాశం ఉంటుంది.

గర్భవతికి కావలసిన ఆహారం -
 • గర్భవతి తీసుకొనే ఆహారం పుట్టబోయే బిడ్డ బరువు పై ప్రభావం చూపుతుంది.
 • గర్బవతికి 300 cal (కాలరీల శక్తి ఎక్కువగా/అదనంగా 15గ్రా మాంసకృత్తులు/10గ్రా కొవ్వుపదార్దాలు అయిదు/ఆరు నెలల గర్భధారణ నుండి తిసుకోవలసిన అవసరం చాలా ఉంటుంది.
 • గర్భవతులు , బాలింతులు తీసుకొనే ఆహారంలో, అధనపు కాల్షియం ఉండాలి. శిశువు ఎముకలు దంతాలు రూపు దిద్దుకోవటానికి, రొమ్ము పాలు పెరగటానికి ఇది చాలా అ వసరం.
 • గర్భ స్ధ దశలో ఇనుము లోపంతో వచ్చే రక్తహీనత, కాన్పుసమయంలో తల్లి మరణానికి దారి తీస్తుంది. శిశువు తక్కువ బరువు తో పుడతారు కనుక, ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవలసి ఉంటుంది.
గర్భవతులు ఆహారం విషయంలో పాటించవలసినవి -
1. గర్భవతులు, బాలింతలు, అదనపు ఆహారం తప్పకుండా తీసుకోవాలి.
2. రోజుకు మూడు కన్నా ఎక్కువ పూటలు భోజనం చేస్తే మరీ మంచిది. .
3. ముడిధాన్యాలు, మొలకెత్తినధాన్యాలు,పులిసిన ఆహారం(పెరుగు ) అదనంగా తీసుకొవాలి.
4. పాలు/మాంసము/కోడిగుడ్లు తీసుకోవాలి.
5. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి .
6. మందులు వైద్యుని సలహా ప్రకారమే తీసుకోవాలి.
7. ఐరన్, ఫోలిక్ / కాల్షీయంను (ఎక్కువ 14-16 వారాల గర్బం నుంచి ప్రారంభించాలి, తల్లి పాలు ఇచ్చేంతవరకు పోడిగించాలి.
8. గర్భవతి, రోజూవారీ చేసుకొనే పనులలో నడక ఉండాలి, కాని ఎక్కువ బరువుపనులు చెయ్యరాదు, అదీ నెలలునిండిన సమయంలో ప్రత్యేకంగా.
9. పోగాకు లేదా మద్యపానం అనగా (సారా, విస్కీ) లాంటివి సేవించరాదు.
10. టీ, కాఫీ తాగడంవలన, శరీరానికి కావలసినంత ఐరన్ అందదు, అందువలన భోజనం తరువాత, టీ / కాఫీ తీసుకొనరాదు.
11.అనవసరమైన భయం ప్రసవ సమయాన్ని కష్టతరము చేస్తుంది,గర్భము , ప్రసవము సృష్టిలో సర్వసాధారణ విషయాలని గుర్తుంచుకోండి.
12. భార్యా భర్తలు నిత్యమూ సంభోగము చేయవచ్చును . అతిగా సంభోగము చేయరాదు . 8-9 వ నెలలో పొట్టపైన ఒత్తిడి పడకుండా రతిలో పాల్గొనాలి .
13. గర్భము దరించిన నుండి , బిడ్డకు పాలు ఇవ్వడం ఆపేంత వరకూ రక్తదానం చేయరాదు .
గర్భము ధరించిన స్త్రీ ఏవిధముగా ఉండాలి?
 • గర్భము ధరించిన స్త్రీ ముఖ్యముగా ఎల్లవేలలూ ప్రసంతముగా వుండాలి.
 • ప్రతిపనిలోను నీజాయితిగా వుండాలి.
 • అనునిత్యము దేవనామస్మరణ చేయవలెను.
 • దర్మప్రవుత్తి కల్గివుండాలి.
 • సత్యమునే పలకవలెను.
 • మీకుటుంబమందు ఆప్యాయత అనురాగము కలిగి వుండాలి .
 • నీతి కధలను చదువుతు వుండాలి.
 • గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది.
గర్భిణులు నిద్రలో కొన్ని సమస్యలు-జాగ్రత్తలు :
గర్భిణులు కంటినిండా నిద్రపోవటం ఎంతో అవసరం. అయితే గర్భం ధరించినపుడు శరీరంలో జరిగే మార్పులు నిద్రలో కొన్ని సమస్యలు సృష్టిస్తుంటాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రాత్రిపూట హాయిగా నిద్రపోవటానికి వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
 • * గర్భిణులు మూడోనెల నుంచి ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఎక్కువసేపు వెల్లకిలా పడుకోకుండా చూసుకోవాలి.
 • * పగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. అయితే రాత్రిపూట వాటిని పరిమితం చేయాలి-లేకపోతే ఎక్కువసార్లు మూత్రవిసర్జన నిద్రలేమికి దారితీయును. .
 • * కారం తక్కువగా ఉండే పదార్థాలు తినాలి. ఛాతీలో మంట పుట్టించే మసాలా ఆహారాన్ని మానెయ్యటమే మంచిది--చాతిలోమంట నిద్రరానివ్వదు ..
 • * పడుకునేటప్పుడు గర్భిణుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దిండ్లు వాడుకోవాలి. అవి అందుబాటులో లేకపోతే మరో దిండును మోకాళ్ల మధ్య పెట్టుకొని పడుకోవచ్చు.
 • * పగటిపూట వీలు చేసుకొని కాసేపు కునుకు తీయాలి. నిద్ర బాగా పట్టేందుకు మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు పాటించాలి.
 • * నిద్రలేమితో బాధపడుతుంటే తప్పకుండా డాక్టరుకు చూపించుకోవటం మరవరాదు.

గర్భిణి లలో మధ్యపానము , Alcohol in pregnency .


ఇంటిలో గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు మానసికం గా తీసుకోవలసిన జాగ్రత్తలు :

ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు, ఆ గృహస్తులు కొత్త ఇల్లు లేదా ఫ్లాట్స్ వంటి వాటివి కొనుగోలు చేయడం, కట్టడం వంటివి కూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. గృహ నిర్మాణ పనులు చేపట్టినప్పుడు అక్కడ వాతావరణము దుమ్ము, ధూళి వంటి వాటివలన కాలుష్యమౌతుంది కనుక కచ్చితముగా గర్భిణీ స్త్రీలను, పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. శిశువు పుట్టిన తర్వాతే కట్టడాల నిర్మాణాలు, ఫ్లాట్స్ కొనడం వంటివి చేయాలని వాస్తునిపుణులు సలహా ఇస్తున్నారు.

అలాగే నిద్రలేచిన వెంటనే గర్భిణీ స్త్రీలు పచ్చటి ప్రకృతి, జలపాతాలు వంటి దృశ్య పటాలను ప్రొద్దునే నిద్రలేస్తూనే చూడటం మంచిది. నిద్రలేచిన వెంటనే దేవుడు పటాల్ని చూడటం ద్వారా రోజంతా శుభదాయకంగా ఉంటుంది.

గర్భిణీ స్త్రీలు ఉండే ఇళ్లలో గృహస్థలం యొక్క దక్షిణము వైపున ఖాళీస్థలాన్ని వదిలిపెట్టి ఉత్తరము వైపున ఇల్లు ఉండకుండా చూడాలి. ఇటువంటి స్థలం గర్భిణీ స్త్రీలనే మాత్రమే గాకుండా స్త్రీలకు బాధలను కలిగిస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తు ప్రకారము దక్షిణము న విశాలప్రదేశమున్నట్లైతె రాత్రులు యమకింకరులు తిరుగుతారని నమ్మకము .

మరోవైపు గర్భవతికి ఆరు మాసములు నిండిన తర్వాత గృహారంభం, గృహప్రవేశం చేయకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. క్రొత్త వతావరణము కడుపులో బిడ్డ మానసిక స్థితి పై ప్రభావము ఉంటుంది . దీంతో పాటు సముద్ర ప్రయాణము, భర్త దూరముగా వలస వెళ్ళుట , గర్భవతి శ్రాద్ధాన్న భోజనం చేయుట వంటివి కూడదు అని అంటారు .

ఇంకా గర్భిణీ స్త్రీ భర్త పుణ్యతీర్థములు సేవించుట, శవమును మోయుట, శవము వెంట నడుచుట వంటివి చేయకూడదు. గర్భిణీ స్త్రీలైతే.. నదీ స్నానము, శవం వద్ద దీపమెలిగించడం, రక్తాన్ని చూడటం, శ్మశాన దర్శనం చేయడం శిశువుకు మంచిది కాదు. అంటువ్యాధు వచ్చే ప్రమాదము మరియు బిడ్డ మానసిక పెరుగుదల పై ప్రభావము చూపుతాయి .

అలాగే గర్భిణీ స్త్రీలుండే ఇంటి నిర్మాణంలో మార్పులు, చేర్పులు చేయడం శ్రేయస్కరం కాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆ సమయము లో గర్భిణీ లకు ప్రశాంతత కరువవుతుందనే వాదన ఉంది .


గర్భిణి స్త్రీలలో మానసిక ఒత్తిడి ప్రభావము, Mental stress effects on Pregnancy

గర్భిణి తీవ్ర మానసిక ఒత్తిడి అనుభవిస్తే ఆ ప్రభావం కడుపులోని బిడ్డ పైనా పడుతుందా? దీనిపై వైద్యరంగం ఎప్పటి నుంచో రకరకాల అధ్యయనాలు చేస్తోంది. తాజాగా వెల్లడైన అంశమేమంటే- గర్భం దాల్చిన తర్వాత తొలి మూడు మాసాల్లో తల్లి తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైతే ఆమెకు పుట్టే బిడ్డకు రక్తహీనత, ముఖ్యంగా ఇనుము లోపం బారినపడే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదల ప్రభావితమవుతుందని ఇజ్రాయెల్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇనుము బిడ్డ శారీరక అవయవాల ఎదుగుదలకు, ముఖ్యంగా మెదడు వికాసానికి చాలా కీలకం. తల్లుల్లో ఇనుము లోపం, మధుమేహం, గర్భం దాల్చిన తర్వాత పొగ తాగటం వంటివి పిల్లల్లో ఇనుము లోపాన్ని పెంచుతాయి. అలాగే నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డల్లో కూడా ఇనుము లోపించే అవకాశాలు ఎక్కువ. వీటన్నింటికి తోడు- గర్భిణి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనా కూడా పిల్లల్లో ఇనుము లోపం తలెత్తవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడవటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. ఈ నేపథ్యంలో గర్భిణులంతా 'చక్కటి పోషకాహారం, మానసిక ప్రశాంతత'.. ఈ రెండు అంశాల మీదా ప్రత్యేక శ్రద్ధ పెట్టటం చాలా అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.

=============================================
మూలాలు
* From my knowledge & experience.
1. ↑ Embryo Definition. MedicineNet.com. MedicineNet, Inc. .
2. ↑ Fetus Definition. MedicineNet.com. MedicineNet, Inc. .
3. ↑ Trimester Definition. MedicineNet.com. MedicineNet, Inc. .
4. ↑ Nguyen, T.H.; et al. (1999). "Evaluation of ultrasound-estimated date of delivery -Ultrasound in Obstetrics and Gynecology 14 (1): 23-28.
5.* Harrison's Text book of Medicine.
6. * Obstetrics for Under graduates" by Dr.R K Raju.MD (prof.& Head of Dept. of OBS & Gynaec._AMC visakhapatnam)

 • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, September 13, 2011

అజీర్ణము ,Indigestion


 • [GIT..+intestines.gif]

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -అజీర్ణము ,Indigestion- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


తిన్నది సరిగా జీర్ణము కాకపోవడాన్ని , కడుపులొ గాస్ ఫార్మయి ఇబ్బంది కలిగించినపుడు , ఆహారము కడుపులో పులిసి మంట అనిపించునపుడు , అజీర్తి విరోచనాలు అవుతున్నపుడు , కడుపు ఉబ్బరము ,త్రేన్పులు రావడము .. అనిపించినపుడు ... మనకు తినంది సరిగా జీర్ణము అవలేదని అంటాము ... అదే అజీర్ణము . వ్యక్తిని బట్టి , తినే ఆహారము బట్టి , జీర్ణరసాలు ఊరడం బట్టి , శరీరము ఏదైనా వ్యాధి బట్టి జీర్ణ ప్రక్రియ ఆధారపడి ఉంటుంది . అజీర్ణానికి మూల కారణము కనుగొని చికిత్స చేయవలది ఉంటుంది . తాత్కాలికము గా జీర్ణము అవడానికి అనేక మార్గాలు ఉన్నాయి .

మరి కొంత సమాచారము కోసము : జీర్ణము - అజీర్ణము

అజీర్ణానికి ఆయుర్వేద వైద్య చిట్కాలు

1. పచ్చి అరటికాయను ఎండబెట్టి పొడిచేసి ఉప్పుతో 1 నుంచి 2 గ్రాముల పొడిని కలిపి సేవించిన అజీర్ణం తొగలగిపోవును.
2. బెల్లముతో శొంటిపొడి కలిపి భోజనమునకు ముందు తినుచున్న అజీర్ణము పోవును.
3. ఉప్పునీళ్లు త్రాగిన అజీర్ణం పోవును.
4. కరక్కాయల పొడి బెల్లం కలిపి సేవించచున్న అజీర్ణము నశించును.
5. అల్లం, జీలకర్ర సైంధవలవణము నిమ్మరసంలో ఊరవేసి ప్రతిరోజు ఉదయం సేవించిన అజీర్ణము తొలగిపోవును.
6. మర్రిచెక్క పొడిచేసిగాని కషాయం పెట్టిగాని సేవించిన అజీర్ణము పోవును.
7. సైంధవ లవణము అల్లము సమానంగా కలుపుకొని ఉదయం, సాయంత్రం 3 గ్రాములు భోజనములందు సేవించిన అన్నిరకముల అజీర్ణరోగములు నశించును.
సంబంధిత సమాచారం
 • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

చర్మము పై ముడతలు , Wrinkles on Skinఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -చర్మము పై ముడతలు , Wrinkles on Skin- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

అన్ని అవయవాలలాగానే చర్మము కూడా ఏజింగ్ ప్రోసెస్ కు లోనవుతుంది . అందువలన చర్మము ముడతలు పడడము , కళ్ళు కింద ఉబ్బడము , కళ్ళ కింద చారలు , కల్లకింద నల్లగా అవడము , కళ్ళకింద వలయాలు , నుదిటిపై ముడతలు వంటివి ఏర్పడతాయి. అందమంటే చర్మమే కదా! తెల్లటి శరీరచ్ఛాయతో మెరిసిపోవటమే సగం అందానికి కారణం. రోజులు పెరిగే కొద్ది శరీరపు చర్మసౌందర్యం మెరుపు తగ్గిపోతుంది వయసువలనే . కాంతులీనే చర్మాన్ని తిరిగి సంపాదించకోలేక పోయినా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు సత్పలితాలు కనిపిస్తాయి .

జాగ్రత్తలు :
జీవన విధానము లో మార్పులు :
ఎండదెబ్బకు గురికావడము ,
ధూమపానము ,
ఆహారపు అలవాట్లు ,
ఒత్తిడి ,
ఫ్రీరాడికిల్స్ పేరుకుపోవడం ,
నిద్రలేమి ,
జన్యుసంబంధ కారణాలు ,
ఎక్కువ గంటలు పనిచెయ్యడం ,
సూర్యరశ్మికి ఎక్ష్పోజ్ అవడము ........................ముఖ్యమైనవి .

ముడతలు లేకుండా ఉండాలంటే ధూమపానము మానండి . ఎండకు ఎక్ష్పోజ్ అవవద్దు , పోషకాహారము తీసుకోవాలి -- నిమ్మజాతి పండ్లు తినాలి . ఆకుకూరలు వాడాలి , కనీషము 8-10 గంటలు నిద్రపోవాలి , ఎ , సి , డి, ఇ , విటమిన్లు కలిగిన ఆహారము తీసుకోవాలి .

చర్మ ఆరోగ్యానికి :
ఎక్కువగా నీరు త్రాగాలి ... నీరు త్రాగితే శరీరములోని మలినాలు , విషపదార్ధాలు బయటికి విసర్జించబడి చర్మము ఆరోగ్యము గా ఉంటుంది . రోజుకు సుమారు 2 లీటర్లు నీరు త్రాగాలి. ఎండలో తిరగటం ఎక్కువ శారీరకశ్రమ, ఇవన్నీ చర్మసొగసును మసక బారేలా చేసి నల్లబరుస్తుంది. స్నానం చేశాక తుడుచుకున్నపుడు చూసుకుంటే మన చర్మపు రంగు ఏమిటో ప్రస్తుతం బైటికి కనిపించే శరీర అవయవాల రంగేమిటో తెలుస్తుంది. అంత తేడా వుండటానికి కారణం బట్టలతో చర్మాన్ని రక్షణగా వుంచకపోవటం, అలా అని శరీరం అంతా బట్టలతో చుట్టుకోమని కాదు స్నానం చేశాక కాలాన్ని బట్టి మాయిశ్చరైజర్‌ రాసుకోవటం, చలికాలం అయిత కోల్డ్‌ క్రీము రాసుకోవటం చేయాలి. మనం చేయాల్సింది ఎండలో బైట తిరిగేటపుడు కేర్‌ తీసుకోవటం, బ్యూటీ పార్లర్‌కు వెళ్ళే మీకు తెలియనిది కాదు. పార్లర్‌లో ఫేషియల్‌ చేయించుకొని ఎండలో బైటికి వచ్చి ఇంటి కొచ్చి చూసేసరికి అయ్యో అలానే వున్నానే అక్కడే పార్లర్‌లోనే కాసేపాగి వచ్చినా సరిపోయేది లేదా సాయంత్రం వెళితే సరిపోయేదే, అని అనుకోవటం సహజం.

అంటే ఎండలో వుంటే రెండు వందలు పెట్టి చేయించు కున్న ఫేషియల్‌ కూడా పోతుందంటే రోజూ ఎండలో ఏ మాత్రం కేర్‌ లేకుండా తిరిగే మీ చర్మపు రంగులో ఎంత మార్పు వస్తుంది. కారణం అర్ధమయిందిగా, సూర్యుని నుంచి వచ్చే యూవి కిరణాలు చర్మసౌందర్యాన్ని డిస్ట్రబ్‌ చేస్తాయి. మెరిసిపోయే మీ అందాన్ని హరింపచేస్తాయి.విటమిన్‌ 'సి' మెలనిన్‌ ఉత్పత్తిని నిషేధించి చర్మం రంగును, కాంతిని మెరుగు పరుస్తుంది. వయసుని పళ్ళరసాలు తగ్గిస్తాయి. సూర్యకిరణాల్లో హాని చేసే యూవి-బి కిరణాల నుంచి కూడా విటమిన్‌ 'సి'వల్ల రక్షణ పొందవచ్చు. శరీరఛాయ నల్లబడకుండా ఎక్సట్రా బెనిఫిట్‌ ఇస్తుంది. కాబట్టి సూర్మరశ్మి శరీరానికి అవసరమైనంత తీసుకోవాలి.

ఎక్కువగా ఎండలో వుంటే చర్మం నల్లబడి పోతుంది. ఇప్పటి దుస్తులు కూడా అలానే వున్నాయి. శరీరానికి ఎండ బాగా తగిలే విధంగా వుంటున్నాయి. చర్మానికి కొత్తదనముతో పాటు చర్మము చిట్లకుండా వుండాలంటే ఆహారములో మార్పులు రావాలి. అంటే విటమిన్‌ 'ఎ' వుండే ఆహార పదార్ధాలను తీసుకోవాలి.

బీట్‌రూట్‌ సహజ క్లెన్సర్‌లా పనిచేసి చర్మాన్ని ప్రకాశవంతంగా, కోమలంగా మృదువుగా వుంచుతుంది.సాధారణంగా ముఖానికి ఎటువంటి మేకప్‌ చేయకుండా వుండటమే మంచిది. మరీ అవసరమైతే తప్ప మేకప్‌ వేసుకోకూడదు. అందులో మేకప్‌కు మీరు వాడే సామాగ్రి బ్రాండెడ్‌ అయి వుండాలి. సాధారణ ప్యాకలు అంటే ఇంట్లో చిట్కాలను ఉపయోగించి ప్యాక్స వేసుకోవచ్చు. దీని వలన ముఖానికి ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స వుండవు. అంతేకాక ముఖం పై ముడతలు కూడా రావు.

ఆహారములో మార్పులు :
టివిలో, పేపర్‌లో వచ్చే ప్రకటలను చూసి వందల రూపాయలు పోసి అనేక రకాల క్రీములు కొంటున్నారు. వాటివల్ల ఎంతవరకు ప్రయోజనం కలుగుతుందనేది మాత్రం ప్రశ్నగానే మిగిలి పోతోంది. అందుేక కృత్రిమంగా తయారు చేసే క్రీములపై ఆధార పడడం అంత మంచిది కాదంటున్నారు సౌందర్య నిపుణులు.సహజసిద్ధంగా తయారయ్యే పండ్లు, నట్స్‌తో కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు అంటున్నారు వారు.
మనం నిత్యం ఉపయోగించే పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. కేవలం శరీరానికి శక్తి నివ్వడమే కాకుండా చర్మానికి మంచి కాంతి తేవడంలో ఇవి ఎంతగానో దోహదపడుతాయి.నారింజ :
నారింజలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్‌ను ఉత్పత్తి చెయ్యడంలో సహా యపడుతుంది. ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది. రోజుకు రెండు వందల గ్రాముల విటమినసి అవసరమవుతుంది. నారింజ జ్యూస్‌ తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది.


బొప్పాయి :
చూడగానే నోరూరించే బొప్పాయి పండులో తక్కువ కేలరీలుంటాయి. విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది.నిర్జీవమైన చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. బొప్పాయి గుజ్జుతో ఫేస్‌ ప్యాక్‌ కూడా వేసుకోవచ్చు. ప్రతిరోజూ ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే మంచిది.గోధుమలు :
గోధుమలలో బి గ్రూపుకు చెందిన విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. చర్మంలో మరణించిన కణాల స్థాన ంలో కొత్తకణాల పెరుగుదలలో ముఖ్యపాత్ర వహిస్తాయి. స్ట్రెస్‌, ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా చర్మం పాడవకుండా కాపాడతాయి.పగిలిన చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుంది. వీటిలో ఉండే నియాసిన్‌, చర్మ ణాలు రక్తంలో ఉన్న పోషకాలను గ్రహించేలా చేస్తుంది. గోధుమపిండితో చేసే బిస్కెట్స్‌, బ్రెడ్‌ను ఎక్కువగా తినాలి.

ప్రొద్దుతిరుగుడుపువ్వు గింజలు : తేలికగా, క్రిస్పీగా ఉండే ఈ గింజలలో ఫాటీ యాసిడ్స్‌ ఉంటాయి.ఇవి చర్మం తేమ ను కోల్పోకుండా చేసి కోమలంగా తయారు చేస్తుంది. బ్లాక్‌ెహడ్స్‌ను నిర్మూలిస్తాయి. మచ్చలు కూడా తగ్గుతాయి. వారానికి రెండుసార్లు రెండు టేబుల్‌ స్పూన్‌ల ప్రొద్దుతిరుగుడు గింజలు తీసుకోవాలి. వంటకు కూడా సన్‌ఫ్లవర్‌నూనెను ఉపయోగించడం మంచిది.


గింజధాన్యాలు :
చర్మకణాల పెరుగుదలకు ఉపయోగపడే ప్రోటీన్లు గింజ ధాన్యాలలో అధిక మోతాదులో ఉంటాయి. చుండ్రును నిర్మూలించే బయోటిన్‌ అనే పోషకం వీటిలో ఉంటుంది. బయోటిన్‌ జుట్టు త్వరగా పెరగడానికి తోడ్పడుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా గింజధాన్యాలు తింటే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ధాన్యాలను ఉడకబెట్టి గుగ్గిళ్ళ రూపంలో తీసుకుంటే చాలా మంచిది. దీనివల్ల నెట్‌ కేలరీలు, జింక్‌ అధికశాతం లభిస్తాయి. జింక్‌ దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల కలిగే రాషెస్‌ రాకుండా చేస్తుంది. క్రమం తప్పకుండా గింజధాన్యాలు తినడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. కలబంద ప్రతిరోజూ కలబంద జ్యూస్‌ తాగడం వల్ల చర్మంపై వచ్చే దురదలు, మొటిమలు, పి గ్మెంటేషన్‌ సమస్యలను తగ్గించుకోవచ్చు. రోజుకు 30 మిల్లీ లీటర్ల జ్యూసును తీసుకోవాలి.

నట్స్‌ : బాదం, కర్జూరాల వంటి డ్రై ఫ్రూట్స్‌లో క్యాలరీలు, జింక్‌ అధిక శాతం ఉం టాయి. జింక్‌ దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల కలిగే రాషెస్‌ రాకుండా చేస్తుంది. రఫ్‌గా ఉండే చర్మాన్ని మృదువుగా చేస్తుంది. క్రమం తప్పకుండా నట్స్‌ తినడం వల్ల చర్మం పొడి బారకుండా ఉంటుంది. జీర్ణప్రక్రియలో కూడా డ్రైఫ్రూట్స్‌ చాలా ఉపయుక్తంగా ఉంటాయి. వీటిలో ఉండే పీచు పదార్థాలతో మలబద్ధకం నివారణ అవుతుంది.
 • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, September 12, 2011

Urinary Infection, మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌


 • [Urine+flow.jpg]-[Urinarytract.jpg]ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌, Urinary Infection- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ను మనం అన్ని వయసుల వారిలో చూస్తుంటాం. మూత్రంలో చీము వచ్చినప్పుడు యురినరి ట్రాక్‌ ఇన్‌ఫెక్షన్‌ అని అంటారు. సరైన సమయంలో దీనికి చికిత్స చేయకుంటే ఇది మూత్రపిండాలకు సోకే అవకాశముంది. దీన్ని ఆక్యుట్‌ పైలొనెఫ్రైటిస్(acute pylonephritis)‌ అంటారు.

లక్షణాలు : మూత్రంలో మంట. చలితో జ్వరం ముఖ్యమైన లక్షణం. మూత్రంలో మంట. తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం. రక్తపోటు పడిపోతుంది. వాంతులవుతాయి. నడుం నొప్పిఉంటుంది.

అక్యుట్‌ యురినరిట్రాక్‌ ఇన్‌ఫెక్షన్‌ : మూత్రంలో మంటగా ఉండంతోపాటు చలి జ్వరంతో బాధపడతారు. ఎక్కువసార్లు మూత్రం పోయడం. దీనికి చికిత్స చేయకుంటే వాంతులవుతాయి. మిగతా అవయవాలకు పాకే అవకాశముంది. మూత్రపిండాల్లో చీము చేరి, క్రియాటిన్‌, యురిన్‌ పెరగడం జరుగుతుంది. బిపిపడిపోవడం, జరుగుతుంది. గుండెపై ప్రభావం చూపుతంది. దీన్నే క్రానిక్‌ యురినరి ఇన్‌ఫెక్షన్‌. అంటారు.

కారణాలు : యురినరి ఇన్‌ఫెక్షన్‌ కలగడానికి వివిధ కారణాలున్నాయి. మూత్రవిసర్జనలో అడ్డు ఉండడం. అంటే మూత్రపిండంలో రాళ్లు. మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌కు ప్రధాన కారణం నీళ్లు తక్కువగా తీసుకోవడం. నీళ్లు ఎక్కువ తాగినప్పుడు మూత్రం నిల్వఉండదు. దీంతో ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశముండదు. తక్కువ నీళ్లు తీసుకున్నప్పుడు మూత్రాశయంలో మూత్రం నిల్వ ఉండి ఇన్‌ఫెక్షకు దారితీస్తుంది. క్రిములు పెరిగే అవకాశముంటుంది. కొత్తగా పెళ్లయిన వారిలో హనిమూన్‌ సిస్టిటిస్‌ అనే సమస్య కనిపిస్తుంది. ఇది కూడా ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది. మగవారి కంటే ఆడవాళ్లలో మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువ. ఎందుకంటే పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రనాళం సైజు చిన్నగా ఉంటుంది. లోపల ఉండడం వల్ల క్రిములు చేరుతాయి. ఇవేకాక మూత్రనాళంలో అడ్డు ఉండడం, రాళ్లు ఎక్కువగా ఉండడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువసార్లు వస్తుంది. చిన్న చిన్న రాళ్లు మూత్ర విసర్జనలో వెళ్లిపోతుంటాయి. మూత్ర వ్యవస్థలో అసాధారణ సమస్యలు ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతాయి. పిల్లల్లో పుట్టుకతోనే మూత్రనాళంలో అసాధారణ మార్పులు ఏర్పడుతుంటాయి. మెడుల్యరి స్పాంజ్‌ కిడ్నీ సమస్య కొంత మందిలో ఉంటుంది. ఇందులో రెండు కిడ్నీలు కింది భాగంలో అతుక్కుని ఉంటాయి. దీని వల్ల ఎక్కువ మూత్రం నిల్వ ఉండే అవకాశముంది. చిన్న పిల్లల్లో రిఫ్లక్స్‌ నెఫ్రోపతి సమస్య ఉంటుంది. మూత్రనాళం ద్వారా బయటికి వెళ్లే మూత్రం వెనక్కి వెళ్తుంది. మూత్రం నిల్వ ఉండి కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశముంది. ఏడాదిలోపు వయసు ఉన్నప్పుడు చలితో జ్వరం వచ్చినప్పుడు మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌, రిఫ్లక్స్‌ సమస్యను నిర్ధారించుకోవాలి. సమస్యను తొలిదశలోనే గుర్తించి చికిత్స చేస్తే కిడ్నీలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. వృద్ధుల్లో మూత్రం ఇన్‌ఫెక్షన్‌కు కారణం పురుషుల్లోని పౌరుష గ్రంథి (ప్రొస్టేట్‌ గ్రంథి). ఇది మూత్రాశయం చుట్టూ ఉంటుంది. వయసుపెరిగే కొద్ది ఇది పెద్దగా మారుతుంది. దీన్ని బినైన్‌ ప్రొస్టేటిక్‌ హైపర్‌ ప్లాసియా అంటారు. 60 ఏళ్ల తర్వాత ఇది పెరగడం వల్ల మూత్రనాళం ఒత్తిడికి గురై సన్న బడుతుంది. సాధారణంగా మూత్రం ధారగా రావాలి. కానీ ఈ సమస్య వల్ల వృద్ధుల్లో మూత్రం చుక్కలు చుక్కలుగా వస్తుంది. మూత్రం పోసిన పదినిమిషాల తర్వాత మళ్లీ పోయాల నుకుంటారు. తరచూ మూత్ర విసర్జనకు వెళ్తుంటారు. ఇక మహిళల్లో... అనారోగ్యానికి గురైనప్పుడు ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళ్లరు. ఇలాంటప్పుడు మూత్రం నిల్వ ఉండి ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశముంది. ఇక వీరిలో మూత్రనాళం సన్నగా, లోపలికి ఉండడం వల్ల సులభంగా క్రిములు వెళ్లి ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. మధుమేహం నియంత్రణ లేని వారి మూత్రంలో క్రిములు పెరుగుతాయి. వీరిలో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా ఉంటుంది. కుటుంబ నియంత్రణ కోసం వాడే కండోమ్స్‌, స్పెర్మ్‌డల్‌ఫోమ్‌ వల్ల కూడా ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది.

నిర్ధారణ పరీక్షలు : పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు కంప్లీట్‌ యూరిన్‌ పరీక్ష చేయించాలి. దీని వల్ల మూత్రంలో చీము కణాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. చీము కణాలు ఉంటే యూరిన్‌ కల్చర్‌ పరీక్ష చేయించాలి. ఈ పరీక్ష వల్ల ఇన్‌ఫెక్షన్‌ ఎందుకొచ్చిందో తెలుస్తుంది. సీరం క్రియాటినిన్‌తో కిడ్నీ పనితీరును తెలుసుకోవచ్చు. తర్వాత మూత్రనాళంలో అడ్డు, రాళ్లు ఉన్నాయో, లేవో తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేస్తారు. తర్వాత మూత్రం సాధారణంగా కిందికి వస్తుందా? లేదా పైకి వెళ్తుందా అనేది ఎంసియుజి పరీక్ష వల్ల తెలుసుకోవచ్చు. యురినరి ఇన్‌ఫెక్షన్‌ కిడ్నీకి పాకిందా లేదా అని తెలుసుకోవడానికి సిటి స్కాన్‌ చేస్తారు.

చికిత్స : 80 శాతం కేసుల్లో యురినరి ఇన్‌ఫెక్షన్‌ ఇ-కొలై అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌కు మొదట యాంటి బయాటిక్‌తో చికిత్స చేస్తారు. మూత్రంలోని ఇన్‌ఫెక్షన్‌ కిడ్నీలకు చేరుకుని దాని పనితీరును ప్రభావితం చేస్తుంది. పనిచేయడం ఆగిపోతుంది. విసర్జక వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో ఆకలి లేకపోవడం, నిద్రపట్టకపోవడం, వాంతులు, మూత్రం రావడం కూడా ఆగిపోవచ్చు. వీరికి డయాలసిస్‌ కూడా అవసరం ఉండొచ్చు.

నివారణ : మధుమేహాన్ని నియంత్రించుకోవాలి. మూత్రం ఎక్కువ నిల్వ ఉండకూడదు. ప్రతి రెండు గంటలకు విసర్జించాలి. రోజూ సుమారుగా 1.5 నుండి రెండు లీటర్ల మూత్రం విసర్జించాలి. అందుకని మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. ఎక్కువగా మూత్రం ఆపుకోకూడదు. మూత్రం పసుపచ్చగా వస్తుంటే కామెర్లు అని అనకుంటాం. కానీ నీళ్లుతాగడం వల్ల తక్కువ తీసుకునే వారిలో ఇది కనిపిస్తుంది. నీళ్లు బాగాతీసుకుంటే ఈ రంగు రాదు. గర్భధారణ సమయంలో కూడా ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశముంది. గర్భంలో బిడ్డ పెరుగుతున్నప్పుడు మూత్రనాళాలపై ఒత్తిడి వల్ల మూత్రం నిల్వ ఉండి ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. ఒక్కోసారి ఇన్‌ఫెక్షన్‌ అబర్షాన్‌కు దారితీసే అవకాశముంది. అందుకని ఎక్కువ నీళ్లు తీసుకోవాలి.


డాక్టర్‌ సురేష్‌ కుమార్‌--కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌--కేర్‌ హాస్పిటల్స్‌, ముషీరాబాద్‌. హైదరాబాద్‌.
 • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, September 11, 2011

గర్భనిరోధక మాత్రలు , Contraceptive pillsఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గర్భనిరోధక మాత్రలు , Contraceptive pills- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...20వ శతాబ్దంలో మానవజాతిని ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య హద్దూ పద్దూ లేకుండా పెరిగిపోతున్న జనాభా, ''దేవుడిచ్చిన బిడ్డలు' నారు పోసిన వాడు నీరు పోస్తాడు. అంటూ మతాలు అధిక జనాభాను అరికట్టడానికి ప్రయత్నించలేదు సరికదా, ఆ రకంగా జరిగేయత్నాలకు పాపం, దుర్మార్గంఅంటూ వక్రభాష్యాలు చెప్పి ఎన్నో అవరోధాలు కల్పించింది. జనాభా అపరిమితంగా పెరిగిపోతూ వుంటే దారిద్య్రం నిర్మూలన ఎలా చేయాలి? అందరికీ వృత్తి ఎలా కల్పించాలి ? విద్యను, విజ్ఞానాన్ని, వికాసాన్ని ఎలా పెంపొందించగలం అన్నది ఆలోచించే ప్రతివారినీ వేధించే ప్రధాన సమస్య, సైంటిస్టు దృష్టిని కూడా ఈ సమస్య ఆకర్షించింది. పరిమిత కుటుంబం ఆనందానికి సోపానం అని వారు గుర్తించారు. అవసరం లేనప్పుడు పిల్లలు కలగకుండా ఎలా చేయాలి అని శాస్త్రజ్ఞులు ఆలోచించడం మొదలుపెట్టారు. కాలం చెల్లిన పాత భావాలకు ప్రతీకగా ఉన్న మతస్తుల ఛాందస భావాలను లెక్కపెట్టకుండా శాస్త్రజ్ఞులు, డాక్టర్లు మూఢనమ్మకాలను అధిగమించి గర్భ నిరోధక మాత్రలు రూపొందించాలని, రూపొందించితే తేలికగా అధిక జనాభాను అరికట్టవచ్చునని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈ విధంగా గర్భ నిరోధం కొరకు నోట్లో వేసుకొనే మాత్రలను రూపొందించి మానవజాతికి మహోపకారం చేసిన గొప్ప పరిశోధకులు డాక్టర్‌ గ్రిగరీపింకస్‌. ఆయన కనుగొన్న మాత్రలు సెక్స్‌ సంబంధాలలో ప్రపంచ వ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి- స్త్రీ-పురుష సంబంధాలలో సమానత్వ సాధనకు మార్గం సుగమం చేశాయి.

గ్రిగరీ పింకస్‌ 1903లో అమెరికాలో జన్మించాడు. కార్నేల్‌ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ చేసి ప్రఖ్యాత హార్వర్డ్‌యూనివర్సిటీ నుండి డాక్టర్‌ ఆఫ్‌ సైన్సు డిగ్రీని పొందాడు. అమెరికాలోనూ, ఇంగ్లాండులోను, గొప్ప పరిశోధనలు జరిపాడు. ఎక్స్‌పెరిమెంటల్‌ జువాలజీలో ప్రొఫెసర్‌ అయి అందులో నిష్ణాతుడయ్యాడు. కుటుంబ నియంత్రణ గురించి ముందు జంతువులపై పరిశోధన చేశాడు. తరువాత మనుషులు గర్భ నిరోధక మాత్రలు నోటి ద్వారా తీసుకొనే విధంగా విప్లవాత్మకమైన కృషి చేసిన వ్యక్తి పింకస్‌. ఆధునిక యుగంలో ఏ పరిశోధన జరిగినా, అవి అన్నీ సమిష్టి కృషి ద్వారా సాధ్యమవుతున్నాయి. ఎందరో వీరుల త్యాగ ఫలితంగా గత శతాబ్దంలో దేశాలకు స్వాతంత్య్రం ఒక ప్రక్క లభిస్తే, మరోప్రక్క స్త్రీజాతి విముక్తికి గర్భనిరోధక మాత్రలు మార్గం సుగమం చేశాయి. 1937 లో ప్రొజెస్టరోన్‌ ఇంజక్షన్‌ను రూపొందించాడు.దాని ద్వారా జంతువులకు
గర్భ నిరోధం సులభ సాధ్యం అయింది. అయితే ఆ ఇంజక్షన్‌ ఇప్పుడు చాలా ఖరీదైనది. అమెరికాలో స్త్రీ స్వేచ్ఛ, సంక్షేమం కొరకు మూఢనమ్మకాలపై తిరుగుబాటు చేసిన ధీర వనతి మార్గెరెట్‌సాంగర్‌. ఆమె స్త్రీ స్వేచ్ఛకు గర్భనిరోధక ప్రక్రియలు అవసరమని ప్రచారం చేసి, డాక్టర్‌ పింకస్‌ను ఈ రంగంలో పరిశోధన చేయమని మరింతగా ప్రోత్సహించింది. కొద్ది విరాళాలతో సహకారంతో ప్రారంభమైన పరిశోధన ఎంతోమందిని ఆకర్షించి, ప్రజల నుంచి లక్షలాది డాలర్ల విరాళాలు వచ్చాయి. గర్భనిరోధక మాత్రలు స్త్రీలకు అందుబాటులో ఉండాలి. ఆరోగ్యంపై ఏ ప్రభావం ఉండకూడదు. పింకస్‌ ఈ లక్ష్యంతో తదేక దీక్షతో దశాబ్దాలపాటు నిర్విరామ పరిశోధన కొనసాగించారు. జంతువులపై వేలాది ప్రయోగాలుచేశారు. డాక్టర్‌ జాన్‌రాక్‌ సహకారంతో ప్రొజెస్టరోన్‌ మాత్రను రూపొందించారు. అది 85% మాత్రమే గర్భం నిరోధించగలిగింది. స్త్రీలు తీసుకోవలసిన డోస్‌ కూడా అధికంగా ఉండేది. అమెరికాలో కెమికల్‌ కంపెనీలు ఉత్పత్తి చేసే ప్రోస్టేజన్‌ మందులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి దానితో మిష్ట్రనాల్‌ కూడా కలిపి వాడితే సత్ఫలితాలు వస్తాయని పింకస్‌ ఊహించాడు. 1955లో పింకస్‌ తాను రూపొందించిన గర్భ నిరోధక మాత్రలను అమెరికాలో భాగమైన పోర్టోరి కాలో పట్టణంలో 265 మంది స్త్రీలకు యిచ్చి సత్ఫలితాలు సాధించాడు. ఈ ఎనోవిడ్‌ మాత్రను వివిధ ప్రాంతాలలో స్త్రీలకు యిచ్చి 1960మేలో ఈ గర్భనిరోధక మాత్రను అమెరికా అంతా అందుబాటులోకి తెచ్చాడు. ఇది కుటుంబ నియంత్రణ చరిత్రలో చాలా గొప్ప పరిణామం. ఎంతోమంది సహకరించినప్పటికీ ఈ గర్భ నిరోధక మాత్ర రూపకల్పన డాక్టర్‌ పింకస్‌ ప్రయత్న ఫలితమే. అహోరాత్రులు కృషి చేసి విజయం సాధించాడు. గర్భ నిరోధక మాత్ర కనుగొనడానికి ఎన్నో వ్యతిరేకతలను సామాజికంగా, మతపరంగా సాంస్కృతికంగా ఎదుర్కోవలసి వచ్చింది. మత గురువులు అగ్గిగుగ్గిలమయ్యారు. ఛాందసవాదులు ఇక నీతి నియమాలు మంటకలుస్తాయన్నారు. అయినా పింకస్‌ జంకలేదు. సైన్సులో, మానవాభివృద్ధిలో, దారిద్య్ర నిర్మూలనలో,స్త్రీజాతి విముక్తి సాధించడంలో పింకస్‌ విజయం అద్వితీయమైనది. అయితే ఛాందస్సులు, మతవాదుల వ్యతిరేకత వల్ల పింకస్‌కు నోబెల్‌ ప్రైజ్‌ యివ్వలేదు. ఆయన చేసిన పరిశోధన చరిత్రగతినే మార్చివేసిందని ఇప్పుడు చాలామంది గుర్తిస్తున్నారు. ఎవరీ గ్రిగరీ పింకస్‌ అని చూస్తే 1903లోరష్యా నుంచి అమెరికా వలస వచ్చిన తల్లిదండ్రుల కుటుంబంలో జన్మించారు. మానవజాతికి, అందులో ముఖ్యంగా స్త్రీలకు విముక్తి ప్రదాత అయిన పింకస్‌ 1967లో బోస్టన్‌లో
మరణించినా,ఆయన సాధించిన విజయం మూఢనమ్మకాలపై కొరడా ఝుళిపించింది. సైన్సు, శాస్త్రీయ దృష్టికి అది ప్రతీక.

ఆరోగ్యవంతంగా తల్లి, శిశువు ఉండాలంటే ఫ్యామిలి ప్లానింగ్‌ తప్పనిసరి. కాన్పు,కాన్పుకు కనీసం రెండు సంవత్సరాల గ్యాప్‌ ఉంటేనే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా క్షేమంగా ఉంటారు. ఈ నేపథ్యంలో గర్భని రోధానికి నేడు వివిధ మాత్రలు లభిస్తున్నాయి. వీటిని డాక్టర్‌ సలహా మేరకు వాడాలి. కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నా గర్భనిరోధానికి ఇవి ఎంతో ఉపయోగ కరం గా ఉంటాయి.గర్భనిరోధానికి రెండు రకాల పద్ధతులున్నాయి. ఇవి పర్మనెంట్‌, టెంపరరీ పద్ధతులుగా చెప్పుకోవచ్చు. టెంపరరీ పద్ధతిలో గర్భనిరోధక మాత్రలతో పా టు కండోమ్స్‌ వాడకం, ఇంట్రాయిన్‌ లూప్‌ కాంట్రసెప్ట్‌ డివైజ్‌లను ఉపయో గిస్తారు. వీటితో పాటు హార్మోన్‌ ఇంజెక్షన్లను కూడా వాడతారు. ఈస్ట్రోజన్‌, ప్రొజెస్ట్రోన్‌ హార్మోన్‌ మాత్రలనే గర్భనిరోధక మాత్రలుగా పేర్కొంటారు. ఇవి మహిళల్లో అండం తయారుకాకుండా నిరోధిస్తాయి. దీంతో వారిలో ప్రెగ్నెన్సీ రాదు. ప్రస్తుతం తక్కువ మోతాదులోని గర్భనిరోధక మాత్రలు అందుబా టులో ఉన్నాయి. వీటి వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ తక్కువగా ఉంటాయి.

ఎవరు తీసుకోవాలి...
గర్భనిరోధక మాత్రలను 18 నుంచి 40 సంవత్సరాలున్న మహిళలందరూ తీసుకోవచ్చు. వీటిని మూడు నుంచి ఐదు సంవత్సరాలు వాడడం మంచిది. అంతకుమించి వాడాలనుకుంటే డాక్టర్ల సలహాను తీసుకోవాలి. గర్భనిరోధక మాత్రలను ఉపయోగించే ముందు డాక్టర్లను తప్పనిసరిగా సంప్రదించాలి. వారు సూచించిన మేరకు తమకు అనువైన మాత్రలను వేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం.

వివిధ రకాలుగా...
నేడు గర్భనిరోధక మాత్రలు సాధారణంగా రెండు రకాలు లభిస్తున్నాయి. వీటిలో 21 టాబ్లెట్లతో కూడిన స్ట్రిప్‌ ఒకటైతే రెండవది 28 టాబ్లెట్లతో కూడిన స్ట్రిప్‌ మరొకటి. 21 టాబ్లెట్లతో కూడిన స్ట్రిప్‌ ను మెన్సెస్‌ వచ్చిన ఐదవ రోజు నుంచి 25 వ రోజు వరకు వేసుకోవాలి. ప్రతి రోజు రా త్రి పడుకునే ముందు ఈ మాత్రలను తీసు కోవాలి. ఏదైనా రాత్రి మరచిపోతే మరుస టి ఉదయం వేసుకొని రాత్రి ఎప్పటిలాగే మ ళ్లీ మరొక మాత్ర వేసుకోవాలి. 21 టాబ్లెట్లు పూర్తయిన తర్వాత 2,3 రోజుల్లో మెన్సెస్‌ వస్తాయి ఆ తర్వాత అయిదు రోజుల గ్యాప్‌ తో మళ్లీ ఈ మాత్రలను తీసుకోవాలి. 28 టాబ్లెట్ల స్ట్రిప్‌ను ఉపయోగిస్తే ప్రతిరోజు ఒక మాత్రను వేసుకోవాలి. గర్భనిరోధక మాత్ర లను డాక్టర్‌చేత చెకప్‌ చేయించుకొని వేసు కోవాలి. వీటిని వేసుకోవడం ప్రారంభించే ముందు బరువు, బిపి చెక్‌ చేస్తారు. యుటి రస్‌ పరీక్ష కూడా నిర్వహిస్తారు. ఇటీవల కొత్తగా గర్భనిరోధక మాత్రలు వచ్చాయి. వీటిని వారానికి రెండు సార్లు మూడు నెలల పాటు వాడిన అనంతరం వారానికి ఒకటి వాడితే సరిపోతుంది. ఇవి గర్భనిరోధానికి ఎమర్జెన్సీ పిల్‌గా కూడా పనిచేస్తాయి.


కాన్పు తర్వాత...
శిశువుకు పాలిస్తున్న తల్లి ఆరు నెలల తర్వాత గర్భనిరోధక మాత్రలను వాడడం శ్రేయస్కరం. పాలివ్వని తల్లి మూడు నెలల తర్వాత వీటిని వాడవచ్చు. ఈ మాత్ర లతో తల్లిలో పాలు తగ్గే అవకాశం ఉంది.గర్భనిరోధ మాత్రలను వాడుతున్న ప్పుడు మధ్యమధ్యలో డాక్టర్‌ చేత చెకప్‌ చేయించుకోవాలి. డాక్టర్‌ బ్రెస్ట్‌ ఎగ్జామి నేషన్‌, యుటిరస్‌ టెస్ట్‌, కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ పరీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం గర్భ నిరోధక మాత్రలను ప్రభుత్వం రూరల్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్లు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రు ద్వారా ఉచితంగా సరఫరాచేస్తోంది.

ఉపయోగాలు...
గర్భనిరోధక మాత్రల వల్ల ఇష్టంలేనప్పుడు గర్భం ధరించకుండా ఉండవచ్చు. ఫ్యా మిలీ ప్లానింగ్‌కు ఎంతో దోహదపడతాయి ఈ మాత్రలు. ప్రెగ్నెన్నీ ప్లానింగ్‌తో తల్లి, పుట్టే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటారు.గర్భనిరోధక మాత్రల సక్సెస్‌ రేట్‌ ఎంతో ఎక్కువ. ఫెయిల్యూర్‌ రేట్‌ కేవలం 0.4 శాతమే. కొంతమంది స్త్రీలలో పీరి యడ్స్‌లో బ్లీడింగ్‌ వస్తుంటుంది. గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల ఈ బ్లీ డింగ్‌ తగ్గుతుంది. బహిష్టు సమయంలో కొందరు కడుపునొప్పితో బాధపడుతుం టారు. అటువంటి వారికి ఈ మాత్రలు ఉపశమనంగా ఉంటాయి. ఈ మాత్రల వి నియోగంతో గర్భాశయం ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.హెక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ రాకుండా ఉం టుంది. రుమాయిటెడ్‌, ఆర్థరైటిస్‌ ఉన్న వాళ్లకి ఈ టాబ్లెట్లు ఉపశమనంగా ఉంటా యి. ఓవరీస్‌లో సిస్ట్‌లు ఉండే వారికి ఈ మాత్రలు ట్రీట్‌మెంట్‌గా పనిచేస్తాయి. బ్లీడింగ్‌ ఎక్కువ ఉన్నవారికి ఈ మాత్రల వాడకంతో చాలా వరకు తగ్గుతుంది.

ఎవరు వాడకూడదు...
గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు గర్భనిరోధక మాత్రలను వాడకూడదు. బి పి ఎక్కువగా ఉన్నవాళ్లు, షుగర్‌ వ్యాధి ఉన్నవాళ్లు వీటిని వేసుకోకూడదు. కాలే యం సమస్యలు, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉన్నవాళ్లు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ఉన్నవాళ్లు ఈ మాత్రలను ఉపయోగించకూడదు. 40 సంవ త్సరాలు పైబడిన వాళ్లు, స్మోక్‌ చేసేవాళ్లు కూడా వీటిని వాడకూడదు.

సైడ్‌ ఎఫెక్ట్స్‌...
గర్భనిరోధక మాత్రలను వాడడం వల్ల కొందరు మహిళల్లో కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది. వాంతి వచ్చినట్టు, గ్యాస్‌ ప్రాబ్లమ్‌తో వారు ఇబ్బం ది పడుతుంటారు. పొట్ట ఉబ్బి నట్టు కూడా వారికి అనిపి స్తుంది. కొందరికి నెలమధ్యలో బ్లీడింగ్‌ అవుతుంది. కొందరికి వెజెనల్‌ ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. లివర్‌ సమస్య కూడా రావచ్చు. టిబి ఉన్న వారు వీటిని వేసు కుంటే ఇబ్బందులు ఎదురవు తాయి. కొంత మందికి తలనొ ప్పి రావచ్చు. బరువు పెరుగుతా రు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టు కుపోతుంది. ఇటువంటి సమ స్యలు ఎదురై నప్పుడే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

గర్భనిరోధక మాత్రలతో జ్ఞాపకశక్తికి దెబ్బ! --తాజా అధ్యయనాల వెల్లడి :

గర్భనిరోధక మాత్రలు జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తాయని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందుకే, మహిళలూ! కాస్త భద్రంగా ఉండాలి అని సూచిస్తున్నారు. గర్భనిరోధక మాత్రలు వాడేవారిని...అసలే వాడని వారినీ ఎంపిక చేసుకుని నిర్వహించిన అధ్యయనం ఈ విషయాన్ని సుస్పష్టం చేస్తోందని వారు పేర్కొన్నారు. మాత్రలు వాడే వారిలో పలు అంశాలను గుర్తుంచుకునే సామర్థ్యం బాగా తగ్గినట్లు తేలింది. ఈ హార్మోన్‌ ఆధారిత గర్భనిరోధక మాత్రలు జ్ఞాపకశక్తి తీరును మారుస్తాయని పరిశోధనలను నిర్వహించిన షాన్‌ నీల్‌సన్‌ వెల్లడించారు. ఈ మాత్రలు జ్ఞాపకశక్తిని పూర్తిగా దెబ్బతీస్తాయని చెప్పలేం...అయితే, కచ్చితంగా వారు గుర్తుంచుకునే సమాచారం తీరుతెన్నులనే మార్చేస్తాయని నీల్‌సన్‌ తెలిపారు. అదే ఈ తరహా మాత్రలు వాడని వారిలో పరిస్థితి వేరేగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లమందికి పైగా మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడుతున్నట్లు అంచనా.

ఋతుచక్రం ఆరంభమైన 3-4 రోజులలో వేసుకుంటే మాత్ర ప్రభావం వుంటుంది. అయితే మాత్ర ప్రభావం బాగా కనిపించాలంటే వారం తర్వాత వేసుకోవాలి. అందువల్ల తొలిరోజుల్లో గర్భనిరోధానికి ఇతర మార్గాలను అనుసరించాలి.మాత్ర వేసుకునే సమయానికి స్త్రీ గర్భం ధరించి వుండకూడదు. 5వ రోజు వేసుకున్నవారికి ఇది మరీ వర్తించే విషయం.
 • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, September 10, 2011

రోటా వైరస్‌ టీకాలు,Rotavirus Vaccinationఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -రోటా వైరస్‌ టీకాలు,Rotavirus Vaccination- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ప్రపంచ వ్యాప్తంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలలో సంభవించే మరణాలలో 17 శాతం అతిసార సంబంధిత సంక్రమణల వలన జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పిల్లల మరణానికి కారణం అవుతున్న వ్యాధులలో ఇది రెండవది. పారిశుధ్య వసతులు సక్రమంగా లేక పోవడం వలన, ఈ వ్యాధి నీరు, ఆహారం, పాత్రలు, అశుభ్రమైన చేతులు, ఈగల నుండి వ్యాపిస్తుంది. రోటా వైరస్‍కు ఒకరి నుండి మరొకరికి వ్యాపించే లక్షణం చాలా ఎక్కువ. ఇది తీవ్రమైన అతిసారా కలుగజేసి, పిల్లల మరణానికి (20%) కారణమవుతుంది. రోటా వైరస్ డయేరియాను నిరోధించడానికి పారిశుధ్య ఏర్పాట్లు ఒక్కటే సరిపోవని WHO చెపుతోంది. రోటా వైరస్ టీకాలకు కాపాడే శక్తి చాలా ఎక్కువ, సురక్షితం. వాటికి విలువకు తగిన ప్రయోజనాన్ని ఇచ్చే సామర్ధ్యం ఉంది.

పిల్లల్లో డయేరియాకు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లతో పాటు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా కారణమవుతుంటాయి. ఈ వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల వచ్చే డయేరియా తక్కువ శాతమే అయినా వీటిని అడ్డుకుంటే చాలావరకు మరణాలను తగ్గించొచ్చని నిపుణులు ఎప్పట్నుంచో చెబుతున్నారు. ముఖ్యంగా డయేరియాకు కారణమయ్యే రోటా వైరస్‌ను అడ్డుకునేందుకు టీకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవి సురక్షితమేనా? కావా? అనే దానిపై ఇన్నాళ్లు సందేహాలు ఉండేవి. ఈ అనుమానాలకు ఎఫ్‌డీఏ ఇటీవలే తెరదించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రోటా వైరస్‌ టీకాలు రోటారిక్స్‌, రోటాటెక్‌లు సురక్షితమైనవేనని తేల్చి చెప్పింది. ఇవి రోటావైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆసుపత్రిలో చేరటం, ప్రాణాలు కోల్పోవటాన్ని సమర్థంగా అడ్డుకుంటున్నాయని తెలిపింది. ఈ టీకాలు వేయించుకున్న తర్వాత ఇబ్బందులేమైనా వస్తాయేమోనని పిల్లలను ప్రత్యేకంగా కనిపెట్టుకొని ఉండాల్సిన అవసరమూ లేదంది. అయితే వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు సోకే విధానాన్ని టీకాలపై ముద్రించాలని మాత్రం సూచించింది.
 • ===============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, September 8, 2011

బండెక్కితే వాంతులా?,Motion Sicknessఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Motion Sickness- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...కొంతమందికి బస్సు/రైలు ప్రయాణం మొదలు పెట్టగానే వాంతులు మొదలవుతాయి. వాహనాల్లోని వాసనలు, కదలికల్ని తట్టుకోలేరు. గమ్యం చేరే వరకూ వాంతులతో ఇక్కట్లు పడుతుంటారు. దీనినే 'మోషన్‌ సిక్‌నెస్‌' అంటారు. పిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తుంది. వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మెదడుకు చేరే కదలికల సంకేతాల్లో తేడాలే దీనికి కారణం. వాహనంలో సీటులో కదలకుండా కూర్చున్నా .. వాహనం కదులుతుండటం వల్ల చెవుల్లో ఉండే సమతౌల్య కేంద్రం ప్రభావితమవుతుంది. ఫలితంగా కళ్లు తిరగటం, వికారంగా ఉండటం, వాంతులవ్వటం జరుగుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో చిన్నచిన్న చిట్కాలతో సమస్యను అధిగమించవచ్చు. సీట్లోనే కాస్త ముందుకు వంగి కూర్చోవటం, వాహనం మధ్య భాగంలో కూర్చోవటం వల్ల కొంత ఫలితం ఉంటుంది. నిమ్మకాయ వాసన చూడటం, అల్లంతో తయారు చేసిన స్వీట్లు అల్లంమురబ్బా వంటి వాటితో వికారం తగ్గుతుంది. ప్రయాణానికి అరగంట ముందు.. 'అవోమిన్‌(Avomin)' వంటి మందులు వేసుకుంటే వాంతులు ఆగిపోతాయి. మీ పిల్లల వైద్యుల్ని సంప్రదిస్తే సరైన మందుల్ని ఇస్తారు. కొంతమంది పిల్లలు వయసు పెరుగుతున్నకొద్దీ, లేదా తరచూ ప్రయాణాలు చేస్తున్నకొద్దీ ఈ సమస్య నుంచి బయటపడతారు.

 • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

పసిబిడ్డల ఆహారానికి సంబంధించి సమగ్ర వివరాలు , Neonates & children food detailsఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పసిబిడ్డల ఆహారానికి సంబంధించి సమగ్ర వివరాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పసిబిడ్డలకు ఏ దశలో ఇవ్వాల్సిన ఆహారం ఆ దశలో ఇవ్వాలి. పసిబిడ్డల సంరక్షణ.. పోషణ.. తరతరాలుగా మనకు అలవాటైనదే అయినా... ఇప్పటికీ పిల్లల ఆహారం విషయంలో బోలెడు అనుమానాలు. తల్లిపాల నుంచి ఉగ్గు పెట్టటం వరకూ ప్రతి అంశంలోనూ ఎన్నో అపోహలు. ఫలితమే మన దేశంలో ఎంతోమంది చిన్న పిల్లలు పోషకాహార లోపంతో సతమతమవుతున్నారు. శిశు మరణాల సంఖ్యా ఎక్కువగా ఉంటోంది. మనం శాస్త్రీయమైన అవగాహనతో వ్యవహరిస్తే పిల్లలు చక్కగా, ఆరోగ్యంగా ఎదుగుతారు.
* ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న మొత్తం పిల్లల్లో 3వ వంతు మంది మన భారతదేశంలోనే ఉన్నారు.
* ఐదేళ్లలోపు పిల్లల్లో 52% మరణాలు కేవలం పోషకాహార లోపం, దానివల్ల తలెత్తే సమస్యల కారణంగానే సంభవిస్తున్నాయి.
* మన దేశంలో 46% పిల్లలు బరువు తక్కువగా ఉంటున్నారు. పోషకాహారం అందటం లేదనటానికి ఇది కీలక సంకేతం.
* పిల్లల్లో మూడింట ఒకొంతు మంది పొట్టిగా ఉండిపోతున్నారు. ఇది దీర్ఘకాలిక పోషకాహార లోపానికి సూచిక.

- నిజానికి ఈ పోషకాహార లోపాన్ని అధిగమించటానికి ప్రజల్లో అవగాహన పెరగటం కీలకం. కేవలం దీంతోనే మనం 50% మరణాలను అరికట్టవచ్చు. దీన్ని సాధించాలంటే.. ప్రజలందరికీ కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలియాలి:

* పుట్టగానే బిడ్డకు తొలి గంట లోపలే తల్లిపాలు ఇచ్చేయాలి.
* తొలి ఆర్నెల్లూ తల్లిపాలు తప్పించి మరే ఇతర ఆహారమూ ఇవ్వాల్సిన అవసరం లేదు. పచ్చి మంచి నీళ్లు ఒక్క చుక్క కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటి బదులూ తల్లిపాలే పట్టాలి.

* ఆర్నెల్లు నిండిన తర్వాత తల్లిపాలతో పాటు సరైన, సమతౌల్య అదనపు ఆహారం మనం ఇంట్లో చేసిపెడితే బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. ప్రస్తుతం కొందరు 8, 9 నెలల తర్వాత పెడుతున్నారు. అందుకే చాలామంది పిల్లలు ఆర్నెల్ల వరకూ బొద్దుగా ఉండి, ఆ తర్వాత బక్కగా అయిపోతున్నారు. ఆర్నెల్లకు అన్నం ముట్టించాలని మన వాళ్లు ఎప్పుడో చెప్పారు. దీన్ని షోడశ సంస్కారాల్లో ఒకటిగా చేర్చారు కూడా. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చేసీచేసీ.. చివరికి పాశ్చాత్య దేశాలు కూడా ఇప్పుడు ఆర్నెల్లకే అదనపు ఆహారం పెట్టాలని బోధిస్తున్నాయి.
అపోహలు
* ఆరు నెలలు దాటిన పిల్లలకు కొందరు కేవలం ఆవు, బర్రె పాలనే ఎక్కువ ఇస్తుంటారు. పాలలో ఇనుము మోతాదు తక్కువ. పాలు సమతులాహారం కాదు. పాలు తాగే పిల్లలు బొద్దుగా బాగానే ఉంటారు కానీ ఇలాంటి వారందరిలోనూ రక్తహీనత కనబడుతుంది.

* పిల్లలకు జబ్బు చేసినప్పుడు తల్లిపాలనే ఇష్టపడి మిగతా ఆహారాన్ని పెద్దగా తీసుకోరు. అయితే మీది ఆహారం ఇవ్వకూడదనేమీ లేదు. ఎంత జబ్బు చేసినా తీసుకోగలిగితే తప్పకుండా ఇవ్వాలి. జబ్బు తగ్గిన తర్వాత తిండి మీద మరింత శ్రద్ధ పెట్టాలి. ఎదుగుదల తిరిగి గాడిలో పడేందుకు ఒకట్రెండు సార్లు అధికంగా కూడా పెట్టాలి.

* పిల్లలు ఒకట్రెండు సార్లు దొడ్డికి పోగానే చాలమంది తల్లిపాలు ఆపేస్తున్నారు. ఇది మరో అపోహ. దీంతో పిల్లల్లో పోషకాలు లోపిస్తాయి. బరువు తగ్గిపోయి, బలహీన పడతాడు. వ్యాధి మరింతగా బాధిస్తుంది. కాబట్టి నీళ్ల విరేచనాలు, న్యుమోనియా వంటివి వచ్చినా తిండి పెడుతూనే ఉండాలి.

* ఫలానా పొడిని పాలలో కలిపి తాగితే శక్తిమాన్‌ అయిపోతారు, కొడితే బంతి సిక్స్‌ ఖాయం, బిల్డింగుల మీది నుంచీ దూకొచ్చు.. ఇలాంటి అశాస్త్రీయ ప్రచారాలను ఏమాత్రం నమ్మొద్దు.

* అన్నింటికన్నా ముఖ్యంగా.. ఈ సూచనలు అన్నింటికీ పరిష్కారాలు చూపకపోవచ్చు గానీ ఈ చిన్నచిన్న చిట్కాలను రోజూ పాటించటం వల్ల పిల్లలకు అవసరమైన పోషకాలను చాలా వరకూ అందించొచ్చు. వారిలో గణనీయమైన మార్పు తెస్తాయి.

* ఒత్తిడిలో ఉన్నా తల్లులు బిడ్డకు పాలివ్వగలరు. అందులో అనుమానమేం లేదు. ఒత్తిడిలో ఉన్నా తల్లికి పాలు తయారవుతుంటాయిగానీ అవి బయటకు సరిగా రావు. (దీన్నే 'లెడ్‌డౌన్‌ రిఫ్లెక్స్‌' అంటారు) పాప చీకినప్పుడు అవి బయటకు వచ్చేస్తాయి.

* బక్కగా పోషకాహారలోపంతో ఉన్న తల్లులు, రొమ్ములు చిన్నగా ఉన్న తల్లులు పిల్లలకు తగినంత పాలివ్వలేరన్నది మరో అపోహ. తల్లులు బక్కగా ఉన్నారా? రొమ్ములు చిన్నగా ఉన్నాయా? అన్నది అర్థం లేదు. పాలకూ, రొమ్ముల సైజుకూ సంబంధం లేదు.

* పిల్లలకు ఆర్నెల్ల లోపలే అదనపు ఆహారం, మీదిపాల వంటివి ఇవ్వటం వల్ల తల్లిపాల ఉత్పత్తి తగ్గిపోతుంది. బిడ్డ చీకటం తగ్గినకొద్దీ పాల ఉత్పత్తి తగ్గిపోతుంది.

పరిశుభ్రత కీలకం
* బిడ్డకు తినిపించే ఆహారం తాజాగా, వేడిగా ఉండాలి. వండిన తర్వాత రెండు గంటల్లోపే తినిపించాలి. వండే ముందు, తినిపించే ముందు, దొడ్డికి కడిగిన తర్వాత.. తప్పనిసరిగా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

* మీజిల్స్‌ టీకాతో పాటు విటమిన్‌-ఎ ఇప్పించాలి. ఏడాది తర్వాత ఆర్నెల్లకో సారి పొట్టలో పురుగులుంటే పోయేందుకు 'అల్బెండజాల్‌' ఒక చెంచా మందు పట్టాలి. ఇలా బిడ్డకు ఐదేళ్లు వచ్చే వరకూ పట్టటం మంచిది. ఇది మురికివాడల్లో, అపరిశుభ్ర వాతావరణంలో ఉండేవారికి మరీ తప్పనిసరి.

డా|| పి.సుదర్శన్‌రెడ్డి, చీఫ్‌ పీడియాట్రీషియన్‌--కృష్ణా చిల్డ్రెన్స్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌

పుట్టిన బిడ్డ బతికి బట్టకట్టి చక్కటి ఆరోగ్యంతో ఉండాలంటే 1. తల్లిపాలు కావాలి 2. తల్లి పక్కన లభించే ఆ వెచ్చదనం కావాలి. 3. ఇన్ఫెక్షన్లు రాకుండా పరిశుభ్రత ఉండేలా చూడాలి. 4. పుట్టిన తొలి గంటలోనే తల్లిపాలు పట్టాలి. తల్లిపాలను మించినది, దానికి సాటి మరోటి లేదు.

* సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసినా- తొలి గంటలోనే బిడ్డకు తల్లిపాలు పట్టచ్చు. సహజ కాన్పు కాదు కాబట్టి వెంటనే పాలు రావేమోనన్న శంక అవసరం లేదు.

* పుట్టగానే బిడ్డకు ముర్రుపాలు ఇచ్చేయాలి. గ్లూకోజు నీళ్లు, తేనె, పేకెట్‌ పాలు, ఆవుపాలు నాకించటం (ప్రీలేక్టెల్‌ ఫీడ్స్‌) వంటివేమీ చెయ్యద్దు.

* పుట్టుకతోనే సమస్యలున్న పిల్లలను ఇంక్యుబేటర్లలో పెడుతుంటారు. ఇలాంటి వారికి కూడా తల్లిపాలను పిండి ట్యూబ్‌ ద్వారానో, చెమ్చాతోనో ఇప్పించే ప్రయత్నం చేయాలి.

* బిడ్డ ఏడిస్తేనే పాలు ఇవ్వాలనేదేం లేదు. ఏడ్వటమన్నది పాలకోసం పసిబిడ్డలు చేసే ప్రయత్నాల్లో ఆఖరిది. ఏడ్వటానికి ముందు పిల్లలు పాల కోసం- చప్పళింత శబ్దాలు చేయటం, పెదాలు నాకటం, గుప్పిళ్లతో నోటిని రుద్దుకోవటం, సున్నితమైన కూతలు.. కళ్లు అటూ ఇటూ వేగంగా తిప్పుతుండటం.. ఒక రకమైన చికాకులా కదలికల వంటివన్నీ మొదలుపెడతారు. తల్లులకు ఈ విషయాలు తెలిస్తే కరెక్టుగా ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే పాలు ఇవ్వగలుగుతారు.

* బిడ్డకు 3, 4 నెలలు రాగానే చాలామందిలో.. బిడ్డ పెరుగుతోంది, ఇక నా పాలు సరిపోతాయా? అని తమ మీద తమకే అనుమానం, అపనమ్మకం మొదలవుతోంది. ఇది పూర్తి అపోహ. ఆర్నెల్ల వరకూ బిడ్డ అవసరాలకు తగినన్ని పాలు తల్లిదగ్గర కచ్చితంగా లభ్యమవుతాయి.

* చాలామంది 3 నెలలు రాగానే బిడ్డకు ఏం పెట్టాలని అడుగుతుంటారు. ఏమీ పెట్టనక్కర్లేదు. ఇవాళారేపూ ఇళ్లల్లో అమ్ముమ్మలు, నాయనమ్మలు కూడా- మూడు నెలలు వచ్చాయి, బిడ్డకు అవీఇవీ పెట్టరాదా? అని దెప్పటం, సాధించటం మొదలుపెడుతున్నారు. ఇది పురోగమనం కాదు, తిరోగమనం!

* పని చేసే తల్లులు ఉద్యోగానికి వెళ్లేటప్పుడు పాలు పిండి ఇంట్లో పెట్టివెళ్లొచ్చు. ఆఫీసులో ఉన్నప్పుడు కూడా పాలు పిండి నిల్వ చేయచ్చు.

* తల్లికి జ్వరం వస్తే తల్లి జ్వరం పిల్లకీ వస్తుంది, పాలివ్వద్దనే వారూ ఉన్నారు. ఇది పూర్తి అపోహ. తల్లికి జబ్బు ఉన్నా పాలు ఇవ్వవచ్చు. ఆ పాల ద్వారా వ్యాధులు రావు. ఇవ్వగలిగే శక్తి కూడా వారికి ఉంటుంది. గర్భిణి సమయంలో తల్లి బరువు పెరుగుతుంది. కాన్పు తర్వాత కొంత తగ్గినా.. మిగిలిన బరువంతా బిడ్డకు పాలివ్వటానికి సహకరించే ఆహారభద్రత. పిల్లలకు పాలివ్వటం ద్వారా తల్లులు గర్భం దాల్చటానికి ముందున్న బరువుకు వచ్చేస్తారు. పాలివ్వకపోతే ఊబకాయం వస్తుంది. పైగా ఒకసారి పాలు ఆపితే మళ్లీ రావటం కొంత కష్టమవుతుందని చెప్పాలి.

* కొందరు తల్లులు 'పాలు రాకపోతే మధ్యలో ఆపేశా!' అని చెబుతుంటారు. వీళ్లు కూడా ఇవ్వటం ఆరంభిస్తే మళ్లీ పాలు వస్తాయి. దీన్నే 'రీలాక్టేషన్‌' అంటారు. పాలు పడితే వస్తాయి, పట్టకపోతే రావు! ఎంత ఎక్కువగా పడితే అంత ఎక్కువగా వస్తాయి. ప్రధానంగా 1. పాలివ్వాలన్న తపన. 2. వస్తాయన్న నమ్మకం. 3. పడుతూ ఉండటం. 4. చుట్టూఉన్నవారి ప్రోత్సాహం.. ఇవి ఉంటే చాలు.. నూరు శాతం పాలు వస్తాయి.

* బిడ్డ ఆరోగ్యానికి సీసా శత్రువు. సకల జబ్బులకూ అది మూలం. ఏటా 5 లక్షల మంది పిల్లలు సీసా వల్ల చనిపోతున్నారు.

* బిడ్డకు పాలు సరిపోవటం లేదన్నది పెద్ద అపోహ. నెలనెలా బిడ్డ ఎదుగుదల బాగుండి, గ్రోత్‌ఛార్ట్‌లో పెరుగుదల చక్కగా ఉండి, బిడ్డ హాయిగా నిద్రపోతూ రోజుకు 6 సార్లు మూత్రం పోస్తుంటే పాలు సరిపోతున్నాయనే అర్థం. బిడ్డ పెరుగుదల కచ్చితంగా చెప్పేది 'గ్రోత్‌ఛార్ట్‌'. ప్రతి తల్లీతండ్రీ ఈ ఛార్ట్‌ విషయంలో శ్రద్ధ పెట్టాలి.
6-12 నెలలు: పాలతో పాటు అదనపు ఆహారం
బిడ్డకు ఆర్నెల్లు పూర్తి అయినప్పుడు 'తల్లిపాలతో పాటుగా' అదనపు ఆహారం ఇవ్వాలి. కేవలం అదనపు ఆహారం ఇచ్చి.. తల్లిపాలు మానెయ్యకూడదు.

* మొదటి ఆర్నెల్లూ బిడ్డ పోషకావసరాలు నూటికి నూరు శాతం తల్లిపాల ద్వారానే తీరతాయి. 6-12 నెలల వయసులో 50 శాతం తల్లిపాలు, మరో 50% అదనపు ఆహారం; ఇక 12 నెలలు నిండిన తర్వాత 33% తల్లిపాలతో, మిగతా 67% తిండితో రావాలి.

* అదనపు ఆహారంగా ఇంట్లో ఉండే దినుసులతో చేసిన ఆహారమే మంచిది. రకరకాల ధాన్యాలు, పప్పులు కలిపి పిండిపట్టించి దాన్ని రెండుపూట్లా జావలా చేసిపెట్టటం మంచిది. తమిళనాడులో- ముడిబియ్యం, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, సగ్గుబియ్యం, పెసర పప్పు, మినప పప్పు, పుట్నాలు, సోయా, పల్లీ, జీడిపప్పు, బాదం, యాలకుల వంటి 18 రకాల దినుసులతో 'కంజి కిట్‌' అనేది ప్రాచుర్యంలో ఉంది. ఇది సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే అదనపు ఆహారం. వీటన్నింటినీ పొడి చేసుకుని.. రెండు స్పూన్లు గంజి మాదిరిగా తయారు చేసి 6-8 నెలల వరకూ రోజూ రెండు పూట్లా పెట్టాలి. ఒకట్రెండు చెమ్చాల నుంచి మొదలుపెట్టి క్రమేపీ ఎంత తింటే అంత, మూతి తిప్పేసేదాకా పెట్టాలి. ఇది కాకుంటే ఇంట్లో ఉంటే బియ్యం, పప్పుతో ఉగ్గు తయారు చేసుకొని, జావ మాదిరిగా చేసి.. ఉప్పు-నెయ్యి లేదా చక్కెర-నెయ్యి వేసి తినిపించాలి. పిల్లల కడుపు చిన్నగా ఉంటుంది కాబట్టి తక్కువ ఆహారంతోనే ఎక్కువ కేలరీలు లభించాలంటే ఉగ్గులో నెయ్యి, వెన్న వంటివి వేసుకోవచ్చు.

* చిరుతిండిగా (స్నాక్‌) అరటిపండు, ఉడకపెట్టిన ఆలుగడ్డ, ఆపిల్‌ వంటివి ఇవ్వొచ్చు. రోజులో రెండు సార్లు ఉగ్గు, ఒకసారి చిరుతిండి పెట్టొచ్చు. 9-11 నెలల వయసులో అయితే మూడు సార్లు ఉగ్గు, రెండుసార్లు చిరుతిండి పెట్టొచ్చు.

* ఇంట్లో వండిందే: అదనపు ఆహారం ఇంట్లో ఉన్న పదార్థాలతోనే తయారు చేసుకోవాలి. వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మే వాటిని పిల్లలకు పెట్టొద్దు. 'ఇన్‌ఫ్యాంట్‌ మిల్క్‌ సబ్‌స్టిట్యూట్‌' చట్టం ప్రకారం ఎవరైనా వాణిజ్యంగా తయారు చేసిన పాలు, అదనపు ఆహారం గురించి ప్రకటనలు ఇవ్వటం, అది తల్లిపాలతో సమానమని చెప్పటం, దాన్ని ప్రోత్సహించటం శిక్షార్హమైన నేరం.

* చాలామంది బయట కొనుక్కొచ్చినదే చాలా శక్తినిస్తుందని పొరబడుతుంటారు. నిజానికి అందులో ఉండేది ఏదో ఒక పిండే. పైగా కొనుక్కొచ్చి పెడతారు కాబట్టి కొద్దికొద్దిగా ఇస్తారు, దీంతో బిడ్డ అవసరాలకు అదీ సరిపోదు. ఇంట్లో వండుకొన్నదైతే పిల్లలకు ఎంత కావాలంటే అంత ఇవ్వొచ్చు.

* 9 నెలలు నిండిన తర్వాత మనం ఇంట్లో వండుకునే ఆహారాన్నే చేత్తో గుజ్జుగుజ్జుగా చేసి దాంట్లోనే టమోటా, బీరకాయ, ఆకుకూరల వంటివి కలిపి ఇవ్వొచ్చు. ఏడాది దాటితే ఇంట్లో అంతా ఏం తింటే బిడ్డకూ అదే (ఫ్యామిలీ డైట్‌) మెత్తగా చేసి పెట్టొచ్చు. దాంతో పాటు తల్లి పాటు కూడా ఇవ్వాలి.

రెండేళ్ల వరకూ..
తల్లిపాలను రెండేళ్లు నిండే వరకు తప్పకుండా ఇవ్వాలి. అది తల్లి ధర్మం. తాగే హక్కు పిల్లవాడికీ ఉంది. రెండేళ్ల తర్వాత తల్లికి ఇష్టం ఉంటే ఇవ్వొచ్చు. లేకపోతే లేదు. గిరిజనుల్లో కొందరు నాలుగేళ్ల వరకూ పిల్లలకు పాలిస్తుంటారు. ఇది మంచిదే కానీ అదనపు ఆహారం ఇవ్వకుండా కేవలం తల్లిపాలే పడుతుండటం మాత్రం సరికాదు. దానివల్ల పిల్లలు చిన్నగా, పొట్టిగా, బక్కగా అయిపోతారు.
సమయానికి తగు చర్యలు
* పిల్లలకు అదనపు ఆహారం ఇచ్చేటప్పుడు 9-12 నెలల మధ్య కొద్దికొద్దిగా బరక గింజలు అలవాటు చెయ్యకపోతే వారికి తర్వాత ఆ అలవాటు చెయ్యటం కష్టమవుతుంది. ఆ సమయంలోనే వాళ్లకు అవి పరిచయం చేస్తే పిల్లలు వాటికి తేలికగా, నమిలి మింగటానికి అలవాటుపడతారు. ఇవాళారేపూ తల్లులు పిల్లలకు మిక్సీలో వేసినంత మెత్తగా తయారుచేసి.. మెత్తటిది కూరుతున్నారు. అది సరికాదు.

* తల్లి పుట్టగానే పడితే పాలు ఎక్కువ తయారవుతాయి. మొదటి 7 రోజులు పట్టలేదంటే పాలు ఎండిపోయే అవకాశాలుంటాయి. ఇది కీలక దశ అని గుర్తించాలి.

* 6-8 నెలల మధ్య పెట్టే పదార్థం.. కొద్దిగా వంచితే చెంచా నుంచి జారి కింద పడిపోయేలా ఉండకూడదు. అది చెంచాకు అంటుకునే ఉండాలి. అలా ఉంటేనే బిడ్డకు సరైన కేలరీలు అందుతాయి. పూర్తి పల్చటిది పెడితే శక్తిసరిపోక పిల్లలు బక్కగా అయిపోతారు.

* వాణిజ్యపరంగా తయారు చేసే జంక్‌ ఫుడ్‌ సమతౌల్యం ఉండదు. కొన్నింటిలో తీపి ఎక్కువ ఉంటే మరికొన్నింటిలో కొవ్వు, ఇంకొన్నింటిలో ఉప్పు.. ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అంతేగానీ వీటిలో పోషకాహారం దొరకదు. అందుకే వీటిని జంక్‌ఫుడ్‌ అంటారు.

* సంపూర్ణ ఆహారంలో చాక్లెట్లు, బిస్కెట్లు, టాఫీలు, చిప్స్‌, కోలాలు భాగం కానే కావు. వాటివల్ల ఆరోగ్యానికి హానే ఎక్కువ. వీలైనంత వరకూ ఇంట్లో వండి ప్రేమ భావంతో పెట్టటం ముఖ్యం.
గుడ్డు - మాంసం
పిల్లలకు గుడ్డు.. పసుప్పచ్చది 6-9 నెలల్లో ఎప్పుడైనా మొదలుపెట్టొచ్చు. ఖీమా (మిన్స్‌డ్‌ మీట్‌) తొమ్మిది నెలల తర్వాత ఇస్తే మంచిది. గుడ్డులోని తెల్లసొన, చేపలు మాత్రం ఏడాది దాటిన తర్వాత పెడితే అలర్జీలు రాకుండా ఉంటాయి. ఇక శాకాహారులు అదనపు ఆహారంలో- పాలు, పాల పదార్ధాలైన పెరుగు, మజ్జిగ, నెయ్యి వంటివి విరివిగా వాడొచ్చు. పప్పుల్లో కూడా మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. కనుక 6-12 నెలల్లోపు ఆహారంలో ఇవి ఉండేలా చూడటం అవసరం.
యుద్ధాలు చెయ్యొద్దు
పిల్లలకు ఏం తినిపిస్తున్నామన్నదే కాదు ఎంత ప్రేమతో, ఎంత బాధ్యతతో, ఎంత సంతోషంతో తినిపిస్తున్నామన్నదీ కీలకమే. పిల్లలకు తినిపించటంలో రెండు మూడు రకాల పద్ధతులున్నాయి. వీటిలో అన్నింటికన్నా ముఖ్యమైంది 'రెస్సాన్సివ్‌ ఫీడింగ్‌'. అయితే ప్రస్తుతం మన సమాజంలో దారుణమైన పరిస్థితి నెలకొంది. తెలిసో, తెలియకో, ఓపిక లేకనో చాలామంది 'కంట్రోల్డ్‌ ఫీడింగ్‌' చేస్తున్నారు. అంటే బిడ్డను కాళ్ల మీద కూచోబెట్టుకునో, పండబెట్టుకునో నోట్లో కుక్కుతున్నారు. పైగా బిడ్డ ఆ ఆహారాన్ని ముట్టుకోకుండా చేతులు కట్టేస్తారు. చెమ్చాతో లేదా చేత్తో నోట్లో కుక్కుతారు. పిల్లాడేమో అటూఇటూ కదులుతూ, మూతి తిప్పేస్తూ పోరాటం చేస్తుంటాడు. తినకపోతే కొట్టేవాళ్లూ ఉన్నారు. ఈ తతంగం- ఇక చాలని తామే నిర్ధారణ చేసుకొనే వరకూ సాగుతుంది. దీనివల్ల పిల్లలకు తిండిపట్ల తిరస్కార భావం వస్తుంది. అన్నం కలుపుకొని వస్తున్నారంటేనే పిల్లవాడు పారిపోవటానికి ప్రయత్నం చేస్తుంటాడు. తిండిపై ఇలాంటి వ్యతిరేక, తిరస్కార భావన పిల్లాడికి కలగనీయరాదు. ఎవరైనా గానీ సంతోషంగా తినాలి. అలాగని అన్నం పిల్లల ముందు పెట్టేసి వాళ్లే తింటారులే అని విడిచిపెట్టటమూ మంచిది కాదు. ఏది మంచిది అంటే.. పిల్లవాడి చేతులు కడగాలి. తినిపించేవాళ్లూ చేతులు కడుక్కోవాలి. పిలవాడిని తినిపించేవారి ఎత్తులో కూచోబెట్టుకోవాలి. ఒకరినొకరు కళ్లలోకి చూసుకోవాలి. నవ్వుకుంటూ.. 'బుజ్జికన్నా.. ఇది నువ్వు తినాలి. బాగుంటుంది. తియ్యగుంటుంది' అని ముచ్చట్లు చెబుతూ తినిపించాలి. అది కూడా చెమ్చాతో గానీ చేత్తోగానీ ఎక్కువ తీసుకోరాదు. కొంచెం తీసుకోవాలి. నోట్లో కుక్కొద్దు. ముద్దను పెదవి దగ్గరకు తెస్తే బిడ్డ తనంత తానే లోనికి తీసుకునే అవకాశం ఇవ్వాలి. కంట్రోల్డ్‌ ఫీడింగ్‌లో పిల్లవానికి ఈ తృప్తి దక్కదు. 'నాది నేను తిన్నాను' అనే ఆ స్వయంతృప్తి వాడికి దక్కేటట్టుచేయాలి. పిల్లాడు తన తిండి తాను తినగానే 'వెరీగుడ్‌.. మంచిగ తిన్నవు బిడ్డా' అని మెచ్చుకోవాలి. మనం బాధలో ఉన్నప్పుడు తక్కువ తింటాం. పిల్లలూ అంతే అని గుర్తించాలి. సంతోషపెట్టి ఎక్కువ తినిపించాలిగానీఏడిపిస్తూ తక్కువ తినిపిస్తే పిల్లాడికి సరైన పోషకాలు ఎలా లభిస్తాయి?


 • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, September 7, 2011

కాల్సియం ఉపయోగాలు , Calcium uses

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

శరీరారోగ్యానికి కాల్షియం : కాల్షియమ్ (Calcium) ఒక మెత్తని ఊదారంగు క్షార మృత్తిక లోహము. విస్తృత ఆవర్తన పట్టికలో దీని సంకేతము Ca. దీని పరమాణు

సంఖ్య 20 మరియు పరమాణు భారము 40.078 గ్రా/మోల్. ప్రకృతిలో అత్యధికంగా దొరికే ఐదవ మూలకము. కాల్షియమ్ జీవులన్నింటికి ముఖ్యమైనది. జీవుల

శరీరంలో అన్నింటికన్నా ఎక్కువగా ఉండే లోహము. ఇది ముఖ్యంగా ఎముకలలో ఉంటుంది.

కాల్షియం లోపం కారణంగా సమస్యలు ఎదుర్కొనే వారిని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో కనిపించే జాయింట్ పెయిన్స్, మహిళల్లో కనిపించే

కీళ్లనొప్పులు, 40 దాటిన వారిలో తరచు కనిపించే ఎముకలు, కండరాల నొప్పులకు కాల్షియం లోపమే కారణం అంటున్నారు నిపుణులు. ఎముకలు క్షీణించడానికి కూడా

ప్రధానం కారణం కాల్షియం లోపమే. అందుకే 40 ఏళ్లు దాటిన మహిళలు నిపుణుల సూచన మేరకు కాల్షియం మాత్రలు తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ

తలెత్తవు. నిజానికి మనం నిత్య జీవితంతో తీసుకొనే ఆహార పదార్థాల్లో కాల్షియం పుష్కలంగా ఉండే పదార్థాలు అనేకం. చిన్నతనం నుంచీ మనం తినే తిండిలో ఆ

ఆహారపదార్థాలను తగినంతగా తీసుకోగలిగితే ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవచ్చు.

ఎముకల ధృడత్వానికి, ఎముకల ఆరోగ్యానికి కాల్షియం అవసరమవుతుంది. చిన్నపిల్లల నుంచి, వృద్ధుల వరకు కాల్షియం ఎంత తీసుకోవాలన్నదీ వైద్య సలహా తీసుకుంటే

మంచిది. టీనేజ్‌ పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు కాల్షియం అవసరం కొంత ఎక్కువగా ఉంటుంది. ఎముకల సాంద్రత పెరగడానికి తగినంత కాల్షియం కావాలి. కాల్షియం లోపం

ఏర్పడితే ఎముకలు అతి త్వరగా విరగడం, ఫెళుసుగా మారటం జరుగుతుంది. అందువల్ల కాల్షియం లభించే పదార్థాలేమిటో తెలుసుకుని, వాటిని తీసుకుంటే శరీరానికి

కాల్షియంలోపం ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు.

కాల్సియం లభించే పదార్ధములు :
పాలు ,
రాజ్‌మా,
రాగులు,
శనగలు,
పెసలు,
నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంది.
పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంది
చేపలు - ముఖ్యంగా చిన్న చేపలలో కాల్షియం సమృద్ధిగా దొరుకుతుంది.
మినుములు లాంటి గింజ ధాన్యాలలోనూ,
ములక్కాడలు.
బీన్స్‌,
సోయాబీన్‌,
మెంతికూర,
తోటకూర,
పాలకూర,
కోతిమీర,
నారింజ పండ్లలో కూడా కాల్షియం అధికంగా ఉంది.
కరివేపాకు లాంటి ఆకుకూరలు, తాజా కాయకూరల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది.
బాదం, ఎండు ద్రాక్ష, వేరుశెనగ కాయలు లాంటి వాటిలోనూ నిలవ పచ్చళ్లు, ఊరగాయలు, ఉప్పు అధికంగా వాడిన ఫాస్ట్‌ఫుడ్స్‌, స్నాక్స్‌ అప్పడాలు, ఒడియాలు లాంటివి

తక్కువగా తీసుకోవడమే మంచిది. ఎందుకంటే, ఆ పదార్ధాల్లో ఉండే సోడియం కాల్షియాన్ని నష్టపరుస్తుంది. నిద్రలేమికి, ఒత్తిడి, ఆందోళన లాంటివి కూడా కాల్షియం

స్థాయిని తగ్గిస్తుంది. మెనోపాజ్‌ స్థితికి చేరుకున్న మహిళల్లో ఈస్ట్రోజన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల ఎముకలు త్వరగా విరుగుతాయి. వృద్దాప్యంలో ఉన్నవారు ఆహార

పదార్ధాల్లో ఉప్పును తగ్గించి తినడం ద్వారా కాల్షియం లోపాన్ని నివారించవచ్చు. శరీరంలో కాల్షియం స్థాయి తగ్గితే వారిలో రక్తపోటు సమస్య కూడా ఏర్పడవచ్చు కనుక,

కాల్షియం, సమృద్ధిగా లభించ టానికి పాలు, పెరుగు తీసుకోవడం మంచిది. చిన్న వయస్సు నుంచే కాల్షియం లభించే పదార్థాలు తీసుకుంటే, వయస్సు పెరుగుతున్నా

కాల్షియంలోపం ఏర్పడకుండా ఉంటుంది.

ఆరోగ్యానికి కాల్షియం చాలా అవసరం...!

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో కాల్షియం చాలా అవసరం. ముఖ్యంగా ఆడవారిలో అధికంగా కాల్షియం లోపం వలనే వారు బలహీనంగా కనిపిస్తుంటారు. దీంతో ఇతరత్రా

రోగాలబారిన పడుతుంటారు. మీరు నిత్యం తీసుకునే పోషకాహారంలో కాల్షియం ఉండేలా చూసుకోవాలి. చిన్నప్పటినుంచే మనం తీసుకునే ఆహారంలో ఐరన్‌, కాల్షియం

అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. దంతాలు, ఎముకలు పటిష్టంగా ఉండాలంటే శరీరంలో తగిన కాల్షియం ఉండాలి. శరీరంలో

కాల్షియం తగ్గే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. పురుషులతో పోల్చినప్పుడు స్త్రీలకే అధిక కాల్షియం అవసరం అంటున్నారు వైద్యనిపుణులు. మహిళల్లో వయస్సు

పెరుగుతున్న కొద్దీ ఎముకలు పెళుసుగా మారతాయనడంలో సందేహం లేదు. దీనికి కారణం కాల్షియం కొరవడటమేనంటున్నారు వైద్యులు. వయస్సు పెరుగుతున్నా

ఎముకలు పటిష్టంగా ఉండాలంటే పాలను, పండ్లను అధికంగా తీసుకోవాలి. సి విటమిన్‌, కాల్షియం సప్లిమెంట్లను తింటే శరీరానికి కాల్షియం పుష్కలంగా అందుతుంది.

గోధుమలు, పాలిష్‌ చేయని బియ్యం, పీచుపదార్థాలు తింటే పూర్తిస్థాయిలో కాల్షియం అందుతుంది.

బంగారం కంటె విలువైంది ‘కాల్షియం’
కాల్షియం మన శరీరంలో ఉంటుంది. 99% మన ఎముకల్లో, పళ్ళలో నిక్షిప్తమై ఉంటుంది. మిగతాది కండరాల్లో, రక్తంలో ఉంటుంది. మన శరీరంలో కండరాలు,

నాడీమండలం పనిచేయడానికి కాల్షియం అవసరం. హార్మోన్ల ఉత్పత్తికి దీని అవసరం ఉంది.
ఎముకలు కాల్షియం ‘బేంకు’లాంటివి. పుట్టినప్పటినుంచీ 30-35 సంవత్సరాల వరకు మన ఎముకల్లో కాల్షియం నిల్వచేయబడుతుంది. ఆ తర్వాత ఈ నిల్వచేసేపని

ఆగిపోతుంది. డెబిట్‌ గాని క్రెడిట్‌ పని ఉండదు. ఈ వయసులో (35 సం. తర్వాత) మనం తినే ఆహారంలో సరిపడా కాల్షియం లేకుంటే అది ఎముకలనుంచే శరీరానికి

అందుతుంది. దాంతో ఎముకలు పల్చబడిపోతాయి. స్త్రీలలో అయితే ‘మోనోపాజ్‌’ సమయంలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఎదుగుతున్న వయసులోనే ఆహారంలో

కాల్షియం సమృద్ధిగా ఉండేలా జాగ్రత్తపడితే ఈ సమస్యను చాలావరకు నివారించగలం.
ఈ మధ్య మనదేశంలో జరిగిన కొన్ని సర్వేల్లో విచారకరమైన విషయం తెలిసింది. అదేమిటంటే టీనేజీ ఆడపిల్లల్లో 20% మంది కాల్షియం లోపానికి గురవుతున్నారు.

దీనికి కారణం సమతుల్యాహారానికి బదులు ఈ పిల్లలంతా పిజ్జాలు, బర్గర్‌లు తినడమేనని తెలిసింది. ఇంకా వీళ్ళంతా మంచినీళ్ల స్థానంలో సాఫ్ట్‌ డ్రింక్సు (పెప్సీలు,

కోలాలు) తాగుతున్నారు. ఇంత చిన్నవయసులోనే కాల్షియం కొరత ఏర్పడితే మరి ‘మోనోపాజ్‌’ నాటికి వారి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. ఈ రోజుల్లో

ఆడపిల్లలు ‘జీరో’ సైజు క్రేజ్‌లో పడి అసలు తిండే సరిగా తినడం లేదు. దీనికి తగ్గట్టుగా టీవీల దగ్గర కూర్చునే సమయం ఎక్కువయింది. దీనివల్ల శరీరానికి సరైన

వ్యాయామం లేక కాల్షియం లోపానికి దోహదమవుతోంది. ఈ పరిస్థితినుంచి బయటపడాలంటే కాల్షియం లోపం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మనలో కాల్షియం కొరత ఉన్నప్పుడు, శరీరంలో మిగతా పనులకు (నాడీమండలం, కండరాలు పనిచేయడానికి, హార్మోన్ల ఉత్పత్తికి) ఎముకల్లో ఉన్న కాల్షియం

ఉపయోగించుకోవలసి వస్తుంది. అందువల్ల ‘చిల్లుల ఎముకలు’ ఏర్పడి ‘ఆస్టియోపరోసిస్‌’కి దారితీస్తుంది. ఆ తర్వాత తుంటి ఎముకలు, వెన్నెముక, మణికట్టు, కటి

ఎముకలు, పక్కటెముకలు ఒక్కటేమిటి ఎక్కడయినా సరే ఈజీగా విరిగిపోయే ప్రమాదం ఉంది. అసలు కాల్షియం ఎముకల దృఢత్వం కోసమే కాకుండా, ఇంకా చాలా

వాటిలో ఉపయోగపడుతుంది.

కాల్షియం ఉపయోగాలు :
మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, మనిషి నార్మల్‌గా ఎదగడానికి, కండరాలు, నరాలు సరిగా పనిచేయడానికి, గుండె సరిగా పనిచేయడానికి, రక్తం గడ్డ కట్టడానికి,

రక్తపోటును నార్మల్‌గా ఉంచడానికి, మన శరీరంలో ఇనుము సరయిన రీతిలో ఉపయోగపడ్డానికి, శరీరంలోని హార్మోన్లు సరిగా పనిచేయడానికి (ముఖ్యంగా థైరాయిడ్‌,

పారాథైరాయిడ్‌ హార్మోన్లు), శరీరంలోని కణాల నిర్మాణంలో, విటమిను బి12 వంట బట్టడానికి.
కాల్షియం తగ్గినందువల్ల కలిగే నష్టాలు :
ఆస్టియో మలాషియ (ళిరీశిలిళిళీబిజిబిబీరిబి) : ఎముకల్లో లవణీకరణ (ళీరిదీలిజీబిజిరిచిబిశిరిళిదీ ళితీ ళీబిశిజీరిని) జరుగదు. దీనివల్ల చిన్నపిల్లల్లో రికెట్సు వస్తుంది.

దీనివల్ల ఎముకలు మెత్తబడతాయి, వంగిపోతాయి. దీనివల్ల పిల్లల్లో విల్లమ్ముల మాదిరి వంగిన కాళ్ళు (లీళిగీలిఖి జిలివీరీ), అతిపెద్ద నుదిటిభాగం (జిబిజీవీలి

తీళిజీలినీలిబిఖి), సొట్టపడిన ఛాతిభాగం (చీలిబీశితిరీ లినిబీబిఖీబిశితిళీ), పిట్ట ఛాతీ (చీలిబీశితిరీ బీబిజీదీరిశితిళీ).
ఆస్టియోపేనియా (ళిరీశిలిళిచీలిదీరిబి) : ఎముకల్లో ఉండాల్సిన కాల్షియం సాంద్రత కంటే తక్కువగా ఉండటం. తగిన చర్య తీసుకోకపోతే ఆస్టియోపరోసిస్‌కి దారితీస్తుంది.
ఆస్టియోపరోసిస్‌ (ళిరీశిలిళిచీళిజీళిరీరిరీ) : ఇంతకుముందే చెప్పుకున్నాం. ‘చిల్లుల ఎముకలు’ ఏర్పడతాయి. ఎముకలు బలాన్ని కోల్పోయి, సపోర్ట్‌ చేసే శక్తిని

కోల్పోతాయి. చిన్నగా కిందపడ్డా ఎముకలు విరుగుతాయి.
నిద్రపట్టకపోవడం, టెటనీ (శిలిశిబిదీగి) - ఫిట్సులా రావడం, మెన్సస్‌కి ముందు క్రేంప్స్‌ రావడం (చీజీలిళీలిదీరీశిజీతిబిజి బీజీబిళీచీరీ). కండరాలు పట్టేసి, తీవ్రమైన నొప్పి

కలగడం, రక్తపోటు పెరగడం., నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం, పెద్దపేగుల్లో కేన్సరు, బ్రెస్ట్‌ కేన్సరు రావడానికి అవకాశం. పై నష్టాలన్నీ జరగకుండా ఉండాలంటే మన

ఆహారంలో కాల్షియం సరయిన మోతాదులో ఉండాల్సిందే.
రోజువారీ మనం తీసుకోవాల్సిన కాల్షియం
వయసు కాల్షియం మి.గ్రాముల్లో
0-6 నెలలు 210
7-12 నెలలు 270
1-3 సం|| 500
4-8 సం|| 800
9-13 సం|| 1300
14-18 సం|| 1300
19-50 సం|| 1000
51 సం|| పైన 1200

పై మోతాదుల్లో కాల్షియం మన శరీరానికి అందాలంటే ఎటువంటి ఆహారం తినాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వచ్చే సంచికలో తెలుసుకుందాం.


కాల్షియం సప్లిమెంట్‌తో గుండెకు చేటు : పరిశోధనలు --
ఎముకల క్షీణతను నివారించడానికి మహిళలు తీసుకునే కాల్షియం సప్లిమెంట్ల వల్ల గుండె ఆరోగ్యానికి హాని కలుగుతుందని స్పష్టమైన రుజువు బయటపడింది. కాల్షియం

సప్లిమెంట్‌ వాడడాలని సూచించడంలో ఏకాభిప్రాయం కొరవడింది. మెనోపాజ్‌ దశకు చేరుకున్న చాలా మంది మహిళల ఎముకల ఆరోగ్యం కోసం వైద్యులు ఈ సప్లిమెంట్‌

బిళ్లలను సూచిస్తుంటారు. కొన్నిసార్లు ఈ బిళ్లల్లో విటమిన్‌-డి కూడా ఉంటోంది. అయితే కాల్షియం సప్లిమెంట్లను విటమిన్‌-డితో తీసుకోవాలా లేదా అనే విషయంపై స్పష్టత

లేదు. ఇది గుండెకు ప్రభావితం చేస్తుంది. ఉమన్స్‌ హెల్త్‌ ఇనిషియేటివ్‌ ఏడేళ్లపాటు 36,000 మందిపై అధ్యయనం చేసింది. విటమిన్‌-డితో ఉన్న కాల్షియం సప్లిమెంట్‌

తీసుకోవడం వల్ల గుండెపై ఎలాంటి ప్రమాదం లేదని కనుగొన్నారు. కానీ ఇందులో పాల్గొన్న చాలా మంది సొంతంగా కాల్షియం సప్లిమెంట్లను తీసుకుంటున్నారు.

వీటి వల్ల అస్పష్టమైన దుష్ప్రభావాలున్నాయి. న్యూజిలాండ్‌కు చెందిన పరిశోధకులు బృందం ఈ ఫలితాలను పునర్‌ విశ్లేషణ చేసింది. అధ్యయనంలో పాల్గొనే ముందు

కాల్షియం సప్లిమెంట్‌ తీసుకోని 16,718 మంది మహిళలను పరిశీలించారు. యాదృశ్ఛికంగా కాల్షియం, విటమిన్‌-డి తీసుకున్న మహిళల్లో మధ్యస్థంగా 13 నుంచి 22

శాతం గుండెజబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉందని వెల్లడైంది. ముఖ్యంగా గుండెపోటు. కాల్షియం సప్లిమెంట్‌ తీసుకున్న తర్వాత రక్తం-కాల్షియం స్థాయిలో

ఆకస్మికమైన మార్పులను పరిశోధకులు పసిగట్టారు. వీటి వల్ల ప్రతికూల ప్రభావాలుంటాయి. రక్తంలో అధిక కాల్షియం స్థాయికి, ధమనులు గట్టిపడడానికి సంబంధం ఉంది.

ఇది ఫలితాలను వివరించడానికి తోడ్పడుతుంది. వృద్ధులు కాల్షియం సప్లిమెంట్‌ వాడే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని ఫలితాలు సూచిస్తున్నాయి. అంతేకాక ఈ

అంశంపై మరిన్ని అధ్యయనాలు, చర్చ జరగాల్సిన అవసరముంది.
 • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/