Tuesday, August 30, 2011

ఒంటరితనం , Lonelinessఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఒంటరితనం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఒంటరితనం అంటే ఒంటరిగా ఉండటం అని అర్థం కాదు. సంఘటనలు లేదా అవకాశాలను బట్టి చాలామంది ఒంటరిగా ఉండే సమయాలుండవచ్చు. ఒంటరితనమనేది వ్యక్తుల నియంత్రణలో ఉన్నట్లయితే, ఒంటరిగా ఉండటాన్ని సానుకూలంగా, ఉల్లాసకరంగా మరియు భావావేశపరంగా పునరుత్తేజం పొందటంగా అనుభూతించవచ్చు. ఏకాంతం స్థితి అంటే ఒంటరిగా మరియు ఇతర వ్యక్తుల నుండి వేరుగా ఉండటం, మరియు తరచుగా స్పృహతోనే ఒంటరిగా ఉండే అవకాశం కల్పించుకోవటంగా సూచించవచ్చు. ఉపేక్షింపబడిన ఏకాంతం నుండి వచ్చే ఫలితమే ఒంటరితనం. ఒంటరితనం, ఒంటరిగా ఉన్నప్పుడే కాదు, జనసమ్మర్ధం ఉన్న ప్రదేశాల్లో ఉన్నప్పుడు కూడా, అనుభవంలోకి రావచ్చు. దాన్ని వ్యక్తిగత గుర్తింపు, అర్ధం చేసుకోవటం లేదా కరుణ లేకపోవటంగా కూడా వర్ణించవచ్చు. ఒక వ్యక్తి భౌతికంగా ఇతరుల నుండి వేరు చేయబడ్డాడా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా, ఒంటరితనం, ఇతర స్వతంత్ర వ్యక్తుల నుండి వేరు చేయబడిన భావనగా వర్ణింపబడుతుంది. నెరవేరని, అంతేకాదు పొందలేమనిపించే ప్రేమ లేదా సాహచర్యం గురించిన బలమైన కోరికగా కూడా దీన్ని వర్ణించవచ్చు. లేదా ఒకరి జీవితంలో ప్రేమ రాహిత్యం నుండి విస్తరించిందనవచ్చు, కాబట్టి తిరస్కారం, నైరాశ్యం మరియు హీనమైన ఆత్మగౌరవం వంటి భావోద్రేకాలకి దారి తీయవచ్చు. ఒంటరితనం యొక్క భావనలు, మృత్యుభావనలు లేదా ప్రియమైన వారిని పోగొట్టుకున్న భావనలకి సమానంగా ఉండవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటివారి ఆరోగ్యంకూడా అంతంతమాత్రమేనంటున్నారు పరిశోధకులు.

ఒంటరిగా ఉండేవారు కేవలం మానసికంగానేకాకుండా శారీరకంగాకూడా బాధపడుతుంటారని వైద్యులు తెలిపారు. ఇది వారి మస్తిష్కంపైకూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని వారు తెలిపారు. ఒంటరిగా ఉండటంవలన మస్తిష్కంపై ఒత్తిడి అధికంగావుంటుందని పరిశోధకులు వివరించారు.ఒంటరితనంవలన మనిషిలో కోరికలు నశిస్తాయని, దీంతో వారికి జీవితంపై విరక్తి కలుగుతుంది. ఏ విధంగానైతే ధూమపానం చేసేవారికి, ధూమపానం చేయనివారికి ఎంత తేడా ఉంటుందో అలాంటి తేడాలే ఒంటరిగా జీవించేవారిలోకూడా ఉంటుందని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పరిశోధనకర్త ప్రొఫెసర్ జాన్ కాసిపో వివరించారు.

ఒంటరితనం అనేది కేవలం వ్యక్తిగతంగానే కాకుండా వారి ఆరోగ్యంపైకూడా తీవ్రమైన ప్రభావం కనపడుతుందని, ఇది చాలావరకు అనారోగ్యానికి దారి తీస్తుందని ఆయన తెలిపారు. ఎందుకంటే అన్ని రకాల ప్రాణులు కలిసి మెలిసి ఉంటాయి. అలాగే మనిషి సంఘజీవి కావడం వలన తన రక్త సంబంధీకులు, మిత్రులు, ఇరుగు-పొరుగులతో సత్సంబంధాలు కొనసాగించనిదే ఉండలేడు.కాబట్టి ప్రతి ఒక్కరు సంఘంతో తమ జీవితాన్ని ముడిపెడుతుంటారు. అయినాకూడా కొందరికి ఒంటరితనం వెంటాడుతూనే ఉంటుందని వారి పరిశోధనలలో తేలినట్లు ఆయన తెలిపారు.

ఒంటరితనంవల్ల మీరు ఏమీ చేయలేని అశక్తులం అన్న భావనకు గురవుతుంటారు. కారణం ఆ ఒంటరితనం మీలో పాతుకుపోయి ఉండటమే. ఒంటరితనం మరీ ఎక్కువైపోతే అది కుటుంబాన్ని కూడా బాధిస్తుంది. సంతోషంతో, చురుగ్గా జీవితాన్ని గడపలేరు. ఒంటరిగా ఉన్నవారు విభిన్నమైన సాంఘిక జీవితాన్ని గడపలేరు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఒంటరితనాన్ని అనుభవించేవుంటారు. ఇది మానవ జీవితపు ఒక అంతర్భాగం. ఈ సమయాన్ని గుర్తుంచుకుని తగినంత సహన్నాని ప్రదర్శించాలి. ఓర్పు ఆయుధంగా ఒంటరితనంతో నెగ్గుకు రావడం సులభం అవుతుంది.

కుటుంబంలో ఏదో కష్టం. లేదా మీ మిత్రుడు మీరు అనుకున్న దానికి భిన్నంగా వ్యవహరించినప్పుడు లేదా మీ జీవితంలో ఏదీ సవ్యంగా ఉండడం లేదనిపించినప్పుడు మీలో సమస్యపట్ల తగినంత సహనం. ఆత్మ పరిశీలన అవసరం. మొట్టమొదటగా మిమ్మల్ని బాధపెడుతున్న ఒంటరి తనం ఎలా సంభవించిందో దాన్ని గురించి అర్థం చేసుకోవాల్సి వుంటుంది. ఉదాహరణకు సంతోషంగా జీవిస్తున్న కుటుంబంలోని సభ్యలు చాలా చురుకైన సాంఘిక జీవితాన్ని గడుపుతారు.

మీలో మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారనుకోండి మీ చుట్టూ మిమ్మల్ని స్వీకరించగల వ్యక్తులు చాలామందే ఉంటారు. అది గ్రహిస్తే మీరు ఒంటరితనాన్ని అనుభవించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీ కుటుంబ సభ్యలు, మిత్రులు మిమ్మల్ని గౌరవంగా స్వీకరించినా మీలో మీరు ఇంకా ఒంటరిగానే ఫీలవుతున్నారా? మీ ఒంటరితనానికి ఇదో కారణం అయి ఉండవచ్చు.

మీరు ఎక్కడకు వెళ్లినా! అందరూ మీ పట్ల మంచిగా నడుచుకోవాలనీ, మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించి గౌరవించాలనీ, తమతమ అభిప్రాయాలను, సానుభూతినీ, ప్రశంసనూ మీకు అందజేయాలని ఆశిస్తూ మీరు గొప్ప ఒంటరితనానికి గురైనారని తేల్చి చెప్పవచ్చు. అయితే ఈ ప్రపంచం కఠినమైనదనీ, అంత తేలిగ్గా ఎవరినీ ఆకాశానికి ఎత్తుతూ పొగడదనీ మీరు గ్రహించాలి. చాలామంది ఏ చిన్న విమర్శకైనా విపరీతంగా ఫీలైపోయి తమలో తాము తాబేళ్లుగా ముడుచుకుపోతుంటారు. ఈ సమాజంలో ఎన్నో రకాల మనస్తత్వాలుగల మనుషులు కోకొల్లలుగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మునుషులు తమ తమ దైనందిన కార్యక్రమాలలో బీజీగా ఉంటారు. వారి వారి సమస్యలతో సతమతమవుతుంటారు. అంతమాత్రాన వారు మిమ్మల్ని గౌరవించటం లేదని భావిస్తే అది మీ తప్పు.

వాస్తవాన్ని అంగీకరించడం గురైన మనస్తత్వానికి నిదర్శనం. వాస్తవాన్ని గ్రహించి ప్రవర్తించేవారికి ఒంటరితనం పెద్ద సమస్యేకాదు. ఎవరైనా బాగా దగ్గరివారు లేదా బాగా ప్రేమించేవారో పోయారనుకోండి. అప్పుడు మీరు చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. పెద్ద వయస్సు తమ జీవిత భాగస్వామిని కోల్పోయినవారు తము అందరిలో నుండి వేరు చేయబడ్డామని, ఎవరూ తమను అర్థం చేసుకునేవారు లేరని, తమపట్ల ఎవరూ సానుభూతి చూపించటంలేదని, విపరీతమైన భావనకు గురై ఒంటరిగా కుమిలిపోతుంటారు. మిమ్మల్ని మీరు ఇష్టపడటం కంటే ఇతరుల్ని మీరు ఇష్టపడటం ప్రారంభించండి. ఇతరులు ఇష్టపడే దానిని ఆసక్తితో చేస్తే మీ కిష్టమైన అభిరుచులతో వారిని మెప్పిస్తూ ఇతరులతో కలసి ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేయగలిగితే మీ ఒంటరితనం కూడా ఒక వరంగా పరిణమించి, మీలో గొప్ప భావుకత్వం వుంటే మంచి కవిగానో, రచయితగానో, మిమర్శకుడిగానో రాణించవచ్చు.

ఒంటరితనం పోవాలంటే
ఎటుచూసినా జనం. కానీ, అంత మందిలోనూ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నవారు చాలా ఎక్కువగానే ఉన్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి నిపుణులు చెబుతున్న సూచనలు...
* వృద్ధాశ్రమాలూ అనాథ శరణాలయాలను సందర్శించి అక్కడి వారితో మాట కలపండి. శక్తిమేరకు సాయం చేయండి.
* నలుగురిలో ఉన్నపుడు మాట్లాడటం కన్నా వినడానికి ప్రాధాన్యం ఇవ్వండి. మాటతీరు సౌమ్యంగా ఉండేలా చూసుకోండి. విమర్శలు, వ్యంగ్యాలతో స్నేహితుల సంఖ్య తగ్గిపోతుంది.
* సంగీతం, ఆటలు, స్టాంపుల సేకరణ... ఇలా ఏదో ఒక కొత్త అలవాటుకు సమయం కేటాయించండి. స్ఫూర్తినిచ్చే సూక్తులు, జోకులు, కవితలు లాంటివి సేకరించండి.
* మంచి పుస్తకాలు విలువైన స్నేహితులు. ఒంటరితనాన్ని దూరంచేసే సాధనాల్లో పుస్తక పఠనం ఒకటి. రచన కూడా ఒంటరితనానికి విరుగుడు.
 • ================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

వృద్ధాప్యంలో అవసరమైనవ్యాయామం ,Exercise in Old age for good health.
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వృద్ధాప్యంలో అవసరమైనవ్యాయామం - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మన దేశంలో ఈ ప్రశ్న అడిగితే చాలామంది నుంచి వచ్చే సమాధానం దాదాపు ఒకే తీరుగా ఉంటుంది. ''కృష్ణారామా అనుకునే ఈ వయసులో మాకేం అవసరాలుంటాయి? సమయానికి నాలుగు మెతుకులు పెట్టి.. కాస్త ప్రేమగా పలకరిస్తే అంతే చాలు!'' నిజమే.. ఆ వయసుకు పెద్దగా అవసరాలేం ఉండకపోవచ్చు. కానీ ఆ నాలుగు మెతుకులైనా హాయిగా తిని.. నిశ్చింతగా తిరుగుతుండాలంటే ఒకటి మాత్రం కచ్చితంగా అవసరం.

అది.. నిత్యం వ్యాయామం!
'ఈ వయసులో కండలు పెంచాలా? ఎముకలు వంచాలా? నాకెందుకులే' అనుకోవటానికి లేదు. కొత్తగా కండలు రానక్కరలేదు.. కానీ ఉన్న కండలు కరిగిపోకుండా.. ఉన్న శక్తులు ఉడిగిపోకుండా.. ఉన్న సామర్థ్యం కొడిగట్టకుండా చూసుకోవటానికే వ్యాయామం చాలా అవసరం.నాలుగు అక్షరాలు రాద్దామంటే వేళ్లు సహకరించవు. డబ్బాల మూతలు తియ్యాలంటే చేతుల బలం సరిపోదు. కిందపడిన వస్తువులు తీసుకుందామంటే ఎక్కడ ముందుకు పడిపోతామోనన్న భయం. ఇలా దైనందిన జీవితంలో ఏ పని చేసుకోవాలన్నా శక్తి చాలక అశక్తత ఆవరిస్తుంటుంది. దీనికి విరుగుడు సూత్రం ఒక్కటే.

వాడుతుంటేనే ఒంటికి చేవ తగ్గకుండా ఉంటుంది. ఉపయోగిస్తుంటేనే పదును తగ్గకుండా ఉంటుంది. అందుకే పాశ్చాత్య దేశాల్లో దీనిపై ఇప్పుడు విస్తృతంగా అధ్యయనాలు జరుగుతున్నాయి. అసలు వృద్ధులకు ఎదురయ్యే సమస్యలేమిటి? వాటిని అధిగమించాలంటే ఏయే వ్యాయామాలు అవసరం? ముఖ్యంగా- నిత్యం ఎటువంటి వ్యాయామాలు చేస్తే వృద్ధాప్య సమస్యలు దరిజేరకుండా.. వృద్ధాప్యాన్ని ఆహ్లాదంగా గడపొచ్చన్న దానిపై వైద్యరంగం ఇప్పుడు స్పష్టత సాధించింది. నిత్య వ్యాయామంతో శారీరక శక్తులు ఉడిగిపోకుండా ఉండటమే కాదు.. వృద్ధాప్యంలో పిలవని పేరంటాళ్లలా వచ్చి పలకరించే మధుమేహం, హైబీపీ, హైకొలెస్ట్రాల్‌ వంటి సమస్యలను అధిగమించేందుకూ వ్యాయామాలు ముఖ్యం.

వ్యాయామం అనగానే చాలామంది యువకులకు మాత్రమే సంబంధించిందని భావిస్తుంటారు. అయితే ఇది వృద్ధాప్యంలోనూ అవసరమేనన్న వాదన ఇప్పుడు బలం పుంజుకుంటోంది. మన జీవనకాలం గణనీయంగా పెరిగింది. దీంతో వృద్ధుల సంఖ్యా పెరుగుతోంది. చిన్న కుటుంబాలూ పెరుగుతుండటంతో ఇంట్లో అన్ని వేళలా మనుషులు అందుబాటులో ఉండటం తగ్గిపోతోంది. అందుకే మలి వయసులోనూ శారీరక సామర్థ్యాన్ని నిలబెట్టుకోవటానికి ప్రాధాన్యం ఎక్కువవుతోంది. ఇంటిపట్టున ఒక్కరే ఉన్నా తమ పనులు తాము చేసుకునేలా ఆరోగ్యంగా ఉండటం అత్యవసరమని అందరూ గుర్తిస్తున్నారు. ఇందుకు వ్యాయామాన్ని మించిన సాధనం లేదు. రోజురోజుకీ తగ్గిపోతున్న సామర్థ్యాన్ని, చలాకీతనాన్ని కాపాడుకోవటంలో దీని పాత్ర అమోఘం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల ఆరోగ్యం సొంతమవటమే కాదు.. సాఫీగా జీవించటానికి కావలసిన శక్తిని అందిస్తుంది. మనసును ఉల్లాసంగా ఉంచుతూ.. కుంగుబాటు బారిన పడకుండా కాపాడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లు, గుండెజబ్బు, మధుమేహం వంటి వ్యాధులు త్వరగా దాడిచేయకుండానూ చూస్తుంది. మన గుండె కూడా కండరమే కదా. వ్యాయామంతో ఇతర కండరాలు దృఢమైనట్టుగానే గుండె కూడా బలం పుంజుకుంటుంది. శారీరకశ్రమ చేసినప్పుడు గుండె బలంగా, వేగంగా కొట్టుకోవటం వల్ల దాని కండరం కూడా బలపడుతుంది. ఇది గుండెజబ్బులు దరిజేరకుండా రక్షిస్తుంది. అప్పటికే వ్యాధులతో బాధపడుతున్నా, వైకల్యంతో సతమతమవుతున్నా దీర్ఘకాలం వ్యాయామం చేయటం వల్ల తిరిగి కోలుకునే అవకాశం ఉండటమూ గమనార్హం.

వృద్ధాప్యం ముంచుకొస్తున్నకొద్దీ కండరాలు కూడా సహజంగానే బలహీనపడతాయని, క్షీణిస్తాయని అనుకుంటూ ఉంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. కండరాలకు పని చెప్పకపోతేనే ఈ ప్రమాదం ముంచుకొస్తుంది. కండను దెబ్బతీసే ఏదైనా జబ్బు సోకినా, పోషకాహార లోపం ఉన్నా ఇలాంటిది కనబడొచ్చు. వృద్ధాప్యానికి కండర క్షీణతకు పెద్దగా సంబంధమేమీ లేదు. మలివయసులోనూ కండరాలు ఎప్పటిలాగానే పనిచేస్తాయి. కాకపోతే కండరాల్లో కొంతమేర రక్తసరఫరా తగ్గొచ్చు. కానీ ఆక్సిజన్‌ వినియోగించుకునే సామర్థ్యంలో మాత్రం ఎలాంటి తేడా ఉండదు. వృద్ధాప్యంలో కీళ్లనొప్పులు, దీర్ఘకాలిక జబ్బు, స్థూలకాయం వంటివన్నీ కదలకుండా ఇంటిపట్టునే ఉండేలా చేస్తాయి. దీంతో కండరాలకు పని తగ్గిపోయి క్రమంగా క్షీణతకు గురవుతుంటాయి. ముందునుంచే వ్యాయామం చేస్తుంటే వయసు మీద పడుతున్నా కండరాలను దృఢంగా ఉంచుకోవచ్చు. ఒకవేళ మలి వయసులో వ్యాయామం మొదలెట్టినా మంచి ఫలితం ఉంటున్నట్టు అధ్యయనాలూ రుజువు చేస్తున్నాయి.

భయపడాల్సిన పనిలేదు
శారీరకశ్రమ, వ్యాయామాలు ఎవరికి వారు చేయాల్సినవే. చేసినవారికి చేసినంత ఫలితం. అయితే చాలామంది వృద్ధులు వ్యాయామం చేయటానికి ఇష్టపడరు. శారీరకశ్రమ, వ్యాయామాలతో తీవ్రంగా అలసిపోతామనో.. గాయాల బారిన పడతామనో తెగ భయపడిపోతుంటారు. కానీ వ్యాయామం చేయటం వల్ల కలిగే ఇబ్బందుల కన్నా చేయకపోవటం వల్ల వాటిల్లే నష్టాలే అధికం. కొద్ది జాగ్రత్తలతో మలి వయసులోనూ ఎన్నో వ్యాయామాలు చేయొచ్చు. ఇవి సురక్షితమైనవే కాదు వయసుతో పాటు వచ్చే వ్యాధులను దూరంగా ఉంచుతాయి కూడా.

వయసు మీద పడిందంటే శక్తి తగ్గిపోయి రోజు వారీ పనులన్నింటికీ ఇతరుల మీద ఆధారపడాల్సిందేనని చింతించాల్సిన పనిలేదు. ముఖ్యంగా వృద్ధాప్యంలో తోడ్పడే నాలుగు రకాల వ్యాయామాలతో మరింత ఉత్సాహాన్ని సొంతం చేసుకోవచ్చు. నడక, ఈత వంటి సామర్థ్యాన్ని (ఎండ్యూరెన్స్‌) పెంచే వ్యాయామాలతో కొత్తశక్తిని పుంజుకోవచ్చు. తోటపని, ఇంటిపని వంటివి తేలికగా చేసేయొచ్చు. కండరాలను దృఢంగా (స్ట్రెంత్‌) ఉంచుకుంటే మనవలు మనవరాళ్లను ఎత్తుకోవటం, మెట్లు ఎక్కటం, దుకాణంలో వస్తువులు కొనుక్కురావటం వరకు అన్ని పనులూ అలుపు లేకుండా చేసేయొచ్చు. కండరాలు సాగే (ఫ్లెక్సిబిలిటీ) గుణాన్ని కాపాడుకుంటే వంటింట్లో సామాన్లను అందుకోవటం దగ్గర్నుంచి చిన్నచితకా పనులన్నింటినీ హాయిగా కానియ్యొచ్చు. బాత్రూంలోనో, ఇంట్లోనో తూలిపడిపోవటం వల్ల ఎంతోమంది వృద్ధులు ఎముకలు విరిగి బాధపడుతుండటం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా తుంటి ఎముక విరగటం వల్ల మంచాన పడిపోయి అవసాన దశకు చేరుకుంటున్నవారు ఎందరో. బ్యాలెన్స్‌ (నియంత్రణ) మెరుగుపరచుకుంటే ఇలా తూలి పడిపోయే ప్రమాదం చాలావరకు తప్పుతుంది. (ఈ వ్యాయామాలు ఎలా చేయాలో పక్కన వివరంగా చూడండి)

జాగ్రత్తలు
వ్యాయామం ఎంత అవసరమో.. వాటి మూలంగా గాయాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవటమూ అంతే ముఖ్యం.

* ఒకేసారి కష్టమైన, బరువైన వ్యాయామాలతో కాకుండా ముందు తేలికైన వాటితో ఆరంభించాలి. వ్యాయామానికి ముందు శరీరం సన్నద్ధం కావటానికి వీలుగా చేతులు, కాళ్లు ఆడించటం వంటి వార్మప్‌ తప్పకుండా చేయాలి. వ్యాయామాన్ని ముగించేటప్పుడు హఠాత్తుగా ఆపకుండా నెమ్మదిగా వేగం తగ్గించాలి. దాహం వేయకపోయినా వ్యాయామానికి ముందు, మధ్యలో, తర్వాత నీళ్లు తప్పకుండా తాగాలి.

* గుండెజబ్బు, మధుమేహం, పాదాలకు మానని గాయాలు, నడుస్తున్నప్పుడు విడవకుండా నొప్పి రావటం, కంటి సమస్యల వంటి వాటితో బాధపడుతుంటే ముందుగా డాక్టర్‌ని సంప్రదించి.. తగు వ్యాయామాలను ఎంచుకోవటం మేలు. వ్యాయామం మొదలెట్టిన తర్వాత.. ఛాతీలో నొప్పి, గుండె వేగంగాగానీ క్రమం తప్పిగానీ కొట్టుకోవటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, చాలా త్వరగా బరువు తగ్గిపోతుండటం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

అధ్యయనాలు :
వ్యాయామంతో మలివయసులోనూ మంచి ఫలితాలు కనబడుతున్నట్టు పలు అధ్యయనాల ఫలితాలూ చెబుతున్నాయి. వీటితో త్వరగా అలసిపోకుండా ఎక్కువ దూరం నడవటం, బరువులను తేలికగా ఎత్తటంతో పాటు గుండె రక్తనాళాల పనితీరూ మెరుగుపడినట్టు స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధనలో తేలింది. ఆత్మ విశ్వాసమూ పెరుగుతుండటం విశేషం. నొప్పులు కూడా తగ్గుతున్నాయి. వ్యాయామం మూలంగా రోగ నిరోధకశక్తి పెరగటంతో ఇన్‌ఫెక్షన్ల ముప్పూ తగ్గుతున్నట్టు ఇతర అధ్యయనాల్లో బయటపడింది. ఎక్కువసేపు కదలకుండా కూచునే వృద్ధులకు తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా, అల్జీమర్స్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు మరో పరిశోధనలో బయటపడింది.

వయసు మీద పడుతున్నకొద్దీ కేలరీల అవసరం తగ్గిపోతుంది. కాబట్టి పిండి పదార్థాలను తగ్గంచి, పోషకాలు దండిగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. మాంసం, కొవ్వు అధికంగా గల పాల ఉత్పత్తులను తగ్గించాలి. ముడిధాన్యాలు తీసుకోవటమూ మంచిదే. వ్యాయామం, శారీరకశ్రమతో శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి. అలాగే పజిల్స్‌ పూరించటం, చదరంగం వంటి ఆటలు ఆడటం, కొత్త భాషలు నేర్చుకోవటం వంటి మెదడుకు మేత పెట్టే వాటితో మనసుకీ పని కల్పించాలి. వృద్ధులకు నిద్ర తక్కువ పడుతుందన్న దాంట్లో నిజం లేదు. అందరిలాగే వారికీ రోజుకి 6-8 గంటల నిద్ర అవసరం. ఒకవేళ పగటిపూట మగతగా అనిపిస్తుంటే నిద్రలేమితో బాధపడుతున్నారేమో పరీక్షించుకోవటం మేలు.పగటి పూట నిద్ర మలి వయసు లో చాలా మంచిది .. రోజూ ఒక గంట కాలము పాటు కునుకు తీస్తే ఆరోగ్యముగా ఉంటారు . పొగ తాగే అలవాటుంటే వెంటనే మానెయ్యటం అన్నివిధాలా మంచిది. ఇక మద్యం అలవాటుంటే పరిమితి మించకుండా జాగ్రత్త పడాలి.రోజుకు 1-1.5 పెగ్గలు కంటే ఎక్కువ తాగరాదు .

చాలామంది ఏదో ఒక రకం వ్యాయామం చేస్తే చాలనుకుంటారు. అయితే శరీరంలోని అన్ని భాగాలు బలోపేతమయ్యేలా వ్యాయామాలను ఎంచుకోవాలి. ఇందుకు ఎండ్యూరెన్స్‌ (సామర్థ్యం), స్ట్రెంత్‌ (బలం), బ్యాలెన్స్‌ (నియంత్రణ), ఫ్లెక్లిబిలిటీ (సాగేగుణం) వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ వ్యాయామాలను 10-15 సార్లు చేస్తే మంచి ఫలితాలు కనబడతాయి.

ఎండ్యూరెన్స్‌ వ్యాయామాలు
* సైకిల్‌ తొక్కటం, ఈత, మెట్లు ఎక్కటం, వేగంగా నడవటం, ట్రెడ్‌మిల్‌పై నడక, జాగింగ్‌.. ఇలాంటి ఎండ్యూరెన్స్‌ వ్యాయామాలు మన సామర్థ్యాన్ని పెంచుతాయి. పనులు చేస్తున్నప్పుడు మనం త్వరగా అలసిపోకుండా కాపాడతాయి. ఎక్కువసేపు వ్యాయామం చేయటానికీ తోడ్పడతాయి.* ఈ వ్యాయామాలన్నీ ఇంట్లో చేసుకునేవే. పెద్దగా ఖర్చు కూడా కాదు. పరికరాలతోనూ పనిలేదు. రోజులో ఒకేసారి గానీ.. విడతలు విడతలుగానూ చేయొచ్చు. జీవనశైలి, ఆరోగ్యం, ఆసక్తులకు సరిపోయిన వాటిని ఎంచుకోవచ్చు. కొంతమంది తోటపని, పెంపుడు కుక్కలను షికారుకు తీసుకెళ్లటం, మెట్లు ఎక్కటం వంటివి శారీరకశ్రమ చేస్తున్నాం కదా. ఇక వ్యాయామం చేయాల్సిన అవసరం లేదని భావిస్తుంటారు. కానీ వ్యాయామానికీ వీటికీ తేడా ఉంది. ఇలాంటివి ఆయా శరీరభాగాలకు అనువైన రీతిలో నిర్ణీత పద్ధతిలో రూపొందిస్తారు. కాబట్టి వీటితో ఆయా శరీరభాగాలు బలం పుంజుకుంటాయి.


Source : sukhibhava of Eenadu news paper • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, August 29, 2011

అవయవాల మార్పిడి ,Organ Transplantationఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -అవయవాల మార్పిడి ,Organ Transplantation- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...మన శరీరంలోని రకరకాల అవయవాలు దేనిపని అది చేసుకుని పోతూ ఉంటే, మనం హాయిగా మన పనులు చేసుకుంటూ ఉంటాము. ఏదైనా కారణం వలన ఆ అవయవాలు పనిచేయకపోతే, శరీరం కూడా మొరాయిస్తుంది. అటువంటప్పుడు ఆ పనిచేయని అవయవం స్థానంలో వేరొర క్రొత్త అవయవాన్ని ఏర్పరచగలిగితే .......?

ప్రాచీన కాలంలో ఇటువంటి ఊహలకు ప్రతిరూపమే మనం చూపే వినాయకుడి తల... కాబట్టి మనకు తెలిసిన మొదటి అవయవ మార్పిడి వినాయకుడి అసలు తల స్తానం ఏనుగు తల రావడం. అలా ఊహల పల్లకిలో ఊరేగిన మనిషి మేధస్సు ఎంతో...... ఇంకెంతో ఎదిగి, ఇప్పుడు చేస్తున్న ఆధునిక అవయవాల మార్పిడి స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ముఖ్యంగా మార్పిడి చేస్తున్న అవయవాలలో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, కళ్ళు (కార్నియా) ముఖ్యమైనవి.

వీటిలో........ శరీరంలో ఒకటే ఉన్న అవయవాన్ని (ఉదా...గుండె, కాలేయం మొ|| ) మార్చాలంటే....... అప్పుడే చనిపోయిన వ్యక్తి నుంచి తీసి మాత్రమే మార్చవలసి వస్తుంది. దీనిని Cadaver transplant అంటారు. ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తి - ఏ వయసులో వారైనా - రోడ్డు ప్రమాదాలు లేదా గుండెపోటు వల్ల లేదా ఇతర కారణాల వలన చనిపోయినప్పుడు - అతని మెదడు చనిపోతుంది - కాని గుండె ఇతర అవయవాలను కృత్రిమంగా పనిచేస్తూ ఉంటారు. దీనిని Brain Death అంటారు. ఇటువంటి వ్యక్తులు కృత్రిమ సహాయం (ఉదా,, వెంటిలెటర్) ఆపిన వెంటనే పూర్తిగా చనిపోవడం జరుగుతుంది. వారి కుటుంబ సభ్యుల అంగీకారంతో, ఇటువంటి వ్యక్తుల నుంచి అవయవాలను వేరొకరికి దానం చేసి ఇతరులకు సహాయపడవచ్చు.

ఇక శరీరంలో జతగా ఉన్న అవయవాలు ఉదా,, కిడ్నీలు బతికి ఉన్న వాళ్ళు వేరొకరికి ఒక కిడ్నీ దానం చేయవచ్చు. దీనిని Live transplant అంటారు.
పేదరికం వల్ల కొందరు తమ అవసరాలనిమిత్తం ఒక కిడ్నీని అమ్ముకునే సంఘటనలు మనం నిత్యం ఎన్నో చూస్తున్నాం. డబ్బున్న వాళ్ళకు కిడ్నీ కావలసి వస్తే ఎంతైనా ఖర్చు పెట్టి పేదల కిడ్నీలు కొనేస్తున్నారు. పేదలకు కిడ్నీ కావలసివస్చే మాత్రం, కొనలేక, ఎవరైనా దానం చేసినా, అపరేషన్ చేయించుకుని అమర్చుకొనే స్తోమత లేక మొగ్గదశలోనే రాలిపోతున్నారు.్

----------

----------
ఇంత ముఖ్యమైన కిడ్నీలు పనిచేయకపోతే ?

* తాత్కాలికంగా పనిచేయనప్పుడు - కిడ్నీల పని బయట నుంచి మనం చేయవచ్చు. దీనిని డయాలసిస్ అంటారు.
* శాశ్వతంగా పనిచేయకపోతే-
1. జీవితాంతం డయాలసిస్.
2. కిడ్నీ మార్పిడి.

మరి కొత్త కిడ్నీ ఎక్కడ దొరుకుతుంది ?

* ఇంతవరకు చెప్పుకున్నట్లు చనిపోయిన వ్యక్తి నుంచి గాని, బ్రతికి వున్న వ్యక్తుల నుంచి గాని తీసుకోవాలి.

రెండు కిడ్నీలు మార్చుకోవాలా ?

* ఒక ఆరోగ్యవంతమైన కిడ్నీ శరీరాన్ని కాపాడుతుంది.
* కాబట్టి కిడ్నీ ఇచ్చిన దాత తనకు మిగిలిన ఒక కిడ్నీతో ఆరోగ్యంతో జీవిస్తాడు.
* గ్రహీతకు ఒక్క కిడ్నీ సరిపోతుంది. అవయవ మార్పిడి లో ముఖ్యమైన అంశాలు మూడు
1. ఆ అవయవం దొరకడం { Availability }
2. తీసుకొనే వారి శరీరానికి సరిపోవడం { matching }
అది అమర్చే ప్రక్రియ { Fixation }

దొరకడం ఎలా ? ఇంతకు ముందు చెప్పినట్లు చనిపోయిన వ్యక్తి నుంచి లేదా బ్రతికి ఉన్న వారి దగ్గర నుంచి తీసుకొని అమర్చాలి.
సరిపోవడం అంటే ?

శరీర నిర్మాణం ప్రకారం బయట నుంచి వేరొక క్రొత్త పదార్థమేదైనా శరీరంలోకి వచ్చినప్పుడు శరీరం వెంటనే దానిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ఈ పని చేస్తుంది. అందుకని సాధ్యమైనంతగా శరీర స్థితికి దగ్గరగా ఉండే వారి నుంచి మాత్రమే కిడ్నీని తీసుకోవలసి వస్తుంది. దీనికోసం రక్తం గ్రూపు, HLA Testing మొదలైనవి చేసి, ఎంతవరకు ఇచ్చేవారి కిడ్నీ రోగికి సరిపోతుందో పరీక్షిస్తారు. సాధారణంగా తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల కిడ్నీ అయితే రోగి శరీరం బాగా స్వీకరిస్తుంది. వీరుకాక రక్తం గ్రూపు మొదలైనవి సరిపోయిన వేరొకరి నుంచి తీసుకొంటే, రోగి శరీరంలోని ఆ క్రొత్త కిడ్నీని నాశనం చేయకుండా శక్తివంతమైన మందులతో (immuno suppressants) రోగ నిరోధక వ్యవస్థను పనిచేయకుండా చేయాలి. దీని వలన క్రొత్త కిడ్నీ నాశనం కాకుండా బాగుంటుంది. కాని శరీరానికి రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గి ఇతర ఇన్ఫెక్షెన్లు సోకే ప్రమాదం వుంది.
అమర్చే ప్రక్రియ ఎలా ?

క్రొత్త కిడ్నీని నూటికి నూరుపాళ్ళు అత్యంత నిపుణతతో శరీరంలో అమర్చవలసి వుంటుంది. దానికి వాడే పరికరాలు, ఇతర వస్తువులు (సూదులు, దారాలు) మొదలైన వాటిలో ఎంతో మార్పు వచ్చి, ప్రస్తుతం వాడే వస్తువులు అత్యంత నాణ్యమైనవిగా తయారయ్యాయి.
ఎన్నో పరిశోధనలు చేసి, శాస్త్రవేత్తలు ఇంతకుముందు చెప్పిన immuno suppressant మందులు తయారుచేశారు. ఈ ఒక్క రంగంలోనే ఆ పరిశోధనలకు గాను 3 నోబెల్ బహుమతులు ఇవ్వబడ్డాయి.
అలాగే ఆపరేషన్ కు వాడే వస్తువులను తయారు చేసే క్రమంలో కూడా జరిగిన పరిశోధలకు గాను కూడా 3 నోబెల్ బహుమతులు ఇవ్వబడ్డాయి.

కాని, మనందరి చేతుల్లో ఉన్నది -ఎక్కువ మంది కిడ్నీలు ఇవ్వడానికి ముందుకు రావడం. రోజు రోజుకు కిడ్నీ జబ్బులతో బాధపడుతున్న యువతీ యువకులు ఎంతో మంది పెరుగుతున్నారు. వీరందరికీ విజయవంతంగా కిడ్నీ మార్పడి చేయగలిగితే వారి వారి కుటుంబాలు, తద్వారా దేశానికి ఎంతో ఉపయోగం. అందుకని ఒక సామాజిక బాధ్యతతో ప్రభుత్వం, ప్రజలు చనిపోయిన వ్యక్తుల నుంచి అవయవాలను మార్చడానికి గట్టి నిర్ణయం తీసుకొని ప్రోత్సహించాలి.

కొన్ని దేశాలలో (ఉదా. ఆస్ట్రేలియా ) వారి పౌరులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేప్పుడు, దురదృష్టవశాత్తు వారు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగితే, వారి అవయవాలు ప్రభుత్వానికే చెందేట్లు చట్టం చేశారు. దీనివలన అలా చనిపోయిన వారి అవయవాలను ఎంతో మంది రోగులకు అమర్చే అవకాశం ఉంది. మన దేశంలో కూడా ఇటువంటి చట్టం చేసే దిశగా ప్రభుత్వం, ప్రజలు చర్చించవలసిన అవసరం ఉంది.

అలాగే, కిడ్నీ మార్పిడి ప్రక్రియలో వాడే మందులు, ఇతర వస్తువులు ధరలు బాగా తగ్గించగలిగితే ఎక్కువ మంది కిడ్నీ మార్పిడి చేయించుకోగలుగుతారు. ఈ దిశగా ప్రభుత్వం ఆయా మందులు తయారీదారులు ప్రయత్నించవలసిన అవసరం ఉంది.


--డా. ఎస్.ఎల్.వి.నారాయణరావు, నెఫ్రాలజిస్ట్, అరవింద్ కిడ్నీ సెంటర్, నెల్లూరు


 • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

డయాలసిస్‌ (రక్తాన్ని శుద్ధిచేసే ప్రక్రియ),Dialysis (Blood purification process)


 • http://2.bp.blogspot.com/-5W5j6eSYtXw/TluKColesVI/AAAAAAAACHE/HH-iaBWTvYk/s1600/Kidney%2BDialysis.jpg


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -డయాలసిస్‌ (రక్తాన్ని శుద్ధిచేసే ప్రక్రియ)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...ప్రపంచంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యుత్తమమైన విధానం కిడ్నీ మార్పిడి. కిడ్నీ మార్పిడి, హీమోడయాలసిస్‌ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వీటికి ప్రత్యామ్నాయం ఇంట్లో చేసుకునే డయాలసిస్‌. దీనికి నెలసరి ఖర్చు తక్కువగా ఉంటుంది. నెలకు సుమారు రూ.12 వేల నుండి 15 వేల వరకు ఉంటుంది. ఆశావాద దృక్పథంతో శాస్త్రీయతను ఉపయోగించుకునే వారికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆరోగ్యకరమైన సాధారణ జీవితానివ్వగలదు.

కిడ్నీ వంద శాతం పాడైనప్పుడు కిడ్నీ మార్పిడితో రోగిని రక్షిస్తారు. అయితే ఇది అందరికీ సాధ్యమవదు. దీనికి ఖర్చు కూడా ఎక్కువ. దాత అవసరం అవుతారు. అరవై ఏళ్లుపైబడిన వారికి కిడ్నీ మార్పిడి చేయడం సాధ్యం కాదు. మార్పిడికి ప్రత్యామ్నాయం డయాలసిస్‌ (రక్తాన్ని శుద్ధిచేసే ప్రక్రియ) ఇది రెండు రకాలు. ఒకటి హీమో డయాలసిస్‌, రెండోది పెరిటోనియల్‌ డయాలసిస్‌.

హీమోడయాలసిస్‌

ఇది యంత్రం ద్వారా రక్తన్ని శుద్ధి చేసే ప్రక్రియ. కృత్రిమ కిడ్నీ ద్వారా యంత్రం సహాయంతో రక్తాన్ని శుద్ధిచేస్తారు. దీని కోసం వారానికి మూడుసార్లు రోజు విడిచి రోజు డయాలసిస్‌ కేంద్రానికి వెళ్లాలి. సుమారు నాలుగు నుండి ఐదు గంటలు సమయం కేటాయించాలి.

పెరిటోనియల్‌ డయాలసిస్‌

ఇది ఇంట్లో చేసుకునే డయాలసిస్‌. దీన్నే 'కంటిన్యూయస్‌ అంబులేటరీ పెరిటోనియల్‌ డయాలసిస్‌' అని అంటారు. డయాలసిస్‌ ఒక ఆసరా. అంతేకాని పూర్తి ప్రత్యామ్నాయం కాదు. అయినా కొన్నిప్రత్యేక పరిస్థితుల్లో ఇంట్లో డయాలసిస్‌ చాలా ఉపయోగకరం. ఆహారంతో, తాగే నీటి పరిమాణంలో ఎటువంటి మార్పులు ఉండవు. అంటే యదేచ్ఛగా తినవచ్చు. తాగొచ్చు. పెరిటోనియల్‌ డయాలసిస్‌ ఇంట్లోనే కాకుండా ఎక్కడైనా చేసుకోవచ్చు.

 • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

కళ్లకు వచ్చే హైపర్-థైరాయిడ్‌ వ్యాధి లక్షణాలు , Opthalmic complications of Hyperthyroidఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కళ్లకు వచ్చే హైపర్-థైరాయిడ్‌ వ్యాధి లక్షణాలు , Opthalmic complications of Hyperthyroid- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


థైరాయిడ్‌ గ్రంథిలో సమస్య వస్తే అది కంటిపైన కూడా ప్రభావం చూపుతుంది. థైరాయిడ్‌ సంబంధ ఆఫ్తాల్మపతి మానసిక సమస్యలకు దారితీస్తుంది. సీతాకొకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్‌ మెడ ముందు భాగంలో ఉంటుంది. ఇది థైరాక్సిన్‌ హార్మోనును స్రవిస్తుంది. హార్మోను శరీరంలోని సాధారణ జీవక్రియలను నిర్వహించడానికి తోడ్పడుతుంది. కానీ, కొన్నిసార్లు అసాధారణంగా అధిక మొత్తంలో థైరాక్సిన్‌ స్రవిస్తే ఇది దుష్ఫ్రభావాలకు దారితీస్తుంది. దీని ఫలితంగా జీవక్రియ రేటు అధికమవుతుంది. థైరాయిడ్‌ గ్రంథి... కళ్ల కండరాలు ను కదలిస్తాయి. ఇవి ఉమ్మడి యాంటిజెన్‌ను పంచుకుంటాయి. థైరాయిడ్‌ గ్రంథిపై దాడిచేసే యాంటిబాడీలు కంటిలోని ఎక్స్‌ట్రా-అకులర్‌ కండరాలపై కూడా దాడిచేస్తాయి. ఫలితంగా కండరాలు, చుట్టు ఉన్న కొవ్వు కణజాలంలో వాపులొస్తాయి. అకస్మాత్తుగా జరిగే పరిణామం వల్ల రోగి రెప్పలార్పకుండా చూస్తాడు.

కంటిలో మార్పులు : థైరాయిడ్‌ ప్రభావం వల్ల కళ్లకు ఏర్పడిన పరిస్థితిని 'థైరాయిడ్‌ రిలేటెడ్‌ ఆప్తాల్మపతి' లేదా 'గ్రేవ్స్‌ ఆప్తాల్మపతి' అంటారు. కంటిలో ఏర్పడే మార్పులను నిర్ధారణ పరీక్ష ద్వారా హైపర్‌థైరాయిడ్‌ అని గుర్తించొచ్చు. కళ్లు ఎర్రగా మారతాయి. చిరాకుకు గురవుతాయి. కంటివెనక బిగపట్టినట్టు ఉంటుంది. కళ్లు బయటికి పొడుచుకుని వస్తాయి. కంటిరెప్పలు ఉబ్బుతాయి. ఇలాంటి పరిస్థితిలో వెంటనే వైద్యం చేయించాలి. నిర్లక్ష్యం చేస్తే ఒక వస్తువు రెండుగా కనిపించే డిప్లొపియా వస్తుంది. అరుదైన కేసుల్లో విస్తరించిన కండరాలు కంటి నరాన్ని ఒత్తుతాయి. ఈ నరం మెదడు నుంచి కంటి దృష్టి సంబంధ ప్రేరణను పొందుతుంది. నరం ఒత్తిడికి గురవడం వల్ల అంధత్వం కలుగుతుంది.

చికిత్స : ఈ సమస్యకు తొలిదశలో రక్తపరీక్షలు చేస్తారు. దీని వల్ల థైరాయిడ్‌ హార్మోన్‌ స్థాయిని, యాంటి-థైరాయిడ్‌ యాంటిబాడీస్‌ను గుర్తించొచ్చు. కంటి చూపు, వర్ణాంధత, దృష్టి క్షేత్రం, కంటి ఒత్తిడి, ఎక్స్‌ట్రా-అకులర్‌ మూవ్‌మెంట్‌లను సాధారణ కంటి పరీక్షల ద్వారా గుర్తించొచ్చు. కంటి కండరాలు విస్తరించాయా? లేదా? అని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్‌ లేదా సిటి స్కాన్‌ పరీక్షలు ఉపకరిస్తాయి. ఎండొక్రినాలజిస్ట్‌ పర్యవేక్షణలో మందులు తీసుకోవాలి. మందులు థైరాయిడ్‌ హార్మోనును, వాపును తగ్గిస్తాయి. ధూమపానం, అధిక ఒత్తిడి వ్యాధి తీవ్రతను పెంచుతాయి. అందుకని ఈ సమస్యతో బాధపడేవారు వీటిని ధూమపానం మానాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. చికిత్సలో భాగంగా కంట్లో చుక్కల మందులు పోయాల్సి ఉంటుంది. కళ్లు తేమగా ఉండటానికి పైపూత మందు పూయాలి. రాత్రి నిద్రపోయేటప్పుడు తల ఎత్తుగా ఉండటానికి అదనంగా ఇంకో దిండును పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉదయం లేచిన వెంటనే కంటిచుట్టూ ఏర్పడే వాపు తగ్గుతుంది. సమస్య ఒకసారి నియంత్రణలోకి వస్తే రోగి రెప్పలార్పకుండా చూసే పరిస్థితి నుంచి బయటపడొచ్చు. మందుల వల్ల నయం కాని కేసులకు శస్త్రచికిత్స పరిష్కార మార్గం. దీని వల్ల రెప్పలను సాధారణ స్థితిలోకి తీసుకోవచ్చు. ఒక వస్తువు రెండుగా కనిపించే డిప్లొపియను తొలి దశలోనే చికిత్స చేస్తే మేలు. ఈ దశ దాటితే శస్త్రచికిత్స ద్వారా కంటి కండరాలను పూర్వస్థితికి తీసుకురావొచ్చు. పట్టకంతో కూడిన ప్రత్యేక కళ్లద్దాలు వాడాలి. ఇక దీర్ఘకాలంగా చికిత్స లేని కేసులకు కాస్మొటిక్‌ శస్త్ర చికిత్స చేస్తారు. • ===========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

How to Control diabetes (sugar)?,మధుమేహము వ్యాధి ని ఎలా నియంత్రించుకోవాలి ? • [diabetes_2.jpg]

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -How to Control diabetes (sugar)?,మధుమేహము వ్యాధి ని ఎలా నియంత్రించుకోవాలి ?- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఆ పేరు తెలియనివాళ్లు ఉండరు. కానీ దాని గురించి ఎప్పుడు చెప్పినా కొత్తగానే ఉంటుంది. అదే మధుమేహం. దాదాపు ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు మధుమేహ వ్యాధి బారిన పడతారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మన రాష్ట్రంలో.. హైదరాబాద్ మధుమేహ రాజధానిగా పేరు పొందుతోందంటే దీని తీవ్రత ఎంతగా ఉందో అర్థమవుతుంది. 14.8 శాతం మంది హైదరాబాదీలు మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా ఈ మధుమేహం కథాకమామిషు....

ఎంత తిన్నా ఒంటబట్టడం లేదు... అన్న మాట చాలాసార్లు వినే ఉంటాం. మధుమేహం ఉన్నవాళ్లలో సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ఎంత ఆహారం తీసుకున్నా దాని నుంచి శరీరానికి శక్తి అందదు. ఆకలి మాత్రం అవుతుంది. ఆహారాన్ని శక్తిగా మార్చే హార్మోన్ పనిచేయకపోవడం వల్లే ఈ తిప్పలన్నీ. నిజానికి మధుమేహ వ్యాధి ఒక జబ్బు కాదు. చాలా రకాల జబ్బుల లక్షణాల సముదాయం. అందుకే దీన్ని సిండ్రోమ్‌గా వ్యవహరిస్తారు.

ముందే సిగ్నల్స్

మధుమేహం రాబోయే ముందు దశనే ప్రీడయాబెటిక్ దశ అంటారు. కొన్నేళ్ల ముందు కూడా ఈ దశ ఉండవచ్చు. ఈ దశ నుంచి ఇన్సులిన్ ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. అందువల్ల ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సరిపోదు. ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ అవసరం అవుతుంది. కాబట్టి రక్తంలో ఇన్సులిన్ పెరుగుతుంది. ఇది మధుమేహం రాబోతున్నదనడానికి సంకేతం. దీనివల్ల రక్తనాళాలు సన్నబడతాయి.

ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చక్కెరలు నార్మల్‌గా ఉండి తిన్న తరువాత 200 కన్నా ఎక్కువ ఉంటే గ్లూకోజ్ ఇన్‌టాలన్స్ లేదా ఇంపెయిర్డ్ గ్లూకోజ్ టాలన్స్ (ఐజిటి) అంటారు. తినకముందు గ్లూకోజ్ విలువ 110 నుంచి 126 ఉండి తిన్న తరువాత నార్మల్ అంటే 200 లోపే ఉంటే ఆ స్థితిని ఇంపెయిర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ (ఐఎఫ్‌జి) అంటారు. ఈ రెండు స్థితులూ మధుమేహ సంకేతాలే. ప్రీడయాబెటిక్ దశలో రక్తనాళాలు క్రమేణా మూసుకుపోవచ్చు. ఈ దశలోనే గుర్తించి జాగ్రత్తపడితే 50 శాతం మంది మధుమేహం రాకుండా తప్పించుకోవచ్చు.
ఇలా గుర్తించొచ్చు
- తేలిగ్గా అలసిపోతారు.
- అతిగా మూత్రవిసర్జన (పాలీయూరియా)
- దాహం ఎక్కువ కావడం
- ఆకలి ఎక్కువగా ఉండటం - ఇన్సులిన్ పనిచేయకపోవడం వల్ల గ్లూకోజ్ శక్తిగా మారదు. శరీరానికి శక్తి అందకపోవడం వల్ల నీరసంగా ఉంటుంది. మళ్లీ ఆకలి అవుతుంటుంది.

- తిన్నది ఒంటికి పట్టదు కాబట్టి బరువు తగ్గుతారు.
- గాయాలు త్వరగా మానవు.
ఈ పరీక్షలు తప్పనిసరి
- రక్తంలో గ్లూకోజ్ మోతాదు ఆధారంగా మధుమేహాన్ని నిర్ధారణ చేయవచ్చు. ఫాస్టింగ్‌లో 120, భోజనం తరువాత చేసే పరీక్షలో 200కు మించి గ్లూకోజ్ మోతాదు ఉంటే అది మధుమేహం అని నిర్ధారించవచ్చు.

- హెచ్‌బిఎ1సి పరీక్ష కూడా ఇందుకు సహాయపడుతుంది. దీని విలువ 5.5 ఉండాలి.
- రక్తంలో కొలెవూస్టాల్, ట్రైగ్లిజరైడ్స్ మోతాదు పెరిగినా మధుమేహ అవకాశాలుంటాయి.
- ఎల్‌డిఎల్ (చెడు కొలెవూస్టాల్) విలువ ఆరోగ్యవంతుల్లో 130 లోపు ఉండాలి. మధుమేహుల్లో అయితే 100 లోపే ఉండాలి. గుండెజబ్బులున్నవారిలో 80 కన్నా తక్కువ ఉండాలి.
- ఇసిజి, కిడ్నీ పనితీరు, కంటి పరీక్షలు, మూత్ర పరీక్షలు కూడా అవసరం.
- చక్కెర వ్యాధి వల్ల మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. కాబట్టి ఈ ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.

చక్కెర ముదిరితే...
మధుమేహం వల్ల పెద్ద పెద్ద రక్తనాళాలే (మాక్రో వాస్కులర్) కాకుండా అతి చిన్న రక్తనాళాలు (మైక్రో వాస్కులర్) కూడా ప్రభావితం అవుతాయి. కిడ్నీలు (నెవూఫోపతి), కళ్లు (టినోపతి), నాడుల (న్యూరోపతి)కు సంబంధించిన సమస్యలన్నీ మైక్రోవాస్కులర్ సమస్యలు. కరొనరీ వ్యాధులు, మెదడులో రక్తనాళాల సమస్యలు (సెరివూబల్ వాస్కులర్ డిసీజ్) లాంటివి పెద్ద రక్తనాళాలు ప్రభావితం కావడం వల్ల వస్తాయి.

నెఫ్రోపతి - మధుమేహం వల్ల మూత్రంలో ప్రొటీన్లు ఎక్కువగా వెళ్లిపోతాయి. దీన్నే మైక్రో అల్యూమిన్యూరియా అంటారు. మూత్రం ద్వారా 30 శాతం అల్బుమిన్ బయటకు వెళ్లిపోతుంది.
రెటినోపతి - చక్కెరలు పెరగడం వల్ల కంటిలోని రెటీనాలో సమస్యలు వస్తాయి. అనవసరమైన కొత్త రక్తనాళాలు, మలినపదార్థాలు ఏర్పడతాయి. దీనివల్ల కంటిచూపు దెబ్బతింటుంది. లేజర్ చికిత్స అవసరం అవుతుంది.

న్యూరోపతి - నాడీకణాలకు రక్తవూపసరణ తగ్గుతుంది. నాడుల్లో సమాచార ప్రసారంలో అంతరాయం కలుగుతుంది. కణాల్లో హానికర పదార్థాలు ఏర్పడతాయి. అందువల్ల నరాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే మధుమేహుల్లో లైంగిక సమస్యలు కూడా ఎక్కువ. వంధ్యత్వ లక్షణాలు కనిపిస్తాయి.

మందుల నుంచి ఇన్సులిన్ దాకా..
ప్రారంభంలో మెట్‌ఫార్మిన్ మందుతో ప్రారంభమైన మధుమేహ చికిత్స అవసరమైతే ఇన్సులిన్ రూపంలో కూడా అందివ్వాల్సి ఉంటుంది. మెట్‌ఫార్మిన్ అదనంగా ఉన్న గ్లూకోజ్ వినియోగం చెందేలా చేస్తుంది. సల్ఫొనైల్ మందులు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. బీటా కణాలను ఆరోగ్యంగా ఉంచే డిపిపి 4 ఇన్‌హిబిటర్లు, జిఎల్‌పి 1 అనలాగ్స్ లాంటి మందులు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. మధుమేహం వచ్చిన 10 నుంచి 13 ఏళ్ల లోపు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం 90 శాతం మందిలో ఉంటుంది.

జెస్టేషనల్ డయాబెటిస్ -
గర్భంతో ఉన్నప్పుడు చాలామందిలో మధుమేహం వచ్చే అవకాశాలుంటాయి. ఇలాంటప్పుడు గానీ, మధుమేహం ఉన్నవాళ్లు ప్రెగ్నెంట్ అయినప్పుడు గానీ మధుమేహానికి మందులు వాడకూడదు. ఇన్సులిన్ మాత్రమే ఇవ్వాలి. ఇలాంటప్పుడు తీసుకునే ఆహారం ప్రధాన పాత్ర వహిస్తుంది. మందులు ఇవ్వడం వల్ల బిడ్డపై దుష్ర్పభావాలు కలిగే అవకాశం ఉంటుంది.

మధుమేహం అంటే...?
మనం తీసుకున్న ఆహారం ఏదయినా చివరికి గ్లూకోజ్ అనే సరళమైన చక్కెరగా మారుతుంది. ఈ గ్లూకోజ్ నుంచి శక్తి ఉత్పత్తి కావడానికి సహాయం చేసేది క్లోమక్షిగంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ అనే హార్మోన్. మనం ఆహారం తీసుకోనప్పుడు సరిపడినంత గ్లూకోజ్ ఉండదు. ఇలాంటప్పుడు కాలేయంలో నిలవ ఉన్న గె్లైకోజన్‌ని గ్లూకోజ్‌గా మారుస్తుంది గ్లూకగాన్ అనే హార్మోన్. ఈ రెండు హార్మోన్లు కలిసి గ్లూకోజ్ మోతాదు ఎక్కువ తక్కువలు కాకుండా కంట్రోల్ చేస్తుంటాయి. మధుమేహం ఉన్నవాళ్లలో ఇన్సులిన్ హార్మోన్ సక్రమంగా పనిచేయదు. తద్వారా గ్లూకోజ్ వినియోగింపబడక శక్తి ఉత్పన్నం కాదు. అలా గ్లూకోజ్ అంతా పేరుకుపోతుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తి ఏమీ తినక ముందు రక్తంలో చక్కెరల మోతాదు 80 నుంచి 120, తిన్న రెండు గంటల తరువాత 140 నుంచి 160 ఉంటుంది. ఈ పరిధి దాటితే అది మధుమేహం అవుతుంది. రక్తంలో గె్లైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్ మూడు నెలల సగటు 5.5 నుంచి 6 ఉండాలి. (హెచ్‌బిఎ1సి టెస్ట్) ఇంతకన్నా ఎక్కువ ఉంటే మధుమేహం ఉన్నట్టే.

వీరికి రిస్కు ఎక్కువ
తల్లిదంవూడులు, తోబుట్టువుల్లో ఎవరికైనా మధుమేహం ఉంటే రిస్కు ఎక్కువ. తల్లిదంవూడులిద్దరూ షుగర్ పేషెంట్లే అయితే వంద శాతం అవకాశం ఉంటుంది. స్థూలకాయులు, శారీరక శ్రమ లేనివాళ్లు, అధిక ఒత్తిడిలో పనిచేసేవాళ్లు, స్వీట్లు ఎక్కువగా తినేవాళ్లలో మధుమేహ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇదీ లైఫ్‌స్టయిల్

మధుమేహానికి మందుల కన్నా జీవనవిధానంలో మార్పులు చేసుకోవడమే ప్రధాన చికిత్స. శారీరక వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం ప్రధాన పాత్ర వహిస్తాయి. మధుమేహం ఉన్నవాళ్లు

- సరళ మైన చక్కెర పదార్థాలుండే స్వీట్లు, జామ్‌లు, ఐస్‌క్షికీమ్‌లు, మిల్క్‌షేక్స్, చాక్లెట్లు, బిస్కట్లు, బేకరీ ఫుడ్స్ జోలికి వెళ్లవద్దు.

- మామిడి, ఖర్జూరాలు, సీతాఫలాలు, అరటిపండ్లు తప్ప ఏ పండ్లయినా తినవచ్చు. పండ్ల రసాల కన్నా పండ్లు తినడమే మేలు.

- తేనె తీసుకోవద్దు.

- అన్నం, ఆలుగడ్డలు, కందగడ్డల్లో కార్బోహైవూడేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తినకపోవడం మంచిది.
- కొలెవూస్టాల్‌ని పెంచే కొవ్వు పదార్థాలను తినకూడదు.

- క్యారెట్, బీట్‌రూట్, క్యాబేజీ, కీరాకాయల్లాంటి వాటితో తయారుచేసిన సలాడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. కూరగాయల్ని ఎక్కువగా తినాలి.
- వారంలో రెండు సార్లు చేపలు, అప్పుడప్పుడు చికెన్ తినవచ్చు. కోడిగుడ్డులో తెల్లసొన మాత్రమే తినాలి.

- రోజూ 40 నిమిషాలు వాకింగ్ తప్పనిసరి. జాగింగ్, ఈత కూడా మేలు చేస్తాయి. నడిచేటప్పుడు ముందు వార్మప్‌గా నెమ్మదిగా ప్రారంభించి తరువాత వేగం పెంచాలి. నడక ముగించే ముందు కూడా వేగం తగ్గించాలి.

- బరువు తగ్గే ప్రయత్నం చేయాలి.
- పొగతాగడం, ఆల్కహాల్ లాంటి అలవాట్లు మానేయాలి.
- ఏటా రక్తపరీక్షలు చేయించుకోవాలి.


--Dr.N.paparao-(consultent physician Yasoda hospital Hyderabad)_for telangana News & talangana patrika .
 • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

పాపాయిల చర్మానికి రాషెస్‌ ఎందుకు వస్తాయి?,Causes for skinrash in babiesఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పాపాయిల చర్మానికి రాషెస్‌(Skin Rashes)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

పాపాయిల చర్మానికి రాషెస్‌(Skin Rashes) ఎందుకు వస్తాయి?.................
పసిపిల్లల చర్మానికి రాషెస్‌(rashes) రావటా నికి అనేక కారణలున్నాయి. దద్దులు ఎర్రబడి ,దురదగా ఉండడం వల్న పాపాయికి చిరాకు పుట్టి ఏడుస్తూ ఉంటుంది .
 • పాపాయి లకు ఉపయోగించే డైపర్స్‌ వల్ల రాషెస్‌ ఏర్పిడతాయి.
 • పాపాయి తడిపిన డ్రాయిర్లను, పొత్తి గుడ్డలను వెంటనే మార్చకపోతే చర్మానికి రాష్‌ ఏర్పడు తుంది.
 • పాపాయి తడిపిన బట్టలను ఉతకకుండా ఆరేసి వాడటం వల్ల, ఆ అపరిశుభ్రత వల్ల రాషెస్‌ ఏర్పడు తాయి.
 • పిల్లల చర్మానికి గాలి బాగ తగలక పోవడం స్వేదాన్ని పీల్చుకునే దుస్తులు కాకుండా, ప్లాస్టిక్‌ డైపర్స్‌ వాడటం, పాలియస్టర్‌ లాంటి డ్రాయర్లను, దుస్తులను వాడటం కూడా రాషెస్‌కు కారణమవుతుంది. పోతపాలు పట్టే పిల్లలకి పాలు పడక ఎలర్జి కలిగి రాషెస్‌ వస్తాయి.
 • చికెన్‌ ప్యాక్స్‌, మీజిల్‌ లాంటి వ్యాధులకు పాపాయి గురయినప్పుడు ఆ అనారోగ్య కారణంగా రాషెస్‌ వస్తాయి.
 • ఇన్‌డోర్‌ మొక్కలను పెంచేటప్పుడు, ఆ క్రోటన్స్‌ మొక్కల వల్ల కూడా పాపాయి లకు రాషెస్‌ కలుగుతాయి.
 • ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు పాపాయికి రాషెస్‌ వస్తాయి.

తీసుకోవలసిన జాగ్రత్తలు :
రాషెస్‌ ఏర్పడిన పాపాయి అసౌకర్యానికి గురయి ఏడుస్తుండటం, రాషెస్‌ ఏర్పరచే మంట, దురదలాంటి కారణాల వల్ల నిద్రపోకుండా ఏడవడం, నిద్రపోయినా మాటిమాటికీ లేస్తూండటం లాంటివి జరుగుతాయి. అందువల్ల పాపాయి లేత చర్మాన్ని బాధించే రాషెస్‌ ఏర్పడకుండా తగిన శ్రద్ధ తీసుకోవాలి. పాపాయికి ఉపయోగించే పక్క బట్టలు, పొత్తిగుడ్డలు, ధరింపచేసే దుస్తుల విషయంలో పరిశుభ్రతను పాటించాలి. పాపాయి బట్టలు తడిపినప్పుడు వెంటనే వాటిని తీసేసి పాపాయి చర్మానికి తడిలేకుండా తుడిచి, బేబీ పొడరును అద్ది, ఆ తర్వాత మరో డ్రాయిర్‌ను తొడగాలి. రాత్రి సమయంలో పాపాయికి డైపర్స్‌ వాడకపోవడమే మంచిది. పాపాయి చర్మానికి గాలి ప్రసరించే కాటన్‌ దుస్తులను మాత్రమే వాడాలి. రాషెస్‌ను మృదువయిన బేబీ సోప్‌తో రుద్ది, పరిశుభ్రమయిన నీటితో కడగాలి. పాపాయి చర్మానికి బేబీ పౌడరును, మెత్తటి మృదువయిన టవల్‌ను మాత్రమే వాడాలి. వాతావరణం వేడిగా ఉండి, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పాపాయిని వాతావరణంలోని వేడి బాధించకుండా, పాపాయి ఉండే గది చల్లగా ఉండేలా చూడాలి. పాపాయి గోళ్ళు పొడుగు పెరగకుండా స్నానం చేయించిన వెంటనే వాటిని జాగ్రత్తగా తీసెయ్యాలి.

పాపాయికి రాషెస్‌ ఏర్పడి, నివారణ చర్యలు చేపట్టినప్పటికీ, 3,4 రోజుల వరకూ తగ్గకుండా చర్మం ఎర్రబడి పాపాయికి బాధకలుగుతుంటే డాక్టరును సంప్రదిం చాలి. రాషెస్‌ బాధవల్ల పాపాయి హాయిగా నిద్రపోలేక చిరాకుగా ఉన్నా పాపాయి నలతగా ఉండి ఏడుస్తున్నా, జ్వరం వచ్చినా వెంటనే డాక్టరుకు చూపించి తగిన సలహాలు పొందాలి. పాపాయి లేత చర్మానికి బాధ లేకుండా సంరక్షించాలి.
చికిత్స :
రాషెస్‌ ఏర్పడినప్పుడు వైద్య సలహాతో కాలమిన్‌ లోషన్‌ను పాపాయి చర్మానికి రాయాలి.
సిట్రజైన్‌ సిరప్ 2.5 మి.లీ. రోజుకు 2-3 సార్లు వాడాలి .
మరీ తీవ్రతమైన రాషెస్ కు డాక్టర్ సలహా పై ... ప్రెడ్నిషలోన్‌(kidpred) లేదా బీటామెథజోన్‌(బెట్నిసాల్) ఓరల్ డ్రాప్స్ వాడాలి .
నిద్ర పోవకపోతే .. క్లోర్ ఫినెరమైన్‌ మాలియేట్ (Avil syrup) సిరప్ వాడవచ్చును .


 • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, August 28, 2011

డెమన్షియా , Dementia,మతిమరుపుఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -డెమన్షియా , Dementia- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


డెమన్షియా అంటే ఒక రోగం కాదు, అనేక రోగాల సముదాయం. మనిషి మెదడు లోపల కొన్ని కణాలు దెబ్బతినడంవల్ల మనిషిలో అనేక నైపుణ్యాలు కనుమరుగైపోతాయి. ముఖ్యంగా తెలివితేటలు, నేర్చుకునే సమర్థత, సమస్యా పరిష్కారశక్తి వంటివి బాగా తగ్గిపోతాయి. ఎంత పాండిత్యంగల వారైనా దీని బారిన పడ్డారంటే భాష మీద ఆధిపత్యం, ఏకాగ్రత, భాషాచాతుర్యం, పరిశీలనాశక్తి వంటివి దారుణంగా దెబ్బతింటాయి. దీనికితోడు మనిషి ప్రవర్తనలో ఎన్నెన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. డెమన్షియావల్ల జ్ఞాపకశక్తిలో లోపం ఏర్పడి ఆ మనిషికి మరుపు మొదలవుతుంది. ఏ వస్తువు ఎక్కడ పెట్టారో గుర్తుఉండదు. కొత్త సంగతులు విన్నా వాటిని గుర్తులో ఉంచుకోలేరు. క్రమక్రమంగా ఈ సమస్య పెరుగుతూ ఉంటే ఏడాదిలోపులో జరిగిన ముఖ్య సంఘటనలను కూడా మరచిపోతారు.
బాగా ముదిరితే ... ఇంట్లో మనుషుల్ని క్రమంగా గుర్తుపట్టలేకపోవడం ప్రారంభమవుతుంది. తిండి తిన్న పది నిముషాలకే దాని మాట మరచి తనకు ఎప్పుడు తిండి పెట్టారు అని అడుగుతారు ఈ డెమన్షియా బాధితులు. ఒకొక్కప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడే మూత్ర విసర్జన కూడా చేసేస్తూ ఉంటారు.

మనిషిలో వచ్చే మార్పులు
ఈ డెమన్షియా ముదురుతుంటే భార్యని అమ్మా అని లేదా పిన్నీ అని పిలుస్తూ ఉంటారు. కొన్ని వస్తువుల పేర్లు గుర్తుకురాక అది..ఇది అని మాట్లాడుతారు. ఎవరికి కనిపించనిది, వినిపించనిది తనకు కన్పిస్తున్నట్లు, విన్పిస్తున్నట్లు భ్రమకు లోనవుతూ ఉంటారు.ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. మగతగా, అయోమయంగా తయారవుతారు .

ఈ డెమన్షియాలో ఎన్నెన్నో రకాలు వున్నాయి. ఒకొక్కదానికి ఒకొక్క రకం లక్షణాలు.

ఆల్‌జైమర్ డెమన్షియా : .
డెమన్షియా వచ్చిన వారిలో సగం మందికి పైగా ఈ ఆల్‌జైమర్ డెమన్షియా వస్తుంది. ఇది ఎందుకు వస్తుందో పూర్తిగా ఇంకా తెలియరాలేదు. కాకపోతే కొంతమంది దీనిని వారసత్వపు సమస్యగాను, మరికొందరు ఆడవారికి ఎక్కువగా వస్తుందని అంటారు.

ప్రీ సెనైల్ డెమన్షియా : ఈ డెమన్షియా మనిషికి 40 ఏళ్ల వయసులోనే వచ్చిందంటే దానిని ప్రీ సెనైల్ డెమన్షియా అంటారు. .

సెనైల్ డెమన్షియా : ఈ డెమన్షియా మనిషికి 60 ఏళ్ల వయసులో వస్తే సెనైల్ డెమన్షియా అంటారు.

క్రాజోఫెల్ట్ జాకబ్ డిసీజ్ డెమన్షియా : క్రాజోఫెల్ట్ జాకబ్ డిసీజ్ గురించి చెప్పుకోవాలి. ఇది మెదడు క్రమంగా క్షీణిస్తూ ఎదురయ్యే ఒక విధమైన డెమన్షియా. ఇది రావడానికి ఒక కారణం మేడ్ కౌ డిసీజ్ వున్న ఆవు మాంసం తినడం అని వైద్యపరిశోధకుల అభిప్రాయం.

కారణాలు :
 • శరీరంలోకి అల్యూమినియం చేరి దాని విషప్రభావం వల్ల మెదడు దెబ్బతిని ఈ డెమన్షియాకు కారణం అవుతోందని కొంతమంది వాదన.
 • మెదడులో కంతులు,
 • తలకు గాయాలు,
 • ఎయిడ్స్,
 • పార్కిన్‌సన్ వ్యాధి
 • మెటబాలిజం సమస్యలు,
 • ఆహార లోపాలు-విటమిన్‌ బి 12 లోపము ,
 • కొన్ని మందులు వాడకము వల్ల -- cimetidine , some cholesterol lowering medicines .
 • నిరంతర మద్యపానము నకు బానిస ,
వంటివి వచ్చినప్పుడు కూడా వారికి డెమన్షియా వచ్చే అవకాశం ఉంటుంది.ఇతర ఇన్‌ఫెక్షన్సువల్ల కూడా కొంతమందికి ఈ డెమన్షియా సమస్య వస్తుంది.

చికిత్స
మెదడును మరమ్మత్తుచేయడానికి మందులు వున్నాయి. అయితే అవి వ్యాధిగ్రస్థునికి ఏమేర పనిచేస్తాయన్నది అనుమానమే. పిరాసిటామ్, వైరిటినాల్, హైడర్జిన్ లాంటి మందులు కొంత మేలుచేస్తున్నట్లు రికార్డులవల్ల తెలుస్తోంది.
వైద్యుని పర్యవేక్షణలో చికిత్స ఎంతో అవసరం. దీనికితోడుగా ఆహారం, వ్యాయామం, ఆటవిడుపు కార్యక్రమాలు కూడా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. వీరికి ప్రధానంగా సపోర్టివ్ సైకోథెరపీ మంచిది.

ముందు జాగ్రత్తలు(prevention) :
 • ధూమపానము మానివేయాలి. ,
 • మద్యపానము మానివేయాలి ,
 • బి.పి . ఉంటే అదుపులో ఉంచుకోవాలి ,
 • మధుమేహము ఉంటే .. అదుపులో ఉంచుకోవాలి ,
 • కొవ్వు పదార్ధాలు తక్కువగా తినాలి ,
 • వ్యాయామము క్రమము తప్పకుండా(regular) చేయాలి .
updates: 

 • వృద్ధాప్యంలో మతిమరుపు సహజమే. కానీ 30ల్లో ఉన్నవారూ దీని బారినపడుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది.

* 6% మందిలో ముప్పైల్లోనే మతిమరుపు ప్రారంభమవుతోంది.
* 10% మందిలో నలబైల్లోనే జ్ఞాపకశక్తి తగ్గటం మొదలవుతోంది.
* 40% మంది తమకు చాలాకాలంగా తెలిసిన వ్యక్తుల పేర్లను తరచుగా మరచిపోతున్నారు.
* 20% మంది తాళంచెవులను, కళ్లద్దాలను ఎక్కడ పెట్టామో గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నారు.
* 10% మంది ఏటీఎంలలో తమ రహస్యసంఖ్య(పిన్‌) గుర్తుకురాక ఇబ్బంది పడుతున్నారు.

నిజానికి చిన్నవయసులో ఇలాంటి మతిమరుపు పెద్దగా హాని కలిగించేదేమీ కాదు. కానీ కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలతో జ్ఞాపకశక్తి తగ్గిపోకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పుస్తకాలను చదవటం.. చిక్కు సమస్యలను, పదకేళీలను పూరించటం.. హోంవర్కు చేయటంలో పిల్లలకు సాయపడటం.. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటం.. వంటి పనులు మతిమరుపు బారినపడకుండా దోహదపడతాయని సూచిస్తున్నారు.

వేళకు తింటే మతిమరుపు దూరము : 
వృద్ధాప్యంలో తీవ్ర మతిమరుపు (డిమెన్షియా)తో బాధపడేవారు వేళకు తినాలనే సంగతినీ మరచిపోతుంటారు. కొన్నిసార్లు తిన్నారో లేదో కూడా చెప్పలేని అయోమయంలో ఉంటారు. దీంతో సరైన పోషకాలు అందక ఇతరత్రా సమస్యలూ ముంచుకొచ్చే అవకాశముంది. ఇలాంటి వారికి సమయానికి ఆహారం తీసుకునే విషయాన్ని గుర్తుంచుకునేలా శిక్షణ ఇస్తే మంచి ఫలితం కనబడుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. దీంతో శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు కుంగుబాటు లక్షణాలూ తగ్గుముఖం పడుతున్నట్టు తైవాన్‌ పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో భాగంగా కొందరికి మామూలు చికిత్స, మరికొందరికి చికిత్సతో పాటు ఆహార అలవాట్లను గుర్తుంచుకునేలానూ శిక్షణ ఇచ్చారు. ఇలా జ్ఞాపకశక్తి శిక్షణ తీసుకున్న వారిలో పోషకాల మోతాదులతో పాటు శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) కూడా మెరుగుపడినట్టు తేలింది. అలాగే వీరిలో కుంగుబాటు లక్షణాలూ తగ్గుముఖం పట్టటం విశేషం. అందువల్ల డిమెన్షియా బారినపడ్డ వారిలో బలహీనత, పోషకాలు తగ్గిపోవటం, కుంగుబాటు లక్షణాల వంటివి కనబడితే ఇలాంటి జ్ఞాపకశక్తి సంబంధ శిక్షణ ఇచ్చే పద్ధతి పాటించటం మేలన్నది పరిశోధకుల సూచన.


Brain exercises in dementiaమతిమరుపునకు మెదడు వ్యాయామాలు

ఖాళీగా ఉండే మెదడు దయ్యాల ఇల్లు అనే సామెత ఉంది. ఇది సామెతే కాదు అక్షరాలా వాస్తవం కూడా. మన శరీరంలో ఏ భాగమైనా సరే వాడ కుండా లేదా ఉపయోగించకుండా ఉంటే అది మొండిగా తయారవుతోంది. పదును తగ్గుతుంది. అదేవిధంగా మన మెదడు కూడాను. చేయటానికి మెదడుకు పని ఏముంటుంద నుకుంటారు? కానీ మీరు మీ చేతులు, కాళ్ళు ఏవి కదపాల న్నా అవి మీకు తెలియకుండానే జరుగుతుంటాయి. కానీ కొన్ని విషయాలలో విచక్షణతో మీరు జాగ్రత్తగా వ్యవహరించ వలసిన అవసరం వస్తుంది. అప్పుడే మీరు మీ మెదడుకు పని కల్పించుతున్నట్లు తెలుసుకుంటారు. ఇంత ప్రధానమైన ఈ శరీర భాగానికి మనం పదును పెట్టాలి. అందుకుగాను మీ మెదడుకు కొన్ని వ్యాయామాలు కావాలి. వయస్సు పైబడు తోందంటే మనమందరం మెదడుకు గల పదును కోల్పోతూ ఉంటాం. కానీ మెదడుకు రెగ్యులర్‌గా పని కల్పిస్తుంటే, మీ తెలివితేటలు మరింత వికసిస్తాయి. జ్ఞాపకశక్తి నశించకుండా ఉంటుంది. వయసు పైబడుతున్నపటికీ మీలో మతిమరపు వ్యాధి రాకుండా ఉంటుంది.

మీ మెదడుకు ఐదు ప్రధాన వ్యాయామాలు
మెమొరీ గేమ్‌ చాలామంది వ్యక్తులు పెద్ద వయస్సు వచ్చిందంటే అల్జీమర్స్‌ అంటే మతిమరపు వ్యాధితో బాధపడుతుంటారు. వయసుతోపాటు మోమొరీ తగ్గటం సహజంగా వచ్చేస్తుంది. కనుక ప్రధానంగా మీ మెదడుకు పని కల్పిస్తుండాలి. మీ స్కూలు తోటి విద్యార్థుల పేర్లను మరోమారు జ్ఞాపకం చేసుకోండి. ఈ వ్యాయామం మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా కాఫీ బ్రేక్‌లో చేయవచ్చు. విచక్షణ మనం విచక్షణగా వ్యవహరించి బ్రెయిన్‌కు వ్యాయామం కల్పించాలి. చాలాసార్లు మనం మనకు తెలియ కుండానే విచక్షణ చూపుతాం. కనుక ప్రతి పని మీరు కొంత లాజిక్‌తో చేయాలి. అందుకుగాను, కొంత రాజకీయాల వంటివి పట్టించుకోవాలి. వాటిపై చర్చలు చేయాలి. నిర్ణయాలకు రావాలి. ఇప్పుడు మీ మెదడు పదును ఎక్కినట్లే.
శ్రద్ధ పెట్టటం గతంలో మీరు మీ స్కూల్‌ టీచర్‌కు తరగతి గదిలో చూపిన శ్రద్ధ నేడు ఆఫీసులో చూపుతున్నారా? చూపలేరు. వయసుతో పాటు మీకు శ్రద్ధ కూడా తగ్గుతుంది. ఆందోళనగా ఉంటారు. మీ శ్రద్ధను మెరుగుపరచటానికి గాను కొంచెంద బాధాకర వ్యాయామం చేయాలి. ఆఫీస్‌లో బాగా మాట్లాడే కొలీగ్‌ను ఎంచుకోండి. అతను ఏ చెత్త విషయాలు మాట్లాడినా శ్రద్ధగా వినండి. అది మీలోని శ్రద్ధను మెరుగుప రుస్తుంది.

పజిల్స్‌ చేయటం ఈ పని పిల్లలదనుకుంటాం. కానీ పిక్చర్‌ పజిల్స్‌, సుడోకు వంటివి మెదడుకు మంచి వ్యాయామం. లేదంటే, బజారులో తిరిగేటప్పుడు దుకాణాల బోర్డులు చదవండి. వాటిని మరల అదే వరసలో గుర్తు చేసుకోండి. భాషాపర వైపుణ్యం మెదడు వ్యాయామాలలో బ్రెయిన్‌కి కొత్త భాషను నేర్పించటం మంచి వ్యాయామం. కనుక ఇప్పటి వరకూ మీకు తెలియని భాష ఒకటి సాధన చేయండి. మార్గ దర్శకంగా అది బాగా వచ్చినవారిని ఒకరిని ఎంచుకోండి. వారితో మాట్లాడటం సాధన చేస్తే మీ మెమొరీ మెరుగువుతుంది. బ్రెయిన్‌కు మంచి వ్యాయామంగా ఉంటుంది. ఈ మెదడు వ్యాయామలు మిమ్మల్ని రోజువారీ జీవితంలో ఎంతో చురుకుగా ఉండేలా చేస్తాయి. కనుక నేటి నుండే మీ మెదడుకు పని కల్పించండి. తెలివైన వారుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోండి.

 • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

కిడ్నీలో రాళ్ళను శస్త్రచికిత్స లేకుండా తొలగించడమెలా? ,Kidney stones Removal without surgery
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు ---------- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

కిడ్నీలో రాళ్ళను శస్త్రచికిత్స లేకుండా తొలగించడమెలా?
 • ఇఎస్‌డబ్ల్యుఎల్‌ : ఇది జర్మనీ రూపొందించిన యంత్రం. దీని ద్వారా రోగిని ఒక నీటితొట్టిలో పడుకోబెడ్తారు. మూత్రపిండంలోని రాళ్ల వద్దకు తరంగ ఘాతములును పంపడం ద్వారా బాగా చిన్న చిన్న రాళ్లుగా మార్చవచ్చును. మూత్రం ఎక్కువగా వచ్చే మందులు వాడినవాటిని మూత్రము ద్వారా బయటకు పంపవచ్చు. దీనికి మూడు రోజులు పడుతుంది. ఇలా కత్తితో పనిలేకుండా మూత్రపిండంలోని రాళ్లను తొలగించుకోవచ్చు.

మూత్రపిండంలో చేరిన రాళ్ళలో ఏ ఒకటికో చికిత్స అవసరమొస్తుంది. మిగతావి కరిగిపోవడమో, మూత్రం ద్వారా బయటకు రావటమో జరుగుతుంది. ఇవి రీనెల్‌ మార్గంలో పెద్దవిగా లేదా వికృతంగా ఏర్పడ్డ రాళ్ళ వల్లనే ప్రమాదానికి లోనవడం జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో కలిగే నొప్పిని సర్జికల్‌ పుస్తకాల్లో లోయిన్‌- టు- గ్రోయిన్‌ అని పేర్కొన్నారు. కొంతమంది యూరాలజిస్టులు కిడ్నీలో ఏర్పడ్డ రాళ్ళను విద్యుదయస్కాంత తరంగాలను ప్రయోగించి రాళ్ళను ఇసుకంత పరిమాణం ఉన్న చిన్న కణాలుగా చేస్తుంటారు. దీనిని ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ షాక్‌వేవ్‌ లిథోట్రిప్సీ అని అంటారు. కేవలం 3 రోజుల్లో ఈ పద్ధతి ద్వారా కిడ్నీలోని రాళ్ళను తొలగిం చుకోవడం జరుగుతుంది. డయాబెటిస్‌, బి.పి., గుండెజబ్బులున్న ఎవరైనా ఈ పద్ధతి ద్వారా సులువుగా కిడ్నీలోని రాళ్ళను తొలగించుకోవచ్చు.

 • కిడ్నీలో ఏర్పడ్డ రాళ్ళను పగలగొట్టేందుకు మరోపద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రత్యేకంగా రూపొందించిన ఒక ట్యూబును కిడ్నీలోనికి లోతుగా పంపి దాని మొనభాగాన్ని అతి వేగంగా త్రిప్పుతారు. దాని నుండి అతి ధ్వని ప్రకంపనాలు వెలువడతాయి. దీనివల్ల రాళ్ళు చిన్నముక్కలుగా పగిలిపోతాయి. వాటిని ఆపరేషన్‌ ద్వారా తీస్తారు. దీనినే 'పర్క్యుటేనియస్‌ సెప్రోలిథోటోనమి' అని అంటారు. ఈ చికిత్సలో రోగి శరీరానికి గాటుపెట్టడం జరుగుతుంది. అప్పుడు కలిగే నొప్పి వర్ణనాతీతం. ఈ చికిత్స చేయించుకుంటున్న రోగిని పట్టుకునేందుకు కనీసం ఇద్దరు వ్యక్తులకైనా అవసరమొస్తుంది. ఈ కష్టమైన చికిత్స చేయాలంటే రోగికి మత్తు కలిగించే మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కంప్యూటర్‌ద్వారా చేస్తూ విద్యుదయస్కాంత తరంగా లను కావలసిన చోటికి పంపుతారు. టాన్యుడ్యూజర్‌ ద్వారా సుమారు నూరు స్పందనాలను ఒక్కసారిగా రోగిలోనికి పంప బడతాయి. తరంగాలు ఒకదాని వెనుక ఒకటి శీఘ్రంగా పంపితే దానివల్ల సుమారు 100 పీడనాల వత్తిడి కిడ్నీలో రాళ్ళున్న ప్రాంతంపై కలుగుతుంది. దానివల్ల కిడ్నీల్లో ఏర్పడ్డ రాళ్ళుబ్రద్ధలై చిన్నముక్కలవుతాయి. కొన్ని లక్షలకు పైగా రోగులు ఈ ఎక్స్‌ట్రాకార్పొరియల్‌ షాక్‌వేవ్‌ లిథోట్రిప్‌టర్‌ పద్ధతి వల్ల ప్రయో జనం పొందారని శాస్త్రవేత్తలు అంటున్నారు.

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఎక్కువ నీరు త్రాగడం మంచిది. మనం ఎక్కువ నీరు త్రాగడం వల్ల మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడవు.


 • ===========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

పేనుకొరుకుడు ,Alopecia areata.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పేనుకొరుకుడు ,Alopecia areata- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...పేనుకొరుకుడు అంటే, తలమీద వున్నట్టుండి వెంట్రుకలు కొద్దిపాటి ప్రాంతంలో పూర్తిగా రాలిపోయి చర్మం కనిపిస్తూవుంటుంది. ఇది అలర్జీ కారణంగా జరుగుతుందని వైద్యులు తెలిపారు.అలర్జీ తగ్గగానే తిరిగి వెంట్రుకలు మళ్ళీ వస్తాయి. బట్టతలమాదిరిగా అవుతుందేమోనని అపోహ పడవలసిన అవసరంలేదు . దీనినే పేనుకొరుకుడు అంటారు.

తక్షణ జాగ్రత్తలు తీసుకుంటే పేనుకొరుకుడు నయమౌతుంది!

గుండ్రని నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నగా ఉండటాన్ని 'పేనుకొరుకుట' అని పిలుస్తారు. నిజానికి ఇది పేను వచ్చి కొరకడం వలనరాదు. అలా 'నానుడి'గా సాధారణజనానికి అర్ధమయ్యే పరిభాషలో అంటారు. దీన్ని వైద్యశాస్త్రంలో 'అలోపీ షియా ఏరియేటా(Alopecia areata)' అని అంటారు. దీన్ని సుమారు 2000 సంవత్స రాల క్రిందటే గుర్తించారు. చర్మవ్యాధుల ఆసుపత్రులకు హాజరయ్యే రోగులలో ఇది 2శాతం మందికి ఉంటుంది.

కారణం : ఇది ఒక 'ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌'. అనగా వెంట్రుకలకు వ్యతిరేకంగా తనలోనే ' ఆంటీబాడీలు' తయారై వెంట్రుకలను అలా అక్కడక్కడా లేకుండా చేస్తుంది. మానసిక ఆందోళన, థైరాయిడ్‌, డయాబెటిస్‌, బి.పి. మొదలగు సమస్యలున్న వాళ్ళలో అధికంగా కన్పిస్తుంది. ఈ జబ్బు ఉన్న వాళ్ళకు 20శాతం మందికి గోళ్ళ మీద గీతలు, గుంటలు కలిగి వుండటం గమనార్హం.

ఎక్కడెక్కడ వస్తుంది : వెంట్రుకలు మొలచు ఏ భాగంలోనైనా ఇది రావచ్చు. తలలో ఎక్కువగా కన్పిస్తుంది. గడ్డంమీద, మీసాల దగ్గర వస్తుంది. కనుబొమ్మల మీద కూడా రావచ్చు. కాళ్ళు, చేతులు, ఛాతీమీద కూడా వెంట్రుకలు లేని గుండ్రని ప్రదేశాలు కన్పిస్తాయి. కానీ, ముఖ్యంగా - తలమీద, గడ్డం, మీసాలు, కనుబొమ్మలు- మీద వస్తే చాలా ఆందోళనకు గురై - వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తారు. ఇది సౌందర్యలోపానికి చిహ్నం కూడా. ఇది మరే ఇతర ఇబ్బంది కలిగించదు కూడా! కొందరిలో తలమీద ఒకచోట మొదలై - మొత్తం తలంతా కూడా వెంట్రుకలు రాలిపోతాయి. తల గుండు జేయించినట్లు ఉంటుంది. దీన్ని' అలోపీషియా' టోటాలిస్‌(Alopecia Totalis)' అని అంటారు. అలాగే, జబ్బు శరీరం అంతా ప్రాకి- తలమీద, కనుబొమ్మలు, గడ్డం, మీసాలు, చేతులు, కాళ్ళు, ఛాతి మీద- మరెక్కడా వెంట్రుకలు లేకుండా చేస్తుంది. దీన్ని ' అలోపీషియా యూనివర్శాలిస్‌(Alopecia Universalis)' అని అంటారు.

ఎవరిలో వస్తుంది : ఇది ఆడా,మగా తేడా లేకుండా ఎవరిలోనైనా వస్తుంది. పిల్లల్లో కూడా వస్తుంది. కానీ, 20-40 సంవత్సరాల మధ్య వయసు వారిలో ఎక్కువగా కన్పిస్తుంది. కుటుంబ సభ్యులలో ఒకరికి ఉంటే, మరొకరికి వచ్చే అవకాశం ఎక్కువ. కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వస్తుంది. కానీ, ఇది అంటువ్యాధి కాదు. 60 సం. దాటిన తర్వాత సాధారణంగా రాదు.

చికిత్స : దీనికి రకరకాలైన చికిత్సా విధానాలు కలవు.

 • 1. స్టిరాయిడ్‌ పూతమందులు.,
 • 2. అక్కడే కొంచెం మంట పుట్టించే పూతమందులు.,
 • 3. ఇమ్యునోమాడ్యులేటర్‌ పూతమందులు
 • 4. అక్కడే స్టిరాయిడ్‌ ఇంజక్షన్‌ ఇచ్చే విధానం.,
 • 5. లేజర్‌ చికిత్స.
 • 6. జబ్బు తీవ్రత ఎక్కువగా ఉండి వేరే చోట్లకు ప్రాకుతుంటే స్టిరాయిడ్‌ మందు బిళ్ళలు లేదా సైక్లోస్పోరిన్‌ మొదలగు ఇమ్యునోసప్రసివ్‌(Immuno suppresive) మందు బిళ్ళలు వాడుతారు.

ఏ చికిత్సా విధానమైనా - చాలా ఓర్పుతో దీర్ఘ కాలంగా వాడాలి. చికిత్స పూర్తికాలం డాక్టరు పర్యవేక్షణలో సాగాలి. తన ఇష్టానుసారం మందులువాడటంవల్ల జబ్బు తగ్గకపోగా సైడ్‌ఎఫెక్ట్స్‌కు గురౌతారు. మందులతో పూర్తి ఫలితం పొందకపోతే, కొన్ని కొన్ని చిన్న చిన్న నిర్ణీత ప్రదేశాలలో టాటూయింగ్‌ పద్ధతి ద్వారా లోపాన్ని కప్పివేయవచ్చు.

చికిత్స ఫలితాలు : ప్రతి డాక్టరు రోగికి పూర్తి న్యాయం చేయాలనే సంకల్పంతోనే మంచి ట్రీట్‌మెంట్‌ రోగిని అనుసరించి ప్రారంభిస్తారు. అయినప్పటికి అందరి రోగులకు ఫలితాలు ఒకేరకంగా ఉండవు. కొందరికేమో అతి కొద్దికాలంలోనే అనూహ్య మార్పు వచ్చి ఆనందాన్నిస్తుంది. మరికొందరికి దీర్ఘకాలం తర్వాత మార్పు వస్తుంది. మరికొద్దిశాతం మందిలో ఎన్నిరోజులు వాడినా ఫలితం కన్పించదు. వంశపారంపర్యంగా ఉన్నా....కనుబొమ్మలు, కనురెప్పలు, తల, గడ్డం, మీసాలు - అన్నిచోట్ల వెంట్రుకలు రాలిపోవడం, చిన్నరోగం మాదిరిగానే జబ్బు మొదలై ప్రాకుతుంటే -మొదలగు సందర్భాలలో ఆశించినంత ఫలితాలు అందవు. కానీ, ఏది ఏమైనా 'పాజిటివ్‌ మైండ్‌'తో ఉండి ఫలితాలు సాధించుకునేందుకు ప్రయత్నం చేయాలి!!

 • మూలము : విశాలాంధ్ర దినపత్రిక -డా|| మామిళ్ళ బాలనరసింహులు,--చర్మ, సుఖవ్యాధుల నిపుణులు

ఆయుర్వేద చికిత్స :
బెట్నిసాల్ వంటి స్టిరాయిడ్స్‌తో తయారయిన చుక్కల మందుని పేనుకొరుకుడు పైన రాయమని వైద్యులు సూచిస్తుంటారు. ఒక్కొక్కసారి వీటికి ఫలితం రాకపోతే గురివింద గింజని బాగా అరగదీసి గంధం తీసి పేనుకొరికిన చోట రాయండి. ఇలా నాలుగైదురోజులు రాస్తే వెంట్రుకలు మళ్ళీ తిరిగి వస్తాయి. మందారంపూలనుకూడా దీనినివారణకు మందుగా వాడుతారు, కాని గురివిందతోనే చాలా త్వరగా నయమౌతుందని వైద్యులు తెలిపారు.

ఎర్ర మందారం పూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది.

 • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, August 25, 2011

వర్షాకాలములో ఊపిరితిత్తుల్లో ఉక్కిరిబిక్కిరి,Breathlessness in Rainy seasonఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వర్షాకాలములో ఊపిరితిత్తుల్లో ఉక్కిరిబిక్కిరి- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...వర్షాకాలంలో దోమకాటు వల్ల మలేరియా, డెంగ్యు, చికున్‌ గున్యా జ్వరాలే కాక శ్వాసకోశ సంబంధ వ్యాధులు బాధిస్తాయి. వేధిస్తాయి. ఒకపట్టాన తగ్గవు. వస్తే వారం, పది రోజులుంటాయి. తమకు వచ్చింది జలుబు, ఆస్తమా, అలర్జీ, న్యుమోనియా అని గుర్తించడంలో రోగి విఫలమవుతాడు. మామూలు జలుబే కదా అని మందుల షాపువాడు ఇచ్చిన మందులతో సరిపెట్టుకుంటారు. కానీ ఈ సమయంలోనే వైద్యున్ని సంప్రదించాలి. దీని వల్ల వ్యాధి ఎక్కడా, ఏ దశలో ఉంది తెలుసుకుని కచ్చిమైతన చికిత్స అందేఅవకాశముంది.... ఆ వివరాలు

ముందు గొంతు నొప్పి మొదలై జలుబులాగా మారుతుంది. తర్వాత కొన్ని రోజుల దాకా పొడి దగ్గు, తెమడతో దగ్గు వస్తుంది. జ్వరంతోనూ, జ్వరం లేకుండా, గొంతులో ఇన్‌ఫెక్షన్‌, సైనస్‌ ఇన్‌ఫెక్షన్‌ రావొచ్చు. సాధారణంగా ఇవి వారం లేదా పదిరోజుల్లో తగ్గుతాయి. ఆస్తమా ఉన్నవారిలో ఇవి ఎక్కువ రోజులుంటాయి.

ఈ సీజన్‌లోనే ఎందుకు?


వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. గాలిలో తేమశాతం ఎక్కువే. సీజన్‌ మారుతుంది. తేమ వల్ల వైరస్‌లు వృద్ధి చెందుతాయి. సీజన్‌ వీటికి అనుకూలం. వేసవిలోని వేడివల్ల ఇవి నియంత్రణలో ఉంటాయి. అంతేకాక వర్షాకాలంలో సూర్యరశ్మి తగ్గుతుంది. ఫలితంగా వైరస్ వృద్ధిచెందుతాయి . దీని వల్ల ఎక్కువ మంది వీటిబారిన పడతారు. ఇక ఆస్తమా ఉన్నవారిలో జలుబు వర్షాకాలంలో కాలుష్యం ఎక్కువై వీరిలో సమస్యలు తీవ్రమవుతాయి.

గొంతునొప్పి : ఇది వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌తో మొదలైవుతుంది. మన శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌ను చంపడానికి రోగనిరోధక శక్తిపనిచేస్తుంది. అందుకే గొంతునొప్పి ఉన్నప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకోవాలి. మంచి నిద్ర అవసరం. చల్లటి పదార్థాలు తీసుకోకుండా వేడి పదార్థాలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మందులు లేకుండానే గొంతునొప్పి తగ్గుతుంది. కానీ మనం పని ఒత్తిడి వల్ల విశ్రాంతి తీసుకోలేం. దీంతో మన రోగనిరోధక శక్తి తగ్గి సెకండరి ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశముంది. ఫలితంగా దగ్గు, ఛాతిలో ఇన్‌ఫెక్షన్‌ వస్తాయి. గొంతు నొప్పికి కారణం 90 శాతం వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, 10 శాతం బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లే. మన పీల్చేగాలిలో ఈ వైరస్‌లు ఎక్కువుంటాయి. పీల్చేగాలిలో, తీసుకునే ఆహారం ద్వారా ఇవి లోపలికి వ వెళ్తాయి.

అలర్జీ : ఇది రకరకాలుగా ప్రభావితం చేస్తుంది. ముక్కు కారడం, పొద్దున్నే చల్లగాలి తగిలినా, దుమ్ము పీల్చినా తుమ్ములు వస్తాయి. ముక్కు బ్లాక్‌ అవుతుంది. తలనొప్పి ఉంటుంది. గొంతు గులగా ఉంటుంది. పొడి దగ్గు రాత్రిపూట ఎక్కువుంటుంది. ఇవీ అలర్జీకి చిహ్నాలు.

ఆస్తమా : వేసవి కాలంలో చాలా తక్కువ మందిలోనే ఆస్తమా ఇబ్బంది కలిగిస్తుంది. చాలా మందిలో వర్షాకాలంలోని చల్లటి వాతావరణం, కాలుష్యం వల్ల వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల ఆస్తమ ఉన్నవారిలో ఇబ్బంది క్రమంగా తీవ్రమవుతుంది. అయితే ఇది అందరిలో ఒకేలా ఉండదు. ఫీనోటైప్స్‌ ను బట్టి ఆస్తమా ఇబ్బంది రకరకాలుగా వ్యక్తమవుతుంది. కొంత మందిలో ఆస్తమా ఉన్న వారిలో ఆయాసం ఉండకపోవచ్చు. దగ్గు రూపంలో వస్తుంది. దీన్ని 'కాఫ్‌ వేరియంట్‌ ఆస్తమా' అంటారు. నాకు ఆయాసం లేదు, పిల్లికూతలు రావడం లేదు, ఆస్తమా కాదు దగ్గు ఉందని చాలా మంది అనుకుంటారు. అయితే దీన్ని ఆస్తమాగా పరిగణించాల్సి ఉంటుంది. కొంత మందిలో నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, మాట్లాడినప్పుడు ఆయాసం ఉంటుంది. సీజన్‌ మారగానే రాత్రిపూట ఛాతిపట్టేసినట్టు ఉంటుంది. ఎమర్జెన్సీ అటాక్స్‌ వస్తాయి. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల వచ్చే జలుబు వారం రోజులు పది రోజుల్లో తగ్గాలి. తగ్గకుంటే జలుబు కాదు ఎలర్జీ అనీ, ముక్కు కారుతుంది అని భావిస్తే ఆస్తమా ఉన్నట్లు భావించాలి. ఆస్తమా ఉన్నవారి ఊపిరితిత్తుల్లోని వాయునాళాలు సెన్సిటివ్‌గా ఉంటాయి. బయటి వాతావరణంలోని వైరస్‌లోపలికి ప్రవేశిస్తే వేగంగా ప్రతిస్పందిస్తాయి. కొంత మందికి రంగుల, సెంట్‌, పూల వాసన పడదు. దీన్ని పీలిస్తే వారికి ఆస్తమా తీవ్రమవుతుంది. ఎందుకంటే పిల్చినప్పుడు లోపలికి వెళ్లిన గ్యాస్‌ ఊపిరితిత్తుల్లోని గాలి గొట్టాలను మూసేస్తుంది. దీంతో గొట్టాలు ముడుచుకుని వెంటనే ఆస్తమా అటాక్‌ వస్తుంది. చల్లటి పదార్థాలు, పుల్లటి పదార్థాలు తీసుకునే వారిలో ఆస్తమా పెరిగే అవకాశముంది. ఘాటైన వాసన పడదు.

న్యుమోనియా : ఇది వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ తర్వాత మొదలవుతుంది. విశ్రాంతి, నిద్రలేకుండా ఒత్తిడికి గురైనప్పుడు, ఆహారం సరిగ్గా తీసుకోకుండా ఉంటే వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమవుతుంది. న్యుమోనియా అంటే ఊపిరితిత్తుల్లోని ఇన్‌ఫెక్షన్‌. చిన్న పిల్లలో, వృద్ధుల్లో ఇది సాధారణం. ఎందుకంటే వీరిలో రోగనిరోధక శక్తి తక్కువుంటుంది కాబట్టి. న్యుమోనియా ఉన్నవారిలో హైగ్రేడ్‌ ఉష్ణోగ్రత, చలి, దగ్గు, వణుకు, కొంత మందిలో తెమడ రావొచ్చు, ఇంకొంత మందిలో రాకపోవచ్చు. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలవుతాయి. జలుబు చేసిన తర్వాత 24 నుంచి 48 గంటల్లో జ్వరం తగ్గక, దగ్గు ఉంటే వైద్యున్ని సంప్రదించాలి. నిమోనియా లక్షణాలున్నాయో పరీక్షించుకోవాలి.

ఆస్తమా-న్యుమోనియా

ఆస్తమా అంటే ఊపిరితిత్తుల్లోని వాయు నాళాలపై ప్రభావం ఉంటుంది. గొట్టాలు ముడుచుకుపోవడం వల్ల గాలి పీల్చుకోవడం వదలడం ఇబ్బందిగా ఉంటుంది. న్యుమోనియ అంటే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌. దీని వల్ల ఊపిరితిత్తుల్లో చీము చేరుతుంది. దీంతో గాలి లోపలికి వెళ్లినా ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయవు. చీము రావడానికి వివిధ కారణాలుంటాయి. ఒక భాగంలో వచ్చింది వేరే భాగానికి సోకకుండా యాంటి బయాటిక్‌ చికిత్స చేయించుకోవాలి.

తేడా ఎలా గుర్తిస్తారు?

అలర్జీకి- జలుబుకు మధ్య ఉన్న తేడా చాలా మందికి అర్థం కాదు. నాకు జలుబు తగ్గదని ఫిక్స్‌ అవుతారు. జలుబు వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల వస్తుంది. ఇది మందులు వేసుకున్నా వేసుకోకపోయినా వారం పదిరోజుల్లో దానంతటదే తగ్గుతుంది. జలుబు తగ్గకుండా ముక్కు బిగపట్టడం, ముక్కు కారడం, తమ్ములు రావడం ఉంటే అలర్జీ ఉన్నట్లు. రాత్రిపూట పొడి దగ్గు ఎక్కువ ఉండి, తెమడ తెల్లగా ఉంటే ఇన్‌ఫెక్షన్‌ అయ్యే అవకాశం తక్కువ. తెమడ ఆకుపచ్చగా, పసుపు పచ్చగా, గోధుమ రంగులో ఉంటే ఇన్‌ఫెక్షన్‌గా భావించాలి. ఈ ఇన్‌ఫెక్షన్‌ ఊపిరితిత్తుల్లో ఉన్నవారందరికి న్యుమోనియా ఉండదు. బాగా ఎక్కువైనప్పుడు మాత్రమే న్యుమోనియా అంటారు. అలర్జీ దగ్గులాగా వచ్చి ఊపరితిత్తులు గొట్టాలు ముడుచుకుంటాయి. ఎందుకంటే లోపల వాపు అధికమై తెమడ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఈ తెమడ మన సహజ రోగనిరోధకశక్తిని తగ్గిస్తుంది. అప్పుడు పీల్చుకున్న బ్యాక్టీరియా, వైరస్‌లు ఇన్‌ఫెక్షన్‌గా మారే అవకాశముంది. జలుబుకు లోపల ఇబ్బందిలేకుండా ఉంటే అలర్జీకి పెద్దగా పరీక్షలు అవసరం లేదు. రోగి లక్షణాలను బట్టి మందులు ఇస్తారు. దగ్గు, ఆయాసం, తెమడ ఉంటే ఛాతి ఎక్స్‌రే పరీక్ష చేస్తారు. ఊపిరితిత్తుల సామర్థ్యం కనుక్కోవడానికి పిఎఫ్‌టి టెస్ట్‌ను చేస్తారు. న్యుమోనియా తీవ్రతను బట్టి ఆసుపత్రిలో చేరాలా, ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల అనేది వైద్యులు నిర్ణయిస్తారు. అందరికీ 25 సంవత్సరాల వరకు ఊపరితిత్తులు పెరుగుతాయి. ఆ తర్వాత సామర్థ్యం తగ్గుతుంది. మామూలు వాళ్లకంటే ధూమపానం చేసేవారిలో సామర్థ్యం ఇంకా తక్కువుంటుంది. సంవత్సరానికి ఐదురెట్లు ఎక్కువ తగ్గుతుంది. చలికాలం, వర్షాకాలంలో ఆస్తమా వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిందా అనేది తెలుసుకోవాలి. ప్రభావం తెలుసుకోవడానికి బ్రీతింగ్‌ టెస్ట్‌ చేస్తారు.

విశ్రాంతి తప్పనిసరి

జలుబు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, గొంతు నొప్పితో వస్తే రెండు, మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలి.గోరువెచ్చని పదార్థాలు ద్రవ పదార్థాలు తాగడం మంచిది. దీని వల్ల జబ్బునుంచి కోలుకోవచ్చు. విశ్రాంతి తీసుకోవడం అంటే ఇంట్లో కూర్చొని టీవి చూడడం, మిగిలిన పనులు చేసుకోవడం, షాపింగ్‌కు వెళ్లడం కాదు.బెడ్ పైన రెస్ట్ తీసుకోవాలి .

మందులు-ఇన్‌హేలర్‌తో చికిత్స

తలనొప్పి, జ్వరం, ఒళ్లునొప్పులకు మందులు వాడొచ్చు. మూడు రోజులు మించి ఇవి ఉంటే వైద్యున్ని సంప్రదించాలి. ముక్కు అలర్జీకి స్ప్రే, యాంటి హిస్టమిన్స్‌ తో చికిత్స చేస్తారు. సైనస్‌లో ఇన్‌ఫెక్షన్‌ ఉంటే యాంటి బయాటిక్‌, దగ్గు, ఆయాసం పిల్లికూతలు ఉంటే ఇన్‌హేలర్‌ వాడతారు. దీంతోపాటు టాబ్లెట్లు ఇస్తారు. న్యుమోనియా వ్యాధి లక్షణాలు ఉంటే మందులు, ఇంజక్షన్‌ ఇస్తారు. ఆయాసం ఎక్కువ ఉండే శరీరంలో ఆక్సీజన్‌ తగ్గినప్పుడు ఆక్సీజన్‌ ఇవ్వాల్సి రావొచ్చు. దగ్గు, తీవ్ర జ్వరం, నీరసం నిస్సత్తువ ఉన్నవారికి ఆసుపత్రిలో వైద్యం చేస్తారు. ముక్కులో స్ప్రే చేసినప్పుడు ఎలర్జీ వల్ల ఏర్పడిన మందమైన పొరను ఇది తగ్గిస్తుంది. ఉపశమనం కలుగుతుంది. ముక్కు బ్లాక్‌కాదు. స్ప్రేను అలర్జీ తగ్గేవరకు వాడాలి.

రోగనిరోధక శక్తి

ఇది అందరికీ ఉంటుంది. ఇది లేకపోతే రోజూ ఏం చేయలేం. మనం తినే పదార్థాల్లో, పీల్చేగాలిలో బ్యాక్టీరియా, వైరస్‌లు ఉంటాయి. ఇవి శరీరం లోపలికి ప్రవేశించిన తర్వాత వీటిపై మనలోని సహజ రోగనిరోధక శక్తిపోరాటం చేస్తుంది. మధుమేహం, దీర్ఘకాల గుండె, శ్వాసకోశ జబ్బులున్నవారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. వీరు వర్షంలో తడిస్తే జలుబు వల్ల రోగనిరోధక శక్తి తగ్గి ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశమెక్కువ. క్షయ, హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌, సిగరెట్‌, ఆల్కహాలు, గుట్కా తినేవారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. వయసును బట్టి, వ్యాధిని బట్టి కొన్ని మందులు వాడేవారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. రోగనిరోధక శక్తిపెరగాంటే వ్యాయామం చేయాలి. ఉదయం లేదా సాయంత్రం అరగంట సూర్యరశ్మి మనపై ప్రసరించాలి. దీని వల్ల సహజ రోగనిరోధక శక్తిపెరుగుతంది. సూర్యరశ్మిసోకకుంటే విటమిన్‌-డిలోపం ఏర్పడి రోగనిరోధకశక్తి నెమ్మదిస్తుంది. వీటిమిన్‌-డి లోపం ఉన్నవారిలో మధుమేహం వస్తుందని ఈమధ్య జరిగిన పరిశోధనలో వెల్లడైంది. తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండాలి. మాంసకృత్తులు, పిండిపదార్థాలు ఉండేలా చూసుకోవాలి. పప్పులు , చికెన్‌, తాజా ఆకుకూరలు రోగనిరోధక శక్తినిపెంచుతాయి. స్వీట్లు, ఉప్పుశాతం తగ్గాలి. రోజూ కనీసం రెండు రకాల పండ్లు తినాలి. టిఫిన్‌, భోజనం మధ్యలో కాఫీలు, టీల కన్నా పండు తింటే ఆకలికాదు. వేళకు ఆహారం సమతుల్యంగా తీసుకోవాలి. రోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అరగంట వ్యాయామం చేయాలి.

Source :
రక్ష డెస్క్ Mon, 15 Aug 2011, -- డాక్టర్‌ సుధీర్‌ఆలపాటి--శ్వాసకోశ వ్యాధినిపుణులు--సన్‌షైన్‌ హాస్పటల్‌, సికింద్రాబాద్‌.


 • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, August 24, 2011

ఉద్యోగిని లలో మానసిక ఒత్తిడి-మెలకువలు , Mental Stress in employed women-awarenessఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఉద్యోగిని లలో మానసిక ఒత్తిడి-మెలకువలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...స్త్రీలు ఉద్యోగాలు చేయాలా? . భర్తల సంపాదన చాలదా?. అలా అనుకుంటే ఇంకేమైనా ఉందా! మహిళా మండళ్లు ఊరుకుంటాయా?.. స్త్రీల హక్కులను కాలరాసినట్టు కాదా?.. సరే ... మరి ఆరోగ్యమూ కాపాడుకోవాలి కదా !
ఇంట్లో పనులు, ఆఫీసు విధులు, అతిథి మర్యాదలు.. పిల్లల బాధ్యతలు.. ఉద్యోగం చేసే మహిళలు నిత్యం ఎదుర్కొనే పరీక్షలెన్నో! మల్టీటాస్కింగ్‌ వారి శక్తికి నిదర్శనం. కానీ అది నాణేనికి ఒకవైపే. ఇంటాబయటా పనులతో తీవ్ర ఒత్తిడికి లోనవ్వడం.. పోషకాహార, నిద్రలేమికి గురి కావడం.. వారే అంతగా గుర్తించని మరోకోణం. ఈ సమస్యని గమనించి, తగిన ముందుచూపుతో మెలగాల్సిన అవసరం ఎంతో ఉందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఓ కార్పొరేట్‌ సంస్థలో పనిచేస్తున్న స్త్రీ దైనందిన జీవితం తెల్లవారుజామున ఐదుకి మొదలవుతుంది. కాఫీ, టిఫిన్‌ పేరుతో ఓ పావుగంట విశ్రాంతి. మిగిలిన సమయం అంతా కాళ్లకు చక్రాలే. వంట, పిల్లల్ని స్కూలుకు సిద్ధం చేయడం, ఇంటిపనులు, భర్త అవసరాలు, అత్తామామలకు మందులు సిద్ధంగా ఉంచడం, మరోవైపు ఆఫీసులో ఆ రోజు చేయాల్సిన పనుల గురించి ఆలోచన.. ఇలా హడావుడిగా అనేక పనులతో బహుపాత్రాభినయమే. పనులు అవుతున్నాయి సరే! కుదురుగా తిన్న, పడుకొన్న భావన కలగదు. అదీకాక శారీరక అలసట, మానసిక ఒత్తిడి. ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగినుల పరిస్థితి ఇదే.

ఒత్తిడిలో మనమే ముందంజ...
బాగా చదవాలి, మంచి ఉద్యోగం చేయాలి, ఇంటాబయటా రాణించి శభాష్‌ అనిపించుకోవాలనే తపన ఒకవైపు.. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న వైనం మరొకవైపు. తాజాగా వెలువడిన ఓ అధ్యయనం ఈ పరిస్థితి తీవ్రతను తేటతెల్లం చేసింది. మహిళలు అత్యవసరంగా ఒత్తిడిని చిత్తుచేసే మార్గాలను అన్వేషించాలని చెప్పకనే చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 6,500 మందిపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. మన దేశంలో 87 శాతం మహిళలు అన్ని వేళలా ఒత్తిడికి గురవుతున్నారు. 82 శాతం వారికి అసలు విశ్రాంతి తీసుకునే సమయమే ఉండట్లేదు. ఇతర దేశాల్లో చూస్తే రష్యాలో 69, ఫ్రాన్స్‌ 65, స్పెయిన్‌ 66, అమెరికాలో 53 శాతం అన్నివేళలా ఒత్తిడికి గురవుతున్నారు.

బాధ్యత తెలిసి భారం..
ఆదాయం, హోదా బాగానే ఉన్నా, తరచూ పెరిగే పని భారం, ఇంటినీ కార్యాలయాన్నీ సమన్వయం చేసుకోలేకపోవడం చాలామంది ఉద్యోగుల్ని వేధిస్తోందని చెబుతారు ఓ ప్రముఖ సంస్థలో చేస్తోన్న సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌.... రోజుకి పదిగంటల పని. అవసరాన్ని బట్టి ఇంకా ఎక్కువ సమయమే ఉండాల్సి ఉంటుంది. లక్ష్యాలుంటాయి. కచ్చితమైన డెడ్‌లైన్లూ చేరుకోవాలి. ఆఫీసులో పని పూర్తి కాకపోతే.. ఇంటికీ మోసుకెళ్లాలి. దాంతో ఇంట్లో ఉన్నా బాబుకు సమయం కేటాయించలేని పరిస్థితి. ఆమే కాదు, ఆమె చుట్టూ ఉన్న వారిలో చాలామందిది ఇదే పరిస్థితి. ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేస్తేనే గుర్తింపు, పదోన్నతి. అలాగని ఇంటికొచ్చాక పనులూ తప్పడం లేదు. సాయంగా ఎంతమంది ఉన్నా.. అమ్మా అంటూ వచ్చే అబ్బాయిని పట్టించుకోవాల్సిన బాధ్యత స్త్రీదేగా! ఇలా అహర్నిశలూ పని చేస్తున్నా, అన్నింటికీ న్యాయం చేయలేకపోతున్నాననే భావన ఒత్తిడికి దారితీస్తోంది..'

సమన్వయం సాధించాలి...ఆర్థిక స్థిరత్వం, కుటుంబ శ్రేయస్సు కోసం ఉద్యోగానికి వెళుతున్న మహిళలకు కుటుంబం నుంచి తగిన స్థాయిలో ప్రోత్సాహం అందాలి .
మెలకువలు తెలిసి...ఇంటి పనులు, ఆఫీసు వ్యవహారాలను సమన్వయం చేసుకొని ఒత్తిడి లేకుండా హ్యాపీగా జాలీగా ఉండటం మాటలు చెప్పినంత సులువు కాదు. అలాగని కష్టమూ కాదు. ఆలోచిస్తే అనేక మార్గాలు ఉంటాయి . . . విధులకు సంబంధించిన నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం.. ఆన్‌లైన్‌లో విద్యుత్తు, కేబుల్‌, క్రెడిట్‌ కార్డు బిల్లుల్ని చెల్లించడం వంటివి చేయాలి . ఎదురయ్యే ఇబ్బందుల్ని బట్టి ఒత్తిడి తగ్గించుకునే మార్గాలు అన్వేషించాలి. నిత్యావసర వస్తువుల్ని సైతం ఇప్పుడు ఇంటికి తెచ్చిచ్చే సదుపాయం వచ్చేసింది కదా'

వాస్తవిక దృక్పథం.. మనసుకు విరామం
* ఉద్యోగినులు వాస్తవికంగా ఆలోచించాలి. మానసిక సాంత్వన పొందాలి. ఎన్నో చేయాలనుకున్నా.. రకరకాల సమస్యలు ఎదురుకావచ్చు. అలాంటి వాటిని ఎలా పరిష్కారించాలా అని ఆలోచించుకోవాలి. అవే తలచుకుని బాధపడకూడదు.

* విరామం లేకుండా పనిచేయడం కన్నా.. ప్రతి గంటకోసారి ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. ఆఫీసైనా, ఇంట్లో బాధ్యతలైనా.. మనసుకు హాయినిచ్చే పనులు చేయాలి. పిల్లలతో మాట్లాడటం.. భాగస్వామికి చిన్న సందేశం పంపడం వంటివి ఏవైనా సరే.

* నిత్యం రకరకాల ఆలోచనలతో సతమతమయ్యే మనసుకు విశ్రాంతినివ్వాలి(ఎమోషనల్‌ వెకేషన్‌). రోజు ఎలా గడిచినా.. మానసికంగా కుంగిపోకుండా ఉండేలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. సహాయకులు రాకపోయినా, సహోద్యోగులతో ఇబ్బంది ఎదురైనా చిరాకు ప్రదర్శించకుండా ఆనందంగా ఉండేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి.

* 'వ్యక్తులు మనకు నచ్చినట్లు ఉండకపోయినా.. సందర్భాలు సానుకూలంగా లేకపోయినా. నేను మాత్రం ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఉంటాన'నే సానుకూల దృక్పథంతో రోజును ప్రారంభించాలి.

* కార్యాలయంలో మర్నాడు చేయాల్సిన పనుల్ని ముందురోజే ఆలోచించుకుని ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇంటి పనుల విషయంలోనూ అంతే. నిద్రలేచిన తరవాత ఆ రోజు ఏం చేయాలని ఓ పది నిమిషాలు ఆలోచించుకుంటే హడావుడి ఉండదు.అంతగా అవసరంలేని పనుల్ని వారాంతాల్లో పూర్తిచేసుకోవచ్చు. ఇంటి నుంచి నిర్వర్తించగలిగే బాధ్యతలు ఉంటే ఆ అవకాశం కల్పించమని యాజమాన్యాన్ని కోరవచ్చు.

* మహిళలు 'సూపర్‌ విమెన్‌'గా మారుతున్నారు. అది ఒకరకంగా మంచిదే. కానీ మెలకువలు గ్రహించి మసలుకోవాలి. ఒత్తిడి చట్రంలో కూరుకుపోకుండా మార్గాలు అన్వేషిస్తూ ముందంజ వేయాలి. ఎవరికైనా రోజులో ఇరవై నాలుగ్గంటలే ఉంటాయి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే సమయస్ఫూర్తి చూపాలి.

* ప్రతి చిన్నపనీ, పెద్దపనీ నేను మాత్రమే బాగా చేయగలను.. అనే తీరు తగ్గించుకుని.. ఇతర కుటుంబసభ్యులకు అప్పగించవచ్చు. అది విధులకూ వర్తిస్తుంది. ఎప్పుడూ బాగా కష్టపడాలి.. ఏ సమయంలో విరామం తీసుకున్నా... ఇబ్బంది ఉండదో గ్రహించే ముందుచూపు కనబరచాలి.

* కెరీర్‌లో ఒక్కో అడుగు పైకెదిగే కొద్దీ సమయం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు డబ్బిచ్చి అయినా సరే.. సహాయకుల్ని నియమించుకోవాలి. ఇంటాబయటా సత్సంబంధాలనేవి ఉద్యోగినులకు తప్పనిసరి.


Source : Eenadu news paper 24/08/2011
 • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, August 19, 2011

డాక్టర్లు-రోగుల సత్సంబంధాలు , Doctor patient Relationshipఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -డాక్టర్లు-రోగుల సత్సంబంధాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...--రోగులు వైద్యులను ఎంతో ఉన్నతంగా భావిం చుకుంటూ ఉంటారు. తమకు సంబంధించిన ఆరోగ్య సమస్యలనే కాకుండా, కుటుంబ పరమైన సమస్యలు తమకు చికిత్స చేస్తున్న వైద్యుడితో చర్చించి, తగిన సలహాలు, సూచనలు కోరుకునే వారు. ఫలితంగా ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థ ఎంతో ప్రాచుర్యం పొందింది. అప్పట్లో వైద్యులు కూడా ఆయా కుటుంబాలలో ఒక వ్యక్తిగా ఉండి, వారికి కావలసిన మనోబలాన్ని చేకూరుస్తూ, తగిన సలహాలు అందించేవాడు.

అయితే వైద్యరంగంలో వస్తున్న అధునాతన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం కారణంగా వైద్యులు ఒక ప్రత్యేక రంగంలో నైపుణ్యం సాధించడం మొదలైంది. దీనితో రోగి శరీరాన్ని మొత్తంగా కాక, ఒక అవయవానికి సంబంధించిన వ్యాధులకు మాత్రమే చికిత్స చేసే సూపర్‌ స్పెషలిస్టులు రూపొందుతున్నారు. మెదడు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు - ఇలా ఏ అవయవానికి సంబంధించిన వ్యాధులకు ఆయా రంగాలలో నిష్ణాతులైనవారు చికిత్స చేస్తున్నారు. ఫలితంగా రోగిని ఒక వ్యక్తిగా పరిశీలించి, పరీక్షించే అవకాశం సన్నగిల్లడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రోగి తన వ్యాధి గురించిన భయాందోళనలతో మానసికంగా కృంగిపోతున్నాడు.

వైద్యుడిపట్ల, చికిత్స పట్ల రోగికి విశ్వాసం ఉండటమనేది చికిత్సలో ఔషధాలలాగే ఎంతో ముఖ్యమైనది. ప్రజల విశ్వాసం కారణంగానే వారికి కలిగే కొన్ని చిన్న చిన్న సమస్యలకు, ముఖ్యంగా ఆందోళన, మంద్రస్థాయిలోని కృంగుబాటు మొదలైన ఆరోగ్య సమస్యలకు ఉత్తమ చికిత్సలు చేసే వ్యక్తులుగా బాబాలు, స్వామీజీలు గుర్తింపు పొందుతున్నారు. అయితే తీవ్రస్థాయిలోని వ్యాధుల విషయంలో ఔషధాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి.

డాక్టర్ల వద్దకు వచ్చే రోగులను మూడు రకాలుగా విభజించవచ్చు.

మొదటి రకానికి చెందిన వ్యక్తి తన అనారోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ డాక్టర్‌ భుజస్కంధాలపైనే పెట్టి నిశ్చింతగా ఉంటాడు. ఇటువంటి వారు తాము చెప్పేదంతా డాక్టర్‌ పూర్తిగా వినాలనీ, తమపై పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపించాలనీ భావిస్తారు. టెస్టుల పేరిట ఎక్కువ డబ్బు ఖర్చు చేయించకూడదని అనుకుంటారు. తాము ఏం చేయాలనే విషయం డాక్టరే చెప్పాలని వారు భావిస్తారు.

రెండవ రకానికి చెందిన వారు డాక్టర్‌తో తమ అనారోగ్యాన్ని గురించి చర్చించాలనుకుంటారు. డాక్టర్‌ తమ అనారోగ్యం గురించి వివరించాలని భావిస్తారు. తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకుంటారు. తమ వ్యాధికి సంబంధించిన చికిత్సలేమిటి? నివారణ పద్ధతులు ఏమిటనే విషయాలను డాక్టర్‌ను అడిగి తెలుసుకుంటారు. తదనుగుణంగా చికిత్స తీసుకుంటారు.


మూడవ రకానికి చెందిన వారు తమకు ఏది కావాలో ముందే నిర్ణయించుకుని ఆ ప్రకారంగా డాక్టర్‌కు ఆదేశాలు జారీ చేస్తుంటారు. ఫలానా మందులు రాయమని, ఫలానా టెస్టులు చేయించమని అడుగుతారు. అంతే తప్ప డాక్టర్‌ చెప్పే విషయాలను వినరు. ఆసుపత్రులకో, క్లినిక్‌లకో వెళ్లే రోగులను పరిశీలిస్తే వారు ఏ రకానికి చెందిన వ్యక్తులనేది తెలిసిపోతుంది.

కొంతమంది డాక్టర్‌ తమను పిలిచే వరకూ మౌనంగా ఒక చోట కూర్చుంటారు. అక్కడ ఉన్న పేపర్‌నో, మ్యాగజైన్‌నో చదువుకుంటూ ఉంటారు. లేదా అక్కడ గోడలపై ఉన్న పోస్టర్లను, ఛార్ట్‌లను చూస్తూ గడుపుతారు. కొంతమంది చాలా అసహనంగా కనిపిస్తారు. వాళ్లు తాము ఎంతో ప్రాముఖ్యతగలిగిన వ్యక్తులమని, తమకు ప్రాధాన్యతనిచ్చి వెంటనే పరీక్షించి పంపేయాలనీ ఆశిస్తారు. తమకు తెలిసిన ఉన్నత హోదా కలిగిన వ్యక్తుల పేర్లు ఉటంకిస్తూ, తమ గొప్పదనాన్ని గురించి చెప్పుకుంటూ ఉంటారు. డాక్టరు మరొక రోగితో మాట్లాడుతున్నారన్నా కొంచెం సేపు కూడా వేచి ఉండటానికి ఇష్టపడరు. కొంతమంది తమ సమస్యకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలూ, సూచనలు డాక్టర్లు చెప్పినప్పుడు సరే అంటూ తలూపుతారు. తిరిగి తమకు ఏవేవో అనుమానాలు న్నాయంటూ మాటిమాటికీ డాక్టర్లకు ఫోన్‌ చేస్తుంటారు. అనుమానాలు తీర్చుకోవడం మంచిదే అయినా, ఇది ఒక రకంగా ఇబ్బందికరమైన అంశం. ఎందుకంటే, ఉదయంనుంచి సాయంత్రం వరకూ ఇటువంటి రోగులకు సమాధానాలు చెబుతూ ఉండటం వలన ఇతర రోగులపై శ్రద్ధ చూపడం, వారికి న్యాయం చేయడం కష్టమవుతుంది.

ఇలా అనేక రకాల వ్యక్తులు తమ ఆరోగ్య పరి రక్షణ కోసం ఆసుపత్రులకు, క్లినిక్‌లకు వస్తున్నప్పుడు అసలు డాక్టర్లకు, రోగులకు మధ్య సంబంధాల ప్రాముఖ్యత ఏమిటనే మౌలిక ప్రశ్న ఉదయిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ డాక్టర్‌ అనే వ్యక్తి ఆ చుట్టుప్రక్కల కుటుంబాల వారికందరకూ ఒక మార్గదర్శిగా, సలహాదారుగా, కుటుంబంలోని వ్యక్తిగా మసలుకునేవాడు. ఆయా కుటుంబాలలో ఏ శుభకార్యం జరిగినా తప్పని సరిగా హాజరయ్యేవాడు. ఆయా కుటుంబాల సభ్యులందరినీ పేరుపేరునా గుర్తిస్తూ, వారి ఆరోగ్య విషయాలే కాక, వారి పూర్వీకుల ఆరోగ్యాలకు సంబంధించిన విషయాల గురించి కూడా తెలుసుకునేవాడు. కేవలం చికిత్స చేసే ఒక 'వృత్తిదారుగా కాకుండా, ఇతరత్రా కూడా ఆయా కుటుంబ సభ్యుల మంచిచెడూ కూడా చూసే వ్యక్తిగా డాక్టర్‌ను భావించేవారు.

ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఒక్కొక్క అవయవం కోసం ఒక్కొక్క డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. డాక్టర్లు, రోగుల మధ్య సంబంధాలు వ్యాధులు, ఔషధాలకు మాత్రమే పరిమితమైపోయింది. దీనితో రోగికి డాక్టర్‌పై విశ్వాసం సన్నగిల్లడం, వరుసగా డాక్టర్లను మారుస్తూ రావడం జరుగుతోంది. ఇది రోగి మనస్సుపై ఎంతో ప్రభావం చూపి చివరకు డిప్రెషన్‌ వంటి మానసిక వ్యాధులకు దారి తీస్తోంది. డాక్టర్లు రోగుల మధ్య సత్సంబంధాలు ఉండటం, డాక్టర్లపై విశ్వాసం, నమ్మకం కలగడమనేవి చికిత్సలో ముఖ్యమైన అంశాలు. మానసిక వ్యాధిగ్రస్తుల విషయంలో ఇది మరీ ప్రధానమైనది.

 • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, August 18, 2011

కళ్లకీ వ్యాయామము , Exercise for Eyes
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కళ్లకి వ్యాయామము , Exercise for Eyes- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


శారీరక ఆరోగ్యానికి వ్యాయామం చేస్తున్నట్లే కళ్ల ఆరోగ్యానికీ కొన్ని ప్రత్యేక వ్యాయామాలున్నాయి. వాటిలో కొన్ని...
* రెండు అరిచేతుల్నీ రుద్దుతూ వెచ్చగాచేసి రెండు నిమిషాలు కళ్లపైన ఉంచాలి. కళ్లపై ఒత్తిడి పడేలా గట్టిగా నొక్కకుండా అరిచేతుల్ని కళ్లకు ఆనిస్తే చాలు. ఇలా ఆరేడుసార్లు చేయాలి.
* నాలుగు సెకన్లపాటు కళ్లను గట్టిగా మూయడం, తెరవడం ఇలా 7-8 సార్లు చేయాలి.
* కళ్లను మూసి ఉంచి చేతివేళ్లతో మసాజ్‌ చేస్తున్నట్లు రెప్పలపై నెమ్మదిగా గుండ్రంగా కదపాలి.
* కనుగుడ్లను సవ్యదిశలో ఒకసారి, అపసవ్యదిశలో ఒకసారి గుండ్రంగా తిప్పాలి. ఇలా అయిదుసార్లు చేయాలి. మధ్యమధ్యలో కనురెప్పలను అల్లల్లాడించాలి.
* 150 అడుగుల దూరంలోని ఒక వస్తువును తదేకంగా చూడటం, మళ్లీ 30 అడుగులలోపు ఉన్న వస్తువుపైకి దృష్టి మరల్చడం... ఇలా పదిసార్లు చేయాలి.
* వీలు చిక్కినప్పుడల్లా చల్లని నీటితో కళ్లను కడుక్కోవాలి.
* తలను బాగా విశ్రాంతిగా ఉంచి చూపును కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి పూర్తిగా చివర్లకు తిప్పాలి. కనుగుడ్లు ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకు ; ఆ ప్రక్కనుంచి ఈ ప్రక్కకు తిప్పాలి.
* తలను విశ్రాంతిగా ఉంచి చూపును సవ్యదిశ లోను,అపసవ్య దిశ లోనూ,తిప్పాలి, ఇలా 3 సార్లు చేయాలి.
* తలను ఏమాత్రము కదల్చకుండానే వీలైన పైకి, మళ్ళీ వీలైనంత క్రిందకూ చూడాలి
* తలను నిటారుగా వుంచిచూపును పైకి తిప్పుతూ పూర్తి కుడివైపు నుండి చూడండి, అలాగే చూపును క్రిందకి దించి పూర్తిగా ఎడమవైపు నుంచి చూడండి.

 • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

తోటపనితో ఆరోగ్యం, Health with gardeningఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -తోటపనితో ఆరోగ్యం, Health with gardening
-
గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

బిజీ జీవితం నుంచి విశ్రాంతి పొందాలంటే మంచి మార్గం ప్రకృతితో స్నేహం చేయడం. కాసేపు పూలతో, చెట్లతో ముచ్చట్లాడి వాటి బాగోగులు చూసుకుంటే చాలు ఎంతటి ఒత్తిడి అయినా ఇట్టే మటుమాయం అవుతుంది. వాటికి కాస్త సేవ చేస్తే ఇటు వ్యాయామమూ అవుతుంది. ఇలా తోటపని ఇష్టపడేవారు రైతులే కానవసరం లేదని పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు రుజువు చేశారు. తామెంత గొప్పవారమైనా ప్రకృతితో చెలిమి తమకెంతో ఇష్టమంటుంటారు. తాము పెంచుకునే మొక్కల మధ్యలో సమయం గడిపి సేదతీరుతారు. ఇలా పూల మొక్కల మధ్య తిరిగి, వాటి పెంపకం ద్వారా ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు. గార్డెనింగ్‌ వారికి ఓ హాబీగా మారుతుండడం విశేషం.

ఉదయం, సా యంత్రం వేళల్లో కాసేపు మొక్కలకు పాదులు చే యడం, చెట్లకు నీళ్ల పట్టడం చేస్తే ఒంట్లోని క్యాల రీలు తెలియకుండా ఖర్చయిపోతాయి . దీనివల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలకి ఆరుబయట ఎక్కువసేపు గడపకపోవడమూ ఒక కారణమంటున్నారు వైద్యులు. వెలుతురూ, గాలీ బాగా ఉండే చోట రోజులో కొంత
సమయమైనా గడిపితే ఈ సమస్యలు రావంటున్నారు. వెుక్కల పెంపకం దీనికి మంచి మార్గమని సూచిస్తున్నారు. వెుక్కలకు పాదులు చేయడం, నీళ్లు పోయడం ఏ వయసువారికైనా ఆరోగ్యకరమైన అలవాటు. మెక్కలు పెంచుతున్నామంటే మనం ప్రకృతికి దగ్గరవుతున్నట్లు. ఈ అలవాటు మనకు తెలియకుండానే మన ఆలోచనా ధోరణిని మారుస్తుంది. పెరటి ఆకుకూరలతో ఆరోగ్యమూ పెరుగుతుంది. తోటపని వ్యాయామంగా కూడా పనిచేస్తుంది. తోట అంటే విశాలమైనదే కానవసరం లేదు, వరుసగా కుండీలు పేర్చి వెుక్కలు పెంచినా మంచి ఫలితాలే ఉంటాయట. వెుక్కల పెంపకానికి వానాకాలంకంటే అనువైన సమయం ఉంటుందా చెప్పండి!

 • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/http://dr.seshagirirao.tripod.com/

గాలిగదుల మధ్య కణజాలం వ్యాధిగ్రస్తమయ్యే ఐ.ఎల్‌.డి.,Interstitial Lung disease(I.L.D) • [asthma.jpg]

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరో Add Imageగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఐ.ఎల్‌.డి.- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...-ఊపిరితిత్తుల్లో ఉండే గాలి గదుల (ఆల్వి యోలై) మధ్య ఉండే కణజాలాన్ని ఇంటర్‌స్టిష ియమ్‌ అంటారు. ఈ కణజాలం దెబ్బ తిన్నప్పుడు (ఫైబ్రోసిస్‌ ఏర్పడ్డప్పుడు) ఏర్పడే స్థితిని ఇంటర్‌స్టిషియల్‌ లంగ్‌ డిసీజ్‌ (ఐఎల్‌డి) అంటారు.

ఊపిరితిత్తులకు సోకే ఇంటర్‌స్టిషియల్‌ వ్యాధుల్లో సుమారు 180 వరకూ దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నాయి. వాటిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి - దీర్ఘకాలిక వ్యాధులు, కేన్సరేతర వ్యాధులు, ఇన్‌ఫెక్షన్‌ కాని వ్యాధులు :

వ్యాధులు.
ఇంటర్‌స్టిషియల్‌ లంగ్‌ డిసీజెస్‌ను ఇంటర్‌ స్టిషియల్‌ పల్మొనరీ ఫైబ్రోసిస్‌ అని పల్మొనరీ ఫైబ్రోసిస్‌ అని కూడా అంటారు. ఐఎల్‌డి వ్యాధి తాలూకు లక్షణాలు ఒక్కొక్క బాధితుడిలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. అయితే ఐఎల్‌డి సోకడంలో కనిపించే సాధారణ లక్షణం వాపు, కమిలినట్లు ఎర్రగా మారడం (ఇన్‌ఫ్లమేషన్‌).

బ్రాంకియోలైటిస్‌
ఊపిరితిత్తుల్లోని సూక్ష్మ వాయు మార్గాలు వ్యాధిగ్రస్తమైతే దానిని బ్రాంకియోలైటిస్‌ అంటారు.

ఆల్వియోలైటిస్‌
ఊపిరితిత్తుల్లోని గాలి గదులు వ్యాధిగ్రస్తమై నప్పుడు దానిని ఆల్వియోలైటిస్‌ అని వ్యవహ రిస్తారు.

వాస్క్యులైటిస్‌
సూక్ష్మ రక్తనాళికలకు సోకే వ్యాధి ఇది.
ఇంటర్‌స్టిషియల్‌ వ్యాధుల్లో 80 శాతం కంటే ఎక్కువ వ్యాధులను మందుల వాడకం వల్ల వచ్చే న్యుమోకొనియోసిస్‌ వ్యాధిగా కాని, హైపర్‌ సెన్సిటివిటీ న్యుమోనైటిస్‌ వ్యాధిగా కాని నిర్ధారించడం జరుగుతుంటుంది.

ఐఎల్‌డిలో ఇతర రకాలు
- సార్కాయిడోసిస్‌
- ఇడియోపతిక్‌ పల్మొనరీ ఫైబ్రోసిస్‌
- బ్రాంకియోలైటిస్‌ ఆబ్లిటెరాన్స్‌
- హిస్టియోసైటోసిస్‌ ఎక్స్‌
- క్రానిక్‌ ఇసినోఫిలిక్‌ న్యుమోనియా
- కొల్లాజెన్‌ వాస్క్యులార్‌ డిసీజ్‌
- గ్రాన్యులోమాటస్‌ వాస్క్యులైటిస్‌
- గుడ్‌పాశ్చర్స్‌ సిండ్రోమ్‌
- పల్మొనరీ ఆల్వియోలార్‌ ప్రొటీనోసిస్‌

ఎలా సోకుతుంది?
ఈవ్యాధి మూడు ప్రధానమార్గాల ద్వారా సోకుతుంది.
- ఏ కారణంగానైనా ఊపిరితిత్తుల కణజాలం దెబ్బ తినడం ద్వారా,
- ఊపిరితిత్తుల్లోని గాలి గదుల గోడలు వ్యాధిగ్రస్తం కావడం
- ఇంటర్‌స్టిషియంపై మచ్చలు (స్కారింగ్‌/ ఫైబ్రోసిస్‌) ఏర్పడటం

కణజాలానికి ఫైబ్రోసిస్‌ సోకడం ద్వారా ఆ కణజాలం శాశ్వతంగా శ్వాస తీసుకోవడానికి, ఆక్సిజన్‌ను తీసుకు వెళ్లడానికి పనికి రాకుండా దెబ్బతింటుంది.
ఈ రకమైన స్కార్‌ కణజాలం ఏర్పడటంతో గాలి గదులు, వాటి చుట్టూ ఉండే కణజాలం, ఊపిరితిత్తుల్లోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బ తింటాయి. ఈ వ్యాధులు నెమ్మదిగా కాని, వేగంగా కాని పెరుగుతాయి.

ఐఎల్‌డికి గురైన వారిలో లక్షణాలు స్వల్ప స్థాయినుంచి తీవ్రస్థాయి వరకూ వివిధ రకాలుగా ఉంటాయి. ఐఎల్‌డి సోకిన తరువాత పరిస్థితి అదే విధంగా దీర్ఘకాలంపాటు కొనసాగవచ్చు. లేదా లక్షణాలు అతి వేగంగా మారుతూ రావచ్చు.

ఐఎల్‌డి పరిస్థితి ఇలా ఉంటుందని వివరించడం కష్టం. ఈ వ్యాధి పురోగతి చెందితే ఊపరితిత్తుల కణజాలం మందంగా మారి గట్టిపడుతుంది. అప్పుడు శ్వాస తీసుకోవడం చాలా కష్టతరంగా మారుతుంది.

ఐఎల్‌డిలో కొన్ని వ్యాధుల్లో ఇన్‌ఫ్లమేషన్‌ ఉన్నప్పుడు మందులతో చికిత్స చేస్తే వ్యాధి నయమవుతుంది. కొంతమందికి చికిత్సలో భాగంగా ఆక్సిజన్‌ ఇవ్వవలసి రావచ్చు.

లక్షణాలు
ఐఎల్‌డిలో కనిపించే సాధారణ లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి. అయితే బాధితులలో లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా కనిపించవచ్చు.
- హ్రస్వ శ్వాస, ముఖ్యంగా శారీరకంగా శ్రమ చెందినప్పుడు శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది
- నిస్త్రాణ, నీరసం,
- ఆకలి తగ్గి పోవడం
- బరువు తగ్గి పోవడం
- కళ్లె లేకుండా కొనసాగే పొడి దగ్గు
- ఛాతీలో అసౌకర్యంగా ఉండటం
- ఊపిరితిత్తుల్లో రక్తనాళాలు చిట్లిపోవడం
ఇంటర్‌స్టిషియల్‌ లంగ్‌ డిసీజ్‌లో కనిపించే లక్షణాలే ఇతర వ్యాధుల్లో కూడా కనిపించ వచ్చు. కనుక వైద్య నిపుణులతో సరైన వ్యాధి నిర్ధారణ చేయించుకుని చికిత్స తీసుకోవాలి.

ఐఎల్‌డికి కారణాలు
ఐఎల్‌డి సోకడానికి గల కారణాలేమిటనేవి ఇతమిత్థంగా తెలియదు. అయితే వాతా వరణ కాలుష్యం ఈ వ్యాధికి ఒక ప్రధాన కారణం ఇతర కారణాల్లో - సార్కాయిడోసిస్‌, కొన్ని రకాల మందులు, రేడియేషన్‌, సంధాయక కణజాల వ్యాధులు, కుటుంబ చరిత్ర మొదలైనవి ముఖ్యమైనవి.

వ్యాధి నిర్ధారణ
పల్మొనరీ ఫంక్షన్‌ టెస్ట్‌, స్పైరోమెట్రీ, పీక్‌ఫ్లో మీటర్‌, రక్త పరీక్షలు, ఎక్స్‌రే, కంప్యూటరైజ్డ్‌ యాక్సిల్‌ టోమోగ్రఫీ (సి.ఎ.టి.) స్కాన్‌, బ్రాంకోస్కోపీ, బ్రాంకోఆల్వియోలార్‌ లావేజ్‌, లంగ్‌ బయాప్సి మొదలైన పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించడం జరుగుతుంది.

చికిత్స :
ఐ.ఎల్.డి వ్యాధికి ఒక కారణము కాదుకాబట్టి వ్యాధిననుసరించి చికిత్స చేయాలి . బాధనివారణ కోసము ఆయాసము తగ్గేమందులు ... డెరిఫిలిన్‌ ఇంజక్షన్‌ లేదా మాత్రలు , కార్టికోస్టెరాయిడ్స్ (ప్రెడ్నిసొలోన్‌) వాడాలి .

 • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Wednesday, August 17, 2011

Mouth wash , మౌత్ వాష్ ,నోటిని శుబ్రపరిచే ద్రావకముఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మౌత్ వాష్ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మౌత్ వాష్ లేదా మౌత్ రింజ్ ని నోటి శుభ్రత కోసం వాడే ఒక ద్రావకము . నోటి దుర్వాసన పోగొట్టి , దంత రక్షణకు ఉపయోగపడును . నోటి లో చేసే ఏవైనా ఆపరేషన్స్ ఇన్ఫెక్షన్‌ అవకుండా మౌత్ వాష్ వాడుతారు . మౌత్ వాష్ ఎన్నో ఏళ్ళ నుండి సుమారు క్రీ.పూ. 2700 కాలము నుండీ వాడుకలో ఉంది . గ్రీకులు , రోమన్లు ... ఉప్పు , ఆలం , వెనిగర్ మిశ్రమాన్ని వాడేవారు . తరువాత కాలములో లీవెన్‌ హాక్ .. సూక్ష్మజీవులు కనుగొన్న తర్వాత నోటిదుర్వాసనకు క్రిములే కారణమని తలుసుకొని ఎన్నోరకాల యాంటిసెప్టిక్ మౌత్ ద్రావకాలు కనుగొనబడ్డాయి. కొంతమంది ధనిక గ్రీకులు , రోమన్లు నోటి సువాసనకు మౌత్ వాష్ లను వాడేవారు . 1960 లో రోయల్ డెంటల్ కాలేజీ ప్రొఫెసర్ " హెరాల్డ్ లోయ్ " దంతాల పై " డెంటల ప్లేక్స్ " ను రాకుండా ఉండేందుకు " క్లోర్ హెక్షిడిన్‌ " రసాయనాన్ని వాడకాన్ని ఉపయోగపడుతుందని కనిపెట్టడం తో దంత వైద్యము లో చాలా ఉపయోగకరము గా తయారయినది . అప్పటినుండి వ్యాపారపరముగా మౌత్ వాష్ లు తయారీ మొదలైనది .
ఒకవేళ పుక్కిలించేటప్పుడు ఈ మౌత్వాష్ పొరపాటున కడుపులోకి వెళ్ళినా ఎలాంటి సమస్యా ఉండదు. బ్యాక్టీరియాలో అనేక రకాలు నోటి దుర్వాసనకు కారణమవుతుంటాయి. ... దీనికోసం నాలుకను నాలుకబద్దతో శుభ్రం చేసుకోవడం, మౌత్వాష్ ఉపయోగించడం వంటివి చేయాలి.

ముఖ్యము గా వాడే మూలపదార్ధాలు :(Active ingredients in commercial brands of mouthwash )

 • థైమాల్ --thymol,
 • యూకలిప్టాల్ --eucalyptol,
 • హెక్షిడిన్‌ --hexetidine,
 • మిథైల్ సాలిసిలేట్ --methyl salicylate,
 • మెంథాల్ ---menthol,
 • క్లోర్ హెక్షిడిన్‌ గ్లుకొనేట్ --chlorhexidine gluconate,
 • బెంజాల్ కోనియం క్లోరైడ్ --benzalkonium chloride,
 • సిటైల్ పిరిడియం క్లోరైడ్ --cetylpyridinium chloride,
 • మిథైల్ పేరాబెన్‌ --methylparaben,
 • హైడ్రోజన్‌ పెరాక్షైడ్ --hydrogen peroxide,
 • డోమిఫెన్‌ బ్రోమైడ్ --domiphen bromide
 • ఫ్లోరైడ్ ---fluoride,
 • ఎంజైంస్ --enzymes,
 • కాల్సియం --calcium. మున్నగునవి .
ఇంకా ఇవి కాకుండా నీరు , స్వీట్నర్స్ అయిన సార్బిటాల్ -సూక్రలోజ్ -సోడియం సాక్కరిన్‌ -జైలిటాల్ (as a bacterial inhibitor) కలిపి ఉంటాయి .

మౌత వాష్ ఉపయోగాలు :
నోటి దుర్వాసనకోసము పుక్కలించడానికి సుమారు 20 మి.లీ. బ్రుష్ చేసుకున్న తర్వాత రోజూ రెండు పూటలూ చేయాలి . సుమారు అర నిముషము నోటిలో ఉంచి ఉమ్మివేయాలి . ఉదా:
లిస్టిర్న్‌(Listerine),
టోటల్ కేర్ (Total care)
హెక్షిన్‌ మౌత్ వాస్ (hexin mouth wash)
బెటాడిన్‌ మౌత్ వాష్ (Betadine),
వకాడిన్‌ (wakadin)మౌత్ వాష్ , మున్నగునవి మార్కెట్ లో లభిస్తున్నాయి.

దంతాల సంరక్షణ కు మంచి ఫలితాలు అందిస్తాయి . బ్రుష్ చేరలేని దంత బాగాలలోని బాక్టీరియాను ఈ మౌత్ వాష్ లు శుబ్రము చేస్తాయి . జింజివైటిస్ నయమవుతుంది . దంతగార తొలగిపోతుంది . .. దంత క్షయము నివారణ జరుగుతుంది .

హెర్బల్ మౌత్ వాష్ లు :
 • పెర్సికా (persica)--ఇది చిన్న మొక్క . దీని బెరడు , ఆకులు దంతరక్షణకు వాడుతారు .
 • సీసం ఆయిల్ ,
 • సన్‌ఫ్లవర్ ఆయిల్ ,
 • పుదీన ఆకు , ల నుండి తయారైన దావకాలు నోటిశుబ్రతకు వాడుతారు .

సైడ్ ఎఫెక్ట్స్ & ప్రమాదాలు :
 • కొన్ని మౌత్ వాష్ లు ఆల్కహాల్ ను కలిగిఉంటాయి . వీటివలన నోటి క్యాన్సర్ వచ్చేఅవకాశముంది .
 • డెంటల ఎరోజన్‌ ,
 • పళ్ళు రంగు మారె ప్రమాదము ఉంది ,
 • కొన్ని మౌత్వాష్ ల వల్ల రుచి తెలుసుకునే శక్తి తగ్గే అవకాశము ఉందనని అంటారు .
 • చిన్నపిల్లలు ప్రమాదవసాత్తు తాగేస్తే విషం గా ప్రమాదం సంభవించవచ్చును .source : written / Dr.Seshagirirao -MBBS

 • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/