Saturday, April 30, 2011

డయాబెటిక్‌ ఫుట్‌ , Diabetic Footఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -డయాబెటిక్‌ ఫుట్(Diabetic Foot)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...మధుమేహం ఉన్నప్పుడు పాదాలను గాజుకాయలా చూసుకోవాలి. కానీ చాలా మంది 'నాకెందుకు వస్తుందిలే'.. 'ఇన్నేళ్ల నుంచీ నాకు ఏ ఇబ్బందీలేదు.. ఇక ముందూ రాదు' అన్న ధీమాతో ఉంటారు. నిర్లక్ష్యం చేస్తారు. అంటే చేజేతులారా సమస్యను కొనితెచ్చుకోవటమే. ఒక సారి పుండుపడితే మానదు. కాబట్టి నాకే సమస్యా రాదన్న ధోరణి వదిలిపెట్టాలి. పాదాల సమస్య వచ్చే అవకాశముందని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. మధుమేహానికి సంబంధించిన పాదాల సమస్యల్లో 50 శాతం చేతులారా కొని తెచ్చుకుంటున్నవేననీ, జాగ్రత్తలు తీసుకుంటే కాళ్లు తీసేయడమనేది సగానికి సగం తగ్గిపోతుందని అధ్యయనాల్లో తేలింది. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి తరచూ క్రమం తప్పకుండా పరీక్ష చేయించుకోవడం ఎంత అవసరమో నిత్యం కాళ్లను పరిశీలించుకోవటం, సంరక్షణ చర్యలు తీసుకోవటం కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి.

పదేళ్లకంటే ఎక్కువ కాలం మధుమేహం ఉన్నవారిలో సహజంగానే కాళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా కాళ్లలోని నాడులు (నరాలు), తర్వాత కాళ్లలోని రక్తనాళాలు దెబ్బతింటాయి. వీటికితోడు శరీరంలో రోగనిరోధకశక్తి క్షీణిస్తుంది. ఈ మూడింటి ఫలితమే.. పాదాల సమస్యలు. వీటిని ఇంగ్లీషులో డయాబెటిక్‌ ఫుట్‌ అంటారు.

ఏం జరుగుతుంది?

కాళ్లలో నరాలు దెబ్బతినడం వల్ల పాదాలకు స్పర్శజ్ఞానం తగ్గుతుంది. ఈ దశలో రోగులు తమ సమస్యను రకరకాలుగా చెబుతుంటారు. దూదిమీద స్తున్నట్టుందనీ,
ఇసుక మీద నడుస్తున్నట్టుందనీ, గాజు పెంకుల మీద నడుస్తున్నట్టుందని చెబుతుంటారు. రాత్రిపూట నిద్రలో కాళ్లు మంట మంటగా అనిపిస్తుండడం దీని ముఖ్య లక్షణం.

కాలి చెప్పు జారిపోతుండడం, గుండు సూదులు గుచ్చినట్లుండడం, తిమ్మిర్లు ఎక్కటం, చీమలు పాకుతున్నట్టు అనిపించడం. ఇవన్నీ పాదాల సమస్యలున్న వారు తరచూ
చెప్పేవే. మధుమేహ బాధితుల్లో నరాలు దెబ్బతినడానికి ప్రధాన కారణాలు... నరం మీదుండే 'మైలిన్‌' అనే పూత, నరం లోపల సంకేతాలను అటూ ఇటూ చేరవేసే 'యాక్సోప్లాజమ్‌' పదార్థం పోవడం. దీని వల్లే సంకేతాలకు అంతరాయం ఏర్పడుతుంది. నరాలు పనిచేయడానికి శక్తి అవసరం. అందుకు ప్రతీ నరానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలుంటాయి. ఈ రక్తనాళాలు దెబ్బతినడం వల్ల నాడులు సమర్థవంతంగా పనిచేయవు. ఫలితంగా కాళ్లకు స్పర్శ తగ్గుతుంది. ఇక దెబ్బ తగిలినా సరే దాని తీవ్రతా, బాధా రోగికి తెలియదు. దీంతో అశ్రద్ధ చేస్తారు. పదేళ్లకు పైబడి మధుమేహం ఉంటే (నియంత్రణలో ఉన్నా సరే) రక్తంలో కొవ్వు పదార్థం, చక్కెర నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాలు సన్నబడతాయి. దీనికి తోడు రక్తనాళాల గోడలకు కొవ్వు పేరుకుని, కాళ్లకు రక్తప్రసారం తగ్గుతుంది.

దీర్ఘకాలంపాటు రక్తంలో ఉండిపోయే చక్కెర వివిధ నాళాలతో, కణజాలంతో చర్యజరిపి, వాటిని దెబ్బతీస్తుంది. దీన్ని అడ్వాన్స్‌డ్‌ గ్లైకేషన్‌ ఎండ్‌ప్రోడక్ట్స్‌ అంటారు. వీటికి తోడు
రక్తాన్ని పంపింగ్‌ చేసే గుండెకు కాళ్లు చాలా దూరంగా ఉంటాయి. కాబట్టి కాళ్లకు అందే పరిమాణం తగ్గుతుంది. ఇవన్నీ కలిసి సమస్యను జటిలం చేస్తాయి.

ముందే ఎలా గుర్తిస్తాం ?

కాళ్లలో రక్తప్రసారం తగ్గుతోందా? అన్న విషయాన్ని ముందే గుర్తించొచ్చు. దీనికి చీలమండల దగ్గర రక్తపోటు ఎలా ఉన్నదీ, మోచేతి కీలు దగ్గర రక్తపోటు ఎలా ఉన్నదీ
కొలవాలి. చేతుల్లో ఉండే రక్తపోటు కంటే కాళ్లలో ఉండే రక్తపోటు తగ్గకూడదు. దీన్ని కోలవడానికి 'డాప్లర్‌' అనే ప్రత్యేక పరికరం ఉంటుంది. దీంతో రక్తనాళాల్లోని పీడనం, రక్తం వేగాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇది లేకపోతే డాక్టర్ల దగ్గరుండే సాధారణ రక్తపోటు మిషన్ల సహాయంతో కూడా కొలవచ్చు. ఏటా డాప్లర్‌ పరీక్ష చేయించుకుంటూ, రక్తప్రసారం

తగ్గుతున్న విషయాన్ని ముందే గుర్తిస్తే కాళ్లలో రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదాన్ని 5 నుంచి 10 ఏళ్ల ముందే పసిగట్టి, నివారణ చర్యలు తీసుకోవచ్చు. డయాబెటిస్‌ రోగుల
శరీరంపై పుండు పడి, త్వరగా మానకుంటే అది నయమ్యే వరకూ ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ తీసుకోవడం మేలు. దీంతో గాయం త్వరగా మానుతుంది. గాయమైనప్పుడు విశ్రాంతి
కోసం కదలకుండా ఉండాలి. కాబట్టి శరీరంలో షుగర్‌ స్థాయి పెరుగుతుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో తగిన మోతాదులో ఇన్సులిన్‌ తీసుకోవడం మేలు. పుండు మానిన తర్వాత పరిస్థితిని బట్టి డాక్టరు సలహా మేరకు కొందరు మళ్లీ బిళ్లలు వాడొచ్చు.

ప్రత్యేక చెప్పుల అవసరం ఏమిటి?

మధుమేహం దీర్ఘకాలం ఉన్నప్పుడు పాదాలపైన చర్మం ఉల్లిపొరలా, పల్చగా తయారవుతుంది. పైగా కాళ్లకు స్పర్శ సరిగ్గా తెలియదు. కాబట్టి పాదానికి రక్షణ అవసరం. సాధారణ చెప్పులు ఈ పనిని సమర్థవంతంగా చేయలేవు. మధుమేహ బాధితుల కోసం ఎటువంటి పాదరక్షలు నిజమైన రక్షణను ఇస్తాయనే అంశంపై పరిశోధనలు జరిగాయి. ప్రత్యేక మెటిరీయల్‌తో తయారు చేసిన చెప్పులు మధుమేహ రోగులకు ఎంతో తోడ్పడతాయిని వెల్లడైంది.

చాలా మంది తమ సైజు చెప్పులు లేకున్నా కూడా వేసుకుంటారు. చెప్పుల్లో తేడా ఉంటే పెద్దగా పట్టించుకోరు. సర్దుకుపోతారు. దీని వల్ల మామూలు వారికి నష్టం లేదోమోగానీ, 'డయాబెటిక్‌ ఫుట్‌' ఉన్నవాళ్లకు సమస్యే. మధుమేహం ఉన్నవాళ్లు తమకోసం ప్రత్యేకంగా తయారు చేసిన సున్నితమైన చెప్పులు వాడడమే మంచిది. ఈ
చెప్పులు..పాదం మీద ఒకచోటే ఒత్తిడి పడకుండా అన్ని వైపులా సమానంగా పడేలా తయారు చేస్తే సమస్యలు తగ్గుతాయి. ఈ చెప్పుల్లో మూడు భాగాలుంటాయి. కింద- తేలికైన, దృఢమైన పియు (పాలియురెథేన్‌) సోల్‌ వాడుతున్నారు. దీని వల్ల మేకులు, ముళ్ల వంటివి దిగే అవకాశం లేదు. రెండోది- మన పాదం చెప్పుకు ఆనుకునే
కింది భాగంలో మైక్రోసెల్‌ పాలిమర్‌, మైక్రోసెల్‌ రబ్బర్‌ 'ఇన్‌సర్ట్‌' పెడుతున్నారు. దీని వల్ల పాదంపై ఒత్తిడి తగ్గుతుంది. కొందరు ఈ ఇన్‌స్టర్‌ను మామూలు చెప్పుల్లో పెట్టుకుంటారు. కానీ అది స్లిప్‌ అయిపోతుంది. మూడోది- లెదర్‌గానీ, కుట్లుగానీ పాదానికి తగలకుండా పైనంతా 'క్రాస్‌లింక్‌ పాలిమర్‌ షీట్‌'తో లైనింగ్‌ ఇస్తున్నారు. దీంతో పాదానికి పైనా, కిందా కూడా ఎక్కడా రాపిడి, గరుకుదనం తగలవు. మన అరికాళ్లల్లో ఒకపక్క గొయ్యిలా ఉండే ప్రాంతం ఉంటుంది కదా.. దానికి సపోర్టుగా కింది నుంచి ఉబ్బెత్తుగా 'ఆర్చ్‌' ఇస్తున్నాం. దీనివల్ల మడమ మీద ఒత్తిడి తగ్గుతుంది. మధుమేహం ఉన్న చాలా మంది వృద్ధుల్లో తరచూ కాళ్లు కొద్దిగా వాస్తుంటాయి. అలాంటప్పుడు చెప్పులు నొక్కుకుపోయి, పుళ్లు పడుతుంటాయి. అందుకని చెప్పులు పైన వదులు చేసుకోవడానికి వీలుగా 'వెల్‌క్రో స్ట్రిప్స్‌' ఇస్తున్నారు. వీటి సైజు పెంచుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. ఈ చెప్పులతో వాకింగ్‌ చేయవచ్చు. ఒక వేళ పుండుపడితే ఆ పుండు చెప్పుకు తగలకుండా, ఆ ప్రాంతంలో మెత్తటి 'సిలిపోస్‌' మెటీరియల్‌ను ఉంచుతున్నారు. ఇది నునుపుగా ఉండి, పుండుపై నేరుగా ఒత్తిడి పడనివ్వదు. డయాబెటిక్‌ చెప్పులు చెమట పీల్చకపోవడమే ఉత్తమం. ఎందుకంటే చెమట పీల్చుకుంటే అందులో బ్యాక్టీరియా పెరుగుతుంది. తర్వాత ఏ చిన్న దెబ్బతగిలినా అది గాయంలో చేరి ఇన్‌ఫెక్షన్‌ కలగజేస్తుంది. అందుకని చెమట పీల్చుకోనివే మంచివి.

పుండుపడకుండా ఏం చేయాలి?

* రోజూ పాదాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.

* కాళ్లను, పాదాలను రోజూ రెండు పూట్లా శుభ్రంగా కడుక్కోవాలి. కాలి వేళ్ల మధ్య, అరికాళ్లు కూడా జాగ్రత్తగా కడుక్కోవాలి.

* కడిగిన తర్వాత ఏమాత్రం తేమ లేకుండా తుడుచుకోవాలి. పొడిగా ఉండడానికి పౌడర్‌ రాసుకోవడం మంచిది.

* సాక్స్‌ వేసుకునే వాళ్లయితే నైలాన్‌వి వేసుకోవద్దు. కాటన్‌ మేజోళ్లే వాడాలి.

చెప్పులకూ, పాదానికి మధ్య రాళ్లు పడకుండా చూసుకోవాలి. చెప్పుల్లో మేకులు వంటివి బయటకు రాకుండా రోజూ పరిశీలించాలి.

* మడమపై ఒత్తిడి పెంచే చెప్పులు వేసుకోవద్దు. మధుమేహ బాధితుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చెప్పులను వాడడం మంచిది.

* పాదానికి ఏ చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయక, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

* చెప్పులు లేకుండా నడవొద్దు. మట్టి రోడ్లు, పొలాల గట్లు, పంటచేలలో కూడా చెప్పులు వేసుకోవాలి.

* కాలి గోళ్లను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కట్‌ చేసుకోవాలి.

*బస్సులు, కార్లలో ఎక్కువసేపు కూర్చుని ప్రయాణం చేయడం వల్ల కాళ్లలో నీరు చేరి ఉబ్బుతాయి. దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఎక్కువసేపు కూర్చుని

ప్రయాణాలు చేయకూడదు.

* రోజూ టబ్బులో గోరువెచ్చని నీళ్లుపోసి, దానిలో 'బిటడిన్‌ సొల్యూషన్‌' కలపాలి. ఆ నీళ్లలో ఇరవై నిమిషాలు కాళ్లు పెట్టుకుని కూర్చుని, తర్వాత పొడిబారేలా

తుడుచుకోవాలి. వేళ్ల మధ్య పౌడర్‌ అద్దాలి. గాయం ఉంటే వదులుగా కట్టుకట్టాలి.

పుండుపడితే ఏం చేయాలి?

* డయాబెటిక్‌ ఫుట్‌ సమస్య ఉన్నవారికి కాలి మీద పుండు పడితే... పాదానికి విశ్రాంతి కల్పించాలి. చాలా మంది పుండు పడిన తర్వాత మధుమేహాన్ని

తగ్గించుకునేందుకు వ్యాయామం పేరిట సరైన చెప్పులు లేకుండా నడక ప్రారంభిస్తారు. అలా చేస్తే పుండు మరింత పెరిగి పెద్దది అవుతుంది.

* కాలి రక్తనాళాలు దెబ్బతిని, రక్తప్రసారం సరిగా ఉండదు. కాబట్టి నోటి ద్వారా, లేదా ఇంజక్షన్‌ ద్వారా తీసుకునే మందు గాయం వరకు చేరుతుందో లేదో అనుమానమే !

కాబట్టి కాలికి విశ్రాంతిచ్చి జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం.

* గాయాన్ని రోజుకు రెండుసార్లు కడగాలి. 'సెలైన్‌'తో కడగడం ఉత్తమం. లేకపోతే మరగకాచి, చల్లార్చిన గోరువెచ్చటి నీటిలో చాలా కొద్దిగా (0.9 శాతం) ఉప్పు కలిపి దాంతో కడగవచ్చు. ఈ నీళ్లలో ద్రావకాలేవీ కలపకూడదు.

* కడిగిన తర్వాత తేమ లేకుండా దూదితో అద్దాలి. దానిపైన ఏదైనా పౌడర్‌ చల్లితే చెమట పీల్చుకుంటుంది. తేమ మిగిలిపోతే ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.

* కట్టు కొద్దిగా వదులుగా కట్టాలి. పుండుకు ఎండ తగలనిస్తే త్వరగా మానే అవకాశాలుంటాయి. దుమ్ము పడకుండా, ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

* రోజూ డాక్టరు దగ్గరకు వెళ్లడం కష్టం కాబట్టి. ఎవరికి వారే కట్టు కట్టుకోవటం నేర్చుకోవాలి. తరచూ డాక్టర్‌కు చూపించడం అవసరం.

* పుండ్ల విషయంలో సాధారణ ఆరోగ్యవంతులకు చేసే చికిత్స వేరు. మధుమేహం ఉన్న వారికి చేసే చికిత్స వేరు.

* గాయంపై స్పిరిట్‌ వేయకూడదు. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కూడా వేయకూడదు. అంతగా వేయాల్సి వస్తే బాగా పల్చన చేసి వేయాలి.

* కొంత మంది బోరిక్‌ యాసిడ్‌, టార్టారిక్‌ యాసిడ్‌ పౌడర్‌ను గ్లిజరిన్‌తో కలిపి పేస్టులా చేసి పుండుమీద కట్టుకడతారు. దీని వల్ల పుండు ఆరోగ్యవంతమైన కణజాలంతో, ఎర్రగా తయారవుతుంది గానీ, ఆ మర్నాటికే అది నల్లగా డెడ్‌ టిష్యుగా మారిపోతుంది. కాబట్టి వీటిని వాడకపోవడం మంచిది.

* చీము ఉన్నా నొక్కటానికీ, సూదితో గుచ్చటానికీ, 'కట్‌' చేయడానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే ఇన్‌ఫెక్షన్‌ పైపైకి వ్యాపిస్తూ గాయం మోకాలికి పాకుతుంది. పాదాన్ని, కాలును పైపైకి తొలుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇక గ్యాంగ్రీన్‌ ఏర్పడిందంటే సమస్య మరీ తీవ్రం. కాబట్టి మరీ అవసరమైతే రక్తప్రసారానికీ మరో మార్గం ఏర్పాటు చేసి అప్పుడు కట్‌ చేయాలి.

* పుండు మానిన తర్వాత మళ్లీ కొత్త పుండు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పుండు ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి, మిగతా ప్రాంతాన్ని వదలిపెట్టి, మిగతా ప్రాంతాన్ని మూసివేయడం ద్వారా కూడా దాన్ని నియంత్రించొచ్చు. దీన్ని టోటల్‌ కాస్‌ థెరపీ అంటారు. దీని వల్ల నడవడానికి వీలుండదు. కాలిపై బరువు, ఒత్తిడి పడదు. పుండు త్వరగా మానుతుంది.
 • ==============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Friday, April 22, 2011

జుత్తు తెల్లబడ కుండా కొన్ని జాగ్రత్తలు , Hints to prevent Graying Hairఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -జుత్తు తెల్లబడ కుండా కొన్ని జాగ్రత్తలు(Hints to prevent Graying Hair)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


వయసుతో పాటు జుత్తు తెల్లబడటం మామూలే కానీ చిన్న వయసులో వెంట్రుకలు నలుపుదనాన్ని కోల్పోతుంటే ఎవరికైనా దిగులు పట్టుకుంటుంది. ఒక్క తెల్ల వెంట్రుక కనబడ్డా ఆందోళన మొదలవుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ 'అకాల తెలుపు' బారినపడకుండా చూసుకునే వీలుంది.

పొగ మానెయ్యండి

పొగ తాగటం వల్ల త్వరగా వృద్ధాప్యం ముంచుకొస్తున్నట్టు చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది వెంట్రుకలకూ వర్తిస్తుంది. కాబట్టి జుత్తు తెల్లబడొద్దనుకుంటే వెంటనే సిగరెట్లు, బీడీల వంటివి మానెయ్యాల్సిందే.

ఒత్తిడికి దూరం

మానసిక బాధలు, ఒత్తిడి మూలంగా వెంట్రుకలు తెల్లబడే అవకాశం ఉంది. పొగ లాగానే ఒత్తిడి కూడా త్వరగా వృద్ధాప్యం వచ్చేలా చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం చేయటం ద్వారా ఒత్తిడి బారి నుంచి బయటపడొచ్చు. ఇది జుత్తు ఆరోగ్యానికీ మేలు చేస్తుంది.

ప్రోటీన్లు తినాలి

ఆహారంలో ప్రోటీన్లు లోపించినా తెల్ల జుత్తు రావొచ్చు. కాబట్టి ప్రోటీన్లు దండిగా ఉండే.. మొలకెత్తిన గింజలు, తృణ ధాన్యాలు, మాంసం, సోయా వంటివి తీసుకోవటం మంచిది.

శుభ్రం పరిశుభ్రం

జుత్తు ఆరోగ్యంగా ఉండాలంటే దానిని శుభ్రంగా ఉంచుకోవటమూ ముఖ్యమే. మనలో చాలామంది స్నానం చేసేటప్పుడు తల గురించి అంతగా పట్టించుకోరు. వారానికి మూడు సార్త్లెనా తలస్నానం చేయటం జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది.

కారణాన్ని గుర్తించాలి

విటమిన్‌ బి 12, థైరాయిడ్‌ సమతుల్యత లోపించినా జుత్తు రంగు కోల్పోవచ్చు. అందువల్ల జుత్తు నెరవటానికి గల కారణాలను గుర్తించి తగు చికిత్స తీసుకోవాలి.

కంటి నిండా నిద్ర

కంటి నిండా నిద్ర లేకపోయినా జుత్తుకు ముప్పు పొంచి ఉన్నట్టే. రోజుకి 6-7 గంటల పాటు తగినంత నిద్ర చాలా అవసరం. రాత్రుళ్లు ఎక్కువసేపు టీవీలు, ఇంటర్నెట్‌లకు అతుక్కుపోకుండా ఉంటే మేలు.

రంగులపై ఓ కన్ను

మార్కెట్లో ఏది దొరికితే ఆ జుత్తు రంగునో, ఉత్పత్తులనో వాడటం అంత మంచిది కాదు. వీటిల్లో హానికర రసాయనాలుండే అవకాశం ఉంది. వేటినైనా నిపుణులను సంప్రదించాకే వాడుకోవాలి.

సరదాలకీ ప్రాముఖ్యం

ఎప్పుడూ పనిలోనే మునిగిపోయి సరదాలు, షికార్లును పక్కన పెట్టేయకండి. రెండింటికీ ప్రాధాన్యమిస్తూ ఆనందంగా గడిపే మార్గాలను అన్వేషించండి. ఇది జుత్తు తెల్లబడకుండానే కాదు.. త్వరగా ముసలితనం మీద పడకుండానూ కాపాడుతుంది.

మాత్రల తోడు

ఒమేగా 3 చేపనూనె మాత్రలను తీసుకోవటమూ జుత్తు నెరవకుండా చూస్తుంది. అవసరమైనప్పుడు వైద్యుల సూచన మేరకు వేసుకోవాలి.
 • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, April 10, 2011

సిద్ధ, (Siddha)ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సిద్ధ (Siddha) - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

సిద్ధ వైద్యం

సిద్ధ (Siddha) అంటే సంస్కృతంలో పూర్తి సామర్ధ్యం కలవారు అని అర్థం మరియు కచ్చితమైన మాస్టర్స్‌ కు దీనిని అపాదించవచ్చు. హిందూ నమ్మకం ప్రకారం, అహంకార (ఇగో లేదా ఐ మేకర్‌)ను వదిలి, వారి మనసులను వారి ఆలోచనలకు తగ్గట్లుగా నిగ్రహం తో ఉంచుకునేవారు మరియు వారి శరీరాలను (ముఖ్యంగా రజో తమో గుణాలతో దూరంగా) సత్వ గుణం తో భిన్నమైన దేహంగా మలచుకునేవారు. సాధారణంగా ధ్యానం చేయడం ద్వారా నైపుణ్యం ను పొందగలుగుతారు.

ప్రత్యామ్నాయ వైద్యవిధానాలలో సిద్ధ దక్షిణ భారతదేశములోని ద్రవిడుల (Dravidians) కాలము నాడు ప్రసిద్ధమైనది. "సిద్ధార్దులు" లేక శైవ భక్తులైన ఋషులు దైవానుగ్రహము వలన పొందిన వైద్యజ్ఞానము ఇది. పురాణాల ప్రకారము సిద్ధార్దులు 18 మంది, వారిలో అగస్త్యుడు ముఖ్యమైన వాడు మరియు సిద్ధ వైద్య పితామహుడని పిలవబడుచున్నాడు. జీవి అన్న ప్రతి దానికి మనసు, శరీరము అనే రెండు భాగాలుంటాయని, ఆరోగ్యవంతమైన శరీరము లోనే శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన మనసు ఉంటుందని సిద్ధులు నమ్మేవారు. ఆ కాలములో వీరు కొన్ని మెదడ్స్ ని , మెడిటేషన్ విధానాలను రూపొందించారు. వీరు నమ్మే సిద్ధాంతాలను వమ్ము చేయకుండా నిర్మలమైన మనస్సుతో మెడిటేషన్ చేయడమువలన జబ్బులకు, అనారోగ్యానికి దూరంగా ఉండేవారు.

సిద్ధ వైద్యములో ఆయుర్వేదములాగే శారీరక రుగ్మతలను వాత, పిత్త, కఫ అనే రకాలుగా వ్యవహరిస్తారు .సిద్ధ వైద్యం అనేది, ప్రతి సందర్భంలోనూ శరీరానికి హాని కలిగించే రోగాల యొక్క మూలాలను తొలగించి వేయడం. ఈ వైద్య పద్దతిని అనేక మంది సిద్ధులు అవలంబిస్తున్నారు. భవిష్యత్‌ తరాలకు ఈ వైద్యం యొక్క వివరాలను అందించడానికి దీనికి సంబంధించిన అంశాలను సిద్దార్లు గ్రంథస్తం చేస్తున్నారు. సిద్ధ వైద్యం అనేది ద్రవిడియన్లు (పూర్వకాల తమిళులు) రూపొందించారు. స్థానికంగా వీరిని సిట్టార్‌ లు అని పిలుస్తారు. వీరు దీనికి వాడే మందులను ఆకులు, బెరడు‌, కాండం‌, దుంపల నుంచి తయారు చేస్తారు. కానీ ఇందులో కొన్ని జంతువులకు సంబంధించిన అంశాలు మరియు ఖనిజాల‌ను కూడా కలుపుతారు. ఈ పద్దతి వైద్యం ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో బాగా ప్రసిద్ధి చెంది ఉంది. బంగారం, వెండిమరియు ఇనుము యొక్క పొడి (సంస్కృత - భష్మం) తదితర లోహాలను కూడా కొన్ని మందులు తయారు చేయడానికి సిద్ధ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఈ లోహాలు శరీరంలోని కొన్ని రోగాలను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ పద్దతిలో తరచుగా ఉపయోగించే పాదరసం విషయంలో ఈ వాదన చాలా ఎక్కువగా ఉంది. వైద్యంలో పూర్తి స్వచ్ఛమైన పాదరసాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. ఏదేమైనా ఇది చాలా ఎక్కువ నైపుణ్యం కలిగిన కళగా చెప్పుకోవాలి.

సిద్ధ సంప్రదాయం

సిద్ధ అనేది ప్రస్తావనకు వచ్చినప్పుడు, 84 సిద్ధలు మరియు 9 నతాలు గుర్తుకువస్తాయి. ఇది సిద్ధలు యొక్క సంప్రదాయం. అందుకే దీనికి సిద్ధ సంప్రదాయం అని పేరు వచ్చింది. సిద్ధ అనే పదం మహాసిద్ధులకు మరియు నాతాలకు కూడా వాడతారు. కాబట్టి సిద్ధ అంటే అర్థం ఒక సిద్ధి కావచ్చు, మహా సిద్ధి కావచ్చు లేదా నాత కావచ్చు . ఈ మూడు పదాలు సిద్ధ, మహాసిద్ధ మరియు నాతా అనేవి ఒకదానికి ఒకటి మార్చుతూ కూడా వినియోగించవచ్చు.

సిద్ధ – శైలి

జైనతత్వం ప్రకారం సిద్ధ శైలి జైన్‌ల తత్వం ప్రకారం, సిద్ధ శైలి అనేది విశ్వం యొక్క అగ్రభాగాన కొలువై ఉంటుంది. సిద్ధులు (అంతరించిన ఆత్మలు, తిరిగి పుట్టుక లేనివి, జీవితం మరణం అనే సైకిల్‌ను దాటిపోయినవారు) సిద్ధశైలిని దాటి, అనంతంలో స్థిరపడిపోతారు. సిద్ధ అనేది ఆత్మ యొక్క మరొక స్థాయి. అరిహంత అంటే కేవల జ్ఞానను సూచిస్తుంది.
హిందూ తత్వంలో, సిద్ధలోకం అనేది సూక్ష్మమైన‌ ప్రపంచం (లోకం ), ఇక్కడ ఉన్నవారు (సిద్ధులు) తిరిగి పుడతారు. పుట్టుకలో ఎనిమిది ప్రాధమిక సిద్ధులు ఉంటాయి.

సిద్ధాశ్రమం

హిందూ పురాణాల ప్రకారం సిద్ధాశ్రమం అనేది హిమాలయాల అంతర్భాగంలో ఉంది. ఇక్కడ గొప్ప యోగులు, సాధువులు మరియు సాగులు సిద్ధ జీవితాన్ని గడుపుతుంటారు. టిబెటిన్ల పవిత్ర భూమి శాంభాలకు ఈ ఆలోచన సమాంతరంగా ఉంటుంది. సిద్ధాశ్రమాన్ని అనేక భారత ఇతిహాసాల్లో, పురాణాల్లో ప్రస్తావించారు. ఇందులో రామాయణ, హాభారతాలు కూడా ఉన్నాయి. వాల్మికి రామాయణంలో, విశ్వామిత్రుడు సిద్ధాశ్రమంలోనే జీవించారని చెప్పారు. ఇది విష్ణువు యొక్క ఆవాసం‌. విష్ణువు వామనావతారము దాల్చినప్పుడు ఇది
తెలుస్తుంది. రామ లక్ష్మణులను విశ్వామిత్రుడు సిద్ధాశ్రమానికి తీసుకెళ్లి, తన మత త్యాగాలను నాశనం చేయాలని చూస్తున్న రాక్షసులను సంహరించమని కోరతారు.


సిద్ధ (Siddha)

సిద్ధ (Siddha) అంటే सिद्ध సంస్కృతంలో పూర్తి సామర్ధ్యం కలవారు అని అర్థం మరియు కచ్చితమైన మాస్టర్స్‌కు దీనిని అపాదించవచ్చు. హిందూ నమ్మకం ప్రకారం, అహంకార (ఇగో లేదా ఐ మేకర్‌)ను వదిలి, వారి మనసులను వారి ఆలోచనలకు తగ్గట్లుగా నిగ్రహంతో ఉంచుకునేవారు మరియు వారి శరీరాలను (ముఖ్యంగా రాజో తమా గుణాలతో) సత్వతో భిన్నమైన దేహంగా మలచుకునేవారు. సాధారణంగా ధ్యానం చేయడం ద్వారా నైపుణ్యంను పొందగలుగుతారు. జైనుల నమ్మకం ప్రకారం సిద్ధ అంటే, కర్మ బంధాలను తెంచుకుని తమ ఆత్మలను స్వేచ్ఛగా చేసుకునేవారు. సిద్ధకు ఎలాంటి శరీరం ఉండదు. ఆత్మ పూర్తి స్వచ్ఛతను కలిగి ఉండటమే సిద్ధ. ఒకరు ఎవరైతే సిద్ధిని పొందారో, వారి గురించి పేర్కొంటూ, ఇచ్చే నిర్వచనాన్ని కూడా సిద్ధ అంటారు. ఇక్కడ సిద్ధిలు ఒక వ్యక్తికి ఉన్న పారానార్మల్‌ సామర్ధ్యాలను, ఎమర్జెంట్‌ సామర్ధ్యాలుగా గుర్తించి, దీనిని సిద్ధత్వంలో భాగంగా తీసుకోవాలి. ఇక్కడ ప్రణవ్‌ లేదా అవుమ్‌లో స్థిరపడిన వారిని సిద్ధగా నిర్వచించలేదు. అనగా సృష్టికి సంబంధించి ఆధ్యాత్మిక భావన పొంది ఉండటం. సిద్ధి అనేది తన పూర్తి స్వచ్ఛమైన అర్థంలో వాస్తవంలో పూర్తి అస్థిత్వాన్ని సాధించడం (బ్రహ్మాన్‌): స్పిరిట్‌ యొక్క కచ్చితత్వం. కాశ్మీర్‌ శైవత్వం (హిందు తంత్ర) యొక్క హిందూ వేదాంతంలో, సిద్ధ అంటే సిద్ధ గురువు అని కూడా అర్థం. ఈయన యోగాలో శక్తిపత్‌ అంశాల ద్వారా ఇది సాధిస్తారు.


సిద్ధ, ఆయుర్వేద, హోమియోపతి, యునానీ ఇలా ప్రత్యామ్నాయ వైద్యంలో నిపుణులు ఎవరైనా సరే వారికి గల శిక్షణను బట్టి శస్త్ర చికిత్సతో సహా అధునాతన ఔషధాల చికిత్స ను కూడా చేయవచ్చునని పేర్కొంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ను ఈ సందర్భంగా చెప్పుకోదగ్గ విషయము . • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, April 9, 2011

వ్యాయామం సౌకర్యం కొరకు జాగ్రత్తలు, Hints for protection in exercise


 • ఫొటో--source : Eenadu vasundara
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వ్యాయామం సౌకర్యం కొరకు జాగ్రత్తలు(Hints for protection in exercise)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...-తరచూ జిమ్‌, యోగా కేంద్రాలకు వెళ్లేవారు.. సౌకర్యంగా ఉండటానికి వెంట కొన్ని వస్తువులు తీసుకెళ్లాలి. తరచూ వాటిని ఉపయోగిస్తే ఆనందం, ఆరోగ్యం.

షూ జత : జిమ్‌కు వెళ్లేవారు తప్పనిసరిగా షూలు ధరించాలి. అవి అరికాళ్ల నొప్పులు, మంటను దూరం చేస్తాయి కొందరు మామూలు చెప్పులు వేసుకోవడం వల్ల ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్క జిమ్‌కు మాత్రమే కాదు ఏ ఇతర వ్యాయామాలు చేసినా అవి తప్పనిసరి. ప్రత్యేకంగా వ్యాయామానికి అయితే నాణ్యమైనవి, సౌకర్యవంతంగా ఉండేలా ఎంచుకోవాలి. కొన్ని రకాల సాధనాలు చేస్తున్నప్పుడు పాదాల మీద ఒత్తిడి పడుతుంది. అలాంటప్పుడు నాణ్యతకు ప్రాధాన్యమివ్వాల్సిందే!

సాక్సులు : పాదాలు కోమలత్వాన్ని కోల్పోకుండా ఉండాలంటే సాక్సులు తప్పనిసరిగా ధరించాలి. అయితే చెమటతో ఇబ్బంది రాకుండా వాటిని ధరించే ముందు పాదాలకు యాంటీబ్యాక్టీరియల్‌ పౌడర్‌ రాసుకొంటే సమస్య ఉండదు. అలానే చేతులకూ గ్లవుజులు తొడుక్కోవాలి.

చేతికి స్ట్రాప్స్‌ : వ్యాయామ సాధనలో ముఖ్యమైంది వెయిట్‌ లిఫ్టింగ్‌. బరువైన డంబెల్స్‌ పట్టుకొన్నప్పుడు చేతులు మృదుత్వాన్ని కోల్పోతాయి. ఒక్కోసారి బరువుకు కందిపోతాయి కూడా. అందుకే క్రీడాకారుల మాదిరి స్ట్రాప్స్‌ ధరించాలి. వాటిని జిమ్‌కు తీసుకెళ్లే బ్యాగులో పెట్టుకొంటే ఇక మర్చిపోవడం అనేదే ఉండదు.

చాప : యోగాసాధన చేయడానికి చిన్నచాపలు అందుబాటులో ఉంటున్నాయి. పనిలో పనిగా వాటిని తీసుకొని బ్యాగులో సర్దుకున్నామనుకోండి రోజూ జిమ్‌కు తీసుకెళ్లవచ్చు. జిమ్‌ కేంద్రంలో కింద కూర్చొని ఆసనాలు, వ్యాయామం చేయాల్సి వస్తుంది. కింద ఏమీ లేకుండా సాధన చేసినప్పుడు శరీరం ఒత్తిడి గురవుతుంది. అలాకాకుండా ఉండాలంటే తప్పనిసరిగా జిమ్‌ మ్యాట్‌ వెంట పెట్టుకోవాల్సిందే!

అనువైన దుస్తులు : వ్యాయామసాధన చేసినప్పుడు చెమట పడుతుంది. అందుకే చెమటను పీల్చే దుస్తులు ధరించినప్పుడు చిరాకు అనిపించదు. అలానే వదులుగా ఉండే వాటికి ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యంగా స్పోర్ట్స్‌ బ్రాలు వేసుకోవాలి. జిమ్‌నుంచి వచ్చిన వెంటనే స్నానం చేసి దుస్తులు మార్చుకోవాలి. అవి చెమట పట్టి ఉంటాయి. కాబట్టి ఏ రోజుకారోజు ఉతకాలి.

తువాలు : మధ్యమధ్యలో చెమట తుడుచుకోవడానికి చిన్న తువాలును బ్యాగులో ఉంచుకోవాలి. అలానే టిష్యూకాగితాలూ కొన్ని పెట్టుకోవాలి. అలసట అనిపించినప్పుడు ముఖం కడుక్కొని తుడుచుకొంటే ఫలితం ఉంటుంది. అంతేకాదు చర్మం తాజాగానూ కనిపిస్తుంది.


 • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Thursday, April 7, 2011

ఎత్తు మడమల చెప్పులు సమస్యలు ,High heel footware and problemsఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఎత్తు మడమల చెప్పులు సమస్యలు (High heel footware and problems)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


అందాన్ని పెంచేవి దుస్తులేకాదు, మీరు తొడిగే దుస్తులకు మేచింగ్‌గా వేసుకునే పాదరక్షలు కూడా మీ అందాన్ని యినుమడింప చేస్తాయి. పూర్వం పాదరక్షలని యెందుకన్నారంటే పాదాన్ని రక్షించేది కనక పాదరక్షలు అన్నారు. ప్రస్తుతం పాదరక్షలు అన్న పదానికి పాదములకు అందమునిచ్చేవి అని అర్థం చెప్పుకోవాలి. ఆభరణాలు, దుస్తులు ఏ విధంగా వ్యక్తికి అందాన్నిస్తాయో చెప్పులు, బూట్లు కూడా వ్యక్తికి అదేవిధంగా ఒక స్టేచర్‌ని కల్పిస్తాయి.

పాదరక్షలలోకూడా అనేక రకాలున్నాయి. ఒక్కొక్క రకం పాదరక్షలను ఒక్కొక్క రకమైన ఫంక్షన్సుకు వుపయోగిస్తారు. ఫంక్షన్సుకు వేసుకునే దుస్తులకు సరి పోయే పాదరక్షలనే వాడాలి. పూర్తి సూటుగాని, సాఫారీ సూట్‌గాని వేసినప్పుడు బూట్లు తప్పనిసరిగా వేసుకోవాలి. చెప్పులు ఎబ్బెట్టుగా వుంటాయి. పైజమా వేసుకునేప్పుడు చెప్పులే ధరించాలి. బూట్లు వేసుకోవడం వింతగా వుంటుంది.

చీర కట్టే వారికి పాదాలు కనిపించవు, కనుక ఏ చెప్పులు వేసుకున్నా ఫరవాలేదు. ఈ రోజుల్లో పాదాలు కనబడే విధంగా సుర్వాలు, కుర్తాలు, కమీజులు, పాంట్లు వేస్తున్నారు

ఎత్తు మడమల చెప్పులు వేసుకుంటే చూడ్డానికి స్త్టెలిష్‌గా కనిపించొచ్చు. కానీ వాటి ఎత్తు పెరిగేకొద్దీ మడమలపై భారం పెరిగిపోతుంది . సాధారణంగా మనం నిలబడినప్పుడు మన శరీరభారాన్ని మోసేది పాదాలే. చెప్పుకుండే హీల్‌ ఒక అంగుళం ఎత్తు ఉంటే మడమలపై భారం మామూలుకన్నా 22 శాతం అధికమవుతుందట. రెండు అంగుళాల ఎత్తుంటే ఆ భారం 57 శాతం పెరుగుతుంది. మూడంగుళాల ఎత్తు చెప్పులు వేసుకుంటే 76శాతం అధికభారం మడమలపై మోపినట్టే. దీర్ఘకాలం పాటు ఇలాంటి చెప్పులే వాడితే పాదాల కండరాలు బలహీనపడి మామూలు చెప్పులు వేసుకున్నా నడవటమే కష్టమవుతుంది . ఒకవేళ ఎత్తుమడమల చెప్పులు వేసుకుని పార్టీలకు వెళ్లినా నాలుగు గంటలకు మించి వాటిని పాదాలకు ఉంచుకోవద్దు. విధిలేని పరిస్థితుల్లో ఎక్కువసేపు అలా ఉండాల్సివస్తే ఇంటికి వెళ్లగానే ఐస్‌ తో కాపడం పెట్టుకోవాలి .

ఎత్తు పాదరక్షలు (పాదాభరణాలు ) ధరించడం వల్ల కలిగే కష్టాలు :
 • శరీర బరువంతా పాదాలపై పడటం వల్ల పాదాల నొప్పి తప్పదు.
 • వీటిని ఎక్కువ సమయం ధరిస్తుంటే.. కొన్నాళ్లలో నడుం, వెన్నునొప్పులు బాధిస్తాయి.
 • ఎత్తు మడమల చెప్పులు శరీరం బరువుని అటూఇటూ మారుస్తుంటాయి. దీంతో శరీరాన్ని నియంత్రించుకునే సమయంలో వెన్నెముక మీద చాలా అదనపు భారం పడుతుంది. కాబట్టి, వీటి వాడకాన్ని తగ్గించుకోవాలి.
 • మునివేళ్ల మీద నడవడం వల్ల ఒత్తిడి పెరిగి బొటన వేళ్ళు వంకర పోవడం, మోకాళ్ల నొప్పులు, కీళ్లు మరియు కాలి మడమలు అరిగిపోవడం, నరాలు తొలగిపోవడం, పాదాలు దెబ్బతినడం, గోళ్ల ఇన్‌ఫెక్షన్ రావడం వంటి ప్రమాదాలున్నాయని ఆర్థోపిడిషియన్(ఎముకుల డాక్టర్)లు అంటున్నారు.

సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే

 • ఒకవేళ ప్రతిరోజు అయితే.. 1 - 1.5 అంగుళాల పొడుగున్నవి ఎంచుకోండి. ఇంకా ఎత్తు చెప్పుల్ని ప్రత్యేక సందర్భాలకు మాత్రమే పరిమితం చేసుకోండి.
 • ఇలాంటివి ధరిస్తున్నప్పుడు పాదాలు పక్కకు వంగినట్లు అవుతాయి. ఎత్తు ఎక్కువగా ఉన్నకొద్దీ ఈ సమస్య తప్పదు. అందుకే.. ఒకటికి రెండుసార్లు వేసుకుని చూసి.. సౌకర్యంగా అనిపించినప్పుడే కొనుక్కోండి.
 • ఎంతో ఇష్టపడి ఎంచుకున్నా కూడా కొన్నిసార్లు ఎలాంటి మడమల్లేని పాదరక్షల్నీ ధరిస్తుండాలి. ఇంట్లో ఉన్నప్పుడు సాధారణ చెప్పుల్ని వేసుకోవాలి. అప్పుడప్పుడు వట్టికాళ్లతో నడవాలి. ఇది పాదాలకు సౌకర్యాన్నిస్తుంది. ఈ తరహా పాదరక్షల్ని ఎనిమిది నుంచి పదిగంటలకు మించి ధరించకపోవడమే మంచిది.
 • కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని అరిపాదాలకు రాసుకుని నెమ్మదిగా మర్దన చేయాలి. దీనివల్ల పాదాల నొప్పుల్ని నివారించవచ్చు.
 • ఎత్తు మడమల చెప్పులతో ఎదురయ్యే వెన్నునొప్పుల్ని నివారించేందుకు.. నడక, యోగా.. ఇతర వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి.

 • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

రాస్ట్రం లో మానసిక సమస్యలు , Mental problems in A.P stateఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఆంధ్రప్రదేశ్ లో మానసిక సమస్యలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

రెండు శాతం మందిలో అత్యంత తీవ్రం,రుగ్మతకు ప్రాధాన్యమివ్వాలని కేంద్రం నిర్ణయం.3 వైద్యశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం యోచన

దశాబ్ద కాలంలో జీవనశైలిలో వచ్చిన వివిధ మార్పులు వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నేడు ఎంతో మంది ఏదో ఒకరకమైన ఒత్తిడికి లోనవుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 12 శాతం మందికి మానసిక సమస్యలు ఉన్నాయి. వీరిలో రెండు శాతం మందికి అతి తీవ్రంగా, మరో అయిదు శాతం మందికి తీవ్రంగా, ఇంకో అయిదు శాతం మందికి ఒక మోస్తరుగా ఉన్నాయి. వీరంతా సకాలంలో చికిత్స తీసుకుంటే సమస్యను పరిష్కరించడం సులభమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. సాధారణ వ్యాధులతో పోలిస్తే మానసిక సమస్యల పెరుగుదల ఎక్కువగా ఉందని పేర్కొంటున్నారు. మానసిక రుగ్మతలు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ సమస్యకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. దీనిపై అన్ని రాష్ట్రాల వైద్య,ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఇటీవల జాతీయస్థాయి సమావేశాన్ని నిర్వహించింది. భవిష్యత్తులో మిగిలిన జబ్బులతో పోలిస్తే మానసిక రుగ్మతలు ప్రథమ స్థానం ఆక్రమిస్తాయని భేటీలో నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను అధిగమించడానికి ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో, మానసిక సమస్యల చికిత్సకు ఇప్పుడు ఉన్న నిబంధనలను పూర్తిగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక ముసాయిదా బిల్లును రూపొందించినట్లు హైదరాబాద్‌లోని మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.ప్రమోద్‌ కుమార్‌ 'న్యూస్‌టుడే'తో చెప్పారు.

జిల్లా ఆస్పత్రుల్లో నియామకాలు
సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టాలని భావిస్తోంది. హైదరాబాద్‌, విశాఖపట్నంలో ఉన్న మానసిక వైద్యశాలలకు అదనంగా మరో మూడు ప్రత్యేక ఆస్పత్రులు స్థాపించే అంశాన్ని పరిశీలిస్తోంది. జిల్లా ఆస్పత్రికి ఒకరు చొప్పున మానసిక వైద్యనిపుణులను నియమించాలని యోచిస్తోంది. ప్రతి 100 పడకల వైద్యశాలలో ఒక మానసిక వైద్యుడిని నియమించాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కొద్ది రోజుల క్రితం ఒక ఉన్నతస్థాయి భేటీలో నిర్ణయించారు.

ఉన్నతస్థాయి భేటీ సిఫార్సులు
* సాధారణ వైద్యసేవల స్థాయిలో మానసిక సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
* మానసిక రుగ్మతలు ఉన్నవారి పట్ల వివక్ష చూపకూడదు.
* తీవ్రమైన మానసిక రుగ్మతలున్న వారికి ఉచితంగా మందులు ఇవ్వాలి.
* మానసిక సమస్యలపై ప్రత్యేక నర్సింగ్‌ డిప్లొమా కోర్సు ప్రారంభించాలి.
* నేరచరిత్ర ఉన్నవారు శిక్ష నుంచి తప్పించుకోవడానికి 'మానసిక రుగ్మత'ను ఒక అవకాశంగా వాడుకోకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకోవాలి.
* మానసిక స్థితి బాగాలేదని ఆస్పత్రుల్లో చేరే ముందు తమపై ఎలాంటి కేసులు లేవని రోగులు రాతపూర్వకంగా ధ్రువీకరించాలి. లేదా వారి సంబంధీకులు ధ్రువీకరణ ఇవ్వాలి.
* ప్రైవేటు ఆస్పత్రుల్లో మానసిక సమస్యలకు చికిత్స నిర్వహించడానికి వైద్య, ఆరోగ్యశాఖ నుంచి ప్రత్యేక గుర్తింపు తీసుకోవాలి.
* మానసిక వైద్యుల ప్రతిభను నిర్ణయించడానికి నిపుణుల కమిటీ సాయంతో ప్రత్యేక గ్రేడింగ్‌తో కూడిన గుర్తింపును ఇచ్చే విధానాన్ని అమలు చేయాలి.

మూలము : హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
 • ================================================
Visit my website - -> Dr.Seshagirirao.com/

Wednesday, April 6, 2011

వెన్నునొప్పి ఉంటే బల్లపైనే పడుకోవాలా?,Do we sleep on a bench in backbone pain?


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వెన్నునొప్పి ఉంటే బల్లపైనే పడుకోవాలా?(Do we sleep on a bench in backbone pain?)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...చాలామంది వెన్ను నొప్పి ఉన్నప్పుడు కేవలం చెక్కబల్ల పైనే పడుకోవాలేమోనని అనుకుంటారు. అయితే అలా చేయడంవలన కండరాలు, ఎముకలు ఒరుసుకు పోయి అసౌకర్యం మరింత పెరుగుతుంది. మరికొంతమంది పరుపు లేకుండా పడుకోవాలనే ఉద్దేశ్యంతో నేలమీద పడుకుంటారు.

అయితే పడుకున్న తరువాత నేలమీద నుంచి లేవా ల్సివస్తే వంగాల్సి వస్తుంది. దీనివల్ల నడుము నొప్పి మరింత పెరిగే అవకాశాలున్నాయి. పైగా నేలనుంచి చల్లదనం, తేమవంటివి శరీరానికి చేరి నడుము కండరా లను మరింత బిగుసుకునేలా చేస్తాయి. వాస్తవానికి మంచం బేస్‌ అనేది కుంగిపోకుండా, స్థిరంగా ఉంటే చాలు.

మంచి మందపాటి ప్లైవుడ్‌ షీట్‌ను మంచం బేస్‌గా ఉపయోగిస్తూ పరుపును రెండు అంగుళాల మందం ఉండేలా అమర్చుకుంటే సరిపోతుంది.
వాటర్‌ బెడ్స్‌, ఆర్థోపెడిక్‌ బెడ్స్‌ వంటి వాటి వలన ఉపయోగం ఉంటుంది కానీ అవిచాలా ఖరీదుతో కూడి నవి.

జీవితంలో చేసుకోవాల్సిన మార్పులు
వెన్ను నొప్పి దీర్ఘకాలంనుంచి బాధిస్తున్నప్పుడు రోజు వారీ కార్యక్రమాలన్నింటినీ గమనించండి. ఎక్కడ, ఏ భంగిమలో, ఏ సందర్భంలో నొప్పి వస్తున్నదో కని పెట్టండి. వృత్తిపరంగా లేదా రోజువారీగా వాడే వస్తు వుల వలన నొప్పి వస్తుంటే ప్రత్యా మ్నాయ పద్ధతుల గురించి ఆలోచించండి.

నిలబడి పని చేయాల్సి వచ్చినప్పుడు కూర్చుని పని చేయడం, బరువులను మోయాల్సి వస్తే హ్యాండ్సిల్స్‌ అమర్చుకోవడం వంటి చిన్నపాటి మార్పులు చేర్పులతో రోజువారీ కార్యకలాపాలను సౌకర్యవంతంగా నిర్వర్తించ వచ్చు.

పథ్యాపథ్యాలు
మీరు అధిక బరువును కలిగి ఉంటే తేలికపాటి ఆహారం తీసుకుంటూ బరువు తగ్గే ప్రయత్నం చేయండి.
స్థూలకాయం వలన వెన్నుపూసల మీద అదనంగా బరువు పడి నొప్పి తీవ్రతరమవుతుంది.
అధిక బరువును తగ్గించుకోవాలంటే తీపి వస్తువులు, వేపుడు పదార్థాలు, నూనెల వంటివి బాగా తగ్గించాలి.
తగిన వ్యాయామాన్ని చేయాలి. సూచనల మేరకు మందులు వాడాలి.
ఉదరంలో గ్యాస్‌ అధికంగా తయారైతే వెన్ను మీద వత్తిడి ఎక్కువ అవుతుంది.
అందుకే గుడ్డు, శనగపిండి వంటకాలు, ఉల్లి, చిక్కుళ్లు, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, దోస కాయ, మసాలాలు, పచ్చి సలాడ్స్‌ వంటి గ్యాస్‌ను తయారు చేసే వాతకర ఆహారాలను తగ్గించాలి.


 • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

మూర్చ (ఫిట్స్ )వ్యాధి , Epilepsy(Fits)ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మూర్చ (ఫిట్స్ )వ్యాధి (Epilepsy(Fits))- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

మూర్ఛ వ్యాధి(epilepsy) అనేది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే నరాలకు సంబంధించిన పరిస్థితి. మూర్ఛవ్యాధిని మూర్ఛల అనారోగ్యం అని కూడా అంటారు. కనీసం రెండు మూర్ఛలు ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత సాధారణంగా రోగ నిర్ధారణ చేయబడుతుంది. మూర్ఛ వ్యాధి మెదడుకు ఏర్పడిన ఒక గాయంగా పరిగణించవచ్చు. కానీ చాలా సార్లు కారణం ఏమిటో తెలియదు. మూర్ఛ వ్యాధి ఏ తరహావి అన్నది లేదా అవి ఎంత తీవ్రమైనవి అని బయట ఎవరూ తెలుసుకోలేరు.

అపుడప్పుడు కొందరు క్రింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ స్పృహతప్పిపోతుంటారు. వారిచేతిలో తాళాల గుత్తి పెట్టే ప్రయత్నం పక్కవారు చేస్తుంటారు. కొందరికి ఈ సమయంలో నోట్లోనుంచి నురగ రావడం కూడా కనిపిస్తుంటుంది. వీరిని మూర్ఛవ్యాధి గ్రస్తులుగా మనం గుర్తిస్తాం. ఈ మూర్ఛనే ఫిట్స్‌గా వైద్యులు చెప్తారు. ఆయుర్వేద శాస్త్రం మాత్రం ఈ ఫిట్స్‌ను గాని స్పృహను కోల్పోయి పడిపోవడం లాంటి లక్షణాలను అపస్మారకం అంటోంది. స్మారకం అంటే జ్ఞాపకశక్తి, అప అంటే నాశనం కావడం అంటే జ్ఞాపక శక్తిని కోల్పోవడమే నంటారు.

 • వ్యాధి లక్షణాలు

మూర్చ పోయే ముందు తీవ్రమైన వణుకులు, నోటి నుండి చొంగ కారుట ఒక్కోసారి నాలుక కరుచుకొనుట జరుగును. ఆ తర్వాత కొంత సేపటికి మరల మామూలు స్థితికి వస్తారు.


 • మూర్ఛ వ్యాధి ఎవరికి వస్తుంది...?
ఒక వ్యక్తిలో మూర్ఛ వ్యాధి ఏ వయస్సులోనైనా రావచ్చు. 0.5 శాతం నుండి 2 శాతం వరకు ప్రజలలో తమ జీవిత కాలంలో మూర్ఛ వ్యాధి వృద్ది అవుతుంది. మన దేశంలో దాదాపు 10 మిలియన్‌ ప్రజలకు ఈ వ్యాధి ఉంది. దీని అర్థం ప్రతి 1000 మందిలో 10 మందికి ఉందన్న మాట.

 • మూర్ఛ వ్యాధిని కలిగించేది ఏది...?
మెదడులో విద్యుత్‌ కార్యకలాపాల ను ప్రారంభింపచేసే అంశాలకు, దానిని నియంత్రించే అంశాలకు మధ్య ఒక సున్నితమైన సమతుల్యం ఉంది. విద్యుత్‌ కా ర్యకలాపాలను వ్యాపింపచేయడాన్ని పరిమితం చేసే వ్యవస్థలు కూడా ఉంటాయి. మూర్ఛ వచ్చిన సమయంలో ఈ పరిమితులు విచ్చిన్నమవుతాయి. దీంతో పాటు విపరీతమైన విద్యుత్‌ విడుదలలు సంభవించవచ్చు. ఒక వ్యక్తికి కనీసం ఈ మూర్ఛ రెండు సార్లు వచ్చి నప్పుడు దానిని మూర్ఛ వ్యాధి అని అంటారు.

 • వ్యాధి రావడానికి కారణాలు...
జ్వరం, పుట్టుకతో వచ్చే లోపాల (కష్టమైన ప్రసూతి) వల్ల మూర్ఛ వ్యాధి రావచ్చు. మెదుడలో లోపాలు లేదా మెదడులో కంతులు, ఇన్‌ఫెక్షన్‌లు (మెనింజైటీస్‌), వేడి నీళ్లతో తలంటుకోవడం, మందుల పరస్పర చర్యల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతిగా మద్యపానం, నిద్రలేకపోవడం, ఆకలితో మాడడం, తారుమారు చేసే ఉద్రిక్తత, రుతు క్రమాల సమయాల్లో లోపాల మూలంగా ఈ వ్యాధి వస్తుంది.

అసలు ఈ మూర్ఛ ఎందుకు వస్తుంది? ఎవరికి వస్తుంది అంటే మెదడు, కిడ్నీ, కాలేయపు వ్యాధుల వల్ల ఈ మూర్ఛరోగం రావచ్చు. ఎవరికీ అంటే దీనికి స్ర్తి పురుష భేదం కాని వయస్సు కాని అడ్డంకి కాదు. ఎవరైనా ఈ వ్యాధి బారినపడవచ్చు. సాధారణంగా ఆల్కహాలు తీసుకొనే వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాక రక్తంలో కాల్షియం, సోడియం, గ్లూకోజ్, ఆక్సిజన్ మోతాదు తగ్గినప్పుడూ ఈ ఫిట్స్ కనపడుతుంది. అంతేకాదు డిప్రెషన్‌కు వాడే మందులకూ, మెట్రొనిడజోల్‌కూ లోకల్ ఎనస్థిటిక్ మందులకూ కూడా ఈ ఫిట్స్ కలిగించే గుణాలున్నాయని తేలింది.

మహిళల్లో హార్మోన్ల తేడావల్ల కూడా ఈ ఫిట్స్ వచ్చే అవకాశాలున్నాయి. దీనివల్ల గర్భధారణలోనూ, బహిస్టు సమయాల్లోనూ, సంతాన నిరోధక మాత్రలు వాడుతున్నపుడూ ఈ ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మిరుమిట్లు గొలిపే కాంతిని చూసినా, వెల్డింగ్ సమయంలో జనించే కాంతిని చూసినపుడూ, మధ్యాహ్నం పూట మిలమిలా మెరిసే నీళ్లను చూసినా కూడా ఫిట్స్ మొదలవుతాయని వైద్యులు చెప్తారు.

చికిత్సలను కూడా వైద్యుని పర్యవేక్షణలోనే చేయాలి. మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుందో వైద్యులను సంప్రదించి తెలుసుకొని దాని నివారణకు ప్రయత్నించాలి.

మూర్చవ్యాధి సోకితో గతంలో వ్యాధి సోకిన వారికి మెడలో ఇనుప వస్తువును వేసేవారని, చేతిలో ఇనుప తాళాలు పెట్టడం, నోటిలో వస్తువులు దూర్చడం వంటి పనులు చేసేవారన్నారు. అయితే రానురాను పెరుగుతున్న ఆధునిక వైద్య విధానాల వలన మూర్చ వ్యాధి నివారణకు మార్గం సుగమం అయిందన్నారు. అయినప్పటికీ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధిపట్ల అవగాహన కొరవడిందని, ప్రజల్లో మూర్చ వ్యాధిపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది . మూర్చ వ్యాధి వంశపారపర్యంగా వస్తుందని, బ్రెయిన్‌లో ట్యూమర్లు ఏర్పడి వచ్చే అవకాశాలున్నాయని, ఆహారం ద్వారా వచ్చే క్రిముల వలన ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. ఒక నిమిషం కన్నా ఎక్కువ సేపు మూర్చలో ఉన్నట్లైతే వెంటనే హాస్పిటల్‌కు తరలించాలి.


 • మూర్ఛలో రకాలు

1. జ్వరంతో పాటుగా వస్తూ వుండే మూర్ఛ


 • ఇది అనారోగ్యంతో బాధపడుతూ వుండే పిల్లలలో వస్తుంది – అంటే చెవిలో వస్తూవుండే అంటువ్యాధి (ఇన్ఫెక్షన్), జలుబు లేక ఆటలమ్మ, మశూచి వంటి వ్యాధి జ్వరంతో పాటు ఉన్నప్పుడు.

 • * ఈ జ్వరంతో పాటుగా వస్తూ వుండే మూర్ఛ వ్యాధి చిన్న పిల్లలలో కనిపిస్తూ వుండే సాధారణ రకమైన మూర్ఛ.
 • * బాల్యంలో 2 నుండి 5 శాతం పిల్లలు ఏదో ఒక టైములో ఈ జ్వరంతో ఉండే మూర్ఛ వ్యాధి బారిన పడిన వారే.
 • * కొంతమంది పిల్లలు జ్వరంతో ఉన్నప్పుడు ఈ మూర్ఛ అనేది ఎందుకు వస్తుందో తెలియని విషయం. అయితే, అనేక ప్రమాదకరమైన ఇతర అంశాలను కనిపెట్టడం జరిగింది.
 • o ఈ జ్వరంతో పాటుగా వస్తూ వుండే మూర్ఛను అనుభవించిన బంధువులతోనూ, ముఖ్యంగా సోదరులతోనూ, సోదరిలతోనూ వుండే పిల్లలు ఇదే మాదిరి పరిస్ధితికి గురయ్యే అవకాశం ఉంది.
 • o పెరుగదల ఆలస్యంగా వుండే పిల్లలలో లేక 28 రోజులు కంటే ఎక్కువగా నియో నాటాల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో గడిపి ఉన్నట్లయితే, ఇటువంటి జ్వరంతో కూడుకుని ఉన్న మూర్ఛకు గురయ్యే అవకాశం మెండుగా ఉంటుంది.
 • o ఈ జ్వరంతో వాటు వచ్చే మూర్ఛ వ్యాధి ఉన్న పిల్లలలో 4 గురిలో ఒకరికి మరోసారి ఈ వ్యాధి వచ్చే అవకాశం వుంది, అదికూడా, మామూలుగా అయితే, ఒక సంవత్సరం లోపునే.
 • o గతంలో, ఇంతకుముందు ఈ వ్యాధికి గురైన పిల్లలు రెండోసారి కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగానే వుంటుంది.


2. నియో నెటల్ మూర్ఛలు

మూర్ఛ, శిశువు పుట్టిన 28 రోజుల లోపునే సంభవించవచ్చును. బిడ్డ పుట్టిన వెంటనే ఇది ఎక్కువగా రావచ్చును. ఇది ఇంకా అనేక కారణాలు, పరిస్ధితుల వల్ల కూడా రావచ్చును. అప్పుడే పుట్టిన బిడ్డకు ఈ వ్యాధి ఉందా అన్న విషయాన్ని కనిపెట్టడం కష్టమైనది, ఎందుకంటే వారు వెంటనే ఈ రోగ లక్షణాలతో వణికిపోతూ, ఊగిపోతూ వుండడాన్ని ప్రదర్శించరు కాబట్టి. దీనికి బదులుగా వీరు (బిడ్డలు) కళ్లను ఇటు, అటు తిప్పుతూ, నలు దిక్కులపైపు దృష్టిని సారిస్తూ వుండడం జరుగుతుంది. పెదాలను కొరుక్కోవడం మరియు అసంబధ్దంగా, సక్రమంగా లేని విధంగా ఊపిరిని పీలుస్తూ వుండడం జరుగుతుంది.


3. పాక్షిక మూర్ఛలు

మెదడులో ఒక భాగం దీనికి గురికావచ్చు. అందుచేత శరీరంలో కేవలం ఒక భాగం మాత్రమే దీని ప్రభావానికి గురవుతుంది.

* సూక్ష్మ, పాక్షిక మూర్ఛలు (జాక్సోనియన్) ఒక మౌటారు (కదలికతో వుండే) పరికరం వంటి దానిని కలిగివుంటాయి, శరీరంలో ఏదో ఒక భాగంలో. ఈ మాదిరి మూర్ఛకు లోనైన పిల్లలు మెళుకువగా, చైతన్యవంతంగా, అసాధారణమైన కదలికలతో వుంటారు. అయితే ఈ వ్యాధి ఇంకా వేగంగా వ్యాప్తి పొందుతూ వుండడంతో ఇది శరీరంలో ఇతర భాగాలపైపు ‘దండయాత్ర’ ను చేస్తుంది,
* క్లిష్టమైన, పాక్షిక మూర్ఛలు ఇదే మాదిరిగా ఉంటాయి, అయితే పిల్లలకు వారికేమి జరుగుతోందో అన్నది తెలియదు. తరచుగా ఈ మాదిరి మూర్ఛకు గురవుతున్న పిల్లలు ఒక చేష్టను పదే పదే చేస్తూ వుంటారు – అంటే ఆ మూర్ఛ ఉన్నంతసేపూ చప్పట్లు కొడుతూ వుండడం, ఇటువంటి చర్యలు, చేష్టలు గురించి వారికేమీ జ్ఞాపకం ఉండదు. మూర్ఛ ఆగిపోయి, తొలగిపోయిన వెంటనే పిల్లలు తరచుగా భ్రాంతిపడే స్ధితిలోనూ, అస్తవ్యస్తంగానూ ఉన్నట్లు కనబడతారు, .


4. సాధారణీకరించబడిన మూర్ఛలు

ఇది మెదడులో పెద్ద భాగాన్ని లోబరచుకుంటుంది. ఇటువంటివి రెండు భాగాలుగా విభజించబడ్డాయిః ఊగిపోతూ, వణికిపోతున్నట్లుండి (కండరాలు బగుసుకుపోతూ) విరీతంగా ఊగిపోతూ, కుదుపుతో వుండడం మరో రకం కంపించిపోకుండా, వణుకు రానటువంటివి, ఉప-విభజన చేయబడిన వివిధ రకాలతో వుండేవి.

* వణుకుతో, విపరీతంగా ఊగిపోతూ వస్తూవుండే మూర్ఛలు అదుపుచేయలేని కండరాల ఊపుతో కొద్ది నిముషాలసేపు అలాగే కొనసాగుతూ వుండేవి – మామూలుగా 5 నిముషాలకంటే తక్కువగా – మగతగా, నిద్రావస్ధలోకి చేరుకున్నట్లుగా వుంటూ వుండే కొద్ది పాటి వ్యవధితో పోస్టిక్టల్ పీరియడ్ అనబడే స్ధితిలో వుంటున్నట్లు మనం గమనించవచ్చు. తిరిగి బిడ్డ తన మామూలు స్ధితికి చేరుకోవాలి - ఒత్తిడి, భారం, అలసట, ఆయాసం అన్నవాటిని తప్పిస్తే – 15 నిముషాల వ్యవధిలో తరచుగా బిడ్డ పల్చగా వుండే మల, మూత్ర విసర్జన కూడా చేయవచ్చు. పిల్లలు కూడా ఇటువంటి సంఘటనను తరువాత మరచిపోవడం అన్నది కూడా సాధారణమైన విషయమే. ఒకోసారి ఈ మాదిరిగా విపరీతంగా ఊగిపోవడం, వణికిపోతూ వుండడం వల్ల గాయాలు కూడా కావచ్చు – దీవి ప్రభావంతో నాలుక కరుచుకోవడం నుండి ఎముక విగిగి పోవడం వరకూ జరుగవచ్చు.

* గొంతుక బిగుసుకుపోయనట్లుండడంతో వచ్చే మూర్ఛలు కొంత సేపు నరాలు బిగుసుకుపోవడం మరియు గట్టిగా, కఠినంగా మారిపోవడానికి దారితీస్తాయి, గొంతుకలో నరాలు బిగుసుకుపోవడం, విచ్చుకోవడం జరుగుతూ, ఒక లయబధ్దంగా నరాల వణుకుతో వుండడం జరుగుతుంది.

* శిశుసంబంధిత కండరాలు బిగుసుకుపోవడం, సంకోచించుకుపోవడం వంటివి సామాన్యంగా 18 నెలల లోపు పిల్లలకు వస్తూ వుంటాయి. ఇవి తరచుగా మానసిక ఎదుగుదల లేకపోవడం అన్న అంశానికి సంబంధించి ఒక్కసారిగా నరాలు బిగుసుకుపోతూ, పిల్లలు సాగే స్ధితికి తీసుకెళుతూ ఉంటాయి. నిద్రలేచిన వెంటనే తరచుగా ఈ మాదిరి ఇబ్బందికరమైన నరాలు బిగుసుకుపోవడం అన్నది జరుగుతుంది.

* ఆవేదన, ఉద్వేగంతో కూడుకుని వుండే మూర్ఛలు. ఇవి పెటిట్ మల్ సీజర్స్ అని కూడా పిలువబడతాయి. ఇది బహుకొద్దిసేపు పాటు సంభవించే సంఘటన వంటిది. బిడ్డలు కంటి రెప్పలార్చకుండా తేరి,పార చూడడం, లేక కళ్లను మిటకరిస్తూ వుండడం చేస్తారు, వారి చుట్టుపక్కల ఏమి జరుగుతోందో ఏ మాత్రం తెలియకుండా. ఈ సంఘటనలు కేవలం కొద్ది సెకన్లు కంటే ఎక్కువసేపు ఉండవు – ఒక్క సారిగా మొదలై, ఒక్క సారిగా, అర్ధాంతరంగా ఆగిపోతూ. అయితే, ఈ సంఘటనలను పిల్లలు ఏమాత్రం జ్ఞాపకం పెట్టుకోలేరు. ఇటువంటి సంఘటనలు బిడ్డను గమనించి పగటికలలను కంటున్నట్లున్నదని ఉపాధ్యాయుడు నివేదించినప్పుడు మాత్రమే గమనించబడతాయి, ఒకవేళ బిడ్డ చదువుతున్నప్పుడు అతని/ఆమె చదివే స్ధానాన్ని తప్పిపోయనపుడు లేక ఇవ్వబడిన పని (ఎసైన్ మెంట్) ని చేయడంలో అనుసరించవలసిన సూచనలను ఏమరుపాటుగా వదిలివేయడమో జరిగినప్పుడు గుర్తించవచ్చు.


5. స్ధిరంగా కొనసాగుతూ వుండే మూర్చ, మధ్యలో విరామమనేది లేకుండా, మనిషి తెలివిలోకి రాకుండా, ఆగకుండా వస్తూ వుండేది--ఈ మాదిరి మూర్ఛ ఎక్కువ సేపు – అంటే 30 నిముషాలకంటే ఎక్కువగా వుండేది లేక వరసగా, మరల మరల వస్తూవుండేది, మథ్యలో మామూలు స్ధితికి తిరిగి రావడానికి వీలు లేనంతగా. 2 ఏళ్ల కంటే తక్కువ వయుసున్న పిల్లలలో ఆతిసాధారణంగా సంభవిస్తూ వుంటుంది. ఇందులో అధికభాగం పిల్లలు సాధారణీకరణ చేయబడిన (జనరలైజ్డ్) గొంతుకు బిగుసుకుపోవడం, పిడిచి కట్టుకుపోయి, నరాలు బిగుసుకుపోవడంతో ఉండే మూర్ఛల బారినపడుతూ వుంటారు. ఈ విధంగా స్ధిరంగా, మధ్యలో ఏమాత్రం విరామావకాశం లేకుండా, ఆగకుండా వస్తూ వుండే మూర్ఛ చాలా తీవ్రమైనది, అపాయకరమైనది కూడా. చాలాసేపు దీర్ఘమైన మూర్ఛ రావచ్చనే అనుమానంతో ఉన్నప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి.

 • చికిత్సా సమయంలో ముందు జాగ్రత్తలు...
epilepsy వ్యాధి గురించి డాక్టర్‌కు సవివరంగా సమాచారాన్ని తెలియ జేయాలి. పుట్టుకతో గాయం, తలకు గాయం, నరాల వ్యవస్థ, కుటుంబ చరిత్ర గురించి సమాచారాన్ని అందజేయాలి. మూర్ఛ వ్యాధిగల వ్యక్తికి ఒక రకం కన్న ఎక్కువ మూర్చలు ఉండవచ్చు. మూర్ఛ వ్యాధి నియంత్రణకు, మూర్ఛలను గుర్తించడం, వైద్యపరమైన చికిత్సలు జరిపించడం ఎంతో ముఖ్యం. డాక్టర్‌ సలహా ప్రకారం మందులు తీసుకోవాలి. మందులను ఇంట్లో పెట్టుకొని నిర్దేశించిన మోతాదుల ప్రకారం వాటిని వాడాలి. ఏ బ్రాండ్‌ మందులు బాగా పనిచేస్తాయో అవే మందులను వాడడం మేలు. ఇతర బ్రాండ్ల మందులను వాడకూడదు. మూర్ఛలు వచ్చే సమయాన్ని, ఇతర పరిశీలనను ఒక డైరీలో ఎప్ప టికప్పుడు రాసుకోవాలి. కనీసం మూడు ఏళ్ల పాటు మూర్ఛలు రాకుండా ఉండాలంటే మందులను క్రమం తప్పకుండా తీసు కోవాల్సి ఉంటుంది. డాక్టర్‌ ఆమోదంతో వ్యాధిగ్రస్తులు టివి చూడవచ్చు. క్రీడలు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.

 • చెయ్యకూడనివి...
మందుల వాడకంతో ఏర్పడే దుష్ర్పభావాలు లేదా మందును సహించకపోవడం వంటి వాటిని వెంటనే డాక్టర్‌కు తెలియజేయాలి. ఉన్నట్లుండి మందులను ఆపివెయ్యకండి. ఇది ఒక నరాల సంబంధిత అత్యవసర పరిస్థితిని, స్టేటస్‌ ఎపిలెప్టికస్‌(నియంత్రించలేని మూర్ఛ)ని తొందరగా తీసుకురావచ్చు. ఏకకాలంలో ఏవైనా ఇతర కొన్ని వ్యాధులు ఉన్నప్పుడు, గర్భిణీగా ఉన్నప్పుడు లేదా ఇతరత్రా మందులను నిలిపివేయడం గానీ తగ్గించడం గానీ చెయ్యకండి. ఇవి నియంత్రించలేని మూర్ఛవ్యాధికి సామాన్య కారణాలు. మరీ కాం తివంతమైన దీపాలకు, బిగ్గరగా ఉండే ధ్వనుల నుండి తప్పించుకోండి. మూర్ఛ వ్యాధి ఉంటే ప్రాణ హాని కలిగించని ఉద్యోగాల్లో చేరాలి. సరైన సురక్షిత ఉపకరణాలను ధరించండి. వాహనాలను నడపడం, స్విమ్మింగ్‌ చేయకూడదు. ఎత్తులకు ఎక్కడం లేదా ఎత్తయిన చోట్ల పని చేయడం మంచిది కాదు. భారీ యంత్రాలతో లేదా విద్యుత్‌ ఉపకర ణాలతో పనిచేసే సమయంలో మూర్ఛ వస్తే హాని కలిగించవచ్చు.

 • మూర్ఛ వచ్చినప్పుడు ఏం చేయాలి...
మూర్ఛను ఆపే ప్రయత్నం చెయ్యకండి. మూర్ఛ వచ్చిన సమయంలో బల వంతంగా నోట్లోకి ఏమీ కుక్కకండి. తగినంత గాలి ఆడేవిధంగా చూడాలి. వాంతిని మింగకుండా ఉండేందుకు పక్కకు తిరగాలి. వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ వ్యాధి ఉన్న వారు వైద్యుని సలహా మేరకు అన్నీ పాటించవలసిన అవసరం ఉంటుంది.


 • నిజాలు :
- మనదేశంలో ప్రతి 100 మందిలో 10 మందికి మూర్ఛ వ్యాధి ఉంది.

-మూర్ఛవ్యాధి మరో వ్యక్తికి గాలి, ఆహారం, నీరు, స్పర్శ లేదా మరే మార్గం ద్వారా సంక్రమించదు.

- వ్యక్తిని నిర్భధించే ప్రయత్నం చేయ్యకండి. ఇది గాయం కలిగించవచ్చు. గట్టి, పదునైన వస్తువులను వేటినీ దగ్గరలో ఉంచకండి. తలకింద ఏమైనా మెత్తని వస్తువుని ఉంచాలి.

- ఎవరిలోనైనా గానీ ఏ సమయంలోనైనా మూర్ఛ వ్యాధి వృద్ధి కాగల అవకాశం ఉన్నప్పటికీ సాధారణంగా మొదట పిల్లల్లోనూ, యువకులలో ఇది కనిపిస్తుంది.

- మూర్ఛ వ్యాధి ఒక శారీరక స్థితేగానీ ఒక మానసిక వ్యాధిగానీ లేదా లోపంగానీ కాదు. మూర్ఛ వ్యాధి అసాధారణమైన తెలివితేటలు కలిగిన ప్రముఖ వ్యక్తులకున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

- మూర్ఛవ్యాధికి సంబంధించిన మూర్ఛ వచ్చినప్పుడు రోగులను అదుపులో పెట్టలేని విధంగా ప్రవర్తిస్తారు. అయితే ఇది మానవాతీత శక్తి కాదు. వారికి వైద్య చికిత్సలు జరిపించి అందరిలాగే చూడాలి.

- దురదృష్టవశాత్తు మూర్ఛ వ్యాధి ఉన్న వ్యక్తులు, కుటుంబాల పట్ల చిన్నచూపు చూస్తారు. ఇది సరైనది కాదు.

--Dr.Naveen kumar (Neurologist) Aware Global hospital -Hyd.

మూర్చతగ్గిందని మందులు వాడడం ఆపొద్దు

ఒక్కసారే ఫిట్స్ వచ్చి, పరీక్షలో అన్ని నార్మల్‌గా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మందులు వాడాల్సిన అవసరం ఉండదు. కొన్ని సందర్భాల్లో రిపోర్ట్‌నిబట్టి ఆసుపత్రిలో 1-2 రోజులు ఉండాల్సి రావచ్చు. సాధారణంగా ఒకసారి మందులు వాడడం మొదలుపెట్టిన తరువాత అవసరాన్నిబట్టి రెండునుంచి మూడు సంవత్సరాలు మందులు వాడాల్సి ఉంటుంది. జన్యుపరమైన కారణాలవలన ఫిట్స్ వచ్చినప్పుడు జీవితాంతం కూడా మందులు వాడాల్సి రావచ్చు.

ప్రత్యేక పరిస్థితులు
ఫెబ్రెల్ సీజర్స్
6 నెలల నుండి 5 సంవత్సరాల పిల్లల్లో జ్వరంతోపాటు ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఇవి తరువాత ఆగిపోతాయి. అయితే వీరికి 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఫిట్స్ వచ్చినా, వరుసగా రెండు, మూడుసార్లు ఫిట్స్ వచ్చినా, ఫిట్స్ వచ్చాక తర్వాత కోలుకోకున్నా; ఇఇజి పరీక్షలో తేడా వచ్చినా వారికి ఫిట్స్ రాకుండా సిరప్ వాడవలసి ఉంటుంది. ఇవేవీ లేవన్నట్లయితే జ్వరం వచ్చిన మూడునాలుగు రోజులు ఫిట్స్ మందులు వాడితే సరిపోతుంది.

మెటబాలిక్ సీజర్స్
మన శరీరంలో వేరే కారణాలవలన, అంటే జ్వరం వలన, కిడ్నీ ప్రాబ్లం వలన, షుగరు, ఉప్పు శాతం తగ్గిపోవడంవలన వచ్చే ఫిట్స్ కొద్ది రోజులు ఫిట్స్ మందులు వాడాతే తగ్గిపోతాయి. వీరిలో రెండు వారాల నుండి మూడునెలల వరకు మందులు వాడితే సరిపోతుంది.

రిఫ్రాక్చరీ సీజర్స్
సాధారణంగా 80 శాతం మందిలో ఒకటి లేక రెండు మందులు పూర్తి డోసులో కనక వాడితే ఫిట్స్ అదుపులో ఉంటాయి. అయితే 20 శాతం మందిలో మందులు వాడినా ఫిట్స్ వస్తూనే ఉంటాయి. ఇటువంటి వారిలో 3టి ఎంఆర్‌ఐ, వీడియో ఇసిజి, స్పెక్ట్, పిఇటి వంటి పరీక్షలు నిర్వహించి మెడలో ఏ భాగం నుంచి విద్యుత్తు ఎక్కువగా ఉత్పత్తి అవుతుందో తెలుసుకోవాలి. ఆ భాగాన్ని ఆపరేషన్ చేసి తొలగించినట్లైతే ఫిట్స్ చాలావరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఆపరేషన్ చేసినాక కూడా కొంతకాలం మందులు వాడాల్సి ఉంటుంది.

ఎపిలెప్సీ సిండ్రోమ్స్
కొంతమంది పిల్లల్లో జన్యుపరమైన కారణాలవలన కూడా ఫిట్స్ వస్తూ ఉంటాయి. వీరిలో కొంతమందిలో జీవితాంతం కూడా మందులు వాడవలసిన అవసరం ఉంటుంది. మరికొంత మందిలో మందులు వాడినా కూడా ఫిట్స్ వస్తూనే ఉంటాయి. వీరికి ఆపరేషన్ వలవ కూడా ఫిట్స్ తగ్గే అవకాశం ఉండదు. వీరిలో కొంతమందికి కీటోజెనిక్ డైట్; వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ వంటి కొత్త పద్ధతుల ద్వారా ఫిట్స్ తగ్గే అవకాశం ఉంటుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు
1. క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఒకటి, రెండ్రోజులు మందులు ఆపినా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
2. రోజుకు 6-8 గంటలు నిద్ర ఉండేట్లు చూసుకోవాలి.
3. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
4. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం; చక్కటి పౌష్టికాహారం తీసుకోవడం కూడా ఫిట్స్‌రాకుండా ఉపయోగపడతాయి. టీవీ వీక్షించడం కూడా తగ్గించాలి.
5. మత్తు మందులు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.
6. డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి.
7. పదే పదే ఫిట్స్ వచ్చేవారు డ్రైవింగ్ చేయకపోవడం మంచిది.
8 ఎత్తయిన ప్రదేశాలకు, నీటిలోనికి, నిప్పు దగ్గరికి వెళ్ళకుండా ఉండాలి.
8. పెళ్ళయిన అమ్మాయిలు ఫిట్స్ మందులతోపాటు, ఫోలేట్ టాబ్లెట్స్ తప్పనిసరిగా వాడాలి. దీనివలన వారికి కలిగే పిల్లల్లో ఎటువంటి లోపాలు రాకుండా ఉంటాయి.
9. మూర్ఛవ్యాధి ఉన్న వారందరూ వారి పర్స్‌లో వారి జబ్బును గూర్చి తెలియజెప్పే కార్డుని పెట్టుకుంటే మంచిది. • =============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

నొప్పి ,pain


 • http://2.bp.blogspot.com/_DP4mgmsZ7NQ/TU0HK_CPTPI/AAAAAAAABak/cB0cc1FWsuE/s1600/Neck%2Bpain.jpg


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -నొప్పి (pain)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...ఎన్నో భిన్న రకాల గాయాల వల్ల శరీరం పొందే అనుభూతినే నొప్పి అని చెప్పవచ్చు. చాలా సందర్భాల్లో ఇదెంతో బాధాకరం గా ఉంటుంది. నిజానికి ఈ నొప్పి అనేది శరీరం అనుసరించే రక్షణాత్మక యంత్రాంగంలో భాగం. సమస్యపై సంబంధిత శరీర భాగాన్ని అప్రమత్తం చేసే ప్రక్రియ ఇది. ఏదైనా భాగంలో నొప్పి ఉందంటే అక్కడ ఏదో సమస్య నెలకొందని అర్థం. ఆ సమస్యను గుర్తించి సంబంధిత కణాజలం మరమ్మతు పూర్తయ్యే వరకు ఈ నొప్పి ఉంటుంది. నొప్పి పోయిందంటే అర్థం అక్కడ ఆ సమస్య పరిష్కారమైందని. కొన్ని సందర్భాల్లో మాత్రం సమస్య పరిష్కా రమైపోయినా నొప్పి అలానే కొనసాగే అవకాశం ఉంది. వెన్నె ముక సంబంధిత నొప్పులను ఇందుకు ఉదాహరణగా చెప్ప వచ్చు. కొన్ని సందర్భాల్లో కణజాల నష్టం లేకున్నా కూడా (మైగ్రేన్‌ తలనొప్పి, లో బ్యాక్‌ పెయిన్‌ లాంటివి) ఈ నొప్పులు ఉంటాయి.అందుకే నొప్పి అనేది కేవలం ఓ అనుభూతికి చెందిన ప్రక్రియ మాత్రమే కాదు. దాని వెనుక మరెన్నో కారణాలు, విశేషాలు ఉంటాయి.

-నొప్పి ఎన్నో రకాలుగా ఉంటుంది. ఏదో కారణం రీత్యా శరీరం గాయ పడిందనే అంశాన్ని ఈ నొప్పి వెల్లడిస్తుంది. చాలా సందర్భాల్లో ఈ నొప్పి రోజువారీ దినచర్యలను ప్రభావితం చేస్తుంది. వాటికి ఆటంకం కలిగిస్తుంది.

‘నొప్పి’ విశేషాలు

* ప్రపంచవ్యాప్తంగా కూడా 76.2 మిలియన్ల మంది ఏదో ఒక నొప్పితో బాధపడుతున్నారు.
* అమెరికాలో నొప్పి కారణంగా 42 మిలియన్ల మంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్న వారిలో
* లో బ్యాక్‌ పెయిన్‌ - 27 శాతం
* తలనొప్పి / మైగ్రేన్‌ - 15 శాతం
* మెడనొప్పి - 15 శాతం
* ఫేసియల్‌ నొప్పి - 4 శాతంగా ఉన్నారు.
* తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న వారిలో అత్యధికులు 30-50 ఏళ్ళ లోపు వారే.
* తీవ్రమైన, దీర్ఘకాలిక నొప్పి కారణంగా తమ శారీరక, మాన సిక ఆరోగ్యం దె బ్బ తిన్నట్లు ఈ నొప్పులు ఉన్నవా రిలో అత్యధిక శా తం పేర్కొన్నారు.
* నొప్పి కారణం గా ప్రతీ ముగ్గురు అమెరికన్ల లో ఒకరు వారంలో 20 గంటల నిద్రను కోల్పోతున్నట్లు వెల్లడైంది.
* ఏటా ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్‌ ఆస్పిరిన్‌ మా త్రలు విక్రయం కావడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

నొప్పి తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు
* నొప్పిని నిర్లక్ష్యం చేయడం, విస్మరించడం సమస్యకు పరిష్కారం కాదు. దాన్ని గుర్తించి, అందుకు కారణాలేంటో తెలుసుకోవాలి. నొప్పిని తట్టుకునే, ని వారించే మార్గాలేంటో చూడాలి.
* చికిత్స కంటే కూడా నివారణే మేలు అనే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. తీవ్రమైన నొప్పులను నిర్లక్ష్యం చేయడం మునుముందు ఎంతో ప్రమాదకరం అవుతుంది. ఒకే రకమైన వ్యాధి/ లక్షణాలు ఉన్నప్పటికీ ఒక్కో వ్యక్తికి ఆ నొప్పి ఒక్కో విధంగా ఉంటుంది. అందరికీ ఒకే విధమైన చికిత్స పని చేయకపోవచ్చు. ఇంట్లో పాటించే చిట్కాలు పని చేయకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

ముఖ్యమైనచిట్కాలు
* కొన్ని రకాల దీర్ఘకాలిక, తీవ్రమైన నొప్పులకు శ్వాస వ్యాయామాలు, యో గా, ధ్యానం ఉపశమనం కలిగించగలుగుతాయి.
* ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. కుటుంబంలో, సమాజంలో ఒంటరి అని భావించవద్దు. అదే రకమైన నొప్పులతో బాధపడేవారితో స్నేహం పెంచుకోవాలి. వారి నుంచి మీకు అవసరమైన సమాచారం, చిట్కాలు పొందే అవకాశం కూడా ఉంటుంది.
* వివిధ రకాల హాబీలను అలవర్చుకోవాలి. సంగీతం, రిలాక్స్‌ కావడం, ఒత్తిడి తగ్గించుకునే విధానాలు లాంటివి మీ నొప్పిని సగం మేర తగ్గిస్తాయి.
* పీఎంఆర్‌: ప్రోగ్రెసివ్‌ మజిల్‌ రిలాక్సేషన్‌: కండరాలను స్ట్రెచ్‌ చేయడం, రిలాక్స్‌ చేయ డానికి సంబంధించిన ప్రక్రియ. ఒత్తిడి తగ్గిన భావనను కలిగిస్తుంది.
* ‘విజువలైజేషన్‌’: మనస్సులో ఎంతో ఆహ్లా దాన్ని ఊహించుకోవడం ద్వారా నొప్పి నుంచి కొంత ఉపశమన భావన పొందవచ్చు. పూల తో నిండిన ఉద్యాన వనంలో పక్షుల ధ్వనులు వింటున్నట్లుగా, జలపాతం చూస్తున్నట్లుగా, చల్లటి గాలి తాకుతున్నట్లుగా ఊహించుకోవ డం కొంత ఉపశమనాన్ని అందిస్తుంది. మీకు బాగా నచ్చిన సందర్భాలను గుర్తు చేసుకోవ డం లాంటివన్నీ నొప్పి భావనని కొంతమేర తగ్గించుకునేందుకు తోడ్పడు తాయి.
* గైడెడ్‌ ఇమేజినరీ / మెంటల్‌ ఇమేజరీ రిలాక్సేషన్‌: ఒత్తిడిని తగ్గించేందుకు, నొప్పి నుంచి ఉపశమనం కలిగించేటందుకు తోడ్ప డే మరో చిట్కా ఇది. సానుకూల, ఒత్తిడిని త గ్గించుకునే రీతిలో ఊహించుకోవడం ఇందు లో ప్రధానం. ఇదో రకమైన మానసిక చికిత్స. ‘అంతా మనస్సులోనే ఉంది’ అని చెప్పే మాటలు ఇక్కడా వర్తిస్తాయి. నొప్పి అనే భావనను మనస్సులో నుంచి తొలగించుకోవాలి.
* జీవనశైలి: నొప్పిని తగ్గించుకునేందుకు తోడ్పడే, ఆరోగ్యదాయక జీవనశైలిని అను సరించాలి.

1. ఏ పనీ చేయకుండా ఉండడం లేదా కేవలం గంటల తరబడి కూర్చొని చేసే పనులనే చేయవద్దు. శారీరక వ్యాయామం శరీరానికి తగిన ఫిట్‌నెస్‌ను అంది స్తుంది. లిఫ్ట్‌ ఉపయోగించేందుకు బదులు మెట్లు ఎక్కడం, దిగడం అలవాటు చేసుకోవాలి. మార్నింగ్‌ / ఈవినింగ్‌ వాక్‌ చేయాలి. ఎక్కువ సేపు ఒకే పనిని చ ేస్తూ కూర్చోవద్దు. మధ్యమధ్యలో తిరగడం చేయాలి.
2. ఏ విషయంలోనైనా అతి మంచిది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యాయామం మంచిదే అయినా అది కూడా ఓ పరిమితిలో నిపుణుల సలహా మేరకు ఉండాలి. దీర్ఘకాలిక, తీవ్ర నొప్పులు ఉన్నవారు తాము చేయాల్సిన వ్యా యామాల విషయంలో డాక్టర్‌ సలహా తీసుకోవాలి. వ్యాయామం చేయదల్చిన వారు మొదట చిన్న చిన్న వ్యాయామాలను చేస్తూ క్రమంగా చేసే సమయాన్ని, వ్యాయామాల స్థాయిని పెంచుకోవాలి.
3. మద్యానికి, ధూమపానానికి దూరం: చాలా మంది ఒత్తిడి తగ్గించుకుందా మని భావిస్తూ మద్యపానం, ధూమపానం చేస్తూ క్రమంగా వాటికి బానిసలుగా మారిపోతారు. ఫలితంగా కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిళ్ళు మరింత పెరుగుతాయి. ధూమపానం రక్తప్రసరణను తగ్గిస్తుంది. అందువల్ల నొప్పి మ రింత పెరుగుతుంది. మద్యపానం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కన బరుస్తుంది.
4. కూర్చొనే భంగిమ: వీపు వంచకుండా ని టారుగా కూర్చోవడం బ్యాకేక్‌ (వెన్నునొప్పి) ని తగ్గిస్తుందనేది అపోహ మాత్రమే. నిజానికి అ ది వెన్నునొప్పిని పెంచుతుంది. ‘వెన్నెముక త నదైన సొంత వంపును కలిగి ఉంటుంది’. మనకు తెలియకుండానే మనం ఆ భంగిమలో కి వెళ్ళిపోతాం. ఒకే విధంగా లేదా కదల కుం డా ఎక్కువ సేపు కూర్చోవద్దు. కుర్చీలో కూ ర్చొన్నప్పుడు రిలాక్స్‌డ్‌గా కూర్చోవాలి. మీ వెన్నెముక కుర్చీని పూర్తిగా తాకేలా ఉండాలి.
5. పరుపులు: పరుపుపై పడుకోవడం అనే అంశం కూడా పెయిన్‌ మేనేజ్‌ మెంట్‌లో ఎంతో కీలకమైంది. బాగా గట్టిగా ఉండేవి లేదా బాగా మెత్తగా ఉండేవి వెన్నెముకకు మంచివి కావు. కాస్తంత దృఢంగా ఉండే పరుపుపై, సరైన భంగిమలో నిద్రించడం ముఖ్యం.
6. బరువైన వస్తువులు లేపేటప్పుడు వెన్నె ముకను పూర్తిగా వంచవద్దు. దానికి బదు లుగా మోకాళ్ళను వంచడం మంచిది.
7. స్థూలకాయం కూడా తీవ్ర, దీర్ఘకాలిక నొప్పులకు కారణమవుతుంది. శరీరం ఫిట్‌ నెస్‌గా ఉండడం, సమతుల ఆహారం తీసు కోవడం కూడా ఎంతో ముఖ్యం.
8. కామోమైల్‌ టీ అనే మూలికా ఉత్పాదన మజిల్‌ రిలాక్సింగ్‌కు ఎంతో తోడ్పడుతుంది. నిద్ర బాగా పట్టేందుకు ఉప కరిస్తుంది. రోజుకు ఒక కప్పు కాఫీ మెదడును ఉల్లాసవంతంగా ఉంచేందుకు మంచిదే అయినా ఎక్కువ తాగితే మాత్రం నొప్పిని అధికం చేస్తుంది.
9. హాట్‌, కోల్డ్‌ ట్రీట్‌మెంట్స్‌: నొప్పి ఆరంభస్థాయిలో ఉన్నప్పుడు, 48 గం టల్లోగా, కోల్డ్‌ ప్యాక్‌ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అది వాపును తగ్గిస్తుంది. ఆ తరువాత మాత్రం మజిల్‌ రిలాక్సింగ్‌ ప్రక్రియల్లో హాట్‌ ప్యాక్స్‌ / హాట్‌ ప్లేట్స్‌ ప్రక్రియ మంచిది.
10. ఎర్గోనామిక్స్‌: నేడు ఆక్యుపేషనల్‌ పెయిన్‌ (వృత్తినిర్వహణపరంగా వచ్చే నొప్పులు) ఎంతో సాధారణమైపోయాయి. సరైన భంగిమలో కూర్చొని పని చేయడం ఎంతో ముఖ్యం. కంప్యూటర్‌ను సరైన విధంగా, సౌలభ్యంగా ఉండే విధంగా అమర్చుకోవాలి. ఎక్కువసేపు కూర్చొని పనిచేయకుండా కాస్తంత విరామం తీసుకొని లేచి నడవడం వంటివి చేయాలి.
11. వెన్నెముకను సరైన రీతిలో ఉంచుకునేందుకు, సపోర్ట్‌ ఇచ్చేందుకు వీలు గా బ్యాక్‌ సపోర్ట్‌ బెల్ట్‌లను ఉపయోగించవచ్చు.

-Dr.P.vijyanad ,Director Akshan pain management clinic -Hyderabad.(Surya news paper)

Allopathic Treatment :

Tab. Dolomed-MR (ibuprfen+paracetamol)-- or
Tab. Acelonac-p (Aceclofenac+paracetamol)-- or
Tab.Trim (Tramadol+paracetamol)--or

పై మాత్రలలో ఏదో ఒక రకము రోజుకు రెండు చొప్పున్న వాడాలి . తాత్కాలికము గా నొప్పి తగ్గును . తరువాత నొప్పికి కారణము తెలుసుకొని తగిన చికిత్స పొందాలి.
 • ============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, April 4, 2011

Stye , కనురెప్పలోపలగాని- బైటగాని లేచిన కంటి కురుపు (సెగ గడ్డ)
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -(Stye) , కనురెప్పలోపలగాని- బైటగాని లేచిన కంటి కురుపు (సెగ గడ్డ)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...Sty(stye) : కనురెప్పలోపలగాని, బైటగాని లేచిన కంటి కురుపు, సెగ గడ్డ. వీటిలాగనే ఉండే ' కెలేజియాన్(chalazion)‌' మయిబోబియాన్‌ గ్రంధులనుండి పుడతాయి . కనురెప్ప లోపలికి point అయి ఉంటాయి..లైపోగ్రాన్యులోమా సిస్టు లని అంటారు . నొప్పిలేని నాడ్యూల్స్ గా ఉండి నయమవడానికి చాలా రోజులు పడుటుంది , ఇవి సాధారణముగా కంటి పై రెప్పలో ఎక్కువగా పుడతాయి . స్టై(stye) కనురెప్ప అంచున పుడతాయి.

కనురెప్పల మీద కొందరికి కంటికురుపులు వచ్చి మహా ఇబ్బందిని కలుగజేస్తాయి. ఇది బ్యాక్టీరియా చేరడం వల్లగానీ, కనురెప్పల మీదనున్న తైల గ్రంధినాళం (sebaceous glands of Zeis)మూతపడటం వల్లగానీ జరుగుతుంది. దురదకు కళ్ళు పులుము కుంటే ఆ కురుపు చితికి ప్రక్కన మరో కురుపు వస్తుంది . ఇటువంటి కురుపులు ఒకరినుండి మరొకరికి అంతువ్యాధి లా సోకే ప్రమాదం ఉంది . కంటికురుపులు వచ్చిన పిల్లలకు వాడిన సబ్బు, టవల్ ఇతర పిల్లలకు వాడకూడదు .

లక్షణాలు :
కనురెప్ప పై అంచున చివరన ఉండే సెబా సియస్‌ గ్రంథి ఇన్‌ఫెక్షన్‌కు గురికావటం వల్ల కురుపులాగా ఏర్పడి, కంటికి ఎంతో బాధను కలిగిస్తుంది.
ఇందువల్ల కంటిభాగము ఎఱ్ఱ గా మారిపోతుంది.
కనురెప్పపై వాపు ఏర్ప డుతుంది.
వాపుతో కూడిన ఈ చిన్నని పుండు కనురప్ప అంచున ఏర్పడడం వల్ల కనురె ప్పలు మూసి తెరచేటప్పుడు ఎంతో బాధాక రంగా ఉంటుంది.
కళ్ళు మంట గా ఉంటాయి.
కంటిలో ఏదో నలత పడి ఉన్నట్లు ఉంటుంది .
కంటి చూపులో తగ్గుదల ఉంటుంది .
కంటిలో నీరు , పుసి కారుతుంది .

కారణాలు :
స్టెఫయిలో కోకస్ ఆరియస్ (staphylococcus aureus) బ్యాక్టీరియ వలన కంటి కురుపులు తరచుగా వస్తాయి.
రాత్రులు నిద్ర చాలకపోతే కొన్నాళ్ళకు కంటి కురుపులు వస్తాయి.
సమతుల్య ఆహారం లోపమువలన ,
కంటి శుబ్రత లోపించే వారిలో ఎక్కువగా కనిపిస్తాయి.
కళ్ళను ఏ కారణము చేతనైనా బాగా రుద్దడం వలన ,


ఇంటి వైద్యము :
ఒక స్పూన్‌ బోరిక్ పొడిని పావుకప్పు నీటిలో కరిగించి ... ఆ నీటితో కనురెప్పలను రోజులు 4-5 సార్లు కడగాలి.. ఇన్ఫెక్షన్‌ తగ్గి కురుపులు నయమవుతాయి.
అటువంటి కురుపుకు వేడి చేసిన గుడ్డను కాపడం పెట్టాలి. రోజుకు నాలుగైదు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
దీనితోపాటు ఒక చెంచా ధనియాలు ఒక కప్పు నీటిలో మరిగించి, చల్లార్చిన తర్వాత ఆ కషాయంతో కంటిని రోజులో నాలుగైదుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి.
జామ ఆకును వేడి చేసి ఆ వేడి ఆకును గుడ్డలో ఉంచి దానితో ఆ కురుపుకు కాపడం పెట్టాలి.
లవంగం ఒకటి నీటిలో చిదిపి ఆ ముద్దను కంటి కురుపు మీద పెట్టాలి.
కంటి కురుపుకు చింతకాయ గింజలు రెండు రోజులు నానబెట్టి ఆ గంధమ్ పట్టించాలి. మల్లీ (మరల) ఎప్పడికీ రావు .
ఒక కప్పు నీళ్లల్లో రెండు లేదా మూడు అలమ్‌ పూసలను బాగా కలిపి, ఆ నీటిని కండ్లు శుభ్రపర్చుకునేందుకు వాడాలి. లేదా
మీరు స్పటిక భస్మాన్ని (ఇది ఆయుర్వేద మందుల షాపులలో దొరుకుతుంది) కూడా వాడవచ్చు. ఇందువల్ల కంటిపై వాపు, ఎర్రబడిన కనురెప్పలు మామూలు స్థితికి వస్తాయి. నీరుకారడం కూడా తగ్గిపోతుంది.
ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్‌ పసుపును బాగా మరగ కాచా లి. ఇలా అర గ్లాసు నీళ్ళుండేంతవరకు మరగకాచి, ఈ నీటిని వడగట్టి, ఒక శుభ్రమైన బట్టతో కంటిని శుభ్రం చేసుకొని రోజుకు రెండు లేదా మూడు చుక్కలను కంటిలో వేసుకోవడం వల్ల ఈ సమస్య సమసిపో తుంది. దీనిని 'ఐ డ్రాప్స్‌'గా వాడవచ్చు.
ఖర్జూరపు విత్తనాన్ని ఒక రాయిపై బాగా రుద్దగా వచ్చిన చూర్ణాన్ని కంటికి నొప్పి కలిగించే ప్రాంతంలో అప్లై చేయాలి.
ఉల్లిపాయపై ఎండిన పొరను నిప్పుల మీద కాల్చి ఆ మసిని కంటి రెప్ప పై కురుపు మీద రాస్తే ఆ కురుపును త్వరగా నయం చేస్తుంది.

allopathic treatment :

కంటి కురుపులు సాదారణము గా ఒక వారము రోజుల్లో వాటంతట అవే నయమయిపోతాయి .
శుబ్రమైన గుడ్డ తో ,నీటితోను కళ్ళను తుడుస్తూ ఉండాలి .
ఏదైనా యాంటిబయోటిక్ కంటి చుక్కలు మందు (ciprofloxin or gentamycin or ofloxine Eye drops),
Tab Doxycyclin 100 mg 2 tabs per day 5-7 days ... or
Tab Ofloxine +Tinidazole (OFX tz) 1 tab twice daily for 5-7 days,
Oint ment Neosporin రాత్రి పూట పెట్టి పడుకోవాలి .
నొప్పి తగ్గడానికి : Tab. Aceclofen-p ... 1 tab 2 time / day . 2-3 days.
దురద తగ్గడానికి : tab. Cet 10 mg / levi cet 5 mg 1 tab twice / once daily 2-3 days.

 • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Sunday, April 3, 2011

Kidney Care, మూత్రపిండాల జాగ్రత్తల అవగాహన .


 • http://3.bp.blogspot.com/-AvzDSCtEw_0/TZfT870OWNI/AAAAAAAABO0/LzK4XpJFI2I/s1600/Kidney%2B-%2Bworld%2Bkidney%2BDay.jpg


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -(Kidney Care)మూత్రపిండాల జాగ్రత్తల అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఇటీవల జాతీయ కిడ్నీ ఫౌండేషన్ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం చాలామందికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నా తమకి కిడ్నీ డిసీజ్ ఉన్నట్లు కూడా తెలియదట! ప్రత్యేక లక్షణాలు ప్రారంభ దశలో లేకపోవడమే ఇందుకు కారణమని పరిశోధకులు గ్రహించారు. రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నవాళ్లు.. అంటే డయాబెటిస్, అధిక రక్తపోటు లాంటి వాటితో బాధపడేవారు తరచూ కిడ్నీ ఫంక్షన్ పరీక్షలు చేయించుకోవటం అవసరమని అంటున్నారు.
నాష్‌విల్లే, వ్యాండర్ బిల్డ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ వారు 401 మందిని , నెఫ్రాలజిస్ట్‌లతో పరీక్షించారు. వీరిలో డెబ్బై ఐదు శాతం మందికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ 3వ దశలో ఉంది. 94 శాతం మందిలో మూత్రపిండాల ఇబ్బంది ఉందని తేలింది. వీరిలో 30 శాతం మందికి తమకి కిడ్నీ వ్యాధి ఉన్నట్లు కూడా తెలియదు. ఇందుకు అవగాహనా రాహిత్యమే కారణమంటున్నారు పరిశోధకులు.

అందుకే మూత్రపిండాల నిర్మాణం గురించి, అవి చేసే పనుల గురించి, అవి దెబ్బతినే కారణాల గురించి, దెబ్బ తినకుండా తీసుకునే చర్యల గురించి తెలుసుకోవాల్సిన అవసరముందని కూడా పరిశోధకులు చెబుతున్నారు. అంతే కాకుండా పరిశోధకులు 34 ప్రశ్నలతో కూడిన పత్రాన్ని అభ్యర్థులకిచ్చారు. వాటివల్ల తేలిందేంటంటే 78 శాతం మందికి లక్షణాలు లేకుండానే ఈ వ్యాధి వృద్ధి చెందుతుందని. ఇంకా విచిత్రమేమిటంటే 32 శాతం మందికి మూత్రం కిడ్నీల ద్వారానే వస్తుందని తెలియదు.

‘కిడ్నీ డిసీజ్ చాలా సైలెంట్‌గా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే అధిక రక్తపోటు, డయాబెటిస్, వంశపారంపర్య చరిత్ర ఉన్నవారు తరచూ కిడ్నీ పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ ఉండాల’ని అంటున్నారు పరిశోధకుల్లో ఒకరైన డా.జోసఫ్ వ్యాసలోటి.
సకాలంలో వ్యాధి ఉన్నట్లు గుర్తించగలిగితే కిడ్నీ వ్యాధులు ప్రబలకుండా కాపాడుకోవచ్చు. డయాబెటిస్, రక్తపోటు లాంటి వాటిని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. కొన్ని మందులు మూత్రపిండాలకి హాని కల్గిస్తాయి. అందుకని ఏ మందులు పడితే ఆ మందులు వైద్యుని సలహా లేకుండా తీసుకోకూడదు. ఈ జాగ్రత్తలతో మూత్రపిండాల వ్యాధులు ప్రబలకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు.

అపరిశుభ్రత వల్ల యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. కొంతమంది తరచూ ఈ ఇబ్బందికి లోనవుతుంటారు. మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్స్, మూత్రపిండాలలో రాళ్లు లాంటివి కలుగకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డేకి ప్రధానాంశం "కిడ్నీ జబ్బులతో గుండెకు ప్రమాదం" అని, గుండెకి అధిక రక్తపోటుకి సంబంధం ఉంది. అధిక రక్తపోటుతో బాధపడేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదముంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. గుండెపోటు వస్తే నొప్పి కూడా తెలియదు డయాబెటిస్ ఉన్నవారికి. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. ఇదే కాదు మూత్రపిండాల జబ్బులు సైలెంట్ కిల్లర్స్ తీవ్రమయ్యే వరకూ ఎటువంటి లక్షణాలు కనిపించవు. అలాగే అధిక రక్తపోటు, డయాబెటిస్ ప్రభావం కిడ్నీల మీదా ఉంది. కాబట్టి కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటే ఈ అనారోగ్య ప్రభావం క్రమంగా గుండె మీదా పడే అవకాశముంది. అందుకని కిడ్నీల ఆరోగ్యం జాగ్రత్త. కిడ్నీ ఆరోగ్యంతోపాటు గుండె ఆరోగ్యం దెబ్బ తింటుంది అని హెచ్చరిస్తుంది ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే.

మన దేశంలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారు 20లక్షల మంది వరకు ఉన్నారని ఒక అంచనా. ఏటా అదనంగా రెండు లక్షల మంది కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని, మన రాష్ట్రం విషయానికి వస్తే రాజధాని నగరంలో 30వేల మంది నుంచి 40 వేల మంది కిడ్నీ వ్యాధిగ్రస్థుకు డయాలసిస్‌ అవసరం అవుతున్నది. ఈ కిడ్నీ సమస్యలకు ప్రధానంగా మధుమేహం (40శాతం), హైబిపి (30శాతం) కారణమవుతున్నాయి. వీటిని అదుపులో ఉంచుకుంటే మూత్రపిండాలు చాలా వరకు కాపాడుకోవచ్చు.

-నిరంతరం రక్తంలోని వ్యర్ధాలను వడకడుతూ.. మూత్ర పిండాలు మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. పైగా చికిత్సకు ఎంతో ఖర్చు అవుతుంది. మూత్రపిండం పూర్తిగా విఫలమైతే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండక తప్పదు. ఈ ‘డయాలసిస్‌’ కోసం నెలకు సుమారు రూ.4-5వేలు ఖర్చు అవుతాయి. అంతేకాకుండా ఇతరత్రా సమస్యలు ఏర్పడతాయి. చికిత్స తీసుకున్నా కిడ్నీ తిరిగి సమర్ధంగా మారదు.

-గుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినటం వంటివీ మొదలవుతాయి. పోనీ దెబ్బతిన్న మూత్రపిండాన్ని మార్పిడి చేయించుకోవాలంటే కిడ్నీ దాతలు దొరకటం కష్టం. ఆపరేషన్‌ పెద్ద ప్రయత్నమనుకుంటే ఇక ఆ రత్వాత జీవితాంతం వేసుకోవాల్సిన మందులకూ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఎన్నో ఇబ్బందులు, దుష్ర్పభావాలు. ఇంత ఖర్చు చేసి చికిత్స తీసుకున్నా జీవనకాలమూ తగ్గవచ్చు. ఇలాంటి ప్రమాదాలన్నీ దరిచేరకుండా ఉండాలంటే ముందే మేల్కొని, అసలు కిడ్నీలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

మన జీవనశైలి మార్పులే కిడ్నీలకు చెడు :
-మన దేశంలో మధుమేహం ఎంత విపరీతంగా విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2015 నాటికి వీరి సంఖ్య రెట్టింపు కావచ్చని అంచనాలు చెబుతున్నాయి. ఈ మధుమేహంతో పాటే మూత్రపిండాల వైఫల్యం కేసులు పెరుగుతున్నాయి. టైప్‌-1 మధుమేహ బాధితుల్లో 10-30శాతం, టైప్‌-2 మధుమేహుల్లో 40శాతం మంది కిడ్నీ సమస్యల బారినపడే అవకాశం ఉంది. ఒకసారి ఈ మూత్రపిండాల సమస్య మొదలైందంటే.. దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. అందుకే సమస్యను తొలిదశలో గుర్తిస్తే దాన్ని ముదరకుండా నిలువరించే అవకాశం ఉంది. అందుకే మధుమేహులంతా కిడ్నీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ ఆరోగ్యవంతులు అసలు మధుమేహం బారినపడకుండా చూసుకోవాలి.

కిడ్నీల పరిరక్షణకు తేలికైన పరీక్షలు :
-టైప్‌-1 రకం బాధితులు మధుమేహం బారినపడిన ఐదేళ్ళ నుంచి ప్రతి ఏటా కిడ్నీ సమస్యలు వస్తున్నాయేమో పరీక్షించుకోవటం మంచిది. టైప్‌- 2 మధుమేహులైతే దాన్ని గుర్తించిన తక్షణమే కిడ్నీ పనితీరు తెలుసుకునే పరీక్షలు చేయించుకోవాలి. ఆ తర్వాత కనీసం ఏడాదికి ఒకసారైనా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీ సమస్యలేమైనా తల ఎత్తుతున్నాయా? అన్నది తేలికైన పరీక్షల ద్వారా చాలా ముందుగానే గుర్తించవచ్చు.

1. మూత్రంలో అల్బుమిన్‌ : అల్బుమిన్‌ అనేది ఒక రకం ప్రోటీను. మూత్రంలో ఈ సుద్ద ఎక్కువగా పోతోందంటే కిడ్నీల వడపోత సామర్ధ్యం తగ్గిపోతున్నట్టే. అందుకే ప్రతి ఏటా తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించుకోవాల్సిందే. దీని ద్వారా కిడ్నీ సమస్యను గుర్తించవచ్చు.

2. రక్తంలో సిరమ్‌ క్రియాటిన్‌ : మన కిడ్నీల వడపోత సామర్ధ్యం ఎలా ఉందో చెప్పేందుకు ఈ పరీక్ష కీలకం. దీని ఆధారంగా వడపోత సామర్ధ్యాన్ని ( ఎస్టిమేటెడ్‌ గ్లోమెరూలార్‌ ఫిల్టరేషన్‌ రేట్‌-ఈజీఎఫ్‌ఆర్‌(ను లెక్కించి... కిడ్నీల సమస్య తలెత్తే అవకాశం ఎంతవరకూ ఉందన్నదనే అంచనా వేస్తారు. సాధారణంగా ఇది 110 మి.లీ. వరకూ ఉంటుంది. ఇది 60 మి.లీ.కన్నా తక్కువుంటే మూత్రపిండాల సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. కేవలం క్రియాటినైన్‌ పరీక్ష చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50శాతం దెబ్బతినే వరకూ కూడా సిరమ్‌ క్రియాటినైన్‌ పెరగకపోవచ్చు. కాబట్టి ‘ఈజీఎఫ్‌ఆర్‌’ను చూసుకోవటం ముఖ్యం. సీరమ్‌ క్రియాటినైన్‌ పరీక్షించి దానితో పాటు వయసు, బరువు, ఎత్తు వంటి ప్రమాణాల ఆధారంగా ‘ఈజీఎఫ్‌ఆర్‌’ లెక్కిస్తారు.

3. బ్లడ్ యూరియ : కిడ్నీ పనితనము తగ్గిందంటే రక్త్మ లో యూరియా శాతము పెరిగిపోతుంది . ఇది సాదారణము గా 40 మి.గ్రా/100 మి.లీ లోపు ఉంటుంది . దీని స్థాయిని బట్తి మనము మూత్ర పిండాల సామర్ధ్యము తెలుసుకోవచ్చును .

కిడ్నీలను కాపాడుకోవాలంటే?
మధుమేహం, అధిక రక్తపోటు కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహులు- హెచ్‌బిఎ 1సి (గ్లైకాసిలేటెడ్‌ హిమోగ్లోబిన్‌) పరీక్ష ఫలితం 7కన్నా తక్కువ ఉండేలా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది గత మూడు నెలల సమయంలో మధుమేహం కచ్చితంగా అదుపులో ఉందా లేదా? అని చెప్పే పరీక్ష. మధుమేహం, హైబీపీ రెండూ ఒకదానికి ఒకటి తోడై.. చివరికి కిడ్నీలను దెబ్బతీసే స్థాయికి చేరకుంటాయి. అందుకే రక్తపోటును 130/80 కంటే తక్కువే ఉండేలా చూసుకోవాలి.రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవాలి. అలాగే రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి.మూత్రంలో సుద్ద పోతుంటే వెంటనే గుర్తించి తక్షణం చికిత్స తీసుకోవాలి. అందుకే తరచూ పరీక్షలు చేయించుకోవటం ముఖ్యం.

 • updates :
మూత్రపిండాలు.. చూడటానికి చిక్కుడు గింజల ఆకారంలో మన పొత్తికడుపులో రెండు చిన్నచిన్న రబ్బరు తిత్తుల్లాగే ఉంటాయిగానీ వీటి లోపల అత్యంత సంక్లిష్టమైన నిర్మాణాలుంటాయి. దీనిలో అత్యంత కీలకమైనది వడపోత విభాగం. దీన్నే 'గ్లోమరులస్‌' అంటారు. ఇలాంటి విభాగాలు ఒక్కో కిడ్నీలో సగటున 10 లక్షల వరకూ ఉంటాయంటే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఇవన్నీ నిరంతరాయంగా మన రక్తాన్ని వడపోస్తూనే ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేస్తూ.. దాని నుంచి మలినాలను వేరుచేస్తూ.. వాటిని మూత్రం రూపంలో బయటకు పంపించేస్తుంటాయి. మన ఆరోగ్యానికి ఈ 'వడపోత' సమర్థంగా జరుగుతుండటం అత్యంత కీలకం. కానీ నేడు మనల్ని చుట్టుముడుతున్న మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలన్నీ ఈ వడపోత వ్యవస్థను దెబ్బతీసి.. మూత్రపిండాలను దెబ్బతీస్తున్నాయి. క్రమేపీ వడపోత సామర్థ్యం తగ్గిపోతూ... మూత్రపిండాల పనితీరు మందగించటం, చివరికి అవి పూర్తిగా విఫలమైపోవటం.. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య! దీన్నే వైద్యపరిభాషలో 'క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ (సీకేడీ)' అంటారు. ఇదో దీర్ఘకాలిక సమస్య. ఒక్కసారిగా పెను ప్రమాదంలా ముంచుకురాదు... కానీ... క్రమేపీ కిడ్నీల పనితీరు దెబ్బతినిపోతూ ఉంటుంది. ఒకసారి ఆరంభమైతే దీన్ని పూర్తిగా నయం చెయ్యటం కష్టమేగానీ.. అది ఇంకా ముదరకుండా, కిడ్నీలు మరింతగా దెబ్బతినకుండా చూసుకోవటం మాత్రమే సాధ్యమే. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ దీర్ఘకాలిక సమస్యపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం మరింతగా పెరుగుతోంది.
'దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి' అంటే..?
స్థూలంగా చెప్పుకోవాలంటే.. మన కిడ్నీలు దెబ్బతిని, వాటి వడపోత సామర్థ్యం క్రమేపీ తగ్గిపోతుండటం! మన కిడ్నీల వడపోత సామర్థ్యం ఏ తీరుగా ఉందో తెలుసుకునేందుకు 'జీఎఫ్‌ఆర్‌' (గ్లోమరులో ఫిల్టరేషన్‌ రేట్‌) అనేది లెక్కిస్తారు. ఈ వడపోత సామర్థ్యం నిమిషానికి కనీసం 90 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ ఉండాలి. అంతకు మించి తగ్గుతుంటే కిడ్నీ సామర్థ్యం తగ్గుతోందని అర్థం. ఇది 60 ఎంఎల్‌ కంటే తక్కువుంటే 'దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి(సీకేడీ)'గా అనుమానిస్తారు, మూడు నెలల కాలంలో పలుమార్లు పరీక్షించినా ఇలాగే ఉంటే 'సీకేడీ'గా నిర్ధారిస్తారు. అయితే కొన్నిసార్లు వడపోత సామర్థ్యం బాగానే ఉన్నా.. అంటే 'జీఎఫ్‌ఆర్‌' తగ్గినా తగ్గకున్నా కూడా.. వీడకుండా మూత్రంలో సుద్ద (ప్రోటీను) పోతున్నా, మూత్రంలో రక్తం పడుతున్నా.. వారిని కూడా 'సీకేడీ' బాధితులుగానే గుర్తించాల్సి ఉంటుంది. ఇలా వడపోత సామర్థ్యం తగ్గటం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతూ నానారకాల బాధలు మొదలవుతాయి, చివరికి కిడ్నీలు పూర్తిగా విఫలమైపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఈ ముప్పు ఎక్కువగా ఉన్నవారు.. ముందు నుంచే కిడ్నీలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం అవసరం.

 •  
 •  


సీకేడీ: కారణాలేమిటి?
ప్రధానంగా చెప్పుకోవాల్సింది మధుమేహం, అధిక రక్తపోటు! ఈ రెండింటి కారణంగానే అధిక సంఖ్యాకులు దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు బారినపడుతున్నారు. ఇవి కాకుండా మూత్రంలో సుద్ద (ప్రోటీను) పోతున్నవారు, పుట్టుకతో మూత్ర వ్యవస్థ నిర్మాణంలో లోపాలున్నవారు, కిడ్నీల్లో నీటితిత్తుల వంటివి ఉన్నవారు.. వీరందరికీ కూడా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ.
ఇవే కాకుండా..
* మూత్రనాళ ఇన్ఫెక్షన్లు: మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కిడ్నీకి పాకి (పైలోనెఫ్రైటిస్‌) దానివల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి రావచ్చు. దీనివల్ల కిడ్నీ విఫలమయ్యే ముప్పూ ఉంటుంది. మధుమేహుల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఎక్కువేం కాదుగానీ.. అవి వస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.

* ప్రోస్టేటు: పురుషుల్లో పెద్దవయసుకు వచ్చేసరికి ప్రోస్టేటు గ్రంథి పెద్దదై (బీపీహెచ్‌)... దానివల్ల మూత్రం ధార తగ్గి.. కొంత మూత్రం లోపలే నిల్వ ఉండిపోతుంటుంది, కొన్నిసార్లు వెనక్కిపోతుంది కూడా. దీనివల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చి కిడ్నీలు దెబ్బతిని, వ్యాధిగ్రస్తం కావచ్చు.

* రాళ్లు: కిడ్నీల్లో రాళ్ల వల్ల మూత్ర ప్రవాహం, పీడనాల్లో తేడాలొచ్చి.. అది వెనక్కి ప్రవహించి.. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చి.. అవి దీర్ఘకాలిక వ్యాధిలోకి వెళ్లే అవకాశాలుంటాయి. కొన్నిసార్లు కిడ్నీలకు క్షయ, కిడ్నీ క్యాన్సర్‌ వంటి వాటి వల్ల కూడా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి రావచ్చు.

* వయసు: మధుమేహం, అధిక రక్తపోటువంటివేమీ లేకున్నా కూడా.. సహజంగానే వయసుతో పాటు మన కిడ్నీల పనితీరు తగ్గుతుంటుంది. అందువల్ల వృద్ధాప్యానికి దగ్గరపడుతున్న వారిలోనూ సీకేడీ ఎక్కువ.

* మందులు: కొన్ని రకాల ముందులు, ముఖ్యంగా నొప్పి నివారిణి (ఎన్‌ఎస్‌ఏఐడీ) మందులు, కొన్ని యాంటీబయాటిక్స్‌ వల్ల కూడా కిడ్నీలు దెబ్బతినొచ్చు.

* గతంలో కిడ్నీ వైఫల్యం: ఆపరేషన్లు, గర్భం-కాన్పులు, తీవ్రమైన నీళ్ల విరేచనాలు, గుండె జబ్బులు.. ఇలాంటి సందర్భాల్లో కొందరికి ఉన్నట్టుండి కిడ్నీలు విఫలమయ్యే అవకాశాలుంటాయి. దీన్నే 'అక్యూట్‌ రీనల్‌ ఫెయిల్యూర్‌' అంటారు. ఇలాంటివారు డయాలిసిస్‌ వంటి చికిత్సలతో సత్వరమే పూర్తిగా కోలుకున్నా కూడా... కిడ్నీ ఒకసారి దెబ్బతిన్నది కాబట్టి భవిష్యత్తులో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి బారినపడే అవకాశం ఉంటుదని మర్చిపోకూడదు. వీరు జీవితాంతం మూత్రపిండాల ఆరోగ్యంపై ఒక కన్నేసి ఉండటం అవసరం.

* యూరిక్‌ ఆమ్లం: రక్తంలో యూరిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉన్న వారికి (హైపర్‌ యూరిసీమియా) దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. వీరిలో కొందరికి కీళ్లు వాచే 'గౌట్‌' సమస్యా ఉండొచ్చు. కాబట్టి గౌట్‌ బాధితులు కూడా కిడ్నీ వ్యాధి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

* కుటుంబ చరిత్ర: కుటుంబంలో మధుమేహం, అధిక రక్తపోటు, కిడ్నీ జబ్బుల వంటివి ఉన్నవారు కూడా.. కిడ్నీ వ్యాధులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని గుర్తించి.. ముందు నుంచే పరీక్షలు చేయించుకోవటం అవసరం.

* వూబకాయం: వూబకాయుల్లో కిడ్నీల మీద వడపోత భారం ఎక్కువ అవుతుంది. దీనివల్లా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి రావచ్చు.

* గుండె జబ్బు: దీర్ఘకాలంగా గుండె జబ్బులున్న వారిలో రక్తపీడనంలో తేడాలు వచ్చి.. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. (కార్డియో రీనల్‌ సిండ్రోమ్‌) గుండె రక్తనాళాలను దెబ్బతీసే అంశాలే కిడ్నీలనూ దెబ్బతియ్యచ్చు.

చికిత్స ఏమిటి?
* మధుమేహం ఉన్నవాళ్లు, హైబీపీ ఉన్నవాళ్లు వాటిని కచ్చితంగా నియంత్రణలో పెట్టుకోవటం ప్రధానం. కిడ్నీ వ్యాధి ఆరంభమైందని నిర్ధారణ అయితే 'ఏసీఈ ఇన్‌హిబిటార్‌', 'ఏఆర్‌బీ' రకం మందులు సిఫార్సు చేస్తారు. ఇవి హైబీపీనీ, కిడ్నీ జబ్బునీ రెంటినీ నియంత్రించుకోవటానికి ఉపకరిస్తాయి. కొంత వరకూ మధుమేహ నివారణకూ ఉపకరిస్తాయి. వీరిలో కొలెస్ట్రాల్‌ వంటివీ అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి 'స్టాటిన్స్‌' రకం మందులూ ఇస్తారు. వీటివల్ల మూత్రపిండ వ్యాధిలోకి వెళ్లకుండా ఉంటారు.

* వూబకాయులు బరువు తగ్గటంతో పాటు మెట్‌ఫార్మిన్‌ తరహా మందులు వాడుకుంటే అది కిడ్నీ వ్యాధిని కూడా నివారిస్తుంది. మధుమేహుల్లోనూ ఇది కిడ్నీ వ్యాధిని నివారించటానికి ఉపయోగపడుతుంది.

* పొగ, మద్యం నేరుగా కిడ్నీలను దెబ్బతీస్తాయి. వాటిని ఆపెయ్యాలి.

* ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్ల వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. విటమిన్‌ ఇ, సి తీసుకోవటం కూడా ఉపయోగపడే అంశమే.

అవగాహనతో చక్కటి పోషకాహారం తీసుకోవటం, రోజూ కొద్దిపాటి వ్యాయామం, బీపీ మధుమేహాలను అదుపులో ఉంచుకోవటం, గుండె మెదడు జబ్బుల వంటి ఇతర వ్యాధుల మీద ఒక కన్నేసి ఉండటం.. ఇవన్నీ ముఖ్యం. వీటివల్ల కిడ్నీ వ్యాధి ఉన్నా.. చాలాకాలం సమస్యలు లేకుండా నిశ్చింతగా జీవితం గడపొచ్చు.

ఆహారంపై శ్రద్ధ ముఖ్యం!
మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు ఆహారంలో మాంసకృత్తులు (ప్రోటీను) తక్కువగా తినాలి. శాకాహార ప్రోటీను కంటే కూడా మాంసాహార ప్రోటీను వల్ల కిడ్నీ దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి శాకాహార ప్రోటీను తీసుకోవటం, దాన్నీ తక్కువగానే తీసుకోవటం మంచిది. జంతుసంబంధ ప్రోటీనులో కూడా- 'హై బయోలాజికల్‌ వాల్యూ ప్రోటీన్‌' అనేవి ఉంటాయి.. ముఖ్యంగా పాలు, గుడ్డులో తెల్లసొన వంటివి. వీటిని తీసుకోవచ్చు, అదీ మితంగానే! ఇలా ప్రోటీన్లను తగ్గించి తినటాన్ని 'లోప్రోటీన్‌ డైట్‌' అంటారు. కొందరికి వీటిని ఇంకా తగ్గించటం (వెరీ లోప్రోటీన్‌ డైట్‌) కూడా బాగా ఉపయోగపడుతుందని గుర్తించారు, కాకపోతే వీరికి బయటి నుంచి కొన్ని పోషకాలను తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే వీరు పోషకాహార లోపంలోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.

* పిండి పదార్థాలు: ప్రోటీను పదార్థాలు బాగా తగ్గించినా.. వీరు ఆహారపరంగా శక్తి దండిగా అందించే పదార్థాలు (క్యాలరీలు) తీసుకోవటం అవసరం. లేకపోతే శరీరం శక్తి కోసం వీరిలోని ప్రోటీనును వాడుకోవటం మొదలవుతుంది. దీనివల్ల కిడ్నీల మీద భారం మరింతగా పడుతుంది. కాబట్టి ఈ పరిస్థితి రాకుండా పిండి పదార్థాల వంటివి తగినంతగా తీసుకోవాలి.

* కొవ్వు: నూనె, నెయ్యి వంటివి బాగా తక్కువగా తీసుకోవాలి. కిడ్నీ వ్యాధి బాధితుల్లో చాలామందికి కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల వంటివీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొవ్వులను మితంగా తీసుకోవాలి.

* ఉప్పు: హైబీపీకి ప్రధాన సమస్య ఉప్పు. హైబీపీ లేకపోయినా కూడా కిడ్నీ జబ్బులుంటే మాత్రం ఉప్పు తగ్గించుకోవాల్సిందే. (కొంతమందిలో మాత్రం కొన్ని రకాల లవణాలు ఎక్కువ పోతుండే నెఫ్రోపతి సమస్యలుంటాయి, వారికి మాత్రం ఉప్పు నియంత్రణ అవసరం ఉండదు, వారు వైద్యుల సలహా సూచనల మేరకు నడుచుకోవాలి.)

* పొటాషియం: పొటాషియంను ఒంట్లోంచి బయటకు పంపటంలో ప్రధాన పాత్ర కిడ్నీలదే. కాబట్టి కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్లు పొటాషియం అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటే.. అది బయటకుపోక.. ఒంట్లోనే పేరుకుని రకరకాల సమస్యలు మొదలవుతాయి. ఈ పొటాషియం- పండ్లు, కొబ్బరి నీళ్లు, పప్పుల్లో ఎక్కువగా ఉంటుంది. కొన్ని కూరగాయల్లోనూ ఎక్కువే ఉంటుంది. కాబట్టి పొటాషియం చాలా ఎక్కువగా ఉండే పదార్థాలేమిటో చూసుకుని, వాటికి దూరంగా ఉండటం ముఖ్యం. లేకపోతే వీరికి కండర పక్షవాతం, గుండె లయ సమస్యల వంటివి వచ్చే అవకాశం ఉంటుంది.

* కూరగాయలు: కూరల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని చిన్నముక్కలుగా తరిగి, నీళ్లలో కొంతసేపు నానబెట్టి.. ఆ నీళ్లు పారబోసేసి అప్పుడు వండుకు తినాలి. దీన్నే 'లీచింగ్‌' అంటారు.

* కిడ్నీ వ్యాధి ఏ దశలో ఉన్నా కూడా ఈ జాగ్రత్తలన్నీ పాటించటం అవసరం. ముఖ్యంగా మూడో దశ నుంచీ మరింత కచ్చితంగా పాటించటం అనివార్యం.

కిడ్నీలు విఫలమైపోతే..?
దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఐదో దశలోకి వెళితే.. కిడ్నీలు దాదాపుగా విఫలమైపోయాయని అర్థం. ఇక వీరికి కృత్రిమంగా రక్తశుద్ధి చేసే 'డయాలసిస్‌' చికిత్స తప్పనిసరి అవుతుంది. లేదంటే కిడ్నీ మార్పిడి చెయ్యాల్సి వస్తుంది.

* డయాలసిస్‌లో- హీమో, పెరిటోనియల్‌ అని రెండు రకాలుంటాయి. మొదటి రెండేళ్లూ పెరిటోనియల్‌ డయాలసిస్‌కు వెళ్లొచ్చు. ఎందుకంటే అప్పటికి ఇంకా కొంత కిడ్నీ పనితీరు మిగిలే ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత డయాలసిస్‌ నాణ్యతను బట్టి హీమోడయాలసిస్‌కు వెళ్లాల్సి ఉంటుంది.


హైబీపీ, మధుమేహంతో కిడ్నీ జబ్బెందుకు?
మన కిడ్నీల్లో 'గ్లోమరులస్‌' అనే చిన్న విభాగాలు లక్షల్లో ఉంటాయి. ప్రధానంగా రక్తాన్ని శుద్ధిచేసే వడపోత విభాగాలివే. హైబీపీ ఉన్నవారికి రక్తం పీడనంతో వీటిలోకి వెళ్లటంతో వీటిలోనూ పీడనం పెరుగుతుంది. దీంతో వీటి గోడలు మందంగా తయారై (స్ల్కిరోసిస్‌).. వడపోత తగ్గిపోవటం మొదలవుతుంది. అలాగే మధుమేహుల్లో రక్తంలో గ్లూకోజు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఈ రక్తం వడపోత కోసం గ్లోమరులస్‌లోకి వెళ్లినప్పుడు.. ఇది వడపోత పొరల స్వభావాన్ని మార్చేస్తుంది. దీంతో ప్రోటీను పోవటం ఆరంభమై.. కిడ్నీల వడపోత సామర్థ్యం దెబ్బతినిపోతుంది.

సీరం క్రియాటినైన్‌ ఒక్కటే చాలదు
చాలామంది సీరం క్రియాటినైన్‌ చూస్తే.. దాన్లో కిడ్నీ పనితీరు తెలిసిపోతుందని భావిస్తుంటారు. క్రియాటినైన్‌ బాగుంటే కిడ్నీలు బాగున్నట్టుగానే పరిగణిస్తుంటారు. కానీ ఇది సరికాదు. నిజానికి క్రియాటినైన్‌ పెరగటం ఆరంభమయ్యే సరికే కిడ్నీలు కొంత దెబ్బతిని ఉంటాయని గుర్తించాలి. కిడ్నీల పనితీరు సామర్థ్యం ప్రభావితమైనా కూడా వెంటనే క్రియాటినైన్‌లో అది ప్రతిఫలించకపోవచ్చు. అందుకే 'ఈజీఎఫ్‌ఆర్‌' పరీక్ష మీద ఆధారపడటం మంచిది.

--Dr.K.V.Dakshinamurty - Nephrologist ,Hyderabad.
 • ===========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, April 2, 2011

గుండెపోటు సూచనలు,Heart attack hintsఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -గుండెపోటు సూచనలు,(Heart attack hints)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


గుండె రక్తనాళంలో కొవ్వు పేరుకుని, కొలెస్ట్రాల్‌ రక్తంలో గడ్డకట్టి గుండె కండరానికి రక్త సరఫరా ఆగిపోవడం వల్ల గుండె కండరం దెబ్బతింటుంది. దీన్ని గుండెపోటంటారు. గుండెపోటు వివిధ లక్షణాలతో కనిపిస్తుంది. ఛాతిలో నొప్పి, ఎడమచేయి లాగడం, కింది దవడ లాగడం, కడుపులో మంట, తల తిప్పడం, శ్వాసలో ఇబ్బంది, గుండెదడ, ఎక్కిళ్లు బాగా రావడం, భుజాలు లాగడం వంటివి.

గుండెపోటు తీవ్రతతో ప్రధాన రక్తనాళం మొదటి భాగం బ్లాక్‌ అయినప్పుడు, గుండె కండరాలు బాగా దెబ్బతిని, గుండె కండరం సరిగా పనిచేయక రక్త పీడనం పడిపోవడం (లోబిపి), గుండె ఆగిపోవడం శ్వాసలో తీవ్ర ఇబ్బంది ఏర్పడి మరణానికి దారి తీసే ప్రమాదముంది. చిన్న రక్తనాళం బ్లాక్‌ అయినప్పుడు ఛాతినొప్పి వచ్చి తగ్గిపోతుంది. కొద్దిమందికి తెలియకపోవచ్చు. పరీక్షల ద్వారా భవిష్యత్తులో వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందా, లేదా అని నిర్ధారించవచ్చు. గుండెపోటు వచ్చే అవకాశమున్నట్లైతే యాంజియోగ్రాం చేసి బైపాస్‌, యాంజియోప్లాస్టి స్టెటింగ్‌ చేసి జాగ్రత్తలు తీసుకోవచ్చు. గుండెపోటు వచ్చిన వారికి దగ్గరలో ఉన్న గుండె వ్యాధుల నిపుణులను సంప్రదించి, త్వరగా వైద్యసేవలు తీసుకున్నట్లైతే గుండె కండరం దెబ్బతినకుండా నివారించి, ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చు. గుండెపోటు ఉన్నవారికి నొప్పి వచ్చి ఆరు గంటల్లోపు త్రోంబోఐటిక్‌ థెరఫి (స్ట్రెఫోటోకెనిస్స్‌, యురోకెనిస్స్‌, టిపిఎ ఇంజక్షన్‌ ఇవ్వడం) ద్వారా చాలా మందికి కండరం దెబ్బతినకుండా ప్రాణాపాయం సంభవించకుండా ఉపయోగముంటుంది. ఎంత త్వరగా వైద్య సేవ లభిస్తే అంత మంచి ఫలితాలు కన్పిస్తాయి. వైద్యసేవలు అలస్యమైతే ఉపయోగముండదు. ముందు వచ్చిన వారికి, ఆలస్యంగా వచ్చిన వారికి వైద్యసేవ ధరల్లో తేడా లేకున్నప్పటికీ ఆలస్యంగా వచ్చిన వారి కంటే ముందు వచ్చిన వారికి వైద్యసేవ ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. గుండెపోటు వచ్చిన మొదటి గంటను వైద్యభాషలో గోల్డెన్‌ అవర్‌ అంటారు. ఆ సమయంలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే సత్ఫలితాలకు అవకాశం ఎక్కువ. గుండెపోటు వచ్చిన మూడుగంటల తర్వాత వారికి యాంజియోప్లాస్టి, సెట్టింగ్‌ వల్ల త్రాంబోలైటెక్‌ యాంజియోప్లాస్టి సెట్టింగ్‌ వల్ల ఉపయోగాలు, త్రాంబోథెరఫికి సమానంగా ఉంటాయి. ప్రాణాంతకంగా ఉన్న రోగికి ఎక్కువగా యాంజియోప్లాస్టి రికమండ్‌ చేస్తారు. హైరిస్కు పేషెంట్‌ అంటే గుండెపోటు వచ్చినప్పుడు లోబిపి, గుండె రేటు ఎక్కువగా ఉండి శ్వాస బాగా ఇబ్బందిగా ఉంటుంది. వీపరీతంగా నొప్పి వచ్చి, మందులతో తగ్గకపోయినా, గుండెరేటులో అవకతకవలు (ఎక్కువ, తక్కువ) వచ్చి ఉన్నప్పుడు గుండె కండరం చిట్లినప్పుడు, గుండెవాల్స్‌ లీకైనప్పుడు ట్రీట్‌మెంటుతో అంతగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఇలాంటి వారికి అతి త్వరగా యాంజియోప్లాస్టి స్టెటింగ్‌ లేదా సర్జికల్‌ ట్రీట్‌మెంట్‌ చేయడం ద్వారా చాలా మందిని ప్రాణప్రాయస్థితి నుంచి కాపాడవచ్చు. గుండెపోటు ఎక్కువగా ఉన్న వారు గుండెపోటు లక్షణాలు, అవస్థలు తగ్గేవరకు ఇన్సెంటివ్‌ కేర్‌లో ఉండాల్సి ఉంటుంది. గుండెపోటు వచ్చినా ఎక్కువగా గాలివీచే ప్రదేశంలో కూర్చోబెట్టి, అరమాత్ర సారబిట్రీట్‌ టాబ్లెట్‌ నాలుక కింద ఉంచి, ఎస్ప్రిన్‌ మాత్ర మింగించాలి. ఆ తర్వాత దగ్గరలో ఉన్న డాక్టర్‌ వద్దకు వెళ్లి ఇసిజి తీసుకుని గుండెపోటు నిర్ధారించుకోవచ్చు. గుండె పోటు 25 సంవత్సరాలు దాటిన పురుషుల్లో, 40 సంవత్సరాలు దాటిన స్త్రీలలో వస్తోంది. అధికంగా బరువు ఉండి, రక్తపోటు, మధుమెహ వ్యాధి, రక్తంలో కొలెస్ట్రాల్‌ అధికంగా ఉన్నవారు రక్తపోటు లక్షణాలున్నవారు. ఆలస్యం చేయకుండా వైద్యనిపుణుల సలహాలు తీసుకున్నట్లైతే చాలా వరకు ప్రాణాపాయస్థితి నుంచి రక్షించబడతారు. ఆలస్యం జరిగితే గుండె ఆగిపోయి ఆకస్మిక మరణం సంభవించే అవకాశముంది. గుండె కండరం దెబ్బతిని, భవిష్యత్తులో గుండె ఫెయిల్యూర్‌ కావడం వల్ల నాణ్యమైన జీవితం దెబ్బతింటుంది. (కాళ్లవాపు, అలసిపోవడం, ఆయాసంతో ఇబ్బందులు పడుతారు) ఎక్కువ గుండెనొప్పి వచ్చిన వారికి గుండె గదుల్లో రక్తం గడ్డకట్టి త్రాంబోఎంబాలిజమ్‌ అనే పరిస్థితి దాపురించి, పక్షవాతం సంభవించవచ్చు. గుండె కొట్టుకునే విధానంలో అవకతవకలు(అరిథమైయాస్‌) ఏర్పడి ఆకస్మిక మరణానికి దారి తీస్తుంది.

గుండెపోటు వల్ల వచ్చే నష్టాలను వైద్యున్ని త్వరగా సంప్రదించి, త్వరగా చికిత్స పొందినట్లైతే నివారించవచ్చు. గుండెపోటు వచ్చిన వారు అధిక బరువు పెరగకుండా చూసుకోవాలి. నూనె వస్తువులు, పాస్ట్‌ఫుడ్స్‌ (బయటి ఫుడ్స్‌) ఎక్కువగా తీసుకోవద్దు. తాజా ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది. ప్రతిరోజు అరగంట జాగింగ్‌ గానీ, వాకింగ్‌ గానీ, స్విమ్మింగ్‌ చేయడం శరీరానికి మంచిది. తరచుగా షుగర్‌, బిపి, కొలెస్ట్రాల్‌ చెకప్‌ చేయించుకుంటూ సిగరెట్‌, గుట్కాలు పూర్తిగా మానేేయాలి. మటన్‌, చికెన్‌ అధికంగా తీసుకోవద్దు, అధికంగా తీసుకున్న వారు వాటికి తగ్గట్టుగా వ్యాయామం చేయాలి. ఫిష్‌ను తీసుకోవచ్చు. గుండె పోటు వచ్చిన వారు వైద్యుల సలహాల ప్రకారం మందులు వాడాలి.


 • ==============================================
Visit my website - > Dr.Seshagirirao.com/