Thursday, December 22, 2011

అంగస్తంభన సమస్య – చికిత్సా విధానాలు, Erectile dysfunction -Treatment



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -అంగస్తంభన సమస్య – చికిత్సా విధానాలు, Erectile dysfunction -Treatment- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




అంగస్తంభన సమస్య కేవలం అది వున్న వాళ్ళనే కాకుండా వాళ్ళ పార్టనర్లని, కుటుంబ సభ్యుల్ని కూడా బాధిస్తుంది. అందువలన దీని చికిత్స గూర్చిన వివరాలు అందరూ తెలుసుకుంటే మంచిది. నపుంసకర అన్నది కేవలం జననాంగానికి సంబంధించినదే కాదు. శరీరంలో కలిగే అనేక వికృతులు ఈ సమస్య కలిగిస్తాయి. శృంగారం అన్నది ఒక క్రీడ. ఈ క్రీడలో ఇద్దరూ భాగస్వాములే. అవతలి వాళ్ళకోసం వాళ్ళలోపం కూడా ఆడే వాడి మీద పడుతుంది. అనుమానించే భార్య, అసహ్యించుకునే భార్య, జడపదార్థం వలె పడుకునే భార్య, రసికత లేని భార్య, సెక్స్ డిమాండ్ చేసే భార్య, డామినేట్ చేసే భార్య – ఇలాంటి పార్టనర్ ప్రభావం కూడా సెక్స్ పై పడుతుంది.

సరైన ఏకాంతం లేకపోవడం, సరైన అవగాహన లేకపోవడం, తల్లిగానీ, తండ్రిగానీ మగవాన్ని బాగా డామినేట్ చేయడం, కొన్ని సందర్భాల్లో అత్తమామల గొడవలు, ఇలా అనేక విషయాలు మగవాని సెక్స్ పై ప్రభావం చూపుతాయి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని చికిత్స చేయాలి. అంగస్తంభన కల్గించడమే సమస్యకు పరిష్కారం కాదు. అంగానికి ఇంజెక్షన్ ఇచ్చి హాస్పిటల్ లో ఒక రూములో భార్యాభర్తలను కలవమని చెప్పి చికిత్స చేసినా సమస్య పరిష్కారం కాని వాళ్ళున్నారు. అందుకే చికిత్సలో కౌన్సెలింగ్ ముఖ్యమైంది. సెక్స్ విషయంలో, సెక్స్ సమస్యల విషయంలో అవగాహన కల్పించడం అత్యంత అవసరమయ్యింది. అన్ని చికిత్సా విధానాలు అందరికీ సరిపడవు. కొందరికి కొన్ని బాగా పనిచేస్తాయి. కొందరికి అదే అసలు పని చెయ్యదు. యాంత్రిక సాధనాలు కొన్ని రకాల చికిత్సలు కొందరికి సౌకర్యంగా ఉంటాయి. కొందరికి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

అంగస్తంభమ సమస్యకు కారణాలు అనేకం ఉంటాయని చెప్పుకున్నాం. కారణం నిర్థారించిన అనంతరం దానిని బట్టి చికిత్స నిర్ణయిస్తాం. అంగస్తంభన కోసం వ్యాక్యూమ్ డివైస్, అంగంలో చేసే ఇంజెక్షన్ లు, ఇంప్లాంట్స్ లభ్యమవుతున్నా చాలామందిలో మందులతో మంచి ఫలితాలు కనబడుతున్నాయి .

చికిత్సకు మూడు నుంచి ఏడు నెలలదాకా సమయం పడుతుంది.
మందులు వాడిన వారిలో ఆందోళన, డిప్రెషన్ తగ్గడం, అంగస్తంభన సమస్యతో పాటు శీఘ్రస్ఖలనం కూడా తగ్గడంలాంటి ఉపయోగాలు అనేకం ఉన్నాయి. హార్మోన్ల హెచ్చుతగ్గులున్నవారిలో వాటిని సరిచేసే చికిత్స అవసరమవుతుంది. మొత్తం మీద అంగస్తంభన సమస్యకు సంపూర్ణమైన సంతృప్తికరమైన చికిత్సా విధానాలున్నాయి. ఇంకా తేలికైన సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా గల చికిత్సా విధానాలు రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే మనకు అందుబాటులోకి వస్తాయి.

అమెరికా, యూరప్ లలో అనుసరించే చికిత్స విధానాల్లో సెక్స్ థెరపీ ముఖ్యమైనది. భార్యాభర్తలిద్దరినీ కౌన్సెలింగ్ విడివిడిగా చెయ్యడం, కలిపి చెయ్యడం ద్వారా అంగస్తంభన సమస్యకు కారణాలు చాలా సందర్భాలలో బయటపడతాయి. పార్టనర్ సహకారంతో సెన్సేట్ ఫోకస్, ఫోర్ ప్లే టెక్నిక్ లు, సైకో థెరపీల ద్వారా చికిత్స జరుగుతుంది.

అంగస్తంభన సమస్యకు ఈ రోజుల్లో ముఖ్యకారణం ఇతర వ్యాధులకు చిరకాలం వాడిన మందుల సైడ్ ఎఫెక్ట్స్, అధిక రక్తపోటుకు వాడే మందుల సైడ్ ఎఫెక్ట్స్ గా అంగస్తంభన సమస్య కల్గినా ఆ మందులు ఆపితే అధిక రక్తపోటు వలన ప్రమాదాలు సంభవిస్తాయి. ఇలాంటివారిలో నివారణ మందులు, బిపీకి వాడే మందులతో పాటు వాడితే మంచి ఫలితాలు కలుగుతాయి. డిప్రెషన్ ఇతర మానసిక వ్యాధులకు వాడే మందులు, కడుపులో అల్సర్ కి వాడే సిమిటిడిన్ లాంటి మందులు అంగస్తంభన సమస్య కలిగిస్తాయి. వైద్యుని సలహాతో మందులు మార్చడం, అల్సర్, డిప్రెషన్ లాంటి వాటికి సురక్షితమైన మందుల్ని ప్రయత్నించడం మంచిది.

యాంత్రిక సాధనాలతో చికిత్సలో వ్యాక్యూమ్ పంపులు, ఇంప్లాంట్స్ ముఖ్యమైనవి. ఆకస్మాత్తుగా, అనుకోకుండా కనుగొనబడినవి.... అంగంలో ఇంజెక్షన్స్ లు ప్రొ-బ్రిండ్లే, ప్రొ-విరాగ్ కృషి ఫలితంగా ఇవి అందరికీ అందుబాటులోకి వచ్చాయి. కొత్త కొత్త మందులు కొత్త కొత్త విధానాలు వచ్చాయి. కొన్ని మందులు భారతదేశంలో దొరుకుతున్నాయి. కొన్ని ఇంకా మన మార్కెట్లోకి రావాల్సి ఉంది. అత్యంత ప్రాచీనమైనది, ప్రపంచంలో చాలామందికి అభిమానమైన మందులు, అత్యంత ఆధునికమైన మందులు, సాధనాలు రెండూ మనదేశంలో లభ్యమవుతున్నాయి. సురక్షితమైనవి, సైడ్ బెనిఫిట్స్ కలవి అయినందువలన మందులపై విశ్వాసం, ఆదరణ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.

వ్యాక్యూమ్ పంప్
అంగస్తంభన కలిగించే సాధనాల కోసం ప్రయత్నాలు అనేక సంవత్సరాలుగా జరపబడుతున్నాయి. వ్యాక్యూమ్ పంపులలో అనేక రకాలున్నాయి. అందులో ఒక రకం పంపులో ఎక్రలిక్ ట్యూబ్ లో అంగాన్ని ఉంచి వ్యాక్యూమ్ ప్రెషర్ ఇవ్వాలి. అంగస్తంభన కలిగాక అంగం మొదటి భాగంలో రింగులను ఉంచాలి. ఈ రింగులను ఉంచినందువలన రక్తం అంగం నుంచి బయటకు వెళ్ళకుండా నిరోధిస్తుంది. ఆ తరువాత సిలండ్దర్ ని తీసివేసి రతిలో పాల్గొనవచ్చు. రిగులను తీసివేసేవరకూ (30 నిమిషాలలోపు) అంగస్తంభన కొనసాగుతుంది. రింగులు ఉన్నందువలన వీర్యస్ఖలనం సరిగా కాదు.

ఈ వ్యాక్యూమ్ పంప్ వాడిన కొద్దిమందిని ప్రశ్నించగా ఇది వాడేప్పుడు అంగంలో నొప్పి తిమ్మిరి కలిగాయని, ఆరు నెలల తరువాత ఇది వాడాలనే ఉత్సాం తగ్గిందని, కొందరు ఇక ఇది వాడదలుచుకోవడం లేదని కొందరు చెప్పారు. ఇది ఇంగ్లాండ్ లో జరిగిన పరిశీలన. అమెరికాలో ఇది వాడమని సలహా ఇస్తున్న డాక్టార్లు దీని పనిపై సరి అయిన సమాధానం ఇవ్వలేదు. అమెరికాలో ఇది తయారు చేసే కంపెనీ ఇచ్చే సమాచారంలో మూడు వేలమందికి పైగా వారు చెప్పినవి పొందుపరిచి పంపారు. వ్యాక్యూమ్ పంప్ పెట్టిన అరనిమిషం నుంచి అయిదు నిమిషాల లోపు అంగస్తంభనలు కలిగినట్లు, 52 శాతం మందికి వీర్య స్ఖలనంలో ఏ విధమైన సమస్యలు కలగనట్లు, 16 శాతం మందికి వీర్య స్ఖలనంలో సమస్యలు కలిగినట్లు తెలియజేశారు. వ్యాక్యూమ్ పంపులు, రింగులు వాడవద్దని చెప్పే డాక్టర్లు ఇవి వాడాక అంగంలోని కణజాలానికి నష్టం కలుగుతుందని, మూత్ర మార్గానికి ఇన్ ఫెక్షన్ లు కలుగుతాయని చెప్తున్నారు.

ఒక రకమైన వ్యాక్యూమ్ పంప్ సుమారు 12,500 రూపాయలు ఖరీదు చేస్తుంది. బ్యాటరీతో పనిచేసే వ్యాక్యూమ్ పంపు సుమారు 23,500 రూపాయలు చేస్తుంది. ఇంకోరకం వ్యాక్యూమ్ పంప్ అంగంపై కండోమ్ లాగా అతికిఉంటాయి. దీన్ని వేసుకుని రతి జరపవచ్చు. ఈ సాధనాలు జననాంగాలకు ఏ విధమైన హానీ చెయ్యవు అన్నది ఇంకా శాస్త్రీయంగా నిర్థారించబడలేదు. అమెరికాలో ఉండేవారికి దీని ఖరీదు భరించవీలవుతుంది. సుమారు 350 అమెరికన్ డాలర్లు కనుక, అదే మన దేశంలో అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండదు. ఇవి దేశీయంగా తయారు చేస్తే అత్యంత చవకగా అమ్మవచ్చు. అప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తాయి.

అంగంలోకి ఇంజెక్షన్లు :
ఇంగ్లాండ్ కి చెందిన ప్రొఫెసర్ బ్రిండ్లే, ఫ్రాన్స్ కి చెందిన ప్రొఫెసర్ విరగ్ కృషి ఫలితంగా అంగంలోకి చేసే ఇంజెక్షన్లు అంగస్తంభన సమస్య వ్యాధి నిర్థారనలోనూ, చికిత్సలోనూ ఉపయోగపడుతున్నాయి. నాడీ మండలానికి సంబంధించిన వికృతుల వలన కల్గిన అంగస్తంభన సమస్య కలవారిలో ఈ ఇంజెక్షన్లు నూరు శాతం మంచి ఫలితాన్నిచ్చినట్టు, రక్తనాళాలకు సంబంధించిన వికృతి కలిగిన వారిలో 66 శాతం మందిలోనూ, ఇవి మంచి ఫలితాన్నిచ్చినట్టు చూశారు. మానసిక కారణాలు కలవారిలో ఈ ఇంజెక్షన్ల ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరిలో అతి తక్కువ మోతాదులో కూడా ఉపద్రవాలు కలుగుతాయి. కొందరిలో అసలు అంగస్తంభన కలగదు.
ఈ ఇంజెక్షన్లలో కలిగే ముఖ్యమైన ఉపద్రవం అంగస్తంభన అనేక గంటలు అలాగే ఉండిపోవడం. 6-12 గంటలు మించి అంగస్తంభన ఉండిపోతే వెంటనే చికిత్స చేసి అంగస్తంభన తగ్గించాలి. లేకపోతే అంగస్తంభన అనేక గంటలు అలాగే ఉండిపోతే అంగంలో కణజాలాలకు హాని కలిగి అంగస్తంభన శాశ్వతంగా కలగదు. ఈ ఇంజెక్షన్ లని సొంతంగా చేసుకోవడం నేర్చి చికిత్స చేసుకోవచ్చు. ప్రొఫెసర్ బిండ్లే 15 రోజులకు ఒక ఇంజెక్షన్ మాత్రమే చేసుకోవాలన్నారు. ఇంజెక్షన్ చేసుకున్న కొద్ది నిమిషాలలోనే అంగస్తంభనం కలుగుతుంది. కలిగిన స్తంభనం ఎక్కువసేపు ఉంటుంది. అయినప్పటికీ మనదేశంలోనే కాక విదేశాలలో కూడా రెగ్యులర్ గా వీటిని తీసుకోవడానికి చాలామంది ఇష్టపడడం లేదు.
ఇంజెక్షన్లలో మూడు రకాలున్నాయి. కావర్ జెక్ట్ ఖరీదైనది. ఒక ఇంజెక్షన్ ఖరీదు వెయ్యి రూపాయలు ఉంటుంది. కొద్ది నొప్పి ఉండవచ్చు. దీనివలన కలిగిన అంగస్తంభనాలు గంట అంతకంటే ఎక్కువ సేపు నిలబడుంటుంది. 1955లో ఇది ఎఫ్.డి.ఎ. అప్రూవల్ పొందింది. 1977లో ఈడెక్స్ అనే మరో ఇంజెక్షన్ ఎఫ్.డి.ఎ. అప్రూవల్ పొందింది. ఇది కానరెక్ట్ కంటే చవకైనది. ఇంకా చిన్న నీడిల్ తో ఇంజెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. అంగస్తంభన గంట సేపు ఎక్కువ నిలబడుతుంది. ఇన్విరాక్స్ అనునది పెంటాలమైన్, వాసో యాక్టివ్ ఇంటెస్టైనల్ పోలీపెప్టైడ్ ల మిశ్రమం ఇది. ఇది అల్ప్రోస్టాడిల్ కంటే సమర్థవంతమైంది. నొప్పి అసలు ఉండదు. వెంటనే అంగస్తంభనాన్ని కలిగిస్తుంది. ఇవేకాక క్రీమ్‍లద్వారా అంగస్తంభన కలిగించే మందులపై పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ప్రొఫెసర్ విరాగ్ 1979 నుంచి 1993 వరకు 2056 మందిలో 163042 ఇంజెక్షన్లు మొత్తం వాడినవారిని పరిశీలించారు.
అంగంలో చిన్న చిన్న గడ్డలు 10 శాతం మందిలో 235 ఇంజెక్షన్ల తర్వాత అంగస్తంభన ఎక్కువ సేపు నిలబడిపోవడం ఆయన గమనించారు. 1989 తర్వాత ఉపద్రవాలు తక్కువ కలిగినట్లు చూశారు. అనుభవం పెరిగే కొద్దీ ఉపద్రవాలు తక్కువ కలగడం చూశారు. డాక్టర్ గణేశన్ అదైకన్ ప్రొస్టాగ్లాండిస్ ఈ 1 తో దీర్ఘకాలం వాడినప్పుడు అంగంలోని కణజాలంపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది పరిశీలించారు. ప్రొస్టాగ్లాండిస్ ఈ 1 వాడినవారిలో అంగస్తంభన ఎక్కువసేపు ఉండడం అనే ఉపద్రవం తక్కువగా కలిగినట్లు తక్కిన మందులు వాడినప్పుడు 5 శాతం 10 శాతం మందిలో ఈ ఉపద్రవం కలిగినట్లు ఆయన చూశారు. అంగంలో కొద్దిపాటి నొప్పి కలుగుతుందని వాడిన వారు చెప్పారు. జంతువులలో ఎనిమిది నెలల నుంచి సంవత్సరం వరకు పెపావరిన్, ప్రొస్టాగ్లాండిస్ ఈ 1 వాడి అంగంలోని కణజాలంలో కలిగే మార్పులు గమనించారు. అంగంలోని కణజాలంలో వాపు కుంచించుకు పోవడం లాంటి మార్పులు పెపావరిన్ లో కలిగినట్టు, ప్రొస్టాగ్లాండిస్ ఈ 1 లో కలగనట్టు చూశారు. అంగస్తంభన సమస్య చికిత్స విషయంలో ఇంజెక్షన్ల ద్వారా వాడే మందులలో ప్రొస్టాగ్లాండిస్ ఈ 1 ఉత్తమమైనదిగా ఆయన చెప్తారు. ఈ ఇంజెక్షన్ ఖరీదు 1100 రూపాయలు. ఒక ఇంజెక్షన్ ఒక్కసారికే పనికివస్తుంది. ప్రతిసారీ అంత మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది.

అంగస్తంభనానికి మూత్ర మార్గం ద్వారా మందు :
మూసే అన్న పేరుతో అమెరికన్ మార్కెట్లో అంగస్తంభనాన్ని వెంటనే కలిగించే సాధనం విడుదలైంది. 1996 నవంబరులో ఎఫ్.డి.ఎ అప్రూవల్ కూడా లభించింది. ఈ సాధనం ద్వారా మూత్ర మార్గములోకి మందును ప్రవేశపెట్టవచ్చు. ఈ సాధనం ప్రవేశపెట్టడానికి ముందు మూత్ర విసర్జన చేసి జననావయవాల్ని బాగా కడగాలి. మూత్ర మార్గం తడిగా ఉన్నందువలన ఈ సాధనాన్ని మూత్రమార్గంలో ప్రవేశపెట్టడం తేలికవుతుంది. అంతేకాకుండా కొద్దిపాటి మూత్రపు చుక్కలున్నందువలన మందు త్వరగా శోషణం చెంది అంగస్తంభనాన్ని కలిగిస్తుంది. కూర్చొని లేదా నిల్చుని నెమ్మదిగా జననావయవాన్ని సాగదీయాల. అంగాన్ని వేళ్ళతో పైకి పట్టుకుని ఈ సాధనాన్ని లోపలికి ప్రవేశపెట్టి పైన ఉన్న బటన్ నొక్కాలి. దీనివలన మందు మూత్ర మార్గంలో పడుతుంది. రెండు చేతుల మధ్య అంగాన్ని ఉంచి పది సెకన్లు బాగా రుద్దాలి. ఒకవేళ మంట కలిగితే ఇంకొక నిమిషం వరకు అంగాన్ని రుద్దాలి. ఈ సాధనాన్ని ప్రవేశపెట్టిన 15 నిమిషాల వరకు కూర్చోవడం, నిల్చోవడం లేదా నడవడం లేదా ఫ్లోర్ ప్లేలో పాల్గొనడం చేయాలి. దీనివలన అంగంలోకి రక్తప్రసారం పెరిగి మంచి స్తంభన కలుగుతుంది.
ఆందోళన, అలసట, టెన్షన్, ఎక్కువ మద్యం సేవించడం, ఈ సాధనం పెట్టుకోగానే పడుకోవడం లేదా మూత్ర విసర్జన చేయడం లాంటివి అంగస్తంభనాన్ని తగ్గిస్తాయి. అదేవిధంగా జలుబుకు, ఎలర్జీ, సైనసెటిస్ వాటికి వాడే మందులు కూడా అంగస్తంభనాలను తగ్గిస్తాయి.
ఈ సాధనం వాడే మొదట్లో మూత్ర మార్గములోకి ప్రవేశపెట్టడం కొంత కష్టంగా ఉండవచ్చు. అలవాటు పడితే అంత కష్టముండదు. ఒక సాధనం ఒకసారికే పని చేస్తుంది. ప్రతిసారీ కొత్తది వాడాల్సొస్తుంది. సాధనం ఖరీదు 20 నుంచి 38 డాలర్లదాకా ఉంది. కనుక ప్రతిసారీ అంత ఖర్చు చేయాల్సి వస్తుంది.
సైడ్ ఎఫెక్ట్స్ :
అంగంలో మంట, నొప్పి, తలనొప్పి, కళ్ళు తిరగడం, నాడి వేగంగా కొట్టుకోవడంలాంటివి కలుగుతాయి. ఈ సాధనం ప్రవేశపెట్టిన అయిదు నుంచి పది నిమిషాలలో అంగస్తంభన కలుగుతుంది. సుమారు 30-60 నిమిషాలు అది నిలబడి ఉంటుంది. కొందరిలో ఇంకా అది నిలబడిఉ ఉండే అవకాశాలున్నాయి. నాలుగు గంటలకు మించి అంగస్తంభన ఉండిపోతే వెంటనే డాక్టర్ ని కలవాల్సి ఉంటుంది. ఐస్ ను తొడల లోపలి భాగంలో రుద్దడం ద్వారా కూడా స్తంభనాన్ని తగ్గించవచ్చు. భార్య గర్భవతిగా ఉన్నవాళ్ళు కండోమ్ వాడాలి. ఇది వాడిన వారి భార్యలలో యోనిలో దురద, మంట కలగడం గమనించారు.

జెల్లిలాంటివి వాడడం కూడా అవసరమవుతుంది. సాధనము వాడే వాళ్ళలో దీర్ఘకాలంలో ఏమైనా నష్టాలొస్తాయన్నది ఇంతవరకూ చూడలేదు.
ఈ సాధనంలో వాడే మందు ప్రొస్టాగ్లాండిస్ ఈ 1. మానవుని శుక్రంలో ప్రొస్టాగ్లాండిస్ ఈ 1, ఈ 2లు ఎక్కువగా ఉంటాయి. స్ఖలనం అయిన వీర్యంలో ప్రతి మిల్లీలీటర్ కు 100-200 మైక్రోగ్రాముల ప్రొస్టాగ్లాండిన్స్ ఉంటాయి. మూత్రమార్గంలోకి 500 మైక్రోగ్రాముల ప్రొస్టాగ్లాండిన్స్ ప్రవేశపెట్టినప్పుడు అంగంలో రక్తప్రసారం 5-10 రెట్లు అధికమైనట్టు డాప్లర్ పరీక్షలలో గమనించారు. అంటే మూత్ర మార్గం ద్వారా ప్రవేశపెట్టిన మందు అక్కడా శోషణం చెంది అంగంలోని అన్ని కణాలకు చేరి అంగస్తంభన కలిగిస్తుంది అని తెలుస్తుంది. మూత్రమార్గంలోని గోడల కుండా కార్పరి స్పాంజియోజ ద్వారా కారిప్రాకావర్నోజాలోకి మందు వెళ్తుంది. పది నిమిషాలలో మందు శోషణం చెందుతుంది.

ఈ సాధనం మార్కెట్లోకి వచ్చాక అంగస్తంభనాన్ని కలిగించే మందులపై పరిశోధనలు తీవ్రతరమయ్యాయి. అనేక మందులపై పరిశోధనలు ఇప్పటికే జరుగుతున్నాయి. అవి సత్ఫలితాల్నిస్తున్నాయి కూడా. నాలుక క్రింద ఉంచుకునే మాత్రలు, అంగంపై పూత మందులు వీటన్నిటిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఒకటి రెండు సంవత్సరాలలోనే ఇవి పరిశోధనలు పూర్తి చేసుకుని రావచ్చు. ఈ మందులు మానవుని చిరకాల వాంఛను నెరవేరుస్తున్నాయి. అనేక సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఇలాంటి మందులు, సాధనాల కోసమే కలలు కంటూ వచ్చారు. 1980 తర్వాత ఇలాంటి కలలు నిజమయ్యే రోజు వచ్చింది.
కానీ శృంగారం అంటే మగాడికి సంబంధించినదేనా? ఆడవాళ్ళ పరిస్థితేంటి? శృంగారంలోనూ, శృంగార సమస్యల విషయంలోనూ, శృంగార సమస్యల పరిష్కార విషయంలోనూ స్త్రీ ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాంటి స్త్రీని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సబబు అని అమెరికాకు చెందిన యూరాలజిస్ట్ లు చెబుతున్నారు. అదే విధంగా మగవారి సమస్యలకు అనేక కారణాలుంటాయి. వివిధ కారణాలు అన్వేషించడం, కౌన్సెలింగ్, చికిత్స ఇవి ఎంతో ముఖ్యమైనవి. కాకపోతే అంగంలోకి వేసే ఇంప్లాంట్స్ అవసరాన్ని చాలావరకు ఈ మందులు, సాధనాలు తగ్గిస్తున్నాయి. కనుక రాబోయే సంవత్సరాలలో ఇంప్లాంట్స్ సర్జరీల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఈ సాధనాలు అంగస్తంభనాన్ని కలిగిస్తాయి కానీ సుఖవ్యాధుల నుంచి రక్షణనీయవు. కనుక సురక్షిత శృంగార మార్గాలు అవలంభించకపోతే సుఖవ్యాధులు కలిగే ప్రమాదం ఉంది.

వయాగ్రా :
అంగస్తంభనం వెంటనే కలిగించే నోటి ద్వారా వాడే మందు ఫుడ్ అండ్ డ్రగ్స్ ఎడ్మినిస్ట్రేషన్, అమెరికా వారి ఆమోదం పొంది అమెరికన్ మార్కెట్లో విడుదలయిన మొదటివారంలోనే సంచలనం సృష్టించింది. దాని పేరు వయాగ్రా. ఫైజర్ కంపెనీ తయారు చేసింది.
సెక్స్ టానిక్స్, వాటికి డిమాండ్, వాటి అవసరం అత్యధికంగా ఉన్నా ఇన్నాళ్ళూ ఈ విషయాన్ని అమెరికన్ శాస్త్రవేత్తలు నిర్లక్ష్యం చేశారు. దానికి ముఖ్య కారణము  సెక్స్ పెంచే మందులపై పరిశోధనలకు రీసెర్చ్ ఫండింగ్ లేకపోవడమే. అంగస్తంభన ప్రక్రియలో నైట్రిక్ ఆక్సైడ్ ముఖ్యపాత్ర వహిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిలిస్ కు చెందిన డాక్టర్ జాకబ్ రాజ్ ఫర్ కనుగొన్నారు. జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన న్యూరో సైంటిస్ట్ డాక్టర్ సాల్మన్ నైడర్ ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు చేశారు.
సింగపూర్ కు చెందిన డాక్టర్ గణేశన్ అదైకన్ అంగస్తంభనలో నైట్రిక్ ఆక్సైడ్ పాత్రను అమెరికన్ల కంటే ముందే గుర్తించారు. అంగస్తంభన చికిత్సలో ఇంజెక్షన్లు 1980లలో ప్రొఫెసర్ విరాగ్, ప్రొఫెసర్ బ్రిండ్లే కృషి ఫలితంగా మనకు అందుబాటులోకి వచ్చాయి. ఆ తరువాత మూత్రమార్గం ద్వారా ప్రొస్టాగ్లాండిస్ ఈ 1ని ప్రవేశపెట్టే సాధనం మార్కెట్లోకి వచ్చింది. ఈ సాధనం మార్కెట్లోకి రాగానే అంగస్తంభనాన్ని వెంటనే కలిగించే మందులపై పరిశోధనలపై అనేక కంపెనీలు ఆసక్తి చూపాయి.
ఫైజర్ కంపెనీ వయాగ్రా పేరుతో ఒక మందును మార్కెట్లోకి విడుదల చేసింది. అంగస్తంభన కలిగించడానికి నోటి ద్వారా వాడే మాత్రలలో ఎఫ్ డి ఎ అప్రూవల్ పొందిన తొలి మాత్ర ఇదే.
వయాగ్రా వాడిన వారిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోలేదు. తలనొప్పి, కంటి చూపుకు సంబంధించిన సమస్యలు కలుగుతాయి. ఈ మందు ముట్లుడిగిన స్త్రీలలో కూడా వాడవచ్చని రోపోర్ట్స్ వస్తున్నాయి.ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులిస్తాయా? సెక్స్ ఎంత సరిపోతుంది? ఎంత సహజము? ఎంత అవసరము? అన్నది ఎలా నిర్ణయిస్తారన్నది ఇన్సూరెన్స్ కంపెనీల ముందున్న ముఖ్యమైన సమస్య. ప్లేబాయ్ శీర్షిక నిర్వహించే జేమ్స్ పీటర్ సన్ ‘చూస్తుండండి ఒక సంవత్సరంలో ఉమెన్స్ మ్యాగజైన్ లో ఆర్టికల్స్ వస్తాయి. ఆ శక్తి మీదా? వయాగ్రాదా? అని. అంతేకాదు కుటుంబ నియంత్రణ పిల్ ఎంత ముఖ్యమైనదో ఈ మందు కూడా అంతే ముఖ్యమైందని అంటున్నారు. వృద్ధులలో ఈ మందు వాడాక వాళ్ళ శృంగార సామర్థ్యం పెరగడం, తద్వారా ఆరోగ్యంగా ఉండడం, ఎక్కువకాలం జీవించడం సంభవిస్తాయి. ఒక విధంగా శృంగారంలో వృద్ధాప్యాన్ని మరిచిపోయి యువకుల్లా ప్రవర్తించవచ్చు.

కామోద్రేకం కలిగినప్పుడు అంగంలో అంగస్తంభన కలిగించే కార్పస్ కావర్నోజమ్ లోకి నైట్రిక్ ఆక్సైడ్ విడుదలవుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ గ్యానిలేట్ సైక్లేస్ అనే ఎంజైమ్ ప్రేరేపించినందువలన సైక్లిక్ గ్వానిజిన్ ఫాస్ఫేట్ (-ఏః) పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా అంగంలోకి రక్తప్రసారం ఎక్కువవుతుంది. వయాగ్రాలో ఉండే మందు సిల్జినాపిల్ సిట్రేట్. కామోద్రేకం కలిగినప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ విడుదలవుతుంది. సిల్జినాపిల్ ఫాస్ఫోడైయిస్టరెస్ టైప్-5ని ఇన్ హిబిట్ చేయడం ద్వారా -ఏః పరిమాణాన్ని పెరిగేట్లు చేస్తుంది. అప్పుడు స్మూత్ మజిల్ రిలాక్స్ అయి అంగంలోకి రక్తప్రవాహం పెరిగి అంగస్తంభన కలుగుతుంది. కామోద్రేకం లేనప్పుడు ఈ మందు అంగస్తంభన కలిగించదు.
ఖాళీ కడుపుతో ఈ మాత్ర తీసుకున్నప్పుడు 30 నుంచి 120 నిమిషాలలో ఈ మందు శరీరంలోకి శోషణం చెందుతుంది. తిన్న తర్వాత వేసుకున్నట్లయితే శోషణం తగ్గుతుంది. మాత్ర వేసుకొన్న 90 నిమిషాల తర్వాత వీర్యంలో ఈ మందు యొక్క పరిమాణం 0.001మి కంటే తక్కువ. ఇది వాడినవారిలో కొన్ని గంటలు చూపు మందగించినట్లు గమనించారు.
19-87 సంవత్సరాల మధ్య వయస్సు కల అంగస్తంభన సమస్య కలవారిపై 3700 మందిలో దీన్ని వాడారు. వారిలో 58మి లో అంగస్తంభన సమస్య శారీరక కారణాలవలన కలిగింది. (వెన్నెముక దెబ్బలు కల్గినవారిని తీసుకోలేదు). మధుమేహం వలన సమస్య కల్గినవారు ఇందులో వున్నారు 17., మానసిక కారణాల వలన అంగస్తంభన సమస్య కల్గినవారు. 24.. శారీరక, మానసిక కారణాలు రెండూ వున్నవారు 25మి గ్రా మందువాడినవారిలో 63,--50 మి గ్రా మందు వాడిన వారిలో 74 మంది। 100 మి గ్రా మందువాడిన వారిలో 82 మందిలోనూ అంగస్తంభనాలు కలిగినట్లు చూశారు.

వెన్నెముక దెబ్బ తగిలిన 178 మందిలో ఈ మందునిచ్చి చూడగా వారిలో 83మి మందిలో అంగస్తంభనాలు బాగా కలిగినట్లు, 59 మి మంది విజయవంతంగా శృంగారం జరిపినట్లు చూశారు. ప్రొస్టేట్ గ్రంథిని పూర్తిగా తొలగించిన వారిలో 43మి వయాగ్రా అంగస్తంభనాలను వృద్ధి పొందించింది. మానసిక కారణాలవలన అంగస్తంభన సమస్య కలిగిన 179 మందిలో 84మి మందిఉలో వయాగ్రా మంచి అంగస్తంభనాలు కలిగించింది. గుండె జబ్బు (కరోనరీ ఆర్టరీ డిసీజ్), అధిక రక్తపోటు, ఇతర గుండె జబ్బులు, మధుమేహం, డిప్రెషన్, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్, రాడికల్ ప్రొస్టేటెక్ట్ లు, ట్రాన్స్ యురెత్రల్ రీసెక్షన్ ఆఫ్ ప్రొస్టేట్‍, వెన్నెముకకు దెబ్బలు తగిలినవారు, డిప్రెషన్ ఇతర మానసిక వ్యాధులకు మందులు వాడేవారు, అధిక రక్తపోటుకు మందులు వాడేవారు – వీరందరిలో కల్గిన అంగస్తంభన సమస్యను వయాగ్రా చాలావరకు తొలగించగలిగింది.
ఆర్గానిక్ నైట్రేట్స్ వాడేవారు వయాగ్రా వాడరాదు. అసలు అంగస్తంభన సమస్యకు కారణాలన్వేషించి పూర్తి చెకప్ చేయాలి. గుండె జబ్బు వున్నవారు ఈ మందును వాడ్డానికి ముందు కార్డియాలజిస్ట్ ను సంప్రదించడం తప్పనిసరి. బ్లీడింగ్ డిజార్డర్స్ వున్నవారు, పెప్టిక్ అల్సర్ వున్నవాళ్ళు, రెటినైటిస్ పిగ్మెంటోజా వున్నవారు ఈ మందును జాగ్రత్తగా వాడాలి.
వయాగ్రా 3700 మందిలో వాడబడింది. వారిలో 550 మంది ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఈ మందు వాడారు. సైడ్ ఎఫెక్ట్స్ కలిగినవారు మొత్తం 730 మంది.తలనొప్పి, ముక్కుదిబ్బడ, యూరినరీ ఇన్ ఫెక్షన్లు, దృష్టిలోపాలు, అతిసారం, శరీరంపై పొక్కులు, మొహం ఉబ్బడం, కడుపునొప్పి, వాంతులు, నోరెండిపోవడం, దాహం, షుగర్ కలవారికి రక్తంలో షుగర్ పెరగడం మొదలగు సైడ్ ఎఫెక్ట్స్ చూశారు. ఎవరిలోనూ అంగం ఎక్కువసేపు నిలబడిపోవడం చూడబడలేదు. శృంగారానికి గంటముందు ఈ మాత్ర వేసుకోవాలి. రోజూ ఒక మాత్ర కంటే ఎక్కువ వాడకూడదు.

ఇక ఈ మందు చిరకాలం వాడిన వారిలో ఎలాంటి దుష్పరిమాణాల్ని కల్గిస్తుంది. ఇతర మందులతో కలిపి వాడినప్పుడు ఎలా ఉంటుంది అన్న విషయం తెలియాల్సి ఉంది. అప్పుడే సైడ్ ఎఫెక్ట్స్ గూర్చి అమెరికాలో చర్చ మొదలైంది. అసలు ఈ మందు గుండెనొప్పి తగ్గించడం కోసం ప్రయత్నించబడింది. ఈ మందు ప్రభావం వల్ల గుండెలోకి కాక తక్కిన అవయవాల్లోకి రక్తప్రసారం పెరుగుతుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ని ఆధారంగా చేసుకుని ఈ మందుని రూపొందించారు.

మధుమేహం వలన అంగస్తంభన సమస్య కల్గి 10 సంవత్సరాలు ఆ వ్యాధితో బాధపడిన ఒక వ్యక్తి ఈ మాత్రలు వాడ్డం మొదలు పెట్టాక 3వ సారి నుంచి బాగా పనిచేయడం ప్రారంభించింది. 59 సంవత్సరాల ఆ వ్యక్తి 30 ఏళ్ళ వాడిలాగా ఫీలవుతున్నానని చెప్తున్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీ మందు డబ్బులివ్వనూ అంటే నెలకు కనీసం 20 సార్లయినా తనే కొనుక్కుంటానని చెపుతున్నాడు.

లాస్ ఏంజిలిస్ కు చెందిన 63 ఏళ్ళ బోమన్ ప్రోస్టేట్‍ ఆపరేషన్ తర్వాత అంగస్తంభన కోల్పోయాడు. 1995లో ఇకదానికి చికిత్స ఇంప్లాంట్ కానీ, వ్యాక్యూమ్ పంపుగానీ, ప్రోస్టాగ్లాండిస్ ఈ 1 ఇంజెక్షన్స్ ని అతను వాడాడు. ఫలితంగా బాగానే కలిగింది కానీ అంగస్తంభన ఒక్కొక్క సేపు బాగా నిలబడి పోయేది. ఆ తర్వాత అతను మూత్రమార్గం ద్వారా వాడే మందు “మూసే” ప్రయత్నించాడు. అది పని చేయలేదు. ఆ తర్వాత వయాగ్రా క్లినికల్ ట్రయల్స్ లో అతను పాల్గొన్నాడు. ఆ మందు బాగా పనిచేసింది. ఇప్పుడు 30 ఏళ్ళ వయసులో వున్నట్లు భావిస్తున్నాను అని అతను చెపుతున్నాడు. అనేక చోట్ల అమెరికన్లకు నోటి ద్వారా వాడే మాత్రలు గొప్ప ఆశాకిరణాలవుతున్నాయి. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ హెల్త్ లెక్కల ప్రకారం 1-2 కోట్ల అమెరికన్లు అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారు. ఇంకా ఎక్కువమందిలోనే ఈ సమస్య ఉంటుందని సెక్సాలజిస్ట్ లు చెపుతున్నారు. చాలామంది మాత్రమే చికిత్సకు వస్తారు. అందువలన ఇంకా అనేక కోట్లమంది ఈ సమస్యతో బాధపడుతున్నారని అంచనా వేస్తున్నారు. ఆడవాళ్ళు ఫేస్ లిస్ట్ లు చేయించుకొని అందంగా తయారవ్వగాలేంది మగవాళ్ళు మందులు వాడి యువకులుగా ఎందుకు తయారవ్వకూడదు అని అంటున్నాడు మరొక వ్యక్తి.

విగర్, నయాగరా ఈ రెండింటిని కలిపి వయాగ్రా అన్న పేరు ఈ మందుకు ఫైజర్ కంపెనీ పెట్టింది. గుండెనొప్పి కలవారికి గుండెలో రక్తప్రసారం పెంచడానికి ఈ మందు ప్రయత్నించబడింది. ఇది వాడేవారిలో అంగస్తంభనలు పెరగడం సైడ్ ఎఫెక్ట్ గా గమనించి ఈ మందును అంగస్తంభనానికి ఉపయోగించారు.

చాలామంది సెక్స్ కి సంబంధించిన విషయాలపై జోక్ చేస్తుంటారు. అంగస్తంభన సమస్య అనేక కోట్ల మందిని బాధించే సమస్య. ఇతర వ్యాధుల విషయంలో చూపించే శ్రద్ధ, ఆసక్తి, సీరియస్ నెస్ సెక్స్ సమస్యల విషయంలో కూడా చూపించాలి. వయాగ్రా ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. సెక్స్ సమస్యలకు కారణాలనేకం వుంటాయి. ఆత్మ విశ్వాసం కొరవడడం, భార్యాభర్తల అనుబంధం తక్కువగా ఉండడం, ఆందోళన, డిప్రెషన్ మొదలగునవి.

సైడ్ ఎఫెక్ట్స్ :
వయాగ్రా కోట్ల కొలది ఆడమగలకు ఉపయోగపడవచ్చు. కానీ అదే సంపూర్ణ సెక్స్ క్యూర్ కాదు. కామోద్రేకం లేని వారికి అది పని చేయదు. మామూలు వారికి అది ఎక్కువగా గట్టిగా లేదా ఎక్కువసేపు ఉండేట్టు చేయలేదు. వివాహాల్ని విడాకుల్నించి రక్షించలేదు.
ఈ మందుకుండే ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్స్
- తలనొప్పి : వాడిన ప్రతి పదిమందిలో ఒకరికి తీవ్రమైన తలనొప్పి కలిగింది. డోస్ పెరిగే కొద్దీ తలనొప్పి కూడా ఎక్కువ అవుతుంది.
-చూపు నీలంగా వుండడం : అంగంలో వుండే ఎంజైమే కళ్ళలో కూడా ఉంటుంది. దానిపైన వయాగ్రా పనిచేస్తుంది. వాడినవారిలో30 మంది తాత్కాలికంగా కళ్ళుకనబడకపోవడం, మసగ్గా కనబడ్డం, నీలంగా కనబడ్డం సంభవించింది.
- కళ్ళు తిరిగి పడ్డం : ఈ మందు రక్తపోటుని తగ్గిస్తుంది. రక్తపోటుని తగ్గించే ఇతరమందులు వాడి అంగస్తంభనానికి ఈ మాత్ర వేసుకున్నప్పుడు రక్తపోటు మరింత పడిపోయి కళ్ళు తిరిగి పడ్డం, షాక్ లోకి వెళ్ళడం సంభవిస్తుంది.
-అంగస్తంభన ఎక్కువసేపు నిలబడిపోవడం : ఈ మాత్ర అంగస్తంభనాన్ని ఎక్కువసేపు నిలబడేలా చేసినట్టు రిపోర్ట్స్ లేకపోయినా అవకాశాలు మాత్రం లేకపోలేదు.
-అంగస్తంభన సమస్య ఇతర సమస్యల్ని సూచించివచ్చు. గుండెజబ్బు, మధుమేహం మొదలగు వ్యాధుల్లో ఈ మందు అంగస్తంభన సమస్య కల్గుతుంది. ఆ తర్వాత అసలు వ్యాధి బయట పడవచ్చు. వయాగ్రా వాడుతుంటే ఈ వ్యాధులు గుర్తించాలన్న ఆలోచన తగ్గవచ్చు. గుండెజబ్బులున్నవారు కార్డియాలజిస్ట్ ను సంప్రదించి ఆ తర్వాత మాత్రమే ఈ మాత్రవాడాలి.
-అలవాటుగా పరిణమించడం : ఈ మాత్రలపై లాంగ్ టెర్మ్ రిసెర్చెస్ లేవు. ఎంతమందికి ఇది అలవాటుగా పరిణమిస్తుంది అన్నది ఇప్పుడే చెప్పలేం.

ఎలా పనిచేస్తుంది ?
1. పరిస్థితులన్నీ బావుంటే మొదడునుంచి వచ్చే కామసంకేతాలు అంగంలో సైక్లిక్ అనే రసాయనం విడుదలయ్యేట్టు చేస్తాయి. దీనివలన అంగస్తంభన కణజాలాలు రిలాక్స్ అయి వాటిలో ధమనులు వ్యాకోచిస్తాయి.
2. రక్తం అంగస్తంభన కణాల్లోకి వచ్చి అంగం గట్టిపడనారంభిస్తుంది. రక్తాన్ని బయటకు తీసుకెళ్ళే సిరలు మూసుకుపోయి అంగం గట్టిగా వుండడానికి దోహదపడ్తుంది. అంగస్తంభమ సమస్య కలవారిలో సైక్లిక్ ఏః తక్కువై సిరలను గట్టిగా నొక్కేంతగా వ్యాకోచాన్ని అంగంలోని కణజాలాలు పొందలేవు.
3. వయాగ్రా సైక్లిక్ ఏః మీద పనిచేస్తుంది. అంగస్తంభన కలిగేట్టు చేస్తుంది.

జీన్ థెరపీలపై కూడా పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మందులన్నీ మార్కెట్లో సంచలనం కల్గిస్తున్నాయి. ఇవి వచ్చాక అనేక వేలమంది నిర్భయంగా చికిత్సకొస్తున్నారు. వయాగ్రా పరిశోధనలకు 400 మిలియన్ డాలర్లు ఖర్చు అయింది. డిప్రెషన్ కు, స్థౌల్యానికి మందులు సంచలనం సృష్టించాయి. ఈ రెండూ కెమికల్స్ తో తగ్గించవచ్చు అన్నది నిరూపణయ్యాక అంగస్తంభన సమస్య కూడా కెమికల్స్ తో తగ్గించవచ్చు అన్నది నిరూపించబడింది.
వయాగ్రా వాడిన వారిలో ఆరుగురు మృతి చెందినట్లు వచ్చినవార్త గొప్ప సంచలనం సృష్టించింది. మరణం వయాగ్రా వలన కల్గిందని ఇంకా నిర్థారించబడలేదని తెలియజేసింది. అయినప్పటికీ మరణానికి కారణాలను ఫైజర్ కంపెనీ అన్వేషిస్తుంది. 10 లక్షల మంది కంటే ఎక్కువమంది ఈ మందువాడారు. అందులో చాలామంది మధ్యవయస్కులే. ఈ మందు సురక్షితమైనది. ఈ మందు లేబెల్ పై గుండె జబ్బులు కలవారు, నైట్రో గ్లిజరిన్ లేదా తక్కిన నైట్రేట్స్ తో కలిపి వాడరాదని సూచించడం జరిగింది.
ఈ మరణాలు డ్రగ్, డ్రగ్ ఇంటర్ యాక్షన్ వలన కలిగాయా? లేదా అసలు వయాగ్రాకు సంబంధంలేనివా అన్న విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయి. మందు పరిశోధన దశలో 3000 మందిలో ఇది వాడారు. వాడిన వారిలో 8 మంది మరణించారు. మందు వాడినందువలన ఎవరిలోనూ మరణం సంభవించలేదని రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. వయాగ్రాని నైట్రోగ్లిజరిన్ తో కలిపి వాడినప్పుడు బ్లడ్ ప్రెజర్ బాగా పడిపోయి ప్రమాదం సంభవిస్తుంది. వయాగ్రాని గుండె జబ్బులతో వాడే మందులతో కలిపి ఇవ్వనప్పటికీ పారామెడికల్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా రతిక్రియలో ఉద్రేకం వలన ఎక్కువసేపు శృంగారం చేసినందు వలన గుండె జబ్బులు కలవాళ్ళకు ఒక్కొక్కసారి ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయని కంపెనీ తెలియచేస్తుంది.

--డా.కంభంపాటి స్వయంప్రకాష్

  • ==================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.