Tuesday, December 20, 2011

సెల్ స్ట్రెస్-ఇమోషనల్ హెల్త్,Cell phone Stress-emotional health



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --సెల్ స్ట్రెస్-ఇమోషనల్ హెల్త్(Cell phone Stress-emotional health)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



మీకు సెల్‌ఫోన్ ఉందా? ఉంటే ఓకే... మీరు మాట్లాడుతూ ఉంటారా? మాట్లాడకపోతే...కొనడం ఎందుకు? ఓకే... మీరు మరీ ఎక్కువ మాట్లాడతారా?
‘అవును’ అనే సమాధానం వస్తే మాత్రం నాట్ ఓకే. సెల్‌ఫోన్ మీ ఒత్తిడిని పెంచుతున్న విషయం తెలుసా?

మీ చేతిలో సెల్ ఉందా! అయితే మీరు ఒత్తిడికి లోనవుతున్నట్లే! సెల్ ఉంటే ఎంజాయ్ చేస్తారు కానీ, ఒత్తిడేమిటా అనుకుంటున్నారా! ఇది నూటికి నూరుపాళ్లు ఒత్తిడే అని మనోవిశ్లేషకులు, మేధావులు పదేపదే చెబుతున్నారు. ఒక్కసారి మీ ఫోన్ గురించి ఆలోచించుకోండి! మీకు తెలియకుండా మీరు ఏ విధంగా ఒత్తిడి ఫీల్ అవుతున్నారో పరిశీలించుకోండి!

సెల్‌ఫోన్స్ వినియోగం వల్ల పనికి, ఇంటికి మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోతున్నాయి. అందువల్ల ఇంట్లోనూ, ఆఫీసులోనూ కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఆఫీసులో ఉన్న ఇబ్బందులను సెల్‌ఫోన్ కారణంగా ఇంటి వరకు తీసుకువస్తున్నారు. అందువల్ల వ్యక్తులలో వ్యతిరేక ఆలోచనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయంలో స్త్రీలు ఎక్కువ బాధపడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. వీటి వాడకం వల్ల మానసికంగా ఒత్తిడికి లోనవ్వడమే కాకుండా కుటుంబసంతోషం కూడా తగ్గిపోతోంది.

పెరిగిన సాంకేతిక నైపుణ్యం మనిషిని మరింత అభివృద్ధి చెందేలా చేస్తున్నప్పటికీ, మానసిక అశాంతి మాత్రం విపరీతంగా పెరుగుతోంది. ‘జర్నల్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ’ మ్యాగజీన్... ‘‘సెల్‌ఫోన్ వాడకం ఎంత ఎక్కువైతే, కుటుంబ సంతోషం అంత తక్కువ అవుతుంది, అందువల్ల ఒత్తిడి ఎక్కువవుతుంది’’ అని ఒక వ్యాసంలో తెలిపింది.

మీకు తెలుసా?...ఈఒత్తిడికి అనేక కారణాలు ఉంటాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

సెల్ ఫోన్ వల్ల కాన్సన్‌ట్రేషన్ దెబ్బ తింటుంది. పని చేస్తున్నప్పుడు ఫోన్ రావడం వల్ల ఏకాగ్రత పోయి, ప్రొడక్టివిటీ రాదు. పని సకాలంలో పూర్తిచేయలేకపోయామన్న బాధతో ఒత్తిడికి లోనవుతారు.

ఏ పని చేస్తున్నా ఫోన్ మోగినట్లే ఫీలవుతుంటారు. ఫోన్ మోగగానే ఎవరైనా టీజ్ చేస్తున్నారేమోనని భయానికి లోనవుతారు.

అసభ్యకరమైన మెసేజ్‌లు వస్తాయేమోనని టెన్షన్ పడుతుంటారు. ఫోన్‌ను స్విచాఫ్ చేయలేక, ఆన్‌లో ఉంచలేక ఒత్తిడి ఫీల్ అవుతారు.

ఫోన్స్‌లోనే ఇంటర్నెట్ రావడం వల్ల చిన్న స్క్రీన్ మీదే ఫేస్ బుక్, చాటింగ్ చేస్తూ 24 గంటలూ అందరితో కనెక్టెడ్‌గా ఉండటానికి ప్రయత్నం చేయడం వల్ల ఒత్తిడి కలుగుతుంది.

అదేపనిగా మోనిటర్ చూస్తూండటం వల్ల కంటి మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది.

ఫోన్ కొన్న వారానికే ఔట్ డేట్ అయిపోతే, ‘‘అయ్యో అనవసరంగా ఇంత ఖర్చుపెట్టానే’’ అని నిందించుకుని, మళ్లీ కొత్తది కొనాలనుకుంటారు. అది కొనేటప్పుడు, ‘కనీసం ఇదైనా ఎక్కువ రోజులు లేటెస్ట్‌గా ఉంటుందా?’ అని ఒత్తిడికి లోనవుతారు.

పూర్వం రోజులలో ల్యాండ్‌లైన్ మాత్రమే ఉండటం వల్ల, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో కుటుంబ సభ్యులకు తెలిసేది. రహస్యాలు ఉండేవి కాదు. కాని సెల్‌ఫోన్ వల్ల రహస్య సంభాషణలు జరుగుతున్నాయి. మాట్లాడేవారికి ఎవరైనా వింటారేమోననే ఒత్తిడి, వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారోనని గమనిస్తున్న వారిలో ఒత్తిడి.

అదేపనిగా ఫోన్ మాట్లాడటం వల్ల రేడియేషన్ ప్రభావం శరీరం మీదే కాక మనసు మీద కూడా పడి ఒత్తిడికి దారితీస్తుంది.

సెల్‌ఫోన్ పుణ్యమా అని పక్కనే ఉన్నవారితో మాట్లాడకుండా, దూరాన ఉన్నవారితో మాట్లాడటం ఎక్కువయ్యింది. అందువల్ల బంధాలు చెడిపోతున్నాయి. కొందరు తమ కాలక్షేపం కోసం, అవతలివారు ఏ స్థితిలో ఉన్నారో కూడా గమనించకుండా ఫోన్ చేస్తారు. రిసీవ్ చేసుకున్నవాళ్లు ఆ సమయంలో పనుండి మాట్లాడలేకపోవటం వల్ల వారి మధ్య మనస్పర్థలు ఏర్పడుతున్నాయి. అయితే... రానున్న తరాలవారు మాత్రం ఈ విషయంలో ఒత్తిడికి లోను కాకపోవచ్చు. వారి జీవితమే వీటితో ప్రారంభం అవుతోంది కాబట్టి, సెల్ లేని జీవితాన్ని, దాని వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను వారు ఊహించలేరు... అని మిల్వాకూలోని యూనివ ర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్ లో సోషియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నోయెల్లీ చెస్లీ చెబుతున్నారు.

ఆధునిక టెక్నాలజీని సాదరంగా ఆహ్వానించాలి. సెల్‌ఫోన్ అనేది జీవితంలో భాగంగా మారిపోయింది. అందుకే దానిని అవసరానికి మాత్రమే వినియోగించుకుంటూ, ఒత్తిడిలేని, ఆనందమయమైన జీవితాన్ని గడపటం మంచిది.

కుటుంబ సభ్యులందరికీ ఎవరి ఫోన్ వారికి ఉండటంవల్ల కుటుంబంలో సంబంధాలు, అనుబంధాలు తగ్గిపోతున్నాయి. అందరూ ఒకేచోట కూర్చున్నప్పుడు, కొందరు తమ గొప్పదనం ప్రదర్శించటానికి, పాపులారిటీ నలుగురికీ తెలియచెప్పుకోవడానికి అవసరం ఉన్నా, లేకపోయినా సెల్‌ని ఎక్కువ వాడతారు. అది ఒక ఎడిక్షన్ కాబట్టి దాని నుంచి బయటపడలేకపోతారు. ఇది ఒత్తిడికి దారితీస్తుంది.

  • =========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.