Monday, March 7, 2011

చేసిన పనే పదేపదే చేసే సమస్య (ఒ.సి.డి),Obsessive compulsive disorder(O.C.D)



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -చేసిన పనే పదేపదే చేసే సమస్య (ఒ.సి.డి)(Obsessive compulsive disorder(O.C.D))- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

అవగాహనాలేమి, అపనమ్మకాలు - ఇవి మానసిక సమస్యలను వెన్నంటి ఉండి వాటిని మరింతగా పెంచు తున్నాయి. వీటికితోడు మానసిక సమస్యతో బాధపడు తున్న వ్యక్తికి మన సమాజంలో గౌరవప్రదమైన స్థానం లభించదు.తమ సమస్య గురించి ఇతరులకు చెప్పుకో లేక, బైటపడే మార్గం తెలియక వీరు సతమతమవు తుంటారు. మనకు సాధారణంగా తెలిసిన స్కిజోఫ్రీనియా తది తర మానసిక వ్యాధులకంటే భిన్నమైన వ్యాధి అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌. ఈ వ్యాధితో బాధపడేవారి సంఖ్య అత్యధికంగా ఉన్నా, సహాయం కోసం వైద్యులను సంప్రదించే వారి సంఖ్య మాత్రం నామమాత్రమే.

ఈ వ్యాధితో 2 నుంచి 3 శాతం ప్రజలు బాధపడు తున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ వ్యాధి సాధారణంగా 18 సంవత్సరాల వయస్సులో ఆరంభ మవుతుంది. వ్యాధికి గురైన 5 నుంచి 10 సంవత్సరాల తరువాతే బాధితులు వైద్యులను సంప్రదించడం జరుగుతున్నది.

కారణాలు
వివిధ కారణాల వల్ల మెదడులోని రసాయనాల్లో కలిగే మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. పిల్లల్లో స్ట్రెప్టోకోకస్‌ ఇన్‌ఫెక్షన్‌ తరువాత ఈ వ్యాధి రావచ్చు. తలకు గాయాలు తగిలినప్పుడు, మెనింజైటిస్‌ వంటి వ్యాధుల తరువాత ఈ వ్యాధి సోకవచ్చు. ఒక కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఈ వ్యాధి సోకే అవకాశాలు 35 శాతం ఉంటాయి. అయితే కుటుంబంలో ఒకరికి ఈ వ్యాధి ఉన్నంత మాత్రాన అందరికీ రావాలని మాత్రం లేదు.
లక్షణాలు
ఈ వ్యాధిగ్రస్తులకు ఒకే ఆలోచన పదే పదే రావడం జరుగుతుంటుంది. ఈ ఆలోచన వాస్తవానికి దూరంగా ఉన్నా, అర్థం లేని ఆలోచనలని బాధితులు గుర్తించినా, వాటిని నిగ్రహించుకునే శక్తి మాత్రం వారికి ఉండదు. ఇటువంటి పరిస్థితినుంచి బైటపడలేక, అవసరమైన పనులపై శ్రద్ధ చూపలేక వారు ఆందోళనకు గురవు తుంటారు. ఈ ఆలోచనలనే అబ్సెషన్స్‌ అంటారు.

అబ్సెషన్స్‌లో రకాలు
అతి శుభ్రత ప్రధానమైనది. చేతులకు మురికి అంటిం దేమోనని భయపడుతుంటారు. అలాగే ఎక్కడికైనా వెళ్లి వస్తుంటే చెత్తను తొక్కినట్లు అనుమానిస్తుంటారు. రెండవ ప్రధానాంశం - అతి జాగ్రత్త. వీరికి అనుమానాలు, భయాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటికి తాళం వేసామా? లేదా? గ్యాస్‌ ఆర్పినట్లు లేదే? అని పదేపదే భయపడుతూంటారు. తాము చేతులు గోడపై ఆనించినప్పుడు ఎన్ని క్రిములు చేతులకు అంటుకున్నాయో అని, తాను తాకిన వ్యక్తులకు ఏవైనా వ్యాధులు ఉన్నాయేమో, అవి తనకు కూడా సోకుతాయేమోనని భయపడుతుంటారు. ఆరోగ్యం విషయంలో తనకు ఎయిడ్స్‌ సోకిందేమోనని, కేన్సర్‌ వచ్చిందేమోనని భయం ఉంటుంది. వీరు తమకే కాక, ఇతరులకు కూడా ఈ అనారోగ్యాలను సంక్రమిం పజేస్తామేమోనని ఆందోళన చెందుతుంటారు.


వీరు తమ అజాగ్రత్త కారణంగా ఇతరులకు హాని కలి గిస్తామేమోనని భయపడుతుంటారు. స్టవ్‌ ఆర్పని కారణంగా అగ్నిప్రమాదం తమ వల్లే జరుగవచ్చునని భయం. అతి భయం, అన్నింటికీ తామే బాధ్యులమనే భావన, ఆలోచన ఉంటాయి.అన్నీ సక్రమంగా, పద్ధతిగా ఉండాలని వీరు కోరు కుంటారు.ప్రతీపనీ సరిగ్గా చేయాలనే ఉద్దేశ్యంతో ఎంతో నిదానంగా, జాగ్రత్తగా పని చేస్తుంటారు. ఎప్పటికీ పని పూర్తి చేయలేరు.చిన్న పనులు కూడా రోజుల తరబడి చేస్తుంటారు. వస్తువులు సరైన ప్రదేశాల్లో ఉండకపోతే తీవ్రమైన అశాంతికి లోనవుతారు.సెక్స్‌పరమైన, ఉద్రేకపూరితమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇతరులకు తాము హాని కలుగజేస్తామేమో నని భయం, సెక్స్‌పరమైన చెడు ఆలోచనలు ఉంటాయి. ఉదాహరణకు తల్లి తన బిడ్డను కత్తితో నరుకుతున్నట్లు ఆలోచన, తాము ఇతరులతో అసభ్యకరంగా ప్రవర్తిం చినట్లు, ప్రవర్తించబోతున్నట్లు ఆలోచన మొదలైన వాటితో సతమతమవుతుంటారు.కొందరికి ఎందుకూ పనికిరాని నిరుపయోగమైన వస్తువులను చాలా జాగ్రత్తగా భద్రపరచాలనే ఆలోచన కలుగుతుంటుంది.

ఇలా అనేక రకాలైన ఈ అబ్సెషన్స్‌ మనిషి మనస్సులోకి అతడి ఇష్టానికి వ్యతిరేకంగా మళ్లీ మళ్లీ ప్రవేశిస్తూ అతడిని తీవ్రమైన అశాంతికి, ఆందోళనకు, భయానికి గురి చేస్తాయి. ఉదాహరణకు తన బిడ్డను నరికేస్తామనే ఆలోచన తల్లికి వస్తే ఎంత భయానకంగా ఉంటుందో ఊహించలేము. మరి అదే ఆలోచన పదే పదే వస్తుంటే? ఈ వ్యాధి ఉన్న వ్యక్తులు తమ ఆలోచనలనుంచి ఉపశమనం పొందడం కోసం చేసిన పనినే పదే పదే చేస్తుంటారు. ఇలా చేసిన క్షణంలో కొంత ఉపశమనం లభించినా, తిరిగి ఆలోచనలు ప్రవేశించడంతో ఆందోళన పెరుగుతుంది. తమ ఇష్టానికి వ్యతిరేకమే అయినా, చేసిన పనినే పదే పదే చేస్తుండటాన్ని కంపల్షన్‌ అంటారు.

రకాలు
కడగడం : మురికి అంటిందనే ఆలోచన కలవారు కడగటాన్ని పదే పదే చేస్తుంటారు. వీరు చెత్త తగలినా, దానికి కొద్దిగా దగ్గరగా వెళ్లినా చేతులు కడుక్కోవాలి. కొందరు ఉదయంనుంచి సాయంత్రం వరకూ చేతులు, కాళ్లు కడుక్కుంటూ బాత్రూమ్‌లోనే గడుపుతుంటారు. మరి కొంతమంది ఒక లెక్క ప్రకారం కొన్నిసార్లు కడిగిన తరువాత దేనినైనా వదిలిపెడతారు. ఉదాహరణకు అయిదుసార్లు లేదా పదిసార్లు కాళ్లు కడుక్కోవడం వంటివి.ఇంట్లోకి ప్రవేశించినప్పుడు తలుపులు, వస్తువులు, గదులు, గోడలు కడగడం చేస్తుంటారు. ఎన్ని నీళ్లు ఉన్నా వీరికి సరిపోవు.

పలుమార్లు పరీక్షించడం : ప్రతిదాన్నీ పలుమార్లు పరీక్షించి చూస్తుంటారు. గంటల తరబడి మళ్లీ మళ్లీ పరీక్షించడం వల్ల వీరు ఇల్లు విడిచి ఎక్కడికీ వెళ్లలేరు. ఇతరులను కూడా వీరు తాము చేసిన పనిని పదే పదే పరీక్షించాలని కోరుతుంటారు.
క్రమపద్ధతి : క్రమపద్ధతిని కోరుకునే వారు వస్తువులన్నీ వేటి స్థానంలో అవి ఉండేలా పదే పదే సర్దుతుంటారు. అన్ని పనులు తాము చెప్పిన ప్రకారం జరగాలని వత్తిడి చేస్తుంటారు. మార్పును ఏమాత్రం సహించలేరు.

వ్యాధుల భయం : తమకు వ్యాధులు సోకుతాయనే భయం ఉన్నవారు తరచుగా తమ శరీరాన్ని పరీక్షించు కోవడం, ఇతరులతో పోల్చి చూసుకోవడం, ఇతరులను పరీక్షించడం, అనేక రకాలైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు పదే పదే చేయించుకోవడం మొదలైనవి చేస్తుంటారు.సెక్స్‌వల్‌ లేదా ఇతర రకాలుగా హాని కలిగిస్తామనే ఆలోచనలు వచ్చే వారు తమ తప్పుడు ఆలోచనలకు క్షమించాలని దైవాన్ని లేదా స్వామీజీలను వేడుకుంటూ ఉంటారు. పోలీసులను కలిసి రిపోర్టు ఇవ్వడం, పేపర్లను పరిశీలించి, ఏవైనా క్రైమ్‌ వార్తలు వస్తే అవి తమ వల్ల కాదు కదా అని నిర్ధారించుకోవడం చేస్తుంటారు.

వీరు ఇంట్లో కూడా హానికరమైన వస్తువులు ఏమైనా ఉంటే (ఉదాహరణకు కత్తెర్లు, కత్తులు, బ్లేడ్లు మొదలైనవి) వాటిని దాచడం లేదా బైట పారేయడం చేస్తుంటారు. బ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌కు లోనైన వారు తమ ఆలోచనలను నియంత్రించుకోవడం కోసం, తగ్గించుకో వడం కోసం చిత్రమైన పనులు చేస్తుంటారు. మనస్సులో అంకెలు లెక్కపెట్టుకోవడం, ఇతరుల చేత మళ్లీ అదే విషయాన్ని చెప్పించుకోవడం, ప్రార్థన చేయడం వంటివి వీటిలో ముఖ్యమైనవి. లా చేయడం వల్ల చెడు జరుగదని, జరుగబోయే ఆపద ఏదైనా ఉంటే తొలగిపోతుందని వీరి నమ్మకం.తాము పలుమార్లు వస్తువులను తాకడం, లెక్కపెట్టడం వంటివి చేయడమే కాకుండా, ఇతరులను కూడా అలాగే చేయాలని వత్తిడి చేస్తుంటారు.

చికిత్స
ఈ వ్యాధి నయం కాదనే అపనమ్మకం ప్రజల్లో నాటుకుని ఉంది. కానీ ఇది సత్యం కాదు. గత రెండు దశాబ్దాల్లో ఈ వ్యాధికి చేసే చికిత్సలో అనేక మార్పులు సంభవించాయి. మందులు, కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ (ఆలోచనలు, తద్వారా చర్యలను మార్చే పద్ధతి) వంటి అనేక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ్యాధిగ్రస్తులను కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వాటిని ఈ కింద పొందుపరచడం జరిగింది.్యాధిగ్రస్తులు వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ందులు ఆరంభించిన వెంటనే మార్పు రాదు. ఈ వ్యాధిలో మందులు ప్రారంభించిన 6నుంచి 12 వారాల తరువాతే మార్పు కనిపిస్తుంది.

మదులను అధిక మోతాదుల్లో వాడాల్సి రావచ్చు.్యాధి నయమవుతున్న సమయంలో కాని, నయమైన తరువాత కాని మందులను ఒక్కసారిగా మానేయ కూడదు. మందులను ఒక్కసారిగా మానేస్తే వ్యాధి మరింత తీవ్రతతో తిరగబెడుతుంది. ందులను మానేయాల్సి వచ్చినప్పుడు వాటిని మోతాదులను కొద్దిగా తగ్గించుకుంటూ రావాలి. రొక ముఖ్యమైన విషయమేమిటంటే వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులు కాని, వారి స్నేహితులు, బంధువులు కాని బాధితులను కించపరిచేలా, బాధపడేలా ప్రవర్తించకూడదు. ఇది పెద్ద వ్యాధి కాదన్నట్లు, దీనికి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమై, ఇతరుల్లా హాయిగా జీవించగలుగుతారని ధైర్యం చెప్పాలి.
  • ==============================================

Visit my website - > Dr.Seshagirirao.com/

9 comments:

Your comment is very important to improve the Web blog.