Tuesday, February 22, 2011

ట్రైజెమైనల్‌ న్యూరాల్జియా ,Trigiminal Neuralgia


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ట్రైజెమైనల్‌ న్యూరాల్జియా ,Trigiminal Neuralgia- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మన మెదడునుంచి 12 జతల కపాల నాడులు (క్రేనియల్‌ నర్వ్స్‌) బయలుదేరుతాయి. వీటిలో ఐదవ నాడిని త్రిధారా నాడి (ట్రైజెమైనల్‌ నర్వ్‌) అంటారు. దీనికి మూడు శాఖలుంటాయి. నుదురు, కంటి భాగానికి (ఆప్థాల్మిక్‌) వెళ్లేది మొదటిది. పైదవడ ప్రాంతానికి వెళ్లేది (మ్యాగ్జి లరీ) రెండవది. కింది దవడకు, చుబుకానికి వెళ్లేది (మ్యాండిబ్యులార్‌) మూడవది. ఇవి మూడూ గసీరియాన్‌ గ్యాంగ్లియాన్‌ను కేంద్రంగా చేసుకుని బయలుదేరుతాయి.
ట్రైజెమైనల్‌ నరం ముఖ భాగంలో ఏర్పడే స్పర్శ, నొప్పి, ఉష్ణోగ్రతలను మెదడకు చేరవేయ డంతోపాటు ఆహారాన్ని నమలడానికి తోడ్పడే కండరాలను నియంత్రిస్తుంది. ఒకవేళ అది దెబ్బ తింటే ముఖంలో తీవ్రాతితీవ్రంగా నొప్పి వస్తుంది. దీనిని ట్రైజెమైనల్‌ న్యూరాల్జియా అంటారు.

ట్రైజెమైనల్‌ న్యూరాల్జియా నొప్పి హఠాత్తుగా మొదలై ఐదారు సెకండ్లనుంచి ఒకటి రెండు నిముషాలపాటు మాత్రమే ఉంటుంది. అయితే ఇదే తంతు దినమంతా పునరావృతమవుతుం టుంది. నొప్పి పొడుస్తున్నట్లు, విద్యుత్‌ ఘాతం తగిలినట్లు ఉధృతంగా ఉంటుంది. అలాగే ముఖంలో ఒక పక్కనే వస్తుంది. పైభాగంలో కాని, మధ్య భాగంలో కాని, కింది భాగంలో కాని కేంద్రీకృతమవుతుంది.
నొప్పి ఏ రకమైన సూచన లేకుండా హఠా త్తుగా మొదలవవచ్చు. లేదా చేతి స్పర్శ, కదలిక వంటి తేలికపాటి కారణాల వల్ల ప్రేరేపితమవ వచ్చు. మాట్లాడటం, నమలటం, తాగటం, తినడం, వేళ్లతో చర్మాన్ని తాకటం, పళ్లు తోము కోవడం, తల దువ్వుకోవడం, తలారా స్నానం చేయడం, ముద్దు పెట్టుకోవడం వంటి చర్యల వలన నొప్పి మొదలవుతుంది. చిత్రంగా ఇవే ఉత్ప్రేరక కేంద్రాలను గిల్లినా, ఒత్తిడి కలిగించినా నొప్పి రాదు.

ట్రైజెమైనల్‌ న్యూరాల్జియా అటాక్‌ వచ్చిన ప్పుడు బాధితుడు హఠాత్తుగా నిశ్చేష్టుడై పోతాడు. వాక్ప్రవాహం ఆగిపోతుంది. ముఖ కదలికలు స్తంభిస్తాయి. నొప్పి మరింత పెరగకూ డదని ఇలా చేస్తాడు. ముఖం బాధతో వంకర తిరుగుతుంది. ఈ లక్షణాలు కొద్దిపాటి ఫిట్స్‌ను పోలి ఉండటంతో దీనిని 'టిక్‌ డౌలోరెక్స్‌ లేదా 'న్యూరాల్జియా ఎపిలెప్టీఫార్మిగా కూడా పిలుస్తారు.
ఈ నొప్పి సాధారణంగా నిద్రలో రాదు. కాక పోతే ఒక భంగిమలో తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. ముందుకు వంగినప్పుడు ఎక్కువ కావచ్చు. ఒకపక్క వచ్చిన నొప్పి మరొక పక్కకు వ్యాపించదు. చాలా అరుదైన సందర్భాలలో మాత్రం నొప్పి రెండువైపులా వస్తుంది. లక్షణాలు ఒక్కొక్కపక్కా ఒక్కొక్క రకంగా ఉంటాయి.

నొప్పి కొంతకాలంపాటు ఉధృతంగా ఉండి, దానంతటదే మరికొంత కాలంపాటు సద్దుమణు గుతుంది. నొప్పి లేనప్పుడు కూడా బాధితులు ప్రశాంతంగా ఉండలేరు. మళ్లీ నొప్పి వస్తుందే మోననే శంకతో గడుపుతుంటారు. నొప్పి ఉన్న ప్పుడు సాధారణమైన పెయిన్‌ కిల్లర్స్‌ అంతగా పని చేయవు.
సమయం గడిచే కొద్దీ నొప్పి వచ్చే సమయాల మధ్య వ్యత్యాసం తగ్గిపోతుంటుంది. నొప్పి తీవ్రత కూడా పెరుగుతుంటుంది. దీర్ఘకాల బాధితులలో ఎంతోకొంత నొప్పి నిరంతర లక్షణ మవుతుంది. ఈ వ్యాధి పరీక్షలకు దొరకదు.
నరాలకు సంబంధించిన న్యూరలాజికల్‌, క్రేనియోఫేషియల్‌ పరీక్షల్లో ఏ దోషమూ కనిపించదు. బాధితుడు వర్ణించే నొప్పి లక్షణా లనుబట్టి ఈ వ్యాధిని నిర్ధారించాల్సి ఉంటుంది. వ్యాధి నిర్ధారణ జరగకముందు బాధితుడు అనేక రకాల చికిత్సలను ప్రయత్నించి విసిగి వేసారిపోయి ఉంటాడు.

-దంతాల వ్యాధి అని, టెంపొరో మ్యాండిబ్యు లార్‌ జాయింట్‌ వ్యాధి అని, సైనుసైటిస్‌ అని, కంటి గోళం నొప్పి అని, మైగ్రేయిన్‌ అని, మయోఫేషియల్‌ పెయిన్‌ అని - ఇలా రకరకాల కారణాల కోసం మందులు వాడి ఉంటాడు.
చివరకు మానసిక వైద్యం కూడా ప్రయత్నించి ఉంటాడు. వీటన్నింటితో ఆత్మస్థయిర్యం దెబ్బ తిని మరింత బేలగా తయారవుతాడు. ఈ నొప్పి వంశపారంపర్యంగా కనిపించదు. పురు షులలో కంటే స్త్రీలలో ఈ నొప్పి ఎక్కువగా కని పిస్తుంది. 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కు లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

రకాలు- కారణాలు
సాధారణం
దీనినే క్లాసికల్‌ అని, ఇడియోపతిక్‌ అని, ఎసెన్షియల్‌ అని ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ట్రైజెమైనల్‌ నరం మెదడులోకి ప్రవేశించే ప్రాంతంలో రక్తనాళాలు (ముఖ్యంగా సుపీరియర్‌ సెరిబెల్లార్‌ ఆర్టరీ) నరానికి చేరువై, ఒత్తిడిని కలిగించడం వల్ల ఈ తరహా నొప్పి వస్తుంది. రక్తనాళాలలో రక్తం అలలమాదిరిగా వెళుతూ ట్రైజెమైనల్‌ నరాన్ని రేగేలా చేస్తుంది. కొంతకాలానికి ఇది నొప్పిగా పరిణమిస్తుంది.

అసాధారణం
దీనిలో నొప్పి నిరంతరమూ ఉంటుంది. మండుతున్నట్లుగాని, మరమేకు దింపుతున్నట్లు గాని తీవ్రస్థాయిలో ఉంటుంది. సాధారణ ట్రైజెమైనల్‌ న్యూరాల్జియా కొంతకాలానికి ఈ తరహా నొప్పిగా మారే అవకాశం ఉంది. నరం మీద ఒత్తిడి పడటం (న్యూరో వ్యాస్కులార్‌ కంప్రెషన్‌), లేదా ట్రైజెమైనల్‌ నరం న్యూక్లియస్‌ అతిగా స్పందించడం వల్ల ఈ నొప్పి వస్తుంది.

పూర్వరూప స్థితి
అసలైన ట్రైజెమైనల్‌ న్యూరాల్జియాకు ముందు చాలా రోజులు లేదా సంవత్సరాల పాటు బాధితుడికి పూర్వరూపాలు కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. పంటి నొప్పి, ముఖంలో అసౌకర్యం, సూదులు గుచ్చినట్లు నొప్పి, కారం పూసినట్లు మంట వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

ఇతర వ్యాధుల ప్రభావం
మల్టిపుల్‌ స్ల్కీరోసిస్‌ అనే వ్యాధిలో నరాల పైనుండే మైలిన్‌ పొర దెబ్బ తింటుంది. ఒకవేళ ఈ పరంపరలో ట్రైజెమైనల్‌ నరం కూడా దెబ్బ తింటే తదనుబంధమైన నొప్పి వస్తుంది. ఒక్కొ క్కసారి కణితి వంటిది మెదడు ప్రాంతంలో పెరిగి ట్రైజెమైనల్‌ నరం మీద వత్తిడి కలిగించే అవ కాశం ఉంది.ఇలాంటి సందర్భాలలో ముఖంలో స్పర్శా రాహిత్యం, నమలడానికి సహకరించే కండరాల్లో పట్టు తగ్గిపోవడం, నొప్పి నిరంతరంగా కొనసాగటం వంటి లక్షణాలు ఉంటాయి.

కాగా, హెర్పిస్‌ జోస్టర్‌ అనే వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినవారిలో నరాలు దెబ్బతిని నొప్పిని కలిగించే అవకాశం ఉంది. దీనిని పోస్ట్‌ హెర్పి టిక్‌ న్యూరాల్జియా అంటారు. ఒకవేళ ఇది ట్రైజె మైనల్‌ నరాన్ని దెబ్బ తీస్తే ముఖంలో ట్రైజెమైనల్‌ న్యూరాల్జియా వస్తుంది.

అభిఘాత జన్యం
ముఖం లేదా కపాలం ప్రాంతంలో దెబ్బ తగి లినప్పుడు ట్రైజెమైనల్‌ న్యూరాల్జియా వచ్చే అవ కాశంఉంది. సాధారణంగా రోడ్‌ ట్రాఫిక్‌ యాక్సి డెంట్లు, పన్ను పీకించుకోవడం, సైనుసైటిస్‌కు చేసే కాడ్‌వెల్‌లక్‌ సర్జరీ వంటివి నరాన్ని శాశ్వతంగా దెబ్బ తీసి, నొప్పిని ఉత్పన్నం చేస్తాయి.
కొన్ని సందర్భాలలో నొప్పితోపాటు కొంతమేర మొద్దుబారినట్లు కూడా ఉండొచ్చు. చలి వాతావరణానికి గురైనప్పుడు కాని, చలిగాలులు తగిలినప్పుడు కాని నొప్పి ఎక్కువ అవుతుంది. నిరంతరమూ మండుతున్నట్లు ఉంటుంది.

చికిత్స
సాదారణ నొప్పిమాత్రలు తాత్కాలిక నొప్పినివారణకు వాడాలి (Aceclofenac , tramadal , paracetamal )
కార్బమజెపిన్‌ మాత్రలు రోజుకు 600 నుండి 800 మిల్లీగ్రాముల వరకు డాక్టర్‌ సలహా మేరకు వాడాలి(Tegratal 200mg 3 times/day).
స్టేరాయిడ్లు, వ్యాధి నిరోధకశక్తి క్షీణకాలు డాక్టర్‌ సలహా మేరకు వాడాలి(prednisolone 10mg 3 times /day).
యాంటి డిప్రజెంట్స్ : Amytriptiline
Botos : దీన్ని ఇంజక్ట్ చేస్తే నొప్పి తగ్గుతుంది ,
Gabapentin : ఇది కూడా నరాల సంబంధించిన నొప్పిని తగ్గిస్తుంది .
sleepinga dose : clonazepam , వాడ వచ్చును .

Surgery : పెయిన్‌ సిగ్నల్స్ ని కట్ చేయడం ద్వారా నొప్పినుండి ఉపసయనము పొందవచ్చును .
Stereotactic radiation therapy-- కొంతమందికి ఇది ఉపయోగిస్తారు .


నివారణ - జాగ్రత్తలు

*మధుమేహ జబ్బును నియంత్రణలో వుంచుకోవాలి. పాదాల సంరక్షణ చేసుకోవాలి.

*సారాయిని మానివేయాలి.

*ధూమపానాన్ని మానివేయాలి.

*శారీరక పరిశుభ్రతను పాటించాలి. సంపూర్ణ ఆహారాన్ని తీసుకోవాలి.

*రోజూ వ్యాయామం చేయాలి.

*రక్తపోటు, గుండె జబ్బు వంటి జబ్బులకు క్రమం తప్పకుండా మందువాడాలి.

*వృద్దాప్యం వల్ల కలిగే అజ్జీమర్సువ్యాధి, ఫార్కిన్‌ సోనిజమ్‌ వంటి వ్యాధులకు సంబంధిత డాక్టరును సంప్రదించి తగు చికిత్స. ఫిజియో, థెరపి మొదలగునవి తీసుకోవాలి.










=================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.