Monday, February 7, 2011

మన శ్వాస ఎలా జరుగుతుంది ?, How do we breath?

ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము . జీవన మనుగడలో ముఖ్యమైనది ఆరోగ్యము . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మనం ఎలా శ్వాసిస్తున్నాం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  • [asthma1.gif]
మన శ్వాస ఎలా జరుగుతుంది ?...
మనం మామూలుగా గాలిని ముక్కు ద్వారా పీల్చుకుంటాం. శ్వాసతోనే మనం జీవిస్తాం. వాతావరణంలో తక్కువ తేమతో ఉండే చలిగాలి సరాసరి శ్వాసనాళాలలోకి వెళ్లకుండా ముక్కు ద్వారా వెచ్చగా అయి నీటి ఆవిరిని కూడా కలుపుకొని శ్వాసనాళాల్లోకి వెళ్తుంది. ముక్కు నుంచి నేసోఫారింక్స్‌, లారింక్స్‌ ఆ తరువాత ట్రేకియాలోకి వెళ్తుంది. ట్రేకియా చివరి భాగంలో శ్వాసనాళం రెండుగా చీలి ఉంటుంది. వీటిని బ్రాంకై అంటారు. ఇవి విడివిడిగా ఒక్కొక్క ఊపిరితిత్తులోకి వెళ్తాయి. క్రమంగా ఈ నాళంరెండుగా చీలుతూ ఊపిరితిత్తులను ఆక్రమిస్తాయి. రెండు మి.మీ.ల కంటే సన్నగా ఉండే శ్వాసనాళాలను స్మాల్‌ ఎయిర్‌వేస్‌ అంటారు.ఊపిరితిత్తులలో ఈ శ్వాసనాళాల చివరి భాగాలు టెర్మినల్‌ బ్రాంకియోల్‌, రెస్పిరేటరీ బ్రాంకియోల్‌, ఆల్వియోలార్‌ డక్ట్స్‌లోకి చేరి అంతమవుతాయి.ఇక్కడ ఆక్షిజన్‌ , కార్బన్‌ డైయాక్షైడ్ మార్పిడి జరుగుతుంది .

ఊపిరితిత్తులు రెండూ గొంతు దిగువ భాగాన ఛాతీ కుహరంలో ఒకదాని పక్కన మరొటి ఉంటాయి. ఈ రెండింటి మధ్య భాగంలో ఉండే ఖాళీ స్థలాన్ని మీడియస్టినమ్‌ అంటారు.. మీడియాస్టినమ్‌ మధ్య భాగంంలో గుండె, దాని నుంచి వచ్చే రక్తనాళాలు ఉంటాయి. ఒక్కొక్క ఊపిరితిత్తిని ఒక్కొక్క పొర ఆవరించి ఉంటుంది. ఊపిరితిత్తికి అతుక్కొని ఉండే పొరను విస్రల్‌ఫ్లూరా అంటారు. దాని పైభాగంలో ఉండే పొరని పెరైటల్‌ప్లూరా అంటారు. ఈ రెండు పొరల మధ్య ఉండే స్థలాన్ని ప్లూరల కేవిటీ అంటారు.

-దీనిలో రక్తం నుంచి వచ్చే సీరమ్‌ సుమారు ఐదు నంచి పది మిల్లీ లీటర్లు ఉంటుంది.ఈ పొరల మధ్య నీరు, గాలి, ఇన్‌ఫెక్షన్‌ చేరితే అనారోగ్యానికి గురువుతాం.ఊపిరితిత్తులు పిరమిడ్‌ల ఆకారంలో ఉంటాయి.చిన్న పిల్లలు ఊదుకునే బెలూన్స్‌లా ఇవి చాలా మెత్తటి అవయవాలు. బ్రౌనిష్‌ రెడ్‌ రంగులో ఉంటాయి. కుడివైపు ఉండే ఊపిరితిత్తిలో మూడు, ఎడమవైపు ఉండే ఊపిరితిత్తిలో రెండు లోబ్స్‌ ఉంటాయి. అయితే కుడివైపు ఊపిరితిత్తిలో మూడు భాగాలున్నా సైజులో మాత్రం చిన్నగా ఉంటుంది.ఎడమ ఊపిరితిత్తి పరిమాణం 55 శాతం ఉంటే కుడి ఊపిరితిత్తి పరిమాణం 45 శాతం ఉంటుంది.


  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.