Tuesday, January 11, 2011

Small things for Good health, మంచి ఆరోగ్యం కోసం చిన్న మార్గాలు

ఫుక్కలింత మేలు , Gargle is good for .....
జలుబు చేస్తే ఏ మందులూ అక్కర్లేకుండానే కొద్దిరోజుల్లో నయం అవుతుంది కాని , దాని తాలూకు ప్రభావాలు మాత్రం పనిలో చికాకు పెడుతుంటాయి. ఈ ప్రభావము నుండి కాపాడుకోవడానికి ఓ కప్పు ఉప్పునీరు శీతాకాలం జలుబులకు దివ్యఔషదం .

గొంతులో గురగుర , ఊపిరితీసుకోవడం లో ఇబ్బందులు సాధారణ జలుబులో సామాన్యం గా కనిపింఛే లక్షణాలు . ఉప్పునీటితో గార్గిల్ చేయడం వల్ల ఈ లక్షణాల నుంచి ఉపశమనం కలుగుతుంది . ఇలాచేస్తే గొంతుతో మండే టిష్యూలకు ఉపశమనం కలుగుతుంది . చిక్కని మ్యూకస్ను కూడా పల్చబరుస్తుంది . ఎలర్జెన్స్ , బాక్టీరియా , ఫంగి వంటి వాటిని గొంతునుండి ఉప్పునీరు తొలగిస్తుంది .
ఆరోగ్యవంతమైన వలంటీర్లపై జలుబు , ఫ్లూ సీజన్‌ లో 60 రోజులు పాటు పరిశోదనలు సాగించారు . క్రమము తప్పకుండా రోజుకు మూడుసార్లు ఉప్పునీటిని గార్గిల్ చేసే వారిలో ... మిగతారితో పోల్చితే 40 శాతం అప్పర్ రెస్పిరేటరీట్రాక్ ఇన్‌ఫెక్షన్‌ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు . ఉప్పునీటితో పిక్కిలించడం వల్ల బ్రోంకైటిస్ లక్షణాలు గణనీయం గా తగ్గాయి . ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్‌ ఉప్పువేసి కలిపి కొద్ది సెకనులు గొంతులో పట్టి పుక్కలించి నీటిని ఊసెయ్యాలి . ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి . దగ్గు , గొంతులో మంట గల పెద్దవాళ్ళు గోరువెచ్చ్ని నీటిలో ఉప్పుతో పాటు నిమ్మరసం , తేనె కలుపుకొని గార్గిల్ చేయాలి . ఉప్పు తక్కువైతే ఆ నీటిని బయటికి ఊసేయాల్సిన అవసరం లేదు . . . మింగేయవచ్చును . బి.పి. ఉన్నవాళ్ళు ఉప్పునీటిని మింగకూడదు .



మంచి ఆరోగ్యాన్నిచ్చే మిత్రులు , Good health giving Friends..........
దిగులు గా , మూడీగా ఉన్నప్పుడు నచ్చినవారిని కలిస్తే మబ్బులు కమ్మేసిన మనస్సుకు హాయిగా ఉంటుంది . ఇందుకు కారణం ఏమిటి ? ... సంతోషముగా ఉన్నప్పుడు విడుదలయ్యే Endorphines అనే హార్మోనులు . అలాగే దీర్ఘకాలిక ఆరోగ్యవంతమైన జీవితం కావాలనుకునే వారు కుటుంబసబ్యులు , స్నేహితులతో చక్కని సంబంద బాంధవ్యాలు ఏర్పరచుకోవాలి .


మిత్రులతో మంచి బాంధవ్యం గలవారు , మిగతావారి కంటే 3-7 సంవత్సరాలు అధిక జీవితకాలం కలిగి ఉంటారని నార్త్ కరోలినా యూనివర్సిటీ పరిశోధకులు తెలియజేస్తున్నారు . కుటుంబసభ్యులు , స్నేహితులు , కమ్యూనిటీ తో కలిసి మెలిసి ఉండేవారు మిగతావారికంటే ఆరోగ్యముగా ఎక్కువకాలము జీవిస్తారు . అంటే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడములో మిత్రులది కీలకపాత్ర అన్నమాట . దాదాపు ఏదున్నర సంవత్సరాల పాటు మూడు లక్షలమందిపై విసృత పరిశోధనలు నిర్వహించాక ఈ విషయాన్ని శాస్త్రజ్ఞులు తెలియజేసారు .
తక్కువ సామాజిక పరిచయము , మద్దతుగలవారికి ఆల్కహాలిజం తొ సమానమయిన మోర్టాలిటీ రేటు ఉంటుందని , స్థూలకాయం , ఇతర శరీరక చురుకుదనం లోపం కంటే ఎక్కువ ప్రభావము కూడా కలిగి వుంటుందని ఈ పరిశో్ధనలో వివరించారు .

మూలము : Medicine updates journal .

వాదిస్తే రిలాక్సవుతారు .... We get relaxed with discussions :
ఊరికూరికె వాదనలకు దిగుతుణ్టారు అని మన చుట్టూ ఉన్నవారు అంటున్నారంటే అది మనకో హెల్త్ సర్టిఫికేట్ కింద లెక్కే. ఇలా వాదించే తత్వము మేలుచేస్తుందని మిచిగాన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు . ఏ అంశాన్ని అయినా మౌనంగా చూస్తూ భరించడం మానసికంగా మేదనకు గురిచేస్తుంది . ఎదురుగా కనిపించే అంశాలకు బాగా స్పందించి వాదించే వారు బాగా రిలాక్ష్ అవుతారు . నచ్చని లేదా నచ్చిన అంశాలపై మౌనం గా సర్దుకుని ... మనస్సు లో మధనపడడం కంటే ఇలా వాదించేవారు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు

వాదన జోలికి వెళ్లకుండా తప్పించుకునేవారు సదరు విషయాన్ని బుర్రనుంచి తప్పించలేరు . . . ఆలోచిస్తూనే ఉంటారు అటువంటివారికి అధిక రక్తపోటు , కార్టిసాల్ స్థాయిలు పెరగడం వలన నిద్రలోపాలు కలుగుతాయి . మనసుకు నచ్చకపోయినా వాదన ఎందుకులే అని తోసిపుచ్చుకుపోయే వారిలోతీవ్ర అనారోగ్య పరిణామాలు కొంతకాలములో తప్పవని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూ ఉన్నారు . చెప్పదలచుకున్న విషయాన్ని అభిప్రాయాల్ని చెప్పేసినవారు తేలికపడిన మనస్సుతో హాయిగా ఉంటారు . ఫలితము గా రక్తపోటు , మానసిక వత్తిడి , నిద్రలేమి లకు దూరముగా ఉండవచ్చును .

ముచ్చటగా మూడే నిముషాలు వ్యాయామము ...
sincerely three minutes only exercise.


వ్యాయామము మనిషికి ఎంతో మేలు చేస్తుంది ముఖ్యముగా వయసుమల్లిన వారిలోనూ , మధుమేహము , రక్తపోటు , గుండెజబ్బులు ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుంది . రోజంతా ఎడతెరపిలేని పనులు అని అనుకుంటూ వ్యాయామాల్ని వాయిదావేసేవారు తెలుసుకోవలసిన తీపికబురు .... ఒక్క మూడు నిముషాలు ఎక్సర్ సైజ్ చేస్తే గుర్తించదగ్గ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని స్కాటిష్ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి .

ఎక్సరసైజ్ బైక్ పై పెద్దవాళ్ళు 30 సెకన్లు స్ప్రింట్స్ ను ఆరుసార్లు చేసినా (మద్యలో నాలుగేసి నిముషాలు విశ్రాంతి)చాలంటున్నారు . దీనివల్ల రక్తం లోని చెక్కెర స్థాయిలు ఎంతోమేరకు నియంత్రించబడతాయంటున్నారు . డయబిటీస్ , గుండెజబ్బుల రిస్కును తగ్గించుకోవడానికి ఇది సరిపొతుంది . ఫేవరెట్ టెలివిజం షో చూస్తూ ఈ వ్యాయామము చేయవచ్చు . ప్రతి రోజూ రెగ్యులర్ గా చేయాలి . Regularity is more important.

సామాజిక ఒత్తిడితో రోగనిరోధకవ్యవస్థ బ్లహీనము ...
Day to Day pressure weaken the body immunity(resistance )


ఆహార పానీయాల లోపము , జీవన విధాన తీరుతెన్నులు రోగనిరోధక వ్యవస్థను బలహీనం చేయగలవని అందరికీ తెలుసు కాని సామాజిక సంబంధిత ఒత్తిడులూ అందుకు కారణం కాగవని అనేక మందికి తెలియదు . ఉద్యోగ ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు కలిగే నెర్వస్నెస్ ఏవిధంగా ప్రభావం చూపుతుందో, పార్టీలలో ఇతర వ్యక్తుల్ని కలవడలో క్లిష్టత , వేదీకపై మాట్లాడల్సి వచ్చినప్పుడు కలిగే ఒత్తిడి రోగనిరోధక వ్యవస్థను ఏ విధంగాప్రభావితం చేస్తాయో తెలుసుకుంటే ఆశ్చర్యము కలుగుకమానదు . సామాజిక విషయాలకు మెదడు ప్రతిస్పందించే తీరు శారీరక రోగనిరోధక వ్యవస్థ ను ప్రతికూలము గా ప్రభావితం చేస్తుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధనలో తెలిపారు . సామాజిక తిరస్కారము వల్ల కలిగే ఒత్తిడి ఇన్‌ఫ్లమేటరీ యాక్టివిటీని పెంచుతుందని కూడా పేర్కొన్నారు .

దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్‌ ఆస్మా, రుమటాయిడ్ ఆర్త్రైటిస్ , కార్డియోవ్యాస్కులార్ రుగ్మతలు , కొన్ని రకాల క్యాన్‌సర్లు , డ్రిప్రషన్‌ జబ్బులు మొదలగు వాటికి దారితీస్తుంది . మానసిక , శారీరక్ అంశాలు ఎంతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటాయనడానికి ఇదో ఉదాహరణ. తరచూ తేదా దీర్ఘకాలిక ఒత్తిడి యాక్టివేషన్‌ వల్ల రోగనిరోధక వ్యవస్థ ప్రభావితమై విభిన్న రుగ్మతలు కలిగే అవకాశం ఉంది .


బి.పి. తో జ్ఞాపకశక్తి సమస్యలు , Memory Troubles with B.P.

అధిక రక్తపోటుకు , జ్ఞాపక శక్తికి సమస్యలకు సంబంధం ఉంటుందా? అంటే ఖచ్చితం గా ఉంటుందంటున్నారు 20 వేల మంది పై పరిసోధనలు నిర్వహించిన న్యూరాలజీ పరిశోధకులు. మధ్య వయస్సు ఆరంభం లో ఈ లక్షణాల్ని గుర్తించారు . మధ్య వయస్కుల్లో డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ( రక్తపోటు రీడింగ్ లో బాటమ్‌ రీడింగ్ ) లో ప్రతి 10 ఎమ్‌.ఎమ్‌ హెచ్.జి. పెరుగుదలలో 7% జ్ఞాపకశక్తి సమస్యలు పెరిగినట్లు కనిపించాయని వారు పేర్కొన్నారు .

ఈ సమస్యల్ని అషిక రక్తపోటుకు సరైన చికిత్స తీసుకోవడం ద్వారా లేదా అరికట్టడం ద్వారా నివారించవచ్చనని పేరోన్నారు . హైపర్ టెన్‌షన్‌ విషయానికి వస్తే ఒక రకం వ్యక్తుల్లో ఒత్తిడికి రక్తపోటుతో పెద్ద జంప్స్ కనిపించాయని , మిగతా వారిలో అవిలేవని తెలిపారు . ఒత్తిది తో కూడిన ఉద్యోగాలవల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఈ హైపర్ యాక్టివిటీకి దారితీయవచ్చని న్యూరాలజిస్ట్లు పేర్కొన్నారు .

శతాధిక ఆయుస్సుకు అలవాట్లే కారణము , Long life depends on our habits :

దీర్ఘాయుష్షు విషయానికి వస్తే పురుషులకంటే స్త్రీలకే ఎక్కువ ఆయుష్షు ఉంటుంది . శతాధిక వృద్దులలో మహిళలదే ఆధిక్యం . అయితే వందేళ్ళు కు చేరిన మగవారు శారీరక దారుఢ్యం తో , మానసిక చురుకుదనం తో ఉంటారు .. . చాలా తక్కువ మందే కనిపిస్తూ ఉంటారు . ఇలా ఆడవారి ఆయుస్సు వెనుక స్పష్టమైన కారణాలు తెలియవు కాని మహిళల శరీరం దీర్ఘకాలిక అనారోగ్యాల్ని , లోపాల్ని తట్టుకోగలదని మాత్రం తేలుతోంది . ఆరోగ్యవంతమైన జీవన విధానాలవల్లే మహిళలకు దీర్ఘాయుస్సు పెరుగుతోంది . ప్రధాన అనారోగ్యాలకు సంబందించి ఆడవాళ్ళు తమకు తాము సరైన జాగ్రత్త వహిస్తారని జపాన్‌ లోని ఒకినావా అంతర్జాతీయ విశ్వవిద్యాలయ పరిశోధనలు తెలియజేస్తున్నాయి .

" స్మోకింగ్ , డ్రింకింగ్ , ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం లాంటి అలవాట్లు స్త్రీలలో తక్కువ . రోజువారి సంపాదన , ఆతృత . పనిలోఒత్తిడి , హింసాత్మక కారణాలు , ప్రమాదాలు , ఆత్మహత్యలు కూడా స్త్రీలలో తక్కువ . తమ ఫిజీషియన్‌ దగ్గరకు తరచుగా స్త్రీలే వెళ్తుంటారు . పురుషులు దీనికి భిన్నంగా ఉంటుంది . పురుషులు జీవితమంతా రిస్కీగానే ప్రవర్తిస్తారు . వయస్సు పెరిగే కొద్దీ పురుషుల్లో దీర్ఘకాలిక అనారోగ్యాలు పెరుగుతుంటాయి . అంటే వారి శతాధిక వయస్సు ఎక్కువ భాగము అలవాట్లు పైనే ఆధారపడి నియంత్రించబడుతుంది .

ఆహారంతో ఆయుష్షు!, Life span is linked with Food :
మనం తీసుకునే ఆహారం మీద మన ఆయుష్షు కూడా ఆధారపడి ఉంటుందంటే నమ్ముతారా? ఎందుకంటే ప్రస్తుతం ఎంతోమంది గుండెజబ్బులు, క్యాన్సర్‌ వంటి వ్యాధులతో చిన్న వయసులోనే మరణిస్తున్నారు. ప్రధానంగా ఆహార అలవాట్లే ఈ జబ్బులకు దోహదం చేస్తున్నాయి. కాబట్టి అకాల మరణాన్ని తప్పించుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం చాలా అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఈ విషయంలో ఇటీవల అమెరికా పరిశోధకులు ఆసక్తికరమైన అధ్యయనం నిర్వహించారు. 70-79 ఏళ్లకు చెందిన 2,500 మంది వృద్ధులను ఎంచుకొని పదేళ్ల పాటు వారి ఆహార అలవాట్లను పరిశీలించారు. తీసుకునే ఆహారాన్ని బట్టి వృద్ధులను ఆరు బృందాలుగా విభజించారు.
తక్కువ కొవ్వుగల పాల పదార్థాలు, పండ్లు, ముడి ధాన్యాలు, కోడిగుడ్లు, కోడిమాంసం, చేపలు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ..
మాంసం, వేపుళ్లు, స్వీట్లు, అధిక కేలరీ పానీయాలు, కొవ్వు పదార్థాలు తక్కువగా తినే వారిని 'ఆరోగ్యకర పదార్థాల' బృందంలో చేర్చారు. ఐస్‌క్రీములు, వెన్న, పూర్తి కొవ్వుతో నిండిన పాలు, పెరుగు ఎక్కువగా తింటూ.. కోడిగుడ్లు, కోడిమాంసం, తక్కువ కొవ్వుగల పాల పదార్థాలు, బియ్యం, పాస్తాలు తక్కువగా తినే వారిని 'అధిక కొవ్వు పాల పదార్థాల' బృందంగా విభజించారు. వీరిలో ఆరోగ్యకర పదార్థాల బృందం వారితో పోలిస్తే అధిక కొవ్వు గల పాల పదార్థాల బృందం వారికి మరణించే ముప్పు 40 శాతం ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. స్వీట్లు, తీపి పదార్థాలు ఎక్కువగా తినేవారికీ 37 శాతం ముప్పు అధికంగా ఉంటోందని బయటపడింది.

  • ఆరోగ్యానికి చిట్కాలు ,Hints for good health

ఆరోగ్యంగా వుండాలని మనలో ప్రతి ఒక్కరికీ వుంటుంది. ఎందుకంటే మనం ఏ కార్యం చేయాలన్నా దానికి ఆరోగ్యం అవసరం. అందుకే పూర్వం మన పెద్దలు ఆరోగ్యమే మహభాగ్యం అన్నారు. అయితే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని చిన్న చిట్కాలు పాటించినట్లయితే మనం నిత్యం ఆరోగ్యంగా వుండ గలుగుతాము. అవి ఏమిటంటే

  • ఉదయాన్నే నిద్ర లేవగానే ఒకటి లేదా ఒకటిన్నర లీటరు నీళ్ళు త్రాగండి. అలా త్రాగటంవల్ల సుఖ విరేచనం అవుతుంది. సమస్త వ్యాధి వర్థకం మలబద్దకం అని మనవైద్యశాస్త్రం చెప్తుంది. సుఖ విరోచనం అవ్వటం అంటే అన్ని జబ్బులు నుండి విముక్తి పొందటమే.
  • రోజుకు ఒక అర్థగంట లేదా 45నిమిషాల నడక ఆరోగ్యానికి అత్యంత అవసరం. ఉదయం నడక మన ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నీ వ్యాయామాలలో నడక అనేది చాలా సులువైన వ్యాయామం. రోజూ ఒకగంట వాకింగ్‌ చేయడం మూలంగా బిపి షుగర్‌ను కొంత వరకు కంట్రోల్‌ చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యటం వల్ల గుండెపోటు అనేది దరిచేరదు. వాకింగ్‌ చేసేటప్పుడు మాట్లాడడం మానాలి.
  • బలమైన ఆరోగ్యకర ఆహారాన్ని తీసు కోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌ను తినటం మానాలి. ప్రోటీన్లు, పీచు అధికంగా ఉండే ఆహారం తీసు కోవటం అత్యుత్తమం. మొలకెత్తిన విత్తనా లలో కొబ్బరి క్యారెట్‌లను తురిమి కొతిమీరతో కలిపి డేట్స్‌తో సహా అల్పాహారంగా తీసుకోవాలి. గోంగూర, తోటకూర, పాల కూర, బచ్చలికూర లేదా క్యారట్‌రసం సేవించటం చాలా మంచిది. ఆకుకూరలన్నింటిలో మునగాకు అత్యంత బలమైన ఆహారం అన్న విషయాన్ని మరువకూడదు.
  • ఉప్పు అధికంగా తినటం వల్ల ప్రమాదం వుంటుంది. కనుక వాటిని తగ్గించాలి.
  • అలాగే నూనె, వేడిపదార్థాలను ఎక్కువగా తినటం మానాలి.
  • ఆహారాన్ని ఎప్పుడూ కూడా బాగా నమిలి తినాలి.
  • అన్నంలో కూరకలిపే పద్ధతిని మాని, కూరలో అన్నం కలిపే అలవాటు చేసుకున్నట్లయితే అది ఆరోగ్యానికి చాలా మంచిది.
  • ఆరోగ్యానికిమంచి అలవాట్లు !

ఆరోగ్యకరమైన సూత్రాలను పాటించటం అందరికీ మంచిది. కొన్ని రకాల ఆరోగ్య సూత్రాలు అందరూ పాటించాల్సి వుంటుంది. అది ఏమిటంటే
  • ఇండ్లలోని చెత్త, చెదారాన్ని రోడ్ల మీదగాని, ఇతరుల ఇంటి ముందర గాని వేయకూడదు. చెత్తను మున్సిపాలిటీ వారి కుండీలలో మాత్రమే వేయాలి. అది కూడా మనం ఆరోగ్యంగా వుండటానికి సహాయపడుతుంది. చెత్త చెదారాన్ని ఇంటిముందు వుంచుకున్నా అది మనకి అనారోగ్యకరం. అందుకే పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలి.
  • కొంతమంది ఎక్కువగా సిగరెట్లు, బీడీలు, చుట్టలు, పొగాకు ఎక్కువగా కాలుస్తుంటారు. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే వీటనింట్లో 'నికోటిన్‌' అనే విష పదార్థము ఉంటుంది. పొగ త్రాగటం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. వాటిద్వారా నోటి క్యాన్సర్‌, ఊపిరితిత్తులు, క్యాన్సర్‌, క్షయ వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా పొగ త్రాగటం వల్ల ఆయుష్షు క్షీణిస్తుంది.
  • కాఫీ, టీలు ఎక్కువగా త్రాగటం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే కాఫీలో 'కాఫిన్‌' అనే పదార్థము, టిలో 'టియాన్‌' అనే పదార్థము వుంటుంది. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. దీనివల్ల జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు వస్తాయి. కనుక కాఫీ, టీలు తాగకుండా వుంటే చాలా మంచిది.
  • కొంతమందికి మత్తు పానీయాలు సేవించటం వల్ల బుద్దిమాంద్యం ఏర్పడుతుంది. అనేకమైన ప్రమాదాలు సంభవిస్తాయి. ఈ రోజుల్లో విద్యార్థులు గంజాయి, మార్ఫిన్‌లకు బానిసలు అవుతున్నారు. అవి మనిషిని పీల్చి పిప్పి చేస్తాయి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేది మన చేతుల్లోనే వుంటుంది. మన అలవాట్ల మీదే మన ఆరోగ్యం చదువు ఆధారపడి వుంటుంది.

  • ==============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.