Sunday, November 28, 2010

పొట్టలో కలత-పేగు పూత ,Inflamatory Bowel Diseases






'పొట్ట' ఓ సంశయాల పుట్ట! ఓ పూట ఎక్కడో నొప్పిగా ఉంటుంది. మరోపూట తిన్నది అరిగినట్టనిపించదు. ఒక్కోరోజు ఎందుకో బరువుగా బిగువుగా అనిపిస్తుంది. ఉన్నట్టుండి ఏదో మెలితిప్పుతున్నట్టు బాధ. లేదంటే లోపల ఏదో గడబిడ. విరేచనాలు పట్టుకుంటాయి. ఇలా పొట్టలో వచ్చే ప్రతి మార్పూ.. ఎందుకో, ఏమిటో అర్థంకాక మనసును విపరీతంగా తొలుస్తుంది. చిన్నాచితకా నొప్పులూ, బాధలూ.. సంశయాలూ, సంకోచాలూ సహజమే! వాటి గురించి మరీ అంతగా ఆందోళన చెందాల్సిన పని లేకపోవచ్చు. కానీ కొన్నిసార్లు పొట్టలో మొదలయ్యే ఉపద్రవాలు.. ఎంతకీ వీడకుండా వేధిస్తూనే ఉంటాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించటానికి లేదు. ముఖ్యంగా దీర్ఘకాలం విరేచనాలు వేధిస్తుంటే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చెయ్యకూడదు.

విరేచనాలు, కడుపు నొప్పి వంటి బాధలు దీర్ఘకాలం వేధిస్తున్నాయంటే పేగుల్లో తలెత్తుతున్న ఇబ్బందికర మార్పులేవో దానికి కారణం కావచ్చు. ముఖ్యంగా పెద్దపేగుల్లో తలెత్తే వాపు, పూత వ్యాధులు ఇటువంటి బాధలనే తెచ్చిపెడతాయి. వీటినే 'ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజెస్‌' అంటారు. ఒకప్పుడు కచ్చితంగా నిర్ధారించుకునే మార్గం లేక వీటిని 'అమీబియాసిస్‌' వంటి సమస్యలుగా భావించి ఏవేవో వైద్యాలు చేసేవారు. మన పొట్ట లోపల ఏం జరుగుతోందో, సమస్యకు మూలాలు ఎక్కడున్నాయో పరిశీలించే వెసులుబాటు లేని రోజుల్లో ఈ రోగులు అనుభవించిన ఆవేదనకు అంతులేదు.

కానీ.. ఇప్పుడీ పరిస్థితి సమూలంగా మారిపోయింది. మన పొట్ట ఏమాత్రం మిస్టరీల పుట్ట కాదు! సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్‌ బెలూన్‌ ఎంటరోస్కోప్‌, క్రోమో ఎండోస్కోపీ వంటి వాటితో మన పేగులను ఆమూలాగ్రం, అణువణువూ క్షుణ్ణంగా పరీక్షించే సదుపాయం ఉందిప్పుడు. ఫలితంగానే పెద్దపేగుల్లో పూత, వాపు, పుండ్లు, క్షయ వంటి సమస్యలను ఇప్పుడు కచ్చితంగా నిర్ధారించి వైద్యం చెయ్యటం సాధ్యపడుతోంది. వైద్యరంగం సాధించిన అత్యాధునికమైన పురోగతి ఇది.

ఎవరికైనా సరే... 30 రోజులకు మించి విరేచనాలు వేధిస్తున్నాయంటే సమస్య కాస్త మొండిగా, దీర్ఘకాలికంగా మారిందని అర్థం. దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా లోతుగా పరిశీలించటం చాలా అవసరం. ఒకప్పుడు ఈ దీర్ఘకాలిక విరేచనాల వంటి సమస్యలకు 'అమీబియాసిస్‌' వంటివి కారణమవుతున్నాయని భావించేవారు. కానీ ఇటీవలి కాలంలో పేగులను క్షుణ్ణంగా పరీక్షించటానికి అవసరమైన ఎండోస్కోపీ, కొలనోస్కోపీ పరిజ్ఞానం బాగా అందుబాటులోకి రావటంతో దీర్ఘకాలికంగా విరేచనాల సమస్యలతో బాధపడుతున్న వారిలో ఎక్కువ మందిని పరిశీలించినప్పుడు వారికి పేగు పూత, వాపు (ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజెస్‌) ఉంటోందని బయటపడుతోంది. పేగుల్లో క్షయ కూడా ఎక్కువగానే కనబడుతోంది.

పెద్దపేగు పూత, వాపు రకరకాలుగా, ఎన్నో రూపాల్లో ఉండొచ్చు. పెద్దపేగు లోపలి గోడలు ఎర్రగా వాచి.. పూసినట్లవటం, పుండ్లు పడటం.. వాటి నుంచి రక్తస్రావం అవుతుండటం.. వీటన్నింటినీ కలిపి పూత వ్యాధులు (ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజెస్‌)గా పరిగణిస్తారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెండు రకాలు. 1. అల్సరేటివ్‌ కోలైటిస్‌. దీనిలో పేగుల్లో పూత, వాపుతో పాటు పేగుల గోడలకు పుండ్లు కూడా పడుతుంటాయి. కానీ ఇది చాలా వరకూ పెద్దపేగుకు మాత్రమే పరిమితమవుతుంది. 2. క్రాన్స్‌ వ్యాధి. దీనిలో ప్రధానంగా కనబడేది పేగుల్లో పూత, వాపు. ఇది పేగుల్లో ఎక్కడైనా రావచ్చు. ఇక ఈ రెండూ కాకుండా పేగుల్లో క్షయ (టీబీ) కూడా రావచ్చు. వీటన్నింటిలోనూ కూడా ముఖ్యంగా కనిపించే లక్షణాలు.. కడుపు నొప్పి, దీర్ఘకాలం విడవకుండా వేధించే విరేచనాలు. వీటిని నిర్లక్ష్యం చేస్తే పేగులు దెబ్బతిని.. తీవ్ర పరిణామాలు తలెత్తుతాయి. కాబట్టి విడవకుండా విరేచనాలు వేధిస్తుంటే తప్పనిసరిగా ప్రత్యేక నిపుణులైన వైద్యులను సంప్రదించి మరిన్ని పరీక్షలు చేయించుకుని, సమస్యను కచ్చితంగా నిర్ధారణ చేయించుకుని, చికిత్స తీసుకోవటం అవసరం.
.
లక్షణాలేమిటి?
* విరేచనాలు, రక్తం పడటం
* కడుపు నొప్పి
* జ్వరం, తీవ్ర అలసట
* బరువు తగ్గిపోవటం
* ఆకలి మందగించటం
* మలద్వారం చుట్టుపక్కల పుండ్లు

చాలామందిలో ఈ లక్షణాలు ఓ మోస్తరుగానే ఉంటాయి. కొద్దిమందిలో మాత్రం తరచూ జ్వరం, రక్తంతో కూడిన విరేచనాలు, వికారం, భరించరాని కడుపు నొప్పి ఉంటాయి. అల్సరేటివ్‌ కోలైటిస్‌లో విరేచనాల బాధ ఎక్కువ, క్రాన్స్‌ డిసీజ్‌లో కడుపునొప్పి బాధ ఎక్కువ.
పేగులకే పరిమితమా?
ఎందుకలా జరుగుతుందో ఇప్పటి వరకూ స్పష్టమైన కారణం తెలియదుగానీ.. పేగుల్లో వాపు, పూత మొదలైనప్పుడు దీనివల్ల ఒంట్లోని ఇతరత్రా అవయవాలు కూడా ప్రభావితమవుతున్నాయని వైద్యులు గుర్తించారు. ముఖ్యంగా:

* కళ్లు ఎర్రబడి వాచటం, నొప్పి, అరుదుగా చూపు మందగించటం
* చర్మం మీద నొప్పితో బుడిపెలు, లేదంటే లోతుగా పుండ్లు పడటం
* మోకాలు కీళ్లు, వెన్నుపూసలకు ఆర్త్థ్రెటిస్‌ రావచ్చు. ముఖ్యంగా 'ఆంకిలోజింగ్‌ స్పాండిలైటిస్‌' రకం వెన్ను బాధలు, ఎముకలు బోలుగా తయారయ్యే ఆస్టియోపొరోసిస్‌ ఎక్కువ..
* పైత్యరస నాళం మూసుకుపోవటం వంటి కొన్ని రకాల లివర్‌ సమస్యలు.
* ఈ పేగుల్లో వాపు, పూత బాధితుల్లో రక్తహీనత, కిడ్నీల్లో రాళ్ల బాధ ఎక్కువగా కనబడుతున్నాయి.
ఎందుకొస్తుందీ పూత?
పేగులకు వాపు, పూత వ్యాధులు ఎందుకు వస్తాయో కచ్చితంగా చెప్పటం కష్టం. జన్యుపరంగా, వంశంలో ఇంతకు ముందు ఉన్నవారికి రావచ్చు. ముఖ్యంగా క్రాన్స్‌ వ్యాధి ఇలా జన్యుపరంగా వచ్చేరకం. తల్లిపాలు లేకుండా పోతపాల మీద పెరగటం, రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున పేగుల మీద దాడి చెయ్యటం, పేగుల్లో హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వంటి రసాయనాల స్థాయులు ఎక్కువగా ఉండటం.. ఇటువంటివన్నీ దోహదం చేస్తుండవచ్చని భావిస్తున్నారు. కచ్చితమైన కారణం తెలియదు కాబట్టి ఈ పూత వ్యాధులు రాకుండా ముందే నివారించుకోవటం కష్టం.
పరీక్షలు ఎందుకు?
కొంత కాలంగా విడవకుండా విరేచనాలు అవుతున్నప్పుడు లోతుగా పరీక్షించాల్సిన అవసరం ఏమిటి? అన్నది కీలకమైన ప్రశ్న. ఆ విరేచనాలకు కారణం పేగుల్లో వాపు, పూత, పుండ్ల వంటివి కారణమా? అన్నది ముందే గుర్తిస్తే వెంటనే చికిత్స ఆరంభించి అవి ముదిరిపోకుండా చూడొచ్చు. ఈ సమస్యలు ముదిరితే కడుపులో బాధలు తీవ్రతరం కావటమే కాకుండా.. పేగులు మూసుకుపోవటం, లేదా పేగులు సన్నబడిపోవటం, ఆపరేషన్‌ చేసి పేగుల్లో ఆ భాగాన్ని తొలగించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కొన్నిసార్లు పెద్దపేగుల్లో ఈ పూత వ్యాధులు క్యాన్సర్‌కు కూడా కారణమవుతున్నాయని గుర్తించారు. కాబట్టి వీటిని సత్వరమే గుర్తించి, ముదరకుండా నియంత్రించటం చాలాచాలా అవసరమని గుర్తించాలి.
* ఆహారం: పేగు పూత బాధితులు సాధారణ ఆహారం తీసుకోవచ్చు. కొందరికి పాల పదార్థాలు ఇబ్బంది పెడతాయి, వారు వీటిని మానేస్తే మేలు. క్రాన్స్‌ వ్యాధి బాధితులు మాత్రం పీచు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

* గర్భం: పేగు వాపు తీవ్రంగా లేని మహిళలు గర్భం ధరించవచ్చు. తీవ్రంగా ఉంటే కొన్నిసార్లు అబార్షన్లు, ముందే కాన్పు రావటం వంటివి జరగొచ్చు. కాబట్టి గర్భిణులకు బాధలు ఎక్కువైతే చికిత్సతో దాన్ని నియంత్రణలో పెట్టటం తప్పనిసరి.

ఇవీ సమస్యలు!

అల్సరేటివ్‌ కోలైటిస్‌
* ఏమిటి: పెద్దపేగు లోపల వాపు, పూతతో పాటు పుండ్లు కూడా పడతాయి. చాలా వరకూ పెద్దపేగుకు మాత్రమే పరిమితమవుతుంది.
* ఎవరికి: 1540 ఏళ్ల మధ్య వయసు వారికి ఎక్కువ. స్త్రీపురుషులు ఇరువురిలోనూ కనబడుతుంది.
* నిర్లక్ష్యంతో: చికిత్స తీసుకోకుండా దీర్ఘకాలం నిర్లక్ష్యం చేస్తే రక్తస్రావం కావటం, పెద్దపేగు ఉబ్బిపోవటం, రంధ్రాలు పడటం, క్యాన్సర్‌ వంటి దుష్ప్రభావాలుంటాయి.
* చికిత్స: ఇది కొంతకాలం తగ్గుతూ, కొంతకాలం ఉద్ధృతమయ్యే రకం సమస్య. కాబట్టి దీర్ఘకాలం చికిత్స తప్పదు. దీనికి ప్రధానంగా మెసలాజైన్‌ వంటి అమినోశాల్సిలేట్లు, రోగనిరోధక వ్యవస్థను అణిచిపెట్టి ఉంచే అజిథియోప్రైన్‌ వంటి ఇమ్యూనో సప్రసెంట్లు సిఫార్సు చేస్తారు. సమస్య తీవ్రంగా ఉంటే కొంతకాలం స్టిరాయిడ్లు కూడా ఇచ్చి క్రమేపీ తగ్గించేస్తారు. పెద్దపేగు చివరి భాగం ప్రభావితమైతే మెసలాజైన్‌ లేదా స్టిరాయిడ్‌ ఎనిమాలు ఇవ్వాల్సి ఉంటుంది. మందులతో ప్రయోజనం లేని కొందరికి సర్జరీ చేసి.. ప్రభావితమైన ఆ పేగు భాగాన్ని తొలగించాల్సిన అవసరం కూడా వస్తుంది.

క్రాన్స్‌ వ్యాధి

* ఏమిటి: ప్రధానంగా కనబడేది పేగుల్లో పూత, వాపు. ఇది పేగుల్లో ఎక్కడైనా రావచ్చు.

* ఎవరికి: ఏ వయసులోనైనా రావచ్చు. 2030 ఏళ్ల మధ్య వయసులో ఎక్కువ. కొన్ని కుటుంబాల్లో ఎక్కువ. పొగతాగేవారికి ముప్పు ఎక్కువ.

* నిర్లక్ష్యంతో: పేగుల్లో ఈ సమస్య ఎక్కడ తలెత్తింది, ఎంత తీవ్రంగా ఉందన్నది ముఖ్యం. నిర్లక్ష్యం చేస్తే చిన్నపేగు మూసుకుపోవటం, మలద్వారం చుట్టుపక్కల చీము గడ్డలు, రంధ్రాలు పడటం, పేగులకు రంధ్రాలు పడటం, రక్తహీనత, పోషకాహార లోపం వంటివి ముంచుకొస్తాయి.

* చికిత్స: పూర్తిగా నయం చెయ్యటం కష్టం. కానీ పేగుల్లో వాపు, జ్వరం, విరేచనాల వంటివి తగ్గించి వ్యాధిని నియంత్రణలో పెట్టచ్చు. దీనికి వాపు తగ్గించే మెసలాజైన్‌ వంటి అమినోశాల్సిలేట్లు, రోగనిరోధక వ్యవస్థను అణిచిపెట్టి ఉంచే అజిథియోప్రైన్‌ వంటి ఇమ్యూనో సప్రసెంట్లు, స్టిరాయిడ్లు సిఫార్సు చేస్తారు. వీటితో పాటు కొంచెం ఖరీదైనవే అయినా ఇన్‌ఫ్లిక్సిమాబ్‌ వంటి 'బయలాజికల్స్‌' రకం మందులతో చాలా ప్రయోజనం ఉంటోందని గుర్తించారు. అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్‌, విరేచనాలు తగ్గించే మందులూ, పోషకాహార లోపం ఉంటే విటమిన్‌ సప్లిమెంట్లూ తీసుకోవాల్సి ఉంటుంది. చికిత్సలతో ప్రయోజనం లేకపోతే సర్జరీ చేసి వాపు ఉన్న పేగు భాగాన్ని తీసెయ్యాల్సి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తూ కొంతకాలానికి ఆ పక్క భాగంలో మళ్లీ వాపు కనబడే ప్రమాదం ఉంటుంది.

పేగుల్లో క్షయ

పేగుల్లో క్షయ ఎవరికైనా రావచ్చు. మన దేశంలో మరీ ఎక్కువ. దీని లక్షణాలు చాలావరకూ పేగుపూత, వాపు లక్షణాల్లాగే ఉంటాయి. కాబట్టి దీన్ని ఐబీడీ నుంచి పూర్తి భిన్నంగా గుర్తించాల్సి ఉంటుంది. చిన్నపేగు, పెద్దపేగు కలిసే చోట ఎక్కువగా కనబడుతుంటుంది. నిర్ధారణ కచ్చితంగా చేసి.. వీరికి క్షయ మందులు వాడితే సంపూర్ణంగా తగ్గిపోతుంది.

ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌)
కొందరికి చూడటానికి పేగుల్లో ఏ లోపం ఉండదుగానీ పేగుల పని తీరు మాత్రం అస్తవ్యస్తంగా తయారవుతుంది. ఫలితంగా దీర్ఘకాలిక కడుపు నొప్పి, కడుపులో అసౌకర్యం, కడుపు ఉబ్బరం, కొంతకాలం మలబద్ధకం లేదంటే విరేచనాలు.. ఇలా వేధిస్తుంటాయి. దీన్ని నిర్ధారించుకోవటానికి పరీక్షలన్నీ చేసి, ఇతరత్రా పేగుపూత వంటి సమస్యలేవీ లేవని తేల్చుకోవటం ముఖ్యం. దీనితో నొప్పి, అలసట వంటివి తప్పించి తీవ్రమైన దుష్ప్రభావాలేమీ ఉండవు, లక్షణాలను బట్టి వైద్యం చేస్తారు.

గుర్తించేదెలా?
చాలావరకూ బాధితులు చెప్పే లక్షణాల ఆధారంగానే వైద్యులు వీటిని గుర్తించగలుగుతారు. రక్త, మల, మూత్ర పరీక్షలు కూడా కొంత కీలకమైన సమాచారాన్ని అందిస్తాయి. అయితే వీటిని కచ్చితంగా నిర్ధారించుకోవటానికి కొన్ని రకాల పరీక్షలు తప్పనిసరి. ముఖ్యంగా ఎండోస్కోపీకొలనోస్కోపీ పరీక్షల్లో నోటి ద్వారా లేదా మల ద్వారం గుండా కెమేరా గొట్టాన్ని లోపలికి పంపించి.. పేగుల్లో వాపు, పూత, పుండ్లు వంటివి ఉన్నాయేమో టీవీ తెర మీద స్పష్టంగా చూస్తారు. సమస్య క్రాన్స్‌ వ్యాధా? లేక అల్సరేటివ్‌ కోలైటిస్‌ వ్యాధా? ఈ రెండూ కాక క్షయ ఉందా? లేక పేగుల్లో ఏ సమస్యా లేకుండానే లక్షణాలు బాధిస్తున్నాయా? ఇవన్నీ కీలకమైన ఈ పరీక్షల్లోనే కచ్చితంగా నిర్ధారణ అవుతాయి.

ముఖ్యంగా: సిగ్మాయిడోస్కోపీ పరీక్షతో మలద్వారం, పెద్దపేగు చివరిభాగాలను పరీక్షించవచ్చు. కొలనోస్కోపీతో పెద్దపేగు మొత్తాన్ని క్షుణ్ణంగా పరీక్షించవచ్చు. అవసరమైతే అదే కెమేరా గొట్టంతో పేగుల నుంచి చిన్నముక్క తీసి (బయాప్సీ) పరీక్షకు పంపించవచ్చు. అలాగే 'డబుల్‌ బెలూన్‌ ఎంటరోస్కోపు'తో మొత్తం చిన్నపేగును తనిఖీ చెయ్యచ్చు. వీటిలో అవసరమైన ప్రాంతాన్ని టీవీ తెర మీద పెద్దగా చేసుకుని చూడటానికి, సమస్య ఉన్న ప్రాంతాన్ని కచ్చితంగా చూడటానికి మాగ్నిఫికేషన్‌, క్రోమోఎండోస్కోపీ విధానాలూ అందుబాటులో ఉన్నాయి. పేగు పూత, వాపు సమస్యలను గుర్తించటంలో ఇవి కీలకమైన పరీక్షలు. సమస్య ఏమిటన్నది కచ్చితంగా నిర్ధారించటంలో 'బయాప్సీ' ముఖ్య పాత్ర పోషిస్తుంది. అవసరాన్ని బట్టి వైద్యులు బేరియం ఎనిమా వంటి మరికొన్ని పరీక్షలూ చేయవచ్చు. ఈ తరహా పూత, పూత సమస్యలను పూర్తిగా నయం చెయ్యటం సాధ్యం కాకపోవచ్చు. కానీ చికిత్సతో వాటిని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటం.. బాధల నుంచి బయటపడటానికేకాదు, భవిష్యత్తులో ఇతరత్రా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవటానికి కూడా చాలా అసవరం.

-డా. కె.జగన్మోహనరావు, చీఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ ,నాగార్జున హాస్పిటల్‌, విజయవాడ.


  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, November 16, 2010

Knee-Pains , మోకాలి నొప్పులు.




  • --courtesy Surya news paper

సాధారణంగా 40 ఏళ్ళు పైబడిన వారిలో వచ్చే మోకాలి నొప్పి తాత్కాలిక ఉపశమనం కోసం వినియోగించే పెయిన్‌ కిల్లర్లు మరిన్ని వ్యాధులకు కారణం అవుతున్నాయి. 40 ఏళ్ళు దాటిన మహిళల్లో ఎక్కువగా కనిపించే మోకాలి నొప్పి నివారణకు ప్రధానంగా పెయిన్‌ కిల్లర్లు ఉపయోగిస్తున్నారు. డాక్టర్ల సలహా లేకుండా మందుల షాపుల్లో అడిగి కొనుక్కోవడం, వాటిని వినియోగించడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్‌‌స అధికం అవుతున్నట్లు వైద్యుల పరిశీలనలో తేలింది. మోకాలి నొప్పి సాధారణంగా సంబంధిత జాయింట్‌ల కింద ఉన్న ఎముకల్లో పటుత్వం కోల్పోవడం, అరిగిపోవటం లేదా తీవ్ర గాయాలపాలయిన అనంతరం కూడా ఇవి ఎక్కువ అవుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. దేశ జనాభాలో 15 మిలియన్ల మంది ఈ మోకాలి నొప్పి, ఊబకాయం వల్ల వచ్చే కీళ్ళ నొప్పులతోనే బాధపడుతున్నారు. వీటికి తోడు ప్రమాదాల్లో గాయపడటం, స్థూలకాయం జీవన శైలి వంటి వాటితో నొప్పి తీవ్రతరం అయి కనీసం కూర్చోలేని, నిలుచోలేని పరిస్థితికి రోగులు చేరుతుంటారు. తాత్కాలిక పెయిన్‌ కిల్లర్స్‌ వీడితే ఇటువంటి వారికి ‘విస్కో సప్లిమెంటేషన్‌’ పేరిట కొత్త చికిత్సా విధానం అమలులోకి తీసుకు వస్తున్నారు.

మోకాలి నొప్పులకు విస్కోసప్లిమెంటేషన్‌

దీని ప్రకారం మోకాలి చిప్పలోపలి భాగంలో చెడిపోయిన ఫ్లూయిడ్‌ను మొత్తం తొలగించి తిరిగి అదే విధమైన కొత్త లిక్విడ్‌ను ఎక్కిస్తారు. దీనితో పాటు సంకోచ, వ్యాకోచ స్థితిగతులను నిత్యం వైద్యులు పరిశీలించడం వలన కొత్తగా ప్రకృతి తయారీ ఫ్లూయిడ్‌లను జొప్పించిన కారణంగా నొప్పి తగ్గి నడిచేందుకు వీలు ఏర్పడుతుందని వైద్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకే ఒక్క ఇంజెక్షన్‌తో దాదాపు ఆరు నెలల పాటు నొప్పిని తగ్గించుకునే అవకాశం ఉందని తేలింది. ఇంజెక్షన్‌ ద్వారా మోకాలి జాయింట్‌ వద్దకు పంపించే ఈ విధానంలో ఆరు నెలల పాటు చికిత్స పొందాల్సి ఉంటుంది. దీనికి తోడు క్రమం తప్పని వ్యాయామం, బరువు నియంత్రణలతో మోకాలి నొప్పులను నియంత్రించుకోవచ్చని అపోలో సర్జెన్‌ డా కార్తీక్‌ సింగ్లే పేర్కొన్నారు. స్టెరాయిడ్‌లు, పెయిన్‌ కిల్లర్ల వినియోగం కేవలం తాత్కాలిక ఉపశమనమేనని, దీర్ఘ కాలిక ఉపశమనం రావాలంటే ఈ కొత్త విధానం చికిత్స తీసుకోవడం ఉత్తమం అన్నారు.

పైగా పెయిన్‌ కిల్లర్ల విచ్చలవిడి వినియోగం వల్ల అల్సర్లు, గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఉత్పన్నం అవుతాయని కిమ్స్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డా ఐ.వి. రెడ్డి అన్నారు. స్థూలకాయానికి, మొకాలి నొప్పి సమస్యకు దగ్గర సంబంధం ఉంటుంది. అత్యధిక బరువు మోకాలిపైనే మోపడం, వయస్సు పై బడుతున్న కొద్దీ ఎదురయ్యే దుష్ఫలితాలు మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌కు కారణం అవుతున్నట్లు వైద్యుల పరిశోధనలు తేట తెల్లం చేస్తున్నాయి. మొత్తం మీద రోజుకు 30 నిమిషాల పాటు నడక లేదా వారానికి ఐదు సార్లు చిన్న పాటి వ్యాయామం, క్రమం తప్పని పౌష్టికాహారం వంటివి మోకాలి నొప్పులకు రోగులు తీసుకోవల్సిన ప్రాథమిక జాగ్రత్తలని చెప్పక తప్పదు. నగరంలో ఈ తరహా కొత్త వైద్య విధానంతో అత్యధిక సంఖ్యలో రోగులకు విస్కో సప్లిమెంటేషన్‌ ద్వారా నయం చేయగలుగుతున్నారు.


  • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

ఫీటల్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ హార్ట్‌ డిసీజెస్‌,Foetal Management of heart diseases




ఫీటల్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ హార్ట్‌ డిసీజెస్‌'.. అంటే పిండం కడుపులో ఉన్నప్పుడే.. దాని గుండెలో తలెత్తిన లోపాలకు చికిత్స చేస్తూ.. ఆ పిండం ఆరోగ్యకరమైన బిడ్డలా ఎదిగేలా చూసే విధానం. గత దశాబ్దకాలంగా వైద్య ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రంగం ఇది. ఎందుకంటే అమ్మ కడుపులో పెరుగుతున్న నలుసుకు ఉన్నట్టుండి గుండె వేగం విపరీతంగా పెరిగిపోవచ్చు, బాగా తగ్గిపోనూ వచ్చు. గుండె ఏర్పడే క్రమంలోనే.. కవాటాలు బిగుసుకుపోయి అసలు గుండె గదులు సరిగా తయారవ్వకపోవచ్చు. అలాగే బిడ్డ పుట్టే వరకూ రక్తప్రవాహం కోసం గుండె గదుల మధ్య ఉండాల్సిన రంధ్రం ముందే మూసుకుని పోవచ్చు. ఇవన్నీ కీలక సమస్యలే.

ఇవి పిండానికి గండం తెచ్చిపెట్టే సమస్యలు! బిడ్డ కడుపులోనే చనిపోవటం ఎంతటి గర్భశోకాన్ని మిగులుస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అది.. లేకలేక నిలిచిన గర్భమైతే ఆ బాధ వర్ణనాతీతం. అందుకే వైద్యరంగం ఈ పిండం గుండె సమస్యలను నెగ్గుకొచ్చేదెలా? అన్న దానిపై పరిశోధనలు చేస్తోంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గాలు, చికిత్సా ద్వారాలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి.

లోపాలు ఎప్పుడు గుర్తించొచ్చు?
* గర్భస్థ పిండానికి 21వ రోజుకే గుండె కొట్టుకోవటం, రక్త ప్రసరణ మొదలవుతాయి. 4 వారాలకల్లా గుండె గదులు ఏర్పడతాయి. 12 వారాలకు గుండె పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. గర్భిణికి వూబకాయం లేకపోతే నిపుణులైన ఎకో కార్డియోగ్రాఫర్లు ఈ సమస్యలను చాలావరకూ 16వ వారంలోనే గుర్తించగలుగుతారు.

సాధారణంగా గర్భిణికి 18-22 వారాల సమయంలో స్కానింగుల్లో భాగంగా 'ఫీటల్‌ ఎకో' చేయాలి. ఒకవేళ గతంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బులున్నా, గర్భం పోయినా, బిడ్డలు చనిపోయిన చరిత్ర ఉన్నా.. ఇంకా ముందు నుంచే ఫీటల్‌ ఎకో స్కానింగులు చెయ్యాలి. కొన్నిసార్లు 26-28 వారాల మధ్య కూడా పరీక్ష చేయిస్తుంటారు. కానీ 20 వారాల లోపు గనక తీవ్రమైన గుండె లోపాలను గుర్తిస్తే.. అవసరమైతే చికిత్సలు (ఫీటల్‌ కార్డియాక్‌ ఇంటర్వెన్షన్స్‌) లేదంటే అబార్షన్‌

చేయించుకునే వీలుంటుంది. తొలి వారాల్లోనే పిండం గుండె లోపాలు బయటపడితే తల్లిదండ్రులకు ముందుగానే అవగాహన కల్పించటం అవసరం. కొన్నిరకాల గుండె సమస్యలున్న బిడ్డలు పుట్టగానే చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని కడుపులో ఉండగానే చికిత్స చేసే వెసులుబాటు ఉంటుంది.

గుండె వేగం అస్తవ్యస్తం
(అరిత్మియాలు)
సాధారణంగా తల్లి కడుపులో ఉన్నప్పుడు పిండం గుండె కొట్టుకునే వేగం (హార్ట్‌రేట్‌) నిమిషానికి 120-160 మధ్య ఉండాలి. 3-6 నెలల మధ్య కొంత ఎక్కువుంటుంది, 6-9 నెలల మధ్య కొంత తగ్గుతుంది. ఎంత తగ్గినా, ఎంత పెరిగినా మొత్తానికి అది 120-160 మధ్యనే ఉంటుంది. ఇది 100 కంటే తగ్గినా (ఫీటల్‌ బ్రాడీకార్డియా), 180 కంటే ఎక్కువైనా (ఫీటల్‌ టెకీకార్డియా) దాన్ని సమస్యగా గుర్తించాలి. ఇలా పిండం గుండె కొట్టుకునే రేటు అస్తవ్యస్తం కావటం చాలా పెద్ద
సమస్య. ఇది 22-36 వారాల మధ్య ఎక్కువగా కనబడుతుంది.
* గుర్తించేదెలా.. ఎవరికి వారే దీన్ని గుర్తించటం కష్టం. కాకపోతేపిండానికి ఇటువంటి 'హార్ట్‌ రేట్‌' సమస్యలుంటే గుండె నుంచి రక్తం పంపింగ్‌ తగ్గిపోయి.. బిడ్డ త్వరగా అలిసిపోయినట్త్లె కదలికలు తగ్గుతాయి. కాబట్టి పిండం కదలికలు తగ్గినట్టు అనిపిస్తే దాన్ని వైద్యుల దృష్టికి తీసుకు వెళ్లాలి. వాస్తవానికి పిండం కదలికలు తగ్గటమన్నది చాలా రకాల సందర్భాల్లో జరగుతుంటుంది. వాటిలో ఇది కూడా ఒకటి. రెండోది- మామూలుగా గర్భిణులకు గైనకాలజిస్టులు క్రమం ప్రకారం చేసే
స్కానింగుల్లో ఇది బయటపడుతుంది. ఈ రెండు మార్గాల్లో తప్పించి వీటిని మరే విధంగానూ గుర్తించే అవకాశం ఉండదు.* గుర్తించకపోతే: పిండం గుండె వేగం 220 కంటే ఎక్కువగా పెరిగిపోతే.. 'ఫీటల్‌ హైడ్రాప్స్‌' అనే సమస్యకు దారి తీస్తుంది. అంటే గుండె చుట్టూ, ఊపిరితిత్తుల్లో, పొట్టలో నీరు చేరిపోతుంది. ముఖం ఉబ్బిపోవటం, మాయ పెద్దదవటం... ఇవన్నీ వస్తాయి. దీన్ని గుర్తించలేకపోతే పిండం తల్లి కడుపులోనే చనిపోతుంది. కాబట్టి దీన్ని కచ్చితంగా గుర్తించాలి.
* గుర్తిస్తే.. ఈ సమస్యను ముందే గుర్తిస్తే గర్భంలో ఉండగానే చికిత్స చెయ్యచ్చు. దీనికి మూడు పద్ధతులున్నాయి.
1. తల్లికి మందులు ఇవ్వచ్చు. మాత్రల రూపంలో ఇచ్చే ఈ మందులు మాయను దాటుకొని శిశువును చేరుకుని, గుండె కొట్టుకునే వేగాన్ని సరిచేస్తాయి. వీటిలో కొన్ని మందుల వల్ల తల్లి గుండె కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది కాబట్టి తరచుగా తల్లికి ఈసీజీ తీసి చూస్తుంటారు. ఈ మందులతో 90% నియంత్రణలోకి వచ్చేస్తుంటుంది. ఈ పిల్లలు పుట్టిన తర్వాత కొందరికి అవసరాన్ని బట్టి మూణ్నెల్ల నుంచి సంవత్సరం వరకు మందులు ఇవ్వాల్సిన అవసరం రావొచ్చు.
2. ఉమ్మనీటిలోకి ఇంజెక్షన్‌.. పిండం బాగా ఉబ్బిపోయి.. తల్లికి మందులిచ్చినా పిండం గుండె వేగం తగ్గకుండా.. తల్లికి వాంతులు కూడా అవుతుంటే.. కొన్ని సందర్భాల్లో మందును నేరుగా ఉమ్మనీటి సంచిలోకి కూడా ఇంజక్షన్‌ రూపంలో ఇచ్చి నియంత్రించొచ్చు.
3. పిండానికే ఇంజెక్షన్‌.. అల్ట్రాసౌండ్‌ సాయంతో చూస్తూ తల్లి పొట్ట మీది నుంచే నేరుగా పిండానికే ఇంజక్షన్‌ ఇవ్వటమన్నది మరో విధానం. ఇది సుశిక్షితులైన నిపుణులు మాత్రమే జాగ్రత్తగా, బిడ్డకు ఎటువంటి హానీ జరగకుండా ఇవ్వగలరు.
* పుట్టిన తర్వాత.. గుండె వేగం అస్తవ్యస్తం కావటానికి కారణాన్ని బట్టి ఈ బిడ్డలకు 1-3 వారాలు, కొద్దిమందికి 6 వారాల నుంచి 3 నెలలలోపు మందులు ఇవ్వాల్సి రావచ్చు. కొందరిలో గుండెలోని విద్యుత్‌ ప్రసారాల్లో తేడాల వల్ల గుండె వేగం మారిపోతుంది. వీరికి ఏడాది పాటు మందులు ఇవ్వాల్సి రావచ్చు. మొత్తానికి ఈ పిల్లలు పూర్తిగా సాధారణ జీవితం గడుపుతారు. దీనికి సంబంధించిన ఇబ్బందులేవీ వెంటాడటమన్నది ఉండదు.

విశేషాలు
* పిండానికి గుండె మరమ్మతు చెయ్యాలంటే దీనికి పెద్ద బృందమే కావాలి. పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌, ఫీటల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌, ప్రసూతి నిపుణులు, పీడియాట్రిక్‌ అనస్థెటిస్ట్‌, నియోనేటాలజిస్ట్‌, శిక్షితులైన నర్సులు.. అందరూ ఉండాలి. తల్లికి దుష్ప్రభావాలు రాకుండా గైనకాలజిస్ట్‌లు జాగ్రత్తలు తీసుకుంటారు.
* ఈ ప్రక్రియలు చేసే సమయంలో కదలకుండా ఉండేందుకు పిండానికి మత్తు ఇస్తారు. ఈ మత్తు ఇచ్చిన 2 నిమిషాల తర్వాత పిండం కదలకుండా స్థిరంగా ఉంటుంది. అప్పుడు చికిత్సా ప్రక్రియలు చేపట్టటం తేలిక.

పిండం గుండెకు ఎందుకీ గండం?
పిండం ఎదిగే క్రమంలో గుండెలో లోపాలు తలెత్తటానికి ఎన్నో అంశాలు కారణమవుతున్నాయి.
* జన్యుపరమైన అంశాలు
* వాతావరణ కాలుష్యం
* ఫోలిక్‌ యాసిడ్‌ లోపం
* పురుగు మందుల ప్రభావం
* గర్భిణికి తొలి మూణ్నెల్లలో జ్వరాలు, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు సోకటం
* పోషకాహార లోపం
* పొగ పీల్చటం (పాసివ్‌ స్మోకింగ్‌)
* గర్భిణి ఫిట్స్‌ వంటి జబ్బులకు వేసుకునే మాత్రలు
* తెలియకుండానే రేడియో ధార్మిక ప్రభావానికి గురికావటం
* మేనరిక వివాహాలు: సాధారణంగా ప్రతి వెయ్యిమంది పిల్లల్లో 10 మందికి పుట్టుకతోనే గుండె లోపాలు ఉంటుంటాయి. కానీ మేనరిక వివాహాలు చేసుకున్న వారికి పుట్టే పిల్లల్లో ప్రతి వెయ్యి మందిలో 40-50 మందిలో ఇవి కనిపిస్తున్నాయని అలీగఢ్‌లో చేసిన అధ్యయనంలో వెల్లడైంది.

ఫలితం ఉంటుందా?
పిండం దశలోనే మనం ఈ చికిత్సా ప్రక్రియలు చేపట్టటం వల్ల ఫలితం ఉంటుందా? అనేది కీలక ప్రశ్న. గుండె వేగానికి సంబంధించిన అరిత్మియాలను నూటికి నూరు శాతం నయం చేసే వీలుంది. అలాగే రంధ్రాన్నీ సరిచెయ్యచ్చు. ఇక కవాటాల విషయంలో- ఈ ఆపరేషన్లతో 30-50% బతికి బట్టకడుతున్నారు. కాబట్టి నూటికి నూరుశాతం మరణిస్తారని తెలిసీ వదిలెయ్యటం కంటే 30-50 శాతం మంది చక్కగా జీవించేలా చెయ్యటం సాధ్యమేనన్నది గమనించాల్సిన విషయం.
మూసుకునే కవాటాలు
సాధారణంగా పిండంలో 12 వారాల వారాల్లోపే గుండెలోని గదులు రూపొందుతాయి. ఈ గదుల్లోకి రక్తం వచ్చిపోయేందుకు కీలకమైన కవాటాలుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ కవాటాలు మూసుకుపోతే రక్తప్రవాహం లేక అసలు గుండె గదులే సరిగా తయారవ్వవు. రక్తప్రవాహం లేని గదులు చిన్నగా కుచించుకుపోతాయి. పిండ దశలో ప్రధానంగా ఈ సమస్య- అయోటిక్‌ వాల్వ్‌, పల్మనరీ వాల్వ్‌లకు ఎక్కువగా కనబడుతుంటుంది.
* గుర్తించేదెలా.. 16-18 వారాలలోపు స్కానింగ్‌ చేసినపుడు కవాటాల లోపం (అయోటిక్‌ స్టినోసిస్‌, పల్మనరీ అట్రీసియా) వంటివి గుర్తిస్తే.. 26 వారాల లోపు ఆపరేషన్‌ చేసి లోపాలను సవరించొచ్చు.
* గుర్తించకపోతే.. కవాటాలు మూసుకుపోయే సమస్య తీవ్రస్థాయిలో ఉంటే వీరు హైపోప్లాస్టిక్‌ లెఫ్ట్‌ హార్ట్‌ సిండ్రోమ్‌, రైట్‌హార్ట్‌ సిండ్రోమ్‌ అనే సమస్యల్లోకి వెళ్లిపోతారు.

పుట్టకముందే తల్లి కడుపులోనే చనిపోవచ్చు లేదంటే పుట్టగానే చనిపోతారు. కొందరు బతికి బట్టకట్టినా తీవ్ర ఇబ్బందులతో ఆయుర్దాయం సరిగా ఉండదు.
* గుర్తిస్తే.. ఈ అడ్డంకులను గుర్తించి, మూడు నెలలలోపే వాటిని వెడల్పు చెయ్యగలిగితే- ఆ గదులు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. దీనికోసమే ఇప్పుడు ఇప్పుడు అత్యాధునికమైన విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అల్ట్రాసౌండ్‌ ద్వారా చూస్తూ.. తల్లి పొట్ట మీది నుంచి ప్రత్యేక సూదులు, వాటితో బెలూన్‌ను నేరుగా పిండం గుండెలోకి పంపి.. బెలూన్‌ను ఉబ్బించటం ద్వారా కవాటాన్ని వెడల్పు చెయ్యాలి. ప్రస్తుతం ఈ ఆపరేషన్లు 50-60% వరకూ విజయవంతమవుతున్నాయి.
* పుట్టిన తర్వాత.. 20-30 శాతం మందికి మళ్లీ బెలూన్‌తో వెడల్పు చేయాల్సి వస్తుందిగానీ అదేమంత పెద్ద విషయం కాదు. దాన్ని చాలా తేలికగా చేస్తారు.

ఒకసారి కవాటాలు వెడల్పు చేసి.. రక్తప్రవాహాన్ని సరిచేసి.. గుండె గదులు చక్కగా పెరిగేలా చూడగలిగితే వారు దాదాపు సాధారణ జీవితం గడపగలుగుతారు. కాకపోతే ఇది కొద్దిమందిలోనే సాధ్యమవుతుంది.

ముందే మూసుకునే రంధ్రం (ఎర్లీ క్లోజర్‌ ఆఫ్‌ ఫొరమినా ఒవేల్‌)
* పిండం తల్లి కడుపులో పెరుగుతున్నప్పుడు.. పిండానికి మంచి రక్తం తల్లి మాయ నుంచే వెళుతుంటుంది, పిండం చెడు రక్తాన్నీ తల్లి శరీరమే శుద్ధి చేస్తుంటుంది.ఇలా తల్లి నుంచి రక్తప్రవాహానికి వీలుగా పిండం ఎదిగేటప్పుడు, బిడ్డ పుట్టే వరకూ కూడా... పిండం గుండెలోని పైరెండు గదుల మధ్యా సహజంగానే ఒక రంధ్రం ఉంటుంది. దీన్నే 'ఫొరామినా ఒవేల్‌' అంటారు. ఇది కీలకం. పుట్టగానే బిడ్డ శ్వాస పీల్చుకుని, బిడ్డ వూపిరితిత్తులు పని చెయ్యటం ఆరంభించగానే ఇక దీని
అవసరం ఉండదు కాబట్టి ఇది 72 గంటల్లోపే పని చెయ్యటం మానేస్తుంది, 4-6 వారాల్లో పూర్తిగా మూసుకుపోతుంది. అయితే బిడ్డ పుట్టిన తర్వాత మూసుకుపోవాల్సిన ఈ రంధ్రం... కొందరిలో పిండం పొట్టలో ఉన్నప్పుడే మూసుకుపోతుంది. దీనివల్ల పిండానికి రక్తసరఫరా తగ్గిపోయి ప్రమాదకర పరిస్థితి

తలెత్తుతుంది. గుండెలోకి రక్తం వస్తూనే ఉంటుందిగానీ అది సరిగా బయటకుపోదు కాబట్టి గుండె పెద్దగా అయిపోతుంది, నీరు పడుతుంది, ఒకవైపు గుండె గదులన్నీ చిన్నగా కుచించుకుపోతుంటాయి.
* గుర్తించేదెలా.. దీన్ని కేవలం స్కానింగుల్లో మాత్రమే గుర్తించగలరు. కాబట్టి పిండం ఎదిగే క్రమంలో వైద్యులు చెప్పినట్టుగా స్కానింగులు చెయ్యటం తప్పనిసరి.
* గుర్తిస్తే.. 3-6 నెలల మధ్య మూసుకుపోతే.. తల్లి కడుపు మీది నుంచి కొన్ని ప్రత్యేక సూదులు, వాటితో పాటు బెలూన్‌ను పిండం గుండెలోని ఆ రంధ్రం వరకూ పంపి.. బెలూన్‌ ఉబ్బించటం ద్వారా దాన్ని తెరవచ్చు. ఇదొక్కటే పరిష్కారం. ఒకవేళ కాన్పుకు 2-4 వారాల ముందు ఈ సమస్యను గుర్తిస్తే.. అప్పటికే బిడ్డ చాలావరకూ ఎదిగింది కాబట్టి వెంటనే అధునాతన సౌకర్యాలున్న ఆసుపత్రిలో కాన్పు చేసి.. బిడ్డను బయట కొద్ది వారాల పాటు జాగ్రత్తగా చూసుకుంటారు.
* గుర్తించకపోతే.. తొలివారాల్లోనే మూసుకుపోతే.. ఆలస్యం అయినకొద్దీ శిశువు కడుపులోనే చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని తెరిచే చికిత్సా ప్రక్రియ చెయ్యాలి. మలివారాల్లో అయితే కాన్పు చేసెయ్యాలి. దీన్ని నిర్లక్ష్యం చెయ్యటానికి లేదు.

--డా|| కోనేటి నాగేశ్వరరావు,పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌,కేర్‌ హాస్పిటల్స్‌ హైదరాబాద్‌ . (Eenadu Sukheebhava)

  • ============================
Visit my website - > Dr.Seshagirirao.com/

House fly Spread diseases, ఈగల వల్ల వ్యాప్తి చెందే జబ్బులు


ఈగలు (Fly) ఒక చిన్న కీటకాలు.ఇది మానవ ఆవాసాలలో పెరుగుతూ ఉంటుంది. ఆహార పదార్థాలపై వాలడం ద్వారా అంటు వ్యాధులను వ్యాపిస్తాయి. నోటిలోని అవయువాలు ద్రవపదార్థ స్వాదనానికి అనుకూలంగా ఉంటాయి. లాలాజలంతో ఈగలు ఘన పదార్థాలను కూడా ద్రవపదార్థాలుగా మారుస్తాయి.

దీనికి ముళ్ళ వంటి పంకా ఉన్నందున పాలు, ఇతర పదార్థాలు ఉండే గ్లాసుల మీద కూడా వాలగలవు. దీని కాళ్ళపై సన్నని రోమాలుంటాయి. ఇవి కొంచెం తడిగా ఉండే ఆహార పదార్థాలపైనే వాలుతూనే ఉంటాయి.

ఆడ ఈగలు ఒక్కసారి వంద గుడ్లను పెడుతుంది. పన్నెండు గంటల్లోనే ఈ గ్రుడ్లు పొదగబడి కోశస్థ దశను చేరుకుంటుంది. ఈ కోశస్థను ప్యుపేరియం అంటారు. ఇది ఈగకు కవచంలా ఉంటుంది. దీని పగల గొట్టిన తర్వాతనే ఈగగా బయటకు వస్తుంది. రెండు వారాల వయస్సు నుంచే సంతానోత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాయి. ఈగలు వేసవి కాలంలో 30 రోజులు, శీతాకాలంలో కొంచెం ఎక్కువకాలం జీవిస్తాయి. చలికాలంలో ఎదిగిన ఈగలు చనిపోతాయి. కాని లార్వా, ప్యూపాలు తట్టుకుని బతికిపోతాయి.

సాధారణంగా మనందరకి తెలిసిన క్రిమి-కీటకాలలో ఇళ్ళలో కనబడే ఈగ ఒకటి. ఆరోగ్య రీత్యా ఇది చాలా అపాయకరమైనది. ముఖ్యంగా పారిశుద్ధ్యం లోపించిన చోట ప్రాణాపాయకరమైన వ్యాధులను వ్యాపింపజేస్తుందిది. ఈగ వెంట్రుకలతో కూడిన బూడిదరంగు శరీరం కలిగి ఏడు మిల్లీమీటర్ల పొడువు వుంటుంది. దీని కళ్ళు పెద్దవిగా ఎర్రగా వుంటాయి. ఇది నోటితో కరవదు కాని నోటిలో మొత్తని మెత్త వుంటుంది. ఇది ప్రత్యేక పద్ధతిలో ఆహారాన్ని గ్రహిస్తుంది. మొదట ఆహారంపై సొంగలాంటి పదార్థాన్ని వదులుతుంది. తరువాత దాన్ని నోటితో పీల్చుకుంటుంది. దీని వలన ఆహారం కలుషితం అవుతుంది. ఈగలు ప్రాణాంతకమైన అనేక సూక్ష్మ జీవులను ఆహార పదార్థాలపై వదులుతాయి. తద్వారా ఏటా అనేక లక్షల మంది ప్రపంచ మంతటా మృత్యువుపాలవుతున్నారు. ఈగలు ఖాళీగా వున్నప్పుడల్లా కాళ్ళు ఒక దానితో ఒకటి రుద్దుకుంటూ వుంటాయి. ఇలా ఎందుకు చేస్తాయంటే... నిజానికి ఈగల శరీరము, కాళ్ళు అంతా నూగులాంటి రోమాలుంటాయి. దాని నాలుకపై జిగురు పదార్థం వుంటుంది. నాలుకద్వారా జిగట పదార్థం ఆహారానికి చేరుతుంది. ఈగ ఆహారంపై వాలినప్పుడు దాని కాళ్ళకు వున్న ఆ పదార్థం అంటుకుంటుంది. దాన్ని వదిలించుకోవడానికి ఈగ తన కాళ్ళను మాటిమాటికి రుద్దుతుంది. ఈ విధంగా సూక్ష్మజీవులు మనం తినే ఆహారములో కలుస్తాయి. కలుషితమైన ఆహారాన్ని తింటే మనకు రోగాలు సంక్రమిస్తాయి.మురికి గుంటలపై, చెత్త చెదారంపై, ఆరుబయట మలమూత్రాలపై వాలుతాయి. అక్కడే నివసిస్తాయి.చెత్తచెదారంలో, మురికి గుంటలనుండి సూక్ష్మజీవులు ఈగలకు అంటుకుంటాయి. ఈగలవలన మనకు సంక్రమించే ముఖ్యమైన వ్యాధులేమిటంటే ---
  • టైఫాయిడు,
  • పారా టైఫాయిడ్ ,
  • కలరా ,
  • అమీబియాసిస్ (రక్తవిరోచనాలు),
  • అతిసారము (విరోచనములు)
  • గాస్ట్రో ఎంట్రైటిస్ ,
  • పోలియో ,
  • హెపటైటిస్ పచ్చకామెర్ల ,
మొదలైనవి.

ఆడ ఈగ ఒకసారి 100 గుడ్లు పెడుతుంది. గుడ్లు 12 నుండి 30 గంట లలో లార్వాలాగా మారతాయి. లార్వా నుండి ప్వూపాగా మారడానికి ముందు అనేక పర్యాయములు పొర వూడుతుంది. కొద్ది రోజులకు ప్యూపా ఈగగా మారుతుంది. ఈ విధంగా దీని జీవితచక్రం జరుగుతూ వుంటుంది.

  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, November 15, 2010

హిస్టీరియా , Hysteria



హిస్టీరియా : ప్రాథమిక అవగాహన--హిస్టీరియా ...మెదడు, నాడీ మండలాలకు సంబం ధించిన వ్యాధి. పురుషులలో కంటే స్త్రీలలో ఈ రుగ్మత ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీ జననేంద్రియ సముదాయం అంటే గర్భా శయంనుంచి అన్ని జననేంద్రియ భాగాలలో అంతర్గతంగా ఉండే నాడీ సంబంధ వ్యాధికారక లక్షణాలతో చాలా వరకూ ముడిపడి ఉండే విప రీత మానసిక లక్షణమిది. హిస్టీరియా పదం గ్రీకు భాషలోని హిస్టేరా అనే పదంనుంచి పుట్టింది. హిస్టేరా అంటే గర్భాశయం (యుటిరస్‌) అని అర్థం. అయితే హిస్టీరియా తప్పనిసరిగా స్త్రీ జననేంద్రియానికి సంబంధించిన రుగ్మత కానవసరం లేదు.

శరీర తత్వాన్నిబట్టి మెదడు, నాడీ మండ లంలో ఏర్పడే అధిక నిస్సత్తువల వలన కాని, మానసిక ప్రకోపాల వలన కాని, మానసిక స్థితిలో కలిగే మార్పుల వలన కాని హిస్టీరి యాతో స్త్రీలు బాధపడవచ్చు. దీనికి ఉదాహ రణగా అసలు గర్భాశయం లేకుండా జన్మించిన స్త్రీలలో కూడా ఈ వ్యాధిని గమనించడాన్ని పేర్కొనవచ్చు.

హిస్టీరియా స్థితి వివాహం కాని స్త్రీలలో, ఏ ఇతర సమయాలలో కంటే బహిష్టు సమయంలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. కాని వివాహమైన స్త్రీలలో, సుఖ సంతో షాలతో ఉన్న స్త్రీలలో, గర్భిణీలలో, పాలిచ్చే తల్లులలో, బహిష్టులు ఆగిపోయిన స్త్రీలలో కూడా హిస్టీరియా లక్షణాలు ఏర్పడటం సహజమే. కొంతమంది పురుషులు కూడా ఈ వ్యాధి బారినపడటం గమనించారు. హిస్టీరియా బారిన పడిన స్త్రీల ప్రవర్తన వింతగా ఉంటుంది. కళ్లు పెద్దవి చేయడం, అరవటం, గెంతటం మొదలై నవి చేస్తుంటారు.

కారణాలు
హిస్టీరియాకు చాలా కారణాలున్నాయి. నరాల నిస్సత్తువ, నరాలకు నాణ్యమైన రక్త ప్రసరణ లేకపోవటం హిస్టీరియాకు కారణాలు.
అలాగే నిద్రలేమి, అవమాన భారం, అధిక లైంగిక వాంఛ, నాడీ మండల అనారోగ్య స్థితి, దీర్ఘకాలంపాటు అనేక ఇతర వ్యాధులతో బాధపడటం తదితర అంశాలు హిస్టీరియాకు కారణమవుతాయి.

అలాగే మద్యపానం, అతి సుఖవంతమైన జీవన విధానం, క్షయ, గౌట్‌ వ్యాధుల వలన, ల్యుకోరియా హిస్టీరియాకు కారణమవుతాయి.పిల్లలకు చాలాకాలం తల్లిపాలు పట్టడం, ఎక్కు వమంది పిల్లలను కనడం మొదలైనవి హిస్టీరి యాకు దారి తీయవచ్చు.
అదేవిధంగా వంశపారంపర్యంగాకూడా హిస్టీ రియా సంభవించవచ్చు. సామాజికపరంగా కొన్ని గ్రూపులలో అకస్మాత్తుగా కనిపిస్తుంది. దీనిని మాస్‌ హిస్టీరియా అంటారు. ఇది ఒక విపరీత మానసిక స్థితి. చాలా వరకూ వెంటనే తగ్గిపోతుంది.

లక్షణాలు
మూర్ఛ వేరు. హిస్టీరియా వేరు. రెండింటికీ వ్యత్యాసమున్నది. ఒక్కొక్కసారి ఈ రెండూ కలిసి ఉంటాయి. హిస్టీరియా ఉద్వేగభరితమైన ఉద్రేకం వలన కలుగుతుంది. ఈ రుగ్మత మెల్లమెల్లగా, నిట్టూ ర్పులతో, ఏడ్పులు, చిత్రమైన నవ్వుతో, గొణు క్కోవడంతో ప్రారంభమవుతుంది.
తరువాత బిగ్గరగా తనలో తాను మాట్లాడు కోవడం, అరవడం, గొంతు వద్ద బంతిలాంటి వస్తువు అడ్డుపడిన భావన కలిగి ఉండటం తది తర లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు రోగికి తెలుస్తుంటాయి. ఒక్కొక్కసారి వెన్నుపాము పైనుండి కింది వరకూ నొప్పితో బాధ ఉంటుంది. నేర్పుగల వైద్యుడు రోగి అరికాలు, పాదాలు, చర్మం స్పర్శ కోల్పోయినట్లు గమనించగలడు.

జాగ్రత్తలు
హిస్టీరియా ఎటాక్‌ వచ్చినప్పుడు రోగి వేసు కున్న వస్త్రాలను వదులు చేయాలి. మంచి గాలి, వెలుతురు ఉన్న పరిసరాలలో విశ్రాంతి తీసుకో వాలి. నోటి ద్వారా, ముక్కు ద్వారా ఉఛ్వాస, నిశ్వాసాలు తగ్గించడం, మానసిక ఉల్లాసం కలి గించడం మొదలైన ఉపశమనాలు అవసరం.
హిస్టీరియాలేని సమయంలోవారికి తగిన పని పాటలలో శ్రద్ధ కల్పించాలి. సమయం వృధా కాకుండా సద్వినియోగం చేసే పనులలో ఆసక్తి కలిగించాలి. హిస్టీరియాతో బాధపడేవారు మూత్రాశయంలో మూత్రం నిండి ఉన్నా విసర్జన చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారి రెండు చేతులను అతి చల్లని నీటిలో ఉంచితే వెంటనే మూత్ర విసర్జన చేస్తారు.


  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

అల్లోపతీ , Allopathy


  • Hippocrates -- The father of Allopathic Medicine

ఎల్లోపతీ (Allopathy):దీనిని నవీన వైద్య విధానమందురు. మొట్టమొదట హోమియో వైద్యులైన డా.సామ్యూల్ హనిమాన్ ఈ పదాన్ని వాడేరు. ఈ వైద్య విధానములో ఒక వ్యక్తికి జబ్బు వలన కలిగే బాధలను అణచి వేయుటకు(To suppress)మందులను వాడేవిధానమని ఆయన ఉద్దేశము. ఇది హోమియో వైద్యవిధానానికి వ్యతిరేక ప్రక్రియ. ఉదాహరణకి జ్వరము తగ్గడానికి ఉష్ణోగ్రతను తక్కువచేసే 'పారసిటమాల్ 'ను అల్లోపతి లో వాడుతాము. ఈ పరసిటమాల్ జ్వరము ఉన్నవారిలోను , జ్వరములేనివారిలోనూ ఉస్ణోగ్రతను తగ్గిస్తుంది. హోమియో వైద్యవిధానములో అలా కాకుండా జ్వరమునకు వాడే మందు నార్మల్ వ్యక్తులలో జ్వరమును పుట్టిస్తుంది ,జ్వరముతో బాధపడేవారిలో జ్వరమును తగ్గిస్తుంది.
అల్లొపతీ వైద్య విధానములో ఒక రోగము వలన కలిగే బాధలను తగ్గించడానికి తగిన మందులివ్వడమే కాకుండా ఆ రోగము రావడానికి గల మూలకారణము వివిధ పద్దతులద్వారా కనుగొని, కారక సూక్ష్మక్రిములను తెలుసుకొని తదనుగునముగా చికిత్స చేయుదురు. నేడు ఎన్నో రకములైన లేబొరటరీ పరీక్షలు, ఎక్షురే పద్దతులు, స్కానింగ్ పరికరాలు అందుబాటులోనికి వచ్చాయి. ఈ వైద్యవిధానము లో చికిత్స చేయు వైద్యునకు సంభందిత డిగ్రీ ఉదా: MBBS, MD, MS, MCh, DM, లాంటి చదువులు అవసరము.

అల్లోపతి వైద్యం ఆవిర్భావం

మనం ఇప్పుడు అల్లోపతి వైద్యంగా చెప్పుకునే ఆధునిక వైద్యం చరిత్ర 500 సంవత్సరాలే. భారతీయ, గ్రీకు, రోమన్‌, అరబిక్‌ వైద్యాల మధ్య వందల ఏళ్లుగా జరిగిన సమ్మేళనం ఫలితంగా, పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో యూరోపులో తొలి ఆధునిక వైద్యం ఆవిర్భవించింది. ఆయుర్వేదం, సిద్ధవైద్యం మన ప్రాచీన వైద్యాలు. ఆత్రేయ (క్రీస్తు పూర్వం 800 సంవత్సరాలు), శుశ్రుతుడు, చరకుడు ( క్రీస్తు శకం 200 సంవత్సరాలు) మనకు తెలిసిన తొలినాటి గొప్ప వైద్యులు. చరకుడు 500 మందుల గురించి ఆనాడే రాశాడు. నాటి భారతీయ వైద్యులు సర్పగంధి అనే మొక్కను మందుగా వాడేవారు. రక్తపోటుకు వాడే 'రిసర్ఫిన్‌' అనే అలోపతి మందును ఈ మొక్కనుండే కనుగొన్నారు. దీన్ని రక్తపోటుకు వాడతారు. చరక సంహిత, సుశ్రుతసంహిత అనే గ్రంథాలను క్రీస్తు శకం 800 సంవత్సరంలో పర్షియన్‌, అరబిక్‌ భాషలలోకి అనువదించారు. ఇటువంటి విభిన్న వైద్య వ్యవస్థలలో జరిగిన కృషికి కొనసాగింపుగానే అలోపతి వైద్యం ఆవిర్భవించింది. అలోపతి వైద్యానికి యూరోపియన్‌ పారిశ్ర్రామిక విప్లవకాలపు ప్రోత్సాహం పెద్ద ఎత్తున లభించింది. అదేకాలంలో మన దేశంలో పాలకుల మద్దతు లేకపోవడంతో ఆయుర్వేదం క్రమేణా దెబ్బతిన్నది.


  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

రేకి వైద్య విధానం,Reiki Medical treatment


  • రేకి వైద్య విధానం,Reiki - మందు అవసము లేని వైద్యం

ఎటువంటి మందుల్లేకుండా చేతుల ద్వారా ఈ వైద్యంలో వ్యాధులను నయంచేయడం విశేషం. ఈ వైద్యంలో ఉన్న మరో విశేషమేమంటే రేకి గ్రాండ్‌ మాస్టర్‌ను ఒకసారి వ్యాధిగ్రస్థుడు కలిస్తే అనంతరం అతను కలవకపోయినా ఈ వైద్యంలో చికిత్సలు నిర్వహించడం గమనార్హం. జపాన్‌ దేశంలో ప్రారంభమైన వైద్యం రేకి. రేకి అంటే యూనివర్సల్‌ లైఫ్‌ఫోర్స్‌ ఎనర్జీ. దీన్ని కాస్మిక్‌ ఎనర్జీ, సైకిక్‌ ఎనర్జీ అని కూడా అంటారు. ఆ దేశంలో అనాదిగా ఈ వైద్యం ఉన్నప్పటికీ బయట ప్రపంచానికి మొదట తెలియజేసింది మాత్రం 1800 సంవత్సరంలో రేకి గ్రాండ్‌ మాస్టర్‌ మికావొ హుసువి. అనంతరం డాక్టర్‌ ఉసూయి దీన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. ఈ వైద్యంలో చికిత్సలను మనిషి శరీరంలోని వివిధ చక్రాల ద్వారా నిర్వహిస్తారు.

తల నుంచి మొదలుకొని కింద వరకు ఉండే ఈ పాయింట్స్‌ సహస్రారా, ఆజ్ఞ, విశుద్ధ్ద, అనహత, మణిపురా, స్పాదిష్టాన, మూలా ధారలు. ఈ చక్రాల అలైన్‌మెంట్‌ శరీరంలో సరిగా ఉండే మనిషి శారీరకంగా, మానసికంగా పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉంటాడని హోలిస్టిక్‌ హీలింగ్‌ సెంటర్‌ రేకి గ్రాండ్‌ మాస్టర్‌ డాక్టర్‌ మీనాక్షి తెలిపారు. మనిషిలోని సూక్ష్మ శరీర, స్థూల శరీరాలకు సోకే వ్యాధులను ఈ వైద్యం నయం చేస్తుందని ఆమె తెలిపారు.

మందులు లేకుండా నిర్వహించే ఈ వైద్యంలో ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. రేకి వైద్యాన్ని మనుషులతో జంతువులు, మొక్కలకు సైతం నిర్వహించడం విశేషం.




  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

ఆక్యుప్రెషర్‌ చికిత్స, Acupressure,రిప్లెక్సాలజీ చికిత్స , మర్ధన చికిత్స


  • ఆక్యుప్రెషర్‌ చికిత్స, Acupressure - మందు అవసము లేని వైద్యం :
ఎటువంటి మందుల్లేకుండా నిర్వహించే వైద్యవిధానాలు ఇటీవల కాలంలో మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఇటువంటి వాటిలో ఆక్యుప్రెషర్‌, రేకీలు నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ప్రత్యామ్నాయ వైద్యము లో రిఫ్లెక్సాలజీ అనేది ఒక ప్రాచీన రూపము . ఆక్యుప్రజర్ , ఆయుర్వేదిక్ మసాజ్  ల మాదిరిగా పోలిఉండే రిప్లెక్షాలజీ ని కొందరు  పిలిచే ఆక్యుప్రెషర్‌ చికిత్స.. క్రీ.పూ. 5000 సంవత్సరాల కాలంలో మన దేశంలోనే ప్రారంభం కావడం విశేషం. ఆ కాలంలో రుషులు, మహామునులు ఈ వైద్యం ద్వారా రోగాలను నయం చేసినట్టు చారిత్రక ఆధారాలు కూడా ఉండడం విశేషం.

అరిచేతులు, అరికాళ్లలో శరీరంలోని వివిధ అవయవాలకు సంబంధించినటువంటి పాయింట్స్‌ ఉంటాయి. వీటిని యాక్టివేట్‌ చేయడం ద్వారారిప్లెక్షాలజీ లో చికిత్సలను నిర్వహిస్తారు. నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పులకు సంబంధించిన సమస్యలు ఈ వైద్యంతో పూర్తిగా నయమవుతాయని ఆక్యుప్రెషర్‌ /రిప్లెక్షాలజీ థెరపిస్ట్‌లు డాక్టర్‌ కె.నారాయణ, డాక్టర్‌ శ్రీనివాస్‌లు తెలిపారు. ఇవేగాకుండా ఐటి ఉద్యోగులకు స్పాండిలైటిస్‌ (మెడ, భుజాల నొప్పులు), నడుము నొప్పి, నిద్ర ఉండకపోవడం వంటి వాటిని ఈ చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ఉదా: ఆక్యుప్రెజర్/రిప్లెక్షాలజీ  పద్ధతితో ఒక బొటనవేలును మరో బొటనవేలుతో నెమ్మదిగా ఒత్తటంవల్ల మెదడు ఉత్తేజితమై ఏకాగ్రత పెరుగుతుంది. ఎక్కువసేపు చదువుకునేవాళ్లు మధ్యమధ్యలో ఇలా చేయటం మంచిది.

ఆక్యుప్రెషర్‌/రిప్లెక్షాలజీ  ద్వారా గుండెజబ్బులు, ఆస్తమా, కిడ్నీ దెబ్బతినడం వంటి వ్యాధులకు చికిత్సలతో పాటు ఆడవారికి సంబంధించిన గైనిక్‌ సమస్యలను సైతం నయం చేయవచ్చు. నేడు ఈ వైద్య విధానం చైనా, జపాన్‌, థాయిలాండ్‌ తదితర దేశాల్లో విశేష ప్రాచర్యాన్ని పొందింది.

  • Some more details about accupressure/replexology Treatment(in Telugu),

మన శరీరంలోని ప్రతి అవయవమూ కండరాలు, నాడీ వ్యవస్థలతో పనిచేస్తుందనే సంగతి విదితమే. ఒక్కో శరీర భాగానికి సంబంధించి ఒక్కోచోట నాడులు కేంద్రీకృతమై వుంటాయి. వాటిపై ఒత్తిడి కలిగించి ప్రేరణ కలిగించి నట్లయితే ఆయా భాగాల్లో ఏర్పడిన లోపాలు సవరించబడి సక్రమంగా పనిచేస్తాయి. ఈ సనూత్రం ఆధారంగా కనిపెట్టిన చికిత్సావిధానమే రిఫ్లెక్సాలజీ.

శారీరకంగా అలసిపోతున్నారా? మానసికంగా ఆందోళన చెందుతున్నారా? రక్తపోటు, తలనొప్పి లాంటి రుగ్మతలు పీడిస్తున్నాయా? టెన్షన్‌కు గురవుతున్నారా? జ్ఞాపకశక్తి తగ్గిపోతోందా? ఇవన్నీ చిరాకుపెట్టే అంశాలే. బాధించే లక్షణాలే. స్థిమితం లేకుండా చేసి అనుక్షణం వేధించే భూతాలే. కానీ, ఇకపై ఇలాంటి సివ్టుమ్స్‌కు ఎంతమాత్రం చింతించాల్సిన అవసరం లేదు. వీటిని తరిమికొట్టే రిఫ్లెక్సాలజీ చికిత్స అమెరికా, బ్రిటన్‌ లాంటి అనేక దేశాల్లో ఎందరో చేయించుకుంటున్నారు. సత్వర ఫలితం కనిపించడంతో అనేకమంది ఈ రకమైన చికిత్స చేయించుకునేం దుకు ముందుకొస్తున్నారు. త్వరలో మనదేశంలోనూ అమలుచేసే అవకాశాలు ఉన్నాయి. ఇంతకీ రిఫ్లెక్సాలజీ చికిత్స ఎలా చేస్తారో, దానివల్ల ఎంతటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

పోటీ ప్రపంచంలో రోజురోజుకీ వత్తిడి పెరుగు తోంది. ఆందోళన కారణంగా నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గడం, ఇతరత్రా అనేక శారీరక, మానసిక జబ్బులు వస్తున్నాయి. ఇది నానాటికీ విస్తరిస్తోంది. ఎందరో ఈ రకమైన లక్షణాలతో ఇబ్బంది పడ్తున్నారు. చదువు, ఉద్యోగాల వేటలో ఉరుకులు, పరుగులు.. కెరీర్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా మరింత వత్తిడి. ఇల్లు, పెళ్ళి లాంటి అంశాల్లో మరో రకమైన అలసట. వెరసి జీవితమే ఒక పరుగు పందెం. ఒక రేస్‌ తర్వాత మరో రేస్‌. నిరంతరం గెలుపు దిశగా పరుగులెత్తడం. వత్తిడితో కూడిన విజయాలు, విషాదంతో కూడిన పరాజయాలు. ఈ మితిమీరిన వత్తిడి మానసిక ఆందోళనకు కారణమౌతోంది. అందుకే పెరిగిన పోటీలాగే జబ్బులూ పెరిగాయి. దాంతో ముఖంలో కాంతి పోవడం, కంటి కింద నల్లటి వలయాలు, కళ్ళలో కాంతి కరువవడం లాంటివి పైకి కనిపించే లక్షణాలు. కాగా, గుండె దడదడలాడటం, ఆకలి మందగించడం, నిద్రలేమి, అంతూఅదుపూ లేని ఆలోచనలు, అస్థిమితం, ఆందోళన లాంటివి ఇబ్బంది పెట్టే కొన్ని లక్షణాలు ‌.

  • రిఫ్లెక్సాలజీ చికిత్స ఎలా చేస్తారంటే..
ఇదొకరకమైన మసాజ్‌ లాంటిది. పాదాలు, చేతులు లాంటి శరీర భాగాలను.. మర్దనతో పాటు ఆక్యుపంచర్‌ను జతకలుపుతారు. వేళ్ళతో నొక్కడంవల్ల రక్తప్రసరణ, నాడీ వ్యవస్థలను పునరుద్ధరిస్తారు. లేనిపక్షంలో శరీరంలోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో కణాలు గూడుకట్టుకుని చిన్ని చిన్ని గింజల్లా లేదా కణుపుల్లా తయారౌతాయి. రిఫ్లెక్సాలజీ ప్రక్రియ ద్వారా అలాంటి భాగాలను బాగా మర్దన చేసి తొలగించగల్గుతారు. దాంతో మెదడులోని కండరాలు శక్తివంతంగా పనిచేస్తాయి. ఆక్యుప్రెషర్‌ సాయంతో ఆక్యుపంచర్‌ కేంద్రాలను ప్రేరేపించినట్లవు తుంది. మొద్దబారిన భాగాలు తిరిగి చురుగ్గా పనిచేస్తాయి. శరీరము, మెదడు కూడా ఉపశమనం పొంది సక్రమంగా పనిచేస్తాయి. ముఖ్యంగా కాస్మొటాలజీ లొ ముఖాన్ని మునివేళ్ళతో నొక్కుతూ కండరాలను ప్రేరేపిస్తారు. ఫేషియల్‌ రిఫ్లెక్సాలజీ మరింత ప్రయోజనకరంగా వుంది.

రిఫ్లెక్సాలజీ చికిత్సకు క్రీములు, లోషన్లు లాంటి ఏ మందులతో పనిలేదు. కానీ, దివ్య ఔషధంలా పనిచేస్తుంది. పాదాలు, చేతులు, చెవులు, బొటలవేలు, ఇతర వేళ్ళపై ఆక్యుప్రెషర్‌ను పంపుతారు. అవసరమైన భాగాల్లో మునివేళ్ళతో చక్కగా మర్దన చేస్తారు. దీనికి నూనెలు కానీ ఏ రకమైన ద్రవాలు కానీ ఉపయోగించనక్కర్లేదు. ఒక సంవత్సరకాలంగా ఈ చికిత్స విస్తృత ఆదరణ పొందింది. కొన్ని కొన్ని మెడిసిన్లవల్ల జబ్బులు నయమైనప్పటికీ చాలాసార్లు వెంటనే రియాక్షన్‌ రావడం లేదా దీర్ఘకాలంలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వుండటం చూస్తుం టాం. కానీ, రిఫ్లెక్సాలజీవల్ల అలాంటి కష్టనష్టాలేమీ వాటిల్లే అవకాశం లేదు. ఇది బిగుసు కున్న కండరాలను సహజస్థితికి తెస్తుంది. రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేసి, నాడీవ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది. టెన్షన్ను తగ్గిస్తుంది. ఏ రకమైన మెడిసిన్లు వాడకుండానే సహజసిద్ధంగా పనిచేసి శరీరం చురుగ్గా పనిచేసేట్లు ప్రేరేపిస్తుంది.

  • నియమ-నిబంధనలు :
రిఫ్లెక్సాలజీకి సంబంధించి నియ మాలు, నిబంధనలు అంటూ ఏమీ లేవు. మన శరీరంలోని ప్రతి అవయవమూ కండరాలు, నాడీ వ్యవస్థలతో పనిచేస్తుందనే సంగతి విదితమే. ఒక్కో శరీర భాగానికి సంబంధించి ఒక్కోచోట నాడులు కేంద్రీకృతమై వుంటాయి. వాటిపై ఒత్తిడి కలిగించి ప్రేరణ కలిగించి నట్లయితే ఆయా భాగాల్లో ఏర్పడిన లోపాలు సవరించబడి సక్రమంగా పనిచేస్తాయి. ఈ సనూత్రం ఆధారంగా కనిపెట్టిన చికిత్సావిధానమే రిఫ్లెక్సాలజీ. దీని వల్ల ప్రధానంగా శారీరక అలసట, మానసిక ఆందోళన తగ్గుతాయి. క్షీణించిన జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. ఇన్‌సోమ్నియాతో బాధపడ్తున్నవారు ఇకపై హాయిగా, ఆనందంగా నిద్రపోగల్గుతారు. మల్టిపుల్‌ స్లెరోసిస్‌ పేషెంట్లకు కూడా ఈ చికిత్స వల్ల ఎంతో మేలు జరుగుతోంది. మూత్రపిండ సంబంధమైన వ్యాధులు సైతం నయమౌతు న్నాయి.

మన శరీరం పది సమానమైన భాగాలుగా విభజించబడ్తుంది. కుడివైపు ఐదు, ఎడంవైపు ఐదు భాగాలుంటాయి. మూడు ట్రాన్స్‌వర్స్‌ లైన్లుంటాయి. భుజం వద్ద ఒకటి, నడుంవద్ద ఒకటి, కింది భాగంలో ఒకటి వుంటాయి. వీటిపై అవసరమైనంత ప్రెషర్‌ను కలుగజేసి శరీర భాగాలు సక్రమంగా పనిచేసేలా చూస్తారు. ఎందరెందరికో ఈ చికిత్స ఉపశమనం కలిగించడంవల్ల పెద్ద పెద్ద డాక్టర్లు కూడా రిఫ్లెక్సాలజీగురించి ఆలోచిస్తున్నారు.

శరీరంలో అక్కడక్కడా బ్లాకేజ్‌లు కనిపించడం సాధారణం. పైపైన చూస్తే ఇలాంటివి స్పష్టంగా కనిపించవు. రిఫ్లెక్సాలజీ చికిత్సలో మునివేళ్ళతో జాగ్రత్తగా, అవసరమైనంత వత్తిడి కలుగజేస్తూ మర్దన చేసినప్పుడు వేళ్ళకు ఈ బ్లాకేజ్‌లు తెలిసొస్తాయి. వాటిని నిర్మూలించి నొప్పి, వత్తిడి తగ్గేలా చేస్తారు. శరీరంలో విడుదలయ్యే ఎండార్ఫిన్స్‌ లాంటి రసాయనాల వల్ల కూడా వత్తిడి, ఆందోళన పెరుగుతాయి. వీటన్నిటినీ బ్యాలెన్స్‌ చేయడంలో రిఫ్లెక్సాలజీ ఉపయోగపడ్తుంది. ఇదేదో ''తూతూ మంత్రం, తుమ్మాకు మంత్రం'' బాపతు కాదు. శాస్త్రీయంగా అత్యంత శక్తివంతమైన ఔషధాయుధం అని తేలింది.

ప్రస్తుతం రిఫ్లెక్సాలజీ చికిత్స ఆసియా, యూరప్‌, ఆఫ్రికా, ఉత్తరమెరికా దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఇంగ్లండులో ఈ చికిత్స ఎక్కువగా జరుగుతున్నప్పటికీ, ఇది మొట్టమొదట చైనాలో మొదలైందని చెప్పాలి. దాదాపు 5 వేల సంవత్సరాల క్రితమే చైనాలో ఈ పద్ధతిని ప్రాక్టీస్‌ చేశారు. ఇక ఉత్తరమెరికాలోనూ దీనికి బాగా ఆదరణ వుంది. జపాన్‌దేశంలో దీన్ని జొకు షిన్‌ డొ అని పిలుస్తారు. జపాన్‌లో ఎక్కువగా కాలి పాదాన్ని రకరకాలుగా మసాజ్‌ చేసే టెక్నిక్‌ అమల్లో వుంది.

ఈ ప్రాచీన జొకు షిన్‌ డొ పద్ధతి అనంతర కాలంలో అనేక మార్పుచేర్పులను సంతరించుకుంది. చైనాలో చేతివేళ్ళపై సూదులతో ఆక్యుప్రెషర్‌ కలిగించడం ద్వారా ఆక్యుపంచర్‌ చేసే పద్ధతి ప్రపంచవ్యాప్తంగా జనాదరణ పొందింది. తలనొప్పి, సైనోసైటిస్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను సైతం ఆక్యుపంచర్‌ద్వారా తగ్గించడం సాధారణం. ఈ చైనా ఆక్యుపంచర్‌ సూత్రమే ఇవాళ్టి ఆధునిక రిఫ్లెక్సాలజీ చికిత్సకు మూలం.

ఈజిప్టు దేశస్తులు కూడా అతి పూర్వకాలంలోనే పాదాలను నొక్కి వత్తిడి కలిగిస్తూ చికిత్స చేసేవారు. అయితే వీళ్ళు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ప్రాక్టీస్‌ చేసినందువల్ల ఈ రకమైన చికిత్సకు సరైన పద్ధతి, ప్రణాళిక లేకపోయాయి.

ప్రస్తుతం అమల్లో ఉన్న రిఫ్లెక్సాలజీ చికిత్సను 1913లో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ఈ.ఎన్‌.టి. స్పెషలిస్టులు (చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్టులు) డాక్టర్‌ విలియం హెచ్‌. ఫిజరాల్డ్‌, డాక్టర్‌ ఎడ్విన్‌ బోవర్స్‌ పరిచయం చేశారు. ''ఇలా శరీర భాగాలపై వత్తిడి కలిగించడంవల్ల ఇతర భాగాల్లో ఒకలాంటి మత్తు ఆవరిస్తుంది'' అన్నారు ఫిజరాల్డ్‌. అమెరికాలోని రిఫ్లెక్సాలజిస్టులు, ఆధునిక పద్ధతులను ఇంప్లిమెంట్‌ చేస్తూనే, ఇంగమ్స్‌ థియరీలను మొదట క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు.

రిఫ్లెక్సాలజీ దివ్య ఔషధంలా పనిచేస్తున్న మాట వాస్తవమే. అయితే శాస్త్రీయంగా అధ్యయనం చేసి, అందులో తర్ఫీదు పొందినవారి వద్ద చికిత్స చేయించుకుంటేనే తగిన ప్రయోజనం వుంటుందని గుర్తించాలి. చవకగా ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారనో లేక అందుబాటులో ఉన్నారనో, ఒక ప్రయోగం చేసిచూద్దామనో ఎవరో ఒకరి దగ్గర చికిత్స చేయించుకుంటే ఆశించిన మేలు జరక్కపోవచ్చు. ఒక్కోసారి రోగం ముదిరి, మరింత ప్రమాదకరంగా మారే అవకాశమూ వుంది. కనుక తస్మాత్‌ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

రిఫ్లెక్సాలజీ చికిత్సలో ఫేషియల్‌ రిఫ్లెక్సాలజీ మరింత చెప్పుకోదగ్గది. దీనివల్ల త్వరిత ప్రయోజనం కనిపిస్తోంది. ఈ చికిత్సలో గొప్ప ప్రయోజనం పొందిన కొన్ని కేసుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

పశ్చిమ యోర్క్‌షైర్‌లో బెలిండా ఒక మహిళ 18 సంవత్సరాలుగా డిప్రెషన్‌తో బాధపడ్తోంది. మధ్యమధ్యలో కొంత తగ్గినప్పటికీ ఇన్నేళ్ళుగా ఆమె దాన్నుండి పూర్తిగా బయటపడలేదు. మొదటిసారి డెలివరీ సమయంలో ఆమెకి డిప్రెషన్‌ వచ్చింది. ఒక్కసారిగా జీవనశైలి మారిపోవడంతో అలా జరిగింది. అనేకసార్లు తీవ్ర అలజడికి గురవడము, రాత్రులు నిద్రపట్టకపోవడము, ఉదయం వేళల్లో విపరీమైన ఆందోళనకు గురవడము, మధ్యాహ్నం వరకూ ఏడవడము, అజీర్తి, గాస్ట్రిక్‌ ట్రబులు లాంటి లక్షణాలతో ఆమె శారీరకంగా, మానసికంగా బాధపడింది. మొత్తానికి రిఫ్లెక్సాలజీ గురించి తెలుసుకుని ఆ సెంటరుకు వెళ్ళి అన్ని విషయాలూ విడమర్చి చెప్పింది. వారానికి ఒకసారి చొప్పున 5 సిట్టింగులు పూర్తయ్యేసరికి ఆమెలో నిద్రలేమి అంతరించి హాయిగా నిద్రపోసాగింది. అజీర్తి కూడా పూర్తిగా తగ్గిపోయింది. మరి కొన్ని వారాల చికిత్స తర్వాత ఆందోళన కూడా తగ్గింది. ఆమె ఇప్పుడు పూర్తి నార్మల్‌ స్థితికి వచ్చి చక్కగా ఉద్యోగం చేసకుంటూ పిల్లలతో ఆనందంగా జీవించగల్గుతోంది.

మరో వ్యక్తి ఒకరకమైన ఎలర్జీతో బాధపడ్తున్నాడు. అదెంత తీవ్రంగా వుండేదంటే అతనికి జలుబు చేసి, ఏ మందులు వాడినా ఆర్నెల్లపాటు తగ్గలేదట. రోజురోజుకీ ఉత్సాహం తగ్గిపోసాగింది. శరీరం, మనసు కూడా నిద్రాణంగా తయారయ్యాయి. శారీరకంగా, మానసికంగా నరకయాతన అనుభవించాడు. డాక్టర్లు పెయిన్‌ కిల్లర్లే శరణ్యమని చెప్పి స్ట్రాంగ్‌ డోసులు ఇవ్వసాగారు. ఆ దశలో అతనికి రిఫ్లెక్సాలజీ గురించి తెలిసి చికిత్సకోసం వెళ్ళాడు. ఐదు వారాల్లో అతనిలో గొప్ప మార్పు కనిపించింది. నాసికా రంధ్రాలు పూర్తిగా తెరుచుకున్నాయి. ఊపిరాడకపోవడం, జలుబు తగ్గాయి. నొప్పికి మాత్రలు వేసుకోవడం మానేశాడు. ఇప్పుడతను ఎంతో ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. ఈ చికిత్స గురించి మాట్లాడ్తూ ''రిఫ్లెక్సాలజీ నిజంగా అద్భుతమైన ట్రీట్‌మెంట్‌. నొప్పి, మానసిక ఆందోళన కూడా తగ్గిపోయాయి. ఇది క్షణాల్లో లేదా రోజుల్లో తగ్గదు. వ్యాధి తీవ్రతను బట్టి కొన్ని నెలలు చేయించుకోవాల్సి వుంటుంది. నాది దీర్ఘకాలిక వ్యాధి కనుక నేను ఇప్పటికీ రిఫ్లెక్సాలజీ చేయించుకుంటున్నాను, ఇంకా కొంతకాలం చేయించుకుంటాను.. ఇది ఎంత ప్రయోజనకరమైందని రుజువైంది'' అంటూ ఆనందంగా చెప్పుకొచ్చాడు.

ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలు మాత్రమే. వందలాదిమంది రిఫ్లెక్సాలజీ చికిత్సతో లాభం పొందుతున్నారు. త్వరలో మనదేశంలోనూ రిఫ్లెక్సాలజీ సెంటర్లు వస్తాయి. అందాకా ఓపికపడదాం.
పై ఫొటోలో చూపించినట్టు రోజూ 5-10 సార్లు అరచేయి మధ్యలో నొక్కడం వలన మూత్రపిండాల సమస్య నుండి బయటపడవచ్హు. మూత్రపిండాల సమస్య లేనివారు కూడా ఈవిధంగా చేయవచ్హు. కాని మరీ ఎక్కువగా చేయడం కూడా సమస్యే. ప్రయత్నించి లాభించండి

మూలము : Harison Text book of medicine , Text book of alternative medical therapy. Text book for students of Acupuncture treatment.



  • =======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Saturday, November 13, 2010

దోమల చక్రం తో ముప్పు , Mosquito coil Side Effects



దోమ కాటు నుండి తప్పించుకునేందుకు వినియోగింఛే దోమల చక్రాలు , ఇతర రసాయనాలు , మనుషుల ఆరోగ్యము పై తీవ్ర ప్రభావము చూపిస్తాయి . చిన్న పిల్లల విషయము లో అయితే మరీను . రోజూ వీటిని వాడడం వలన ముఖ్యముగా పసికందుల నుంది 5 ఏళ్ళ పిల్లలు శ్వాసకోస ఇబ్బందులకు గురివనుతారు . ఇవి లేకుంటే దోమ కాటుకు గురై అనేక వ్యాధులతో పాటు ప్రశాంతం గా నిద్రపోలేని పరిస్థితికి లోనవుతారు . అమందువలన శ్వాసకోస వ్యాదులు , ఉబ్బసము ఉన్న వారు తప్ప మిగతావారంతా వీటిని నిత్యావసర వస్తువుగా వినియోగిస్తునారు . కొంతమందికి గొంతునొప్పి , కళ్ళమంటలు , ఊపిరి తీసుకోవడం లో ఇబ్బదులకు లోనవుతున్నారు .

శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 27 లక్షల జనాబా ఉన్నారు . ఏటా 50 వేల మంది పిల్లలు జన్మిస్తున్నారు . జిల్లాలో 5 ఏళ్ళు లోపు పిల్లలు సుమారు 3 లక్షల మంది ఉన్నారు . ఇంతమంది కి ప్రభుత్వము అన్ని నివారణ చర్యలు తీసుకోలేదు . ఎవరి బాధ్యత వారికి ఉండాలి .
ఇంట్లో చిన్నపిల్లలు లేనిచో ఎటువంటి దోమ నివారణ రసాయనాలు వాడినా పరవాలేదు . దోమకాటువల్ల వచ్చే జబ్బులతో పోల్చితే ఈ పొగవలన వచ్చే శ్వాస ఇబ్బందులు ఈజీ గా తట్టుకోవచ్చును .
ప్రత్యామ్నాయ మార్గాలు :
  • దోమలు లేకుండా నివారణమార్గాలు చేపట్టడం ,
  • దోమతెరలను వాడడం ,
  • చిన్నారులకు గొడుగు లాంటి చిన్న దోమతెరలు వాడాలి,
  • ఇంటి కిటికీలకు , తలుపులకు దోమలు రాకుండా మెస్ లను వాడడం ,
  • సాయంత్రం 5 గంటలు తరువాత ఇళ్ళ కిటికీలు , తలుపులు మూసే ఉంచాలి .
  • కటుకరోహిణి , పసుపు , సాంబ్రాణి , ఎండిన వేపాకులు కలిపి పొడిచేసి ఇంట్లో సాయంత్రం 5 గంటల సమయమ్లో పొగవేస్తే దోమలు రావు .

  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

మనిషి-వత్తిడి , Stress and Strain in Human life



మనిషి సంఘజీవి. తన చుట్టూ వున్న వారిని అనుకరిస్తుంటాడు, తనకంటే మెరుగనుకున్న వాటిని అలవర్చుకుంటాడు. ఈ క్రమంలో ఎన్నో శారీరక , మానషిక వత్తిడులకు లోనవుతూ ఉండాడు . ఒత్తిడిని భౌతికశాస్త్రము నుండి అరువు తెచ్చుకున్నాము ... ఒత్తిడి అంటే " ప్రెజర్ (pressure)" అన్నమాట . ప్రతిరోజూ మనము సంతోషముగా ఉండదల్చుకున్నామో , విషాదముగా ఉండదల్చుకున్నామో , ఒత్తిడితో ఉండదల్చుకున్నామో , విశ్రాంతిగా ఉండదల్చుకున్నామో మనమే ఎంపికచేసుకోవచ్చును . తాను చేసేపనిని ఎంజాయ్ చేయగలిగినంతకాలము ఒక వ్యక్తి ఎన్ని గంటలైనా పనిచేయవచ్చు ... లేదంటే అది వత్తిడికి దారి తీస్తుంది .
ఒత్తిడి

చేదు జ్ఞాపకాలు గుర్తుంచుకోకూడదు. ఒంటరిగా ఉండకుండా నలుగురితో మాట్లాడుతూ ఉండాలి. కుటుంబంతో, స్నేహితులతో, కుటుంబ డాక్టర్‌ లేదా మానసిక ఆరోగ్య నిపుణులను కలుస్తుండాలి. వ్యాయామం, యోగా, ధ్యానం, మసాజ్‌ వంటివి చేయాలి. పాజిటివ్‌ ఆలోచనలు చేయాలి. ఆసక్తి ఉన్న కార్యకలాపాల్లో నిమగ్నమవ్వాలి. ఖాళీ మెదడు దెయ్యాల కొంప అన్న సంగతి మర్చిపోకూడదు. సాధించిన లక్ష్యాలు గుర్తుచేసుకోవాలి. ప్రతి ఒక్కరినీ ప్రేమించడం వంటి లక్షణాలను అలవర్చుకోవాలి.
ఇది సాంకేతిక పరిజ్ఞానమే కాదు ఆధునికత కూడా. కొత్త సహస్రాబ్దిలో మానసిక ఆరోగ్య రుగ్మతలు పట్టిపీడిస్తున్నాయి. జీవితం అత్యంత వేగంగా మారింది. కనీస జీవ అవసరాలైన నిద్ర, ఆహారానికి సైతం సమయాన్ని వెచ్చించలేకపోతున్నాం. ప్రస్తుతం అనేకమంది ఆయా వృత్తుల్లో నిమగ్నమై 6 నుంచి 8 గంటలు సైతం నిద్రలేకపోతున్నారు. పదినిమిషాలైనా ప్రశాంతంగా కూర్చుని భోనం చేయలేకపోతున్నారు. ఇది మార్పు అవుతుందా? అనుసరణీయం కానీ...ఈ సంస్కృతిల ప్రపంచం మారిపోతుందా? ఒకవేళ అవును అయితే మానసిక వైకల్య పరిణామాల వ…ల్ల వచ్చే తరాలు `శారీరక దారుఢ్య మనుగడ' రేసులో పాల్గొనాల్సి ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా 2020 సంవత్సరానికి 15 శాతం మంది న్యూరోసైకియాట్రిక్‌ సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ఆత్మన్యూన్యత, ఆందోళన కేసులు దశాబ్దంలో ఎక్కువగానే వెలుగుచూస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాది రాషా్టల్ల్రో వైరుధ్య ఆలోచనలు పోటీపడుతున్నాయి. దీనివల్ల సాంప్రదాయానికి, ఆధునికతకు పోటీ అనివార్యమైంది. ఇది నిరుత్సాహపరిచే అనుభవం. నా రోగుల్లో చాలా మంది 25-35 ఏళ్ల లోపు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. ఆందోళన సంబంధిత రుగ్మతలతో వస్తుంటారు. ఒబెసివ్‌ కంపల్సివ్‌ డిజాస్టర్‌ (ఒఎస్‌డి), సోషల్‌ ఫోబియా వంటి రుగ్మతలు ఎక్కువగా వస్తున్నాయి.
ఆందోళన మనిషికి సంబంధించిన భావోద్వేగం అని చెప్పొచ్చు. దాదాపు సగం మంది బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడటానికి జంకుతారు. 30 శాతం రోగులు ఆందోళన లక్షణాలు కనిపిస్తే 15-20 శాతం మంది ఔట్‌ పేషెంట్లు ఆందోళనకు సంబంధించిన రుగ్మతలతో బాధపడుతున్నారు. జీవితాంతం ఆందోళనకు సంబంధించిన రుగ్మతలతో 15 శాతం మంది బాధపడుతున్నారు.
మరో ఆసక్తికరమైన విషయమేమంటే మగవాళ్లలో ఆందోళనకు సంబంధించిన రుగ్మతలు అధికంగా ఉన్నట్లు పరిశీలనలో వెల్లడైంది. మహిళలు ఆత్మనూన్యత, ఆందోళన రెండూ కలిపి బాధపడుతున్నారు. కౌమారదశలో వస్తున్నప్పుడు ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. దాదాపు 10 శాతం పిల్లలు ఆందోళన, ఆత్మనూన్యతతో బాధపడుతున్నారు.
ప్రస్తుతం టీన్‌స్ట్రెస్‌ను సాక్షిభూతంగా నిలిచింది. చదువులు, భారీ అంచనాలు, క్రీడలు, మ్యూజిక్‌ తదితర రంగాల్లో పోటీవల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. తల్లిదండ్రులు, సామాజిక ఒత్తిడి వల్ల వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రజలు ఆర్థిక పురోగతి, పెద్ద ఇల్లు కావాలని కలలు కంటున్నారు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఒత్తిడికి గురవుతున్నారు.

యువత టివి, మీడియా ద్వారా వెలిగిపోవాలని చూస్తున్నారు. జీవితంలో రాణించడానికి చూడ్డానికి అందంగా కనబడాలి. పాపులారిటీ రావాలని నమ్మే రోజులివి. ఒకవేళ ఈ కలలు నెరవేరకపోతే ఆందోళన, ఆత్మనూన్యత వారివెంటే ఉంటుంది. పిల్లలు స్వేచ్ఛగా ఆడుకోవడం, సొంతంగా ఎదిగే వాతావరణం కనిపించడం లేదు. దీనికి మంచి పరిష్కారం ఉంది. సుఖనిద్ర, మంచి ఆహారం తీసుకోవడం వల్ల మానసిక సమస్యలను ఎదుర్కోవచ్చు. ఒత్తిడి ఎక్కువగా ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తల్లో రావడానికి అవకాశం ఉంది. వారిపిల్లలను జాగ్రత్తగా చూసుకునే పనిలో ఒత్తిడి మీటర్‌ కాస్తా పెరుగుతుంది. ఆత్మహత్యలు, స్థూలకాయం, దాంపత్య రుగ్మతలు, ప్రమాదాలు, విడాకులు ఒత్తిడికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
  • ఒత్తిడికి దూరంగా ఉండేందుకు సూచనలు:
చేదు జ్ఞాపకాలు గుర్తుంచుకోకూడదు. ఒంటరిగా ఉండకుండా నలుగురితో మాట్లాడుతూ ఉండాలి. కుటుంబంతో, స్నేహితులతో, కుటుంబ డాక్టర్‌ లేదా మానసిక ఆరోగ్య నిపుణులను కలుస్తుండాలి. వ్యాయామం, యోగా, ధ్యానం, మసాజ్‌ వంటివి చేయాలి. పాజిటివ్‌ ఆలోచనలు చేయాలి. ఆసక్తి ఉన్న కార్యకలాపాల్లో నిమగ్నమవ్వాలి. ఖాళీ మెదడు దెయ్యాల కొంప అన్న సంగతి మర్చిపోకూడదు. సాధించిన లక్ష్యాలు గుర్తుచేసుకోవాలి. ప్రతి ఒక్కరినీ ప్రేమించడం వంటి లక్షణాలను అలవర్చుకోవాలి.

More details -> Stress and Strain in human life
  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Tuesday, November 9, 2010

మండే ఎండలు..చర్మ సంరక్షణ , skin-care in summer






ఎండల కాలం.. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సూర్యతాపానికి నేరుగా ప్రభావితమయ్యేది మన చర్మం. అధిక ఉష్ణోగ్రత.. రేడియేషన్లతో కూడిన సూర్యకిరణాలు చర్మాన్ని పలు సమస్యల పాలు చేస్తాయి. మనం ఎండలోకి వెళ్లినప్పుడు సూర్యకాంతిలోని అతినీలలోహిత (అల్ట్రావయొలెట్) కిరణాలు నేరుగా చర్మ కణజాలంలోకి దూసుకుపోయి, చర్మాన్నికష్టాల పాలు చేస్తాయి. ఈ మండే ఎండల్లో చర్మాన్ని ఎలా రక్షించుకోవాలో చెబుతున్నారు నిపుణులు...

ఎండలోకి వెళ్లినప్పుడు చర్మం నల్లబడుతుందనడంలో నిజం లేకపోలేదు. మన చర్మం నల్లగా లేదా తెల్లగా ఉండడానికి కారణం చర్మంలో ఉత్పత్తయ్యే మెలనిన్ అనే వర్ణకపదార్థం. చర్మానికి నలుపు రంగు రావడానికి కారణం ఇదే. మన శరీరంలో ఉండే కొన్ని రకాల హార్మోన్లు మెలనిన్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ఎండలోకి వెళ్లినప్పుడు అతినీలలోహిత కాంతి ఈ హార్మోన్లను ప్రేరేపిస్తుంది. ఫలితంగా అధిక మోతాదులో మెలనిన్ ఉత్పత్తయి చర్మం అంతటా విస్తరిస్తుంది. తద్వారా చర్మం నలుపుదేలుతుంది. అందుకే ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు చర్మం నల్లగా వడలిపోతుంది.

చిరాకెత్తించే చెమట కాయలు
వేసవి కాలంలో చెమట ఆరిపోకుండా తిరిగి శరీరంలోకే ఇంకిపోయి, చర్మం పై పొరల్లో నిలిచిపోతుంది. ఫలితంగా స్వేదగ్రంథుల నాళాలు మూసుకుపోతాయి. దీనివల్ల ఆ ప్రదేశంలో చెమట బిందువులే చర్మంపై బుడిపెల్లా ఏర్పడుతాయి. వీటినే చెమటకాయలంటాం. ఇవి మరి కాస్త పెద్దవైతే ఎర్రని బిళ్లల్లా మారిపోతాయి. ఆ తరువాత విపరీతమైన దురద, మంట మొదలవుతుంది. చెమటకాయలు రాపిడికి గురయినప్పుడు వాపు రావచ్చు. ఈ స్థితిలో ఇన్‌ఫెక్షన్లకు లోనయ్యే అవకాశం ఎక్కువవుతుంది.

ఇన్‌ఫెక్షన్లకు మండే ఎండలు..ఎండే చర్మం, శరీరంలో వేడి, తడి కలిసి ఉండే ప్రదేశాల్లో ఫంగస్ వృద్ధి చెందుతుంది. తొడలు, భుజాల కింద, పిరుదుల మధ్య ఫంగస్ ఎక్కువగా పెరుగుతుంది. వేసవి తీవ్రతతో పాటు ఈ భాగాలు ఎక్కువ ఒరిపిడికి గురవుతుంటాయి. పైగా, గాలి కూడా సరిగా అందక చెమట అధికంగా వస్తుంది. వేడితో పాటు తడి కూడా సమానంగా ఉండడం వల్ల వేసవి కాలంలోనే ఫంగస్ సమస్య ఎక్కువగా ఉంటుంది. జంతువులు, నీటి ద్వారానే కాకుండా ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. ఇన్‌ఫెక్షన్ ఉన్న వ్యక్తి దుస్తులను ఇతరులు ధరించడం వల్ల కూడా ఫంగస్ సోకే అవకాశం ఉంది.

ఎండతో ముడతలా?
చర్మం ముడుతలు పడడానికి వయసు పెరగడం ఓ ప్రధాన కారణమైతే మండించే ఎండ మరో ముఖ్య కారణం. ఎండ వేడిమి వల్ల చర్మంలోని ఎలాస్టిక్ కణజాలం దెబ్బతింటుంది. ఇది చర్మాన్ని బిగువుగా పట్టి ఉంచుతుంది. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఈ కణజాలం పట్టు తప్పి చర్మం బిగువు సడలిపోయి ముడుతలు ఏర్పడడానికి దారితీస్తుంది. దీన్నే సోలార్ ఎలాస్టోసిస్ అంటారు. తమ సొంత వ్యాధి నిరోధక వ్యవస్థే దాడిచేయడం వల్ల కొందరు ఆటోఇమ్యూన్ వ్యాధులకు గురవుతారు. సిస్టమిక్ ల్యూపస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధులున్న వారిలో చర్మం, శ్వాసకోశాలు, గుండె, కాలేయం, కిడ్నీ వంటి ప్రధాన అవయవాలన్నీ దుష్ప్రభావానికి లోనవుతాయి. ఇలాంటి వారు ఎండలో తిరిగితే ఈ వ్యాధి మరింత తీవ్రమవుతుంది. వంశానుగతంగా వచ్చే చర్మ వ్యాధులు కూడా ఎండవేడిమికి తీవ్రమవుతాయి.

సెగగడ్డలు
సాధారణంగా మన చర్మం మీద నిరంతరం పలురకాల బ్యాక్టీరియాలు నిలిచి ఉంటాయి. చర్మం దృఢంగా ఉన్నంత కాలం అవి పైపైనే ఉండిపోతాయి. అయితే వేసవిలోని అధిక ఉష్ణోగ్ర త కారణంగా వచ్చే చెమట వల్ల చర్మం మెత్త బడుతుంది. ఇదే అదనుగా బ్యాక్టీరియాలు చర్మం లోపలికి ప్రవేశిస్తాయి. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల వల్ల చర్మం మీద గడ్డలు తయారవుతాయి. వీటినే సెగ గడ్డలు అంటారు.


గజ్జి (స్కేబీస్‌):
ఈ సమస్య ఇచ్‌మైట్‌ అనే కీటకం వల్ల వస్తుంది. ఇది కూడా ఒకరి నుంచి మరొకరికి చాలా సులువుగా సంక్రమిస్తుంది. రాత్రిళ్లు దురద ఎక్కువగా ఉండటం దీని ప్రధాన లక్షణం. వేళ్ల సందుల్లో, మణికట్టు, జననేంద్రియాల దగ్గర, పొట్టచుట్టూ.. అధికంగా వస్తుంది. ఇది ఎక్కువగా హాస్టల్‌లో ఉండే పిల్లల్లో కనిపిస్తుంది. దీన్ని నివారించేందుకు లోషన్లు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సలహాతో ఎంచుకోవాల్సి ఉంటుంది. రాత్రిళ్లు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసి.. మెడనుంచి పాదాల దాకా క్రీమ్‌ రాసుకోవాలి. మర్నాడు మళ్లీ స్నానం చేయాలి. ఈ సమస్య ఉన్నవాళ్లు ధరించే దుస్తులు, దుప్పట్లు ఎప్పటికప్పు శుభ్రంగా ఉతికి, ఇస్త్రీ చేయాలి. దీన్ని నివారించేందుకు మాత్రలు కూడా ఉంటాయి. ఒకసారి నయమైన తరవాత దురద తగ్గడానికి కొంత సమయం పడుతుంది. దాన్ని నివారించేందుకు వైద్యుల సలహాతో యాంటీ ఎలర్జీ మందులు తీసుకోవాలి.

తామర:
ఇది కూడా అంటువ్యాధే. ఫంగస్‌ వల్ల వస్తుందీ ఇన్‌ఫెక్షన్‌. శరీరంపై ఎక్కడైనా రావచ్చు. ప్రారంభంలో గుండ్రంగా మొదలై.. క్రమంగా మధ్యభాగంలో తగ్గుతూ చుట్టూ వ్యాపిస్తుంది. శుభ్రత పాటించకపోతే మళ్లీమళ్లీ వస్తుంది. సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడే వైద్యుల్ని సంప్రదించి మందులు, క్రీమ్‌లు వాడాలి. పైపూతగా రాయడానికి యాంటీ ఫంగల్‌ క్రీమ్‌లు సిఫారసు చేస్తారు. మరీ బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరించకూడదు.

నగలతో అలర్జీ
మెడలో గొలుసు వేసుకున్నా, చేతులకు గాజులు ధరించినా, వేలికి ఉంగరం పెట్టుకున్నా కొంతమందిలో దురదతో కూడిన అలర్జీ కనిపిస్తుంది. సాధారణంగా బంగారు ఆభరణాలతో ఈ సమస్య రాదు. కానీ నికెల్, కోబాల్ట్, రాగి ఆభరణాలు ధరిస్తే మాత్రం అలర్జీ కనిపిస్తుంది. ఎండవేడిమికి ఈ లోహాలు కరిగిపోతాయి. ఈ సమయంలో లోహంలోని యాంటీజన్స్ చెమట రంధ్రాల ద్వారా శరీరంలోకి వెళ్లి అలర్జీలకు దారి తీస్తాయి.

నలుపు.. రక్షణ కవచం
తెల్లగా, పసిమిఛాయలో ఉండేవాళ్లలో వేసవి చర్మ సమస్యలు మరింత ఎక్కువ. చర్మంలో ఉండే మెలనిన్ అతినీలలోహిత కిరణాలు చర్మకణాల లోపలికి చొచ్చుకుపోకుండా కాపాడుతుంది. తెలుపు వర్ణంలో ఉండేవాళ్లు తక్కువ మెలనిన్‌ను కలిగివుండడం వల్ల అతినీలలోహిత కాంతి చాలా సులువుగా కణంలోపలికి వెళ్తుంది. ఫలితంగా వీళ్లు చర్మసమస్యలకు గురయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఇలాంటివారిలో చర్మక్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చర్మంలోపలికి చొచ్చుకుపోయే అతినీలలోహిత కిరణాలు కణాల్లోని జన్యువులపైన ప్రభావం చూపి క్యాన్సర్‌కు కారణమవుతాయి. ఇటీవల ఓజోన్ పొర బాగా పలుచబడుతున్న కారణంగా మన దేశంలోనూ చర్మ క్యాన్సర్ల సంఖ్య పెరుగుతోంది.

ఇలా రక్షించుకోండి...
మామిడి పండ్లలో బీటా కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఎండ తీవ్రతను తట్టుకునే శక్తిని పెంచుతుంది. పైగా ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అత్యధికంగా ఉంటాయి. ఫ్రీ-రాడికల్స్‌తో వచ్చే పలు రకాల సమస్యకు ఇవి విరుగుడుగా పనిచేస్తాయి. మామిడి పండ్లు తినడం వల్ల సెగ గడ్డలు వస్తాయనుకుంటారు చాలామంది. ఇది కేవలం అపోహే. కొబ్బరి నీళ్లు, పండ్లరసాలు, మొలకెత్తిన ధాన్యాలతో పాటు, టొమాటో, క్యారెట్ రసం, మజ్జిగ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. కూల్‌డ్రింక్స్ వద్దు.

వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించాలి. తెలుపు రంగు సూర్యరశ్మిని నిరోధిస్తుంది. అందుకే తెలుపు రంగు దుస్తులు, తెలుపు రంగు గొడుగునే వాడాలి. లోదుస్తులు కూడా కాటన్‌వే ధరించడం మేలు. ఈప్రతి రోజూ సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం ద్వారా ఎండ తగిలినా అల్ట్రావయొలెట్ కిరణాలు చర్మం లోపలికి చేరకుండా ఈ సన్‌స్క్రీన్ అడ్డుకుంటుంది. అయితే ఒకసారి వేసుకున్న సన్‌స్క్రీన్ రెండు గంటల వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి రెండు గంటలకు ఒకసారి ఇది రాసుకోవాలి. ముఖానికే కాకుండా మెడ, చేతులకు కూడా రాసుకోవడం మంచిది. అయితే ఎస్‌పిఎఫ్ విలువ 30 ఉన్న సన్‌స్క్రీన్‌లు వాడడం ఉత్తమం.

చాలామంది ఎక్కువసార్లు సబ్బుతో రుద్ది, ముఖానికి రకరకాల క్రీములు పట్టిస్తుంటారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఎండాకాలంలో ముఖానికి క్రీములు ఏవీ వాడకపోవడం ఉత్తమం.

  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

పెద్దపేగు క్యాన్సర్‌ నివారణ , Large Bowel cancer prevention



సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలను 'కంతి' ( టూమర్, tumor) అంటారు. అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని కేన్సర్ అని వ్యవహరిస్తారు. ఈ రకమైన పెరుగుదలకు ఒక స్పష్టమైన విధి ఉండదు. కేన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని 'ఆంకాలజీ' (Oncology) అంటారు.

కాన్సర్ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉన్నది. అయినా గర్భాశయం, రొమ్ము, ఊపిరితిత్తులు, పేగులు, శ్వాస నాళాలు మొదలైన భాగాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ.

పురీషనాళ, పెద్దపేగు (కొలెరెక్టల్‌) క్యాన్సర్‌. దీనిని చాలావరకు నివారించే అవకాశం ఉన్నప్పటికీ ఎంతోమంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతుండటం విషాదం. మొత్తం క్యాన్సర్ల మరణాల్లో కొలెరెక్టల్‌ క్యాన్సర్‌ మూడో ప్రధాన కారణంగా నిలుస్తుందంటే దీనిపై అవగాహన లేమి ఏమేరకు ఉందో అర్థమవుతుంది. ఎంత ప్రమాదకరమైనదైనా.. ఈ క్యాన్సర్‌ను చిన్నపాటి జీవనశైలి మార్పులతోనే సమర్థంగా నివారించుకోవచ్చని ఇటీవల డెన్మార్క్‌లో జరిగిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. అవేంటంటే..
* రోజుకి కనీసం అరగంట సేపు వ్యాయామం.
* మద్యం అలవాటుంటే మితాన్ని పాటించటం. లేనివారు దాని జోలికి వెళ్లకపోవటం.
* పొగ తాగటం మానెయ్యటం.
* పీచు ఎక్కువగా గల ఆహారాన్ని తీసుకోవటం. రోజుకి మూడు కప్పుల పండ్లు, కూరగాయలు తినటం. తీసుకునే కేలరీల్లో 30 శాతానికి మించి కొవ్వు నుంచి లభించకుండా ఉండేలా మాంసాహారాన్ని తగ్గించటం.
* నడుము పరిమాణాన్ని ఆడవారైతే 34.6 అంగుళాలు, మగవారైతే 40.1 అంగుళాలు మించకుండా చూసుకోవటం.
వీటిని పాటిస్తే చాలు. పురీషనాళ క్యాన్సర్‌ నుంచి చాలావరకు తప్పించుకోవచ్చని డెన్మార్క్‌ పరిశోధకులు చెబుతున్నారు. క్యాన్సర్‌ బారిన పడని 50-64 ఏళ్ల వయసుగల 55,487 మందిని పదేళ్ల పాటు పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. అధ్యయనం ఆరంభమైనప్పటి నుంచి వారి జీవనశైలి, ఆహార పద్ధతులు, ఆరోగ్యస్థితి, అలవాట్లు, సంతాన సామర్థ్యం వంటి వివిధ అంశాలను పరిశీలించారు. పరిశోధన అనంతరం అనారోగ్య జీవనశైలిని అనుసరిస్తున్న 678 మంది ఈ క్యాన్సర్‌ బారిన పడ్డట్టు గుర్తించారు. పైన పేర్కొన్న జీవనశైలి మార్పుల్లో ఒక్కదాన్ని పాటించినా.. 13 శాతం వరకు పురీషనాళ క్యాన్సర్‌ బారిన పడకుండా చూసుకోవచ్చని వివరిస్తున్నారు. అందుకే చిన్నపాటి జీవనశైలిని మార్పులతో ప్రాణాంతక వ్యాధుల నుంచి తప్పించుకునే వీలుందని సూచిస్తున్నారు.



  • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Monday, November 8, 2010

పిల్లలకు యాంటీ బయోటిక్స్‌ జాగ్రత్తలు , Antibiotics use in Children



పిల్లలకు యాంటీ బయోటిక్‌ మందులు వేస్తున్నారా? అయితే కొన్ని జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. బయో (Bio)అంటే లైఫ్(Life) అని అర్ధము . యాంటి(Anti) అనంటే వ్యతిరేకమై(opposite)నది అని అర్ధము . జీవులు నశింపజేయడానికి ... తద్వారా వాటివల్ల కలిగే జబ్బులను నయము చేయడానికి వాడే రసాయనాలు .
  • వైద్యుడిని సంప్రదించకుండా సొంతంగా యాంటీ బయోటిక్‌ మందులను వాడొద్దు.
  • దగ్గు, జలుబు, అప్పుడప్పుడు నీళ్ల విరేచనాలు, చర్మం మీద ఇన్‌ఫెక్షన్ల వంటి చిన్న చిన్న సమస్యలు 3-7 రోజుల వరకు ఉంటాయి. వీటిల్లో చాలావాటికి యాంటిబయోటిక్స్‌ వేయాల్సిన అవసరం లేదు. తగినంత విశ్రాంతి, ద్రవాహారం ఎక్కువ ఇవ్వటం, అవసరమైతే కొద్ది మోతాదులో నొప్పి నివారణ మందులతోనే ఇవి నయమవుతాయి.
  • కడుపు నిండుగా ఉన్నప్పుడు అంటే పిల్లలు ఆహారం, పాలు తీసుకున్న వెంటనే యాంటీ బయోటిక్స్‌ వెయ్యద్దు. అలాచేస్తే మందులను శరీరం పూర్తిగా గ్రహించలేకపోవచ్చు.

  • ఆంపిసిలిన్‌, అమాక్జసిలిన్‌ వంటి యాంటీ బయోటిక్స్‌ కడుపులో ఇబ్బంది, విరేచనాల వంటి స్వల్ప దుష్ప్రభావాలు కలగజేస్తాయి. అయితే ఇవి తాత్కాలికమే. వాటంతటవే తగ్గిపోతాయి. మందులు మానేయాల్సిన అవసరం లేదు.

  • పిల్లలకు, కుటుంబంలో ఎవరికైనా ఏవైనా మందులు పడకపోయినా.. దద్దు, ఉబ్బసం వంటి సమస్యలున్నా వైద్యులకు ముందే చెప్పాలి.

  • యాంటీ బయోటిక్స్‌ వేస్తున్నప్పుడు పిల్లల్లో తీవ్రమైన దురద, వాపు వంటి దుష్ప్రభావాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి.

  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/