Thursday, September 16, 2010

గర్భాశయం తొలగింపు ప్రత్యామ్నాయ చికిత్సా ప్రక్రియలు






స్త్రీలలో గర్భాశయాన్ని తొలగించడాన్ని హిస్టరెక్టమీ అంటారు. ఒకవేళ అండాశయా లనూ, ట్యూబ్స్‌నూ తొలగించాల్సి వస్తే దానిని సాల్ఫింగో ఓఫరెక్టమీ అంటారు.
ఇటీవలి కాలంలో ఈ రకం శస్త్ర చికిత్సలు ప్రాణావసరం కోసం కాకుండా, ఇతర వ్యక్తిగత ప్రయోజనాల కోసం జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయితే హిస్టరెక్టమీ అనేది ఒక శక్తివంతమైన చికిత్సా విధానం. ఎంతో అవసరమైతే తప్ప దాని గురించి ఆలోచించకూడదు. ఈ శస్త్ర చికిత్సకు కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ముందుగా వాటిని ఎంచుకుని ప్రయత్నించాలి.

కొన్ని నిజాలు
స్త్రీలలో హిస్టరెక్టమీ తరువాత లైంగిక స్పందనలు తగ్గుతాయి.
హిస్టరెక్టమీ తరువాత జననేంద్రియం కుర చగా, వంకరగా తయారవుతుంది. నార వంటి స్కార్‌ టిష్యూ తయారవడంవల్ల సంకోచ వ్యాకో చాలు తగ్గుతాయి.
హిస్టరెక్టమీ తరువాత వివిధ రకాలైన అనా రోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సాధా రణ శస్త్ర చికిత్సల వల్ల ఏర్పడే రిస్కులను అలా ఉంచితే, అనేక ఇతర ఇబ్బందులు కలుగు తాయి.

ఉదాహరణకు ఎముకలు పెళుసెక్కడం, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులు, లైంగిక స్తబ్దత, తరచుగా మూత్రకోశ వ్యాధులు రావడం, మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, మలబద్ధకం, నిస్త్రాణ, శరీర దుర్గంధం, జ్ఞాపక శక్తి తగ్గడం, కుంగుబాటు, కోపం, అసహనం వంటివి కనిపించే అవకాశం ఉంది.
హిస్టరెక్టమీ చేయించుకోకుండా ఉన్న వారిలో గర్భాశయం, అండాశయాలు జీవితాంతం పని చేస్తూనే ఉంటాయి. రజోనివృత్తి తరువాత ఇవి పని చేయవని అనుకోవడం పొరపాటు.

హిస్టరెక్టమీ చేసే సమయంలో కొంతమందికి అండాశయాలనూ, ట్యూబులనూ తొలగిస్తుం టారు. దీని వల్ల ఇబ్బందులు ద్విగుణీకృతమవు తాయి. అండాశయాలను తొలగించకుండా వది లేసినప్పటికీ, హిస్టరెక్టమీ చేయించుకున్న చాలామందిలో త్వరితంగా మెనోపాజ్‌ లక్షణాలు కనిపించడాన్ని అధ్యయనకారులు గమనించారు.

ఆపరేషన్‌ అవసరమైన సందర్భాలు
గర్భాశయానికి, గర్భాశయ ముఖ ద్వారానికి, అండాశయాలకూ, ట్యూబ్స్‌కు, స్త్రీ జననేంద్రి యానికి కేన్సర్‌ సోకడం,
కటివలయం మొత్తం తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌కు గురై (పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌) మందులకు లొంగకుండా తయారు కావడం అధిక స్థాయిలో, అనియతంగా బహిష్టు స్రావం జరగడం,
ప్రసవ సమయంలో గర్భాశయం విచ్ఛిన్నం కావడం,
గర్భాశయం జారడం, ఫైబ్రాయిడ్‌ పెరగడం, ఎండోమెట్రియోసిస్‌ వ్యాధి కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడటం
పైన ఉదహరించిన సందర్భాల్లో తప్పితే ఇతర సమస్యలన్నింటిలోనూ ముందుగా ఔషధ చికిత్సలను ప్రయత్నించాలి. పై సందర్భాల్లో కూడా ముందుగా ప్రత్యామ్నాయాలను ప్రయ త్నించిన తరువాత మాత్రమే శస్త్రచికిత్స గురించి ఆలోచించాలి. హిస్టరెక్టమీ కోసం ఎన్ను కోబడే కొన్ని ముఖ్యమైన వ్యాధులను, ప్రత్యా మ్నాయ ఆయుర్వేద చికిత్సా విధానాలను తెలుసుకుందాం.

ఫైబ్రాయిడ్స్‌
గర్భాశయం గోడల్లో రబ్బరు బంతుల మాది రిగా చిన్న కంతులు పెరుగుతుంటే వాటిని ఫైబ్రాయిడ్స్‌ అంటారు. ఇవి ఒక్కొక్కసారి కమలాఫలమంత సైజుకు పెరిగి సమస్యలను సృష్టించే అవకాశం ఉంది.
ఫైబ్రాయిడ్స్‌ కేన్సర్‌ పెరుగుదలలు కావు కనుక ఆందోళన చెందాల్సిన పని లేదు.
గర్భధారణ వయస్సు వచ్చిన మహిళలు 25 శాతం మందిలో ఫైబ్రాయిడ్స్‌ ఉంటాయి. బహి ష్టులు ఆరంభం కాని ఆడపిల్లల్లో ఇవి అసలు కనిపించవు. అలాగే బహిష్టు క్రమం ఆగిపో యిన వారిలో కూడా కుంచించుకుపోయి కనపడ కుండా పోతాయి.
ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌కూ, ఫైబ్రాయిడ్స్‌కు మధ్య సంబంధం ఉంది. గర్భధారణ వంటి ఈస్ట్రోజెన్‌ పెరిగే సందర్భాలన్నింటిలోనూ ఫైబ్రాయిడ్స్‌ పెరుగుతాయి. బహిష్టు స్రావం అత్యధిక మోతాదుల్లో కావడం ఫైబ్రాయిడ్స్‌ ప్రధాన లక్షణం.
ఈ సమస్య ఉన్నవారికి కటివలయం మొత్తం అసౌకర్యంగా, ఒత్తిడిగా, నొప్పిగా అనిపిస్తుంది. ఫైబ్రాయిడ్స్‌ చుట్టుప్రక్కల నిర్మాణాల మీద ఒత్తిడిని ప్రదర్వించడం వల్ల మలబద్ధకమే కాకుండా, మూత్ర విసర్జన కూడా తరచుగా చేయాల్సి రావచ్చు.
నరాల మీద ఒత్తిడి పడటం వల్ల తొడల్లోనూ, నడుములోనూ నొప్పిగా అనిపించవచ్చు. కంతులు బాగా పెరిగి గర్భంలో పెరుగుతున్న శిశువు మీద ఒత్తిడిని కలిగించి అబార్షన్‌ కావడానికి కారణం కావచ్చు.
ఆయుర్వేదంలో ఫైబ్రాయిడ్స్‌కు సంబం ధించిన అంశాలు ఆర్తవాతివృద్ధి, మాంసార్బుదం అనే వ్యాధుల వివరణల్లో కనిపిస్తాయి.

సూచనలు
ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, గింజ ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. సోయాతో తయారైన ఆహార పదార్థాలను, దానిమ్మనూ ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఐసోఫ్లావన్స్‌ ఉంటాయి. ఇవి అధిక ఈస్ట్రోజెన్‌ను తగ్గిస్తాయి.
జంతు మాంసాన్ని, కొవ్వును, పంచదారను, కెఫీన్‌ కలిగిన పదార్థాలనూ తగ్గించాలి. విటమిన్‌ ఇ, సిలను నేరుగానో, ఆహారం రూపంలోనో తీసుకుంటే హార్మోన్స్‌ విడుదల సక్రమంగా జరిగి ఫైబ్రాయిడ్స్‌ కుంచించుకు పోతాయి.
ఈవెనింగ్‌ ఫ్రైమ్‌రోస్‌ ఆయిల్‌ను ఈ సంద ర్భంగా ప్రత్యేకించి పేర్కొనాలి. దీనిని వైద్య సలహా మేరకు వాడుకోవచ్చు.
ఈ వ్యాధిని అదుపులో పెట్టడానికి త్రిఫలా గుగ్గులు, లోధ్రాసవ, ప్రదరరిపురస వంటి ఆయుర్వేద మందులను వైద్యసలహాతో వాడుకో వచ్చు.

ఎండోమెట్రియోసిస్‌
గర్భాశయం లోపలి పొరను పోలిన కణ జాలం గర్భసంచిలో కాకుండా, ఉదరకోశంలోని వివిధ ప్రదేశాల్లో కనిపిస్తున్నప్పుడు దానిని ఎండోమెట్రియోసిస్‌ అంటారు.
ఈ కణజాలం కూడా బహిష్టు సమయాల్లో ప్రేరేపితమై రుతు రక్తాన్ని స్రవిస్తూ ఉంటుంది. అయితే ఈ రక్తానికి బైటకు వెళ్లే మార్గం ఉండదు కనుక లోపలే సంచితమై వాపునూ, తంతుయుత నిర్మాణాలను తయారు చేయడమే కాక, అంతర్గత అవయవాలను ఒకదానికి ఒకటి అతుక్కునేలా చేస్తుంది.
ఈ వ్యాధికి ఇతమిత్థమైన కారణం తెలియ కపోయినా, తిర్యక్‌ దిశలో బహిష్టు స్రావం ప్రవ హించి, ఉదరకుహరంలోకి చేరుకుని ఎండోమె ట్రియల్‌ ఇంప్లాంట్స్‌ను ఏర్పరచి తద్వారా నెల నెలా సమస్యను కలిగించే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.
ఆనువంశికత, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, వ్యక్తిగత శరీర ప్రకృతి వంటివన్నీ ఈ వ్యాధిని కలిగించే అవకాశం ఉంది. ఎండోమెట్రియోసిస్‌ వల్ల విపరీతమైన బహిష్టు నొప్పి వస్తుంది.
కొంతమందిలో నడుము నొప్పి, మలమూత్ర విసర్జన సమయాల్లో నొప్పి ఉంటాయి. భార్యాభర్తల కలయిక సమయంలో నొప్పి అనిపిస్తుంది. బహిష్టు స్రావం సక్రమంగా కాకుండా, అనియతంగా, అధిక మొత్తాల్లో అప క్రమంగా జరుగుతుంది. ఈ లక్షణాల కారణంగా సంతాన రాహిత్య, గర్భస్రావాలు చోటు చేసుకుంటాయి.

సూచనలు
పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కండరాలు ముడుచుకోవడం ద్వారా ఏర్పడే శూల తగ్గుతుంది. గింజ ధాన్యాలు, ఇతర నూనె గింజలు తీసుకుంటే వాటిలో ఉండే తైలాల వల్ల నొప్పి ఉప శమిస్తుంది.
పెరుగు, మజ్జిగ, వెల్లుల్లి, ఇంగువ, కాయగూ రలు వంటివి మంచిది. పంచదార, జంతు సంబంధ మైన కొవ్వు పదార్థాలు నొప్పిని ఎక్కువ చేస్తాయి కనుక వాటిని తగ్గించుకోవాలి.
బి కాంప్లెక్స్‌ కలిగిన పదార్థాలను తీసుకుంటే శరీరంలో సంచితమైన అధిక ఈస్ట్రోజెన్‌ విచ్చి ´న్నమై సమస్థితికి చేరుతుంది. రక్త స్రావాన్ని నిలువరించడం కోసం ఉసిరి వంటి విటమిన్‌ సి కలిగిన పండ్లను ఆహారాలను తీసు కోవాలి. కాల్షియం కలిగిన ఆహార పదార్థాలు గర్భాశయం కండరాల్లో పుట్టే నొప్పిని తగ్గి స్తాయి. యుక్తవయస్సు నుంచే ఏరోబిక్‌ వ్యాయామా లను చేసే ఆడపిల్లల్లో ఎండోమెట్రి యోసిస్‌ తక్కువగా కనిపించి నట్లు ఇటీవలి అధ్యయ నాలు వెల్లడిస్తున్నాయి.
ఈ వ్యాధిలో ఫైటో ఈస్ట్రోజెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇవి ఈస్ట్రోజెన్స్‌ తగ్గినప్పుడు సానుకూలంగానూ, పెరిగినప్పుడు ప్రతికూలంగానూ పని చేసి ఈస్ట్రోజెన్స్‌ పరిమాణాన్ని సమస్థితిలో ఉంచుతాయి. సోయా చిక్కుడు, ఇతర చిక్కుళ్లు, టమాట, పుచ్చకాయ, రేగు, కంది, పెసర, యష్టి మధుకం, దానిమ్మ వంటి వాటిలో ఇవి ఎక్కువగా ఉంటాయి.

గర్భాశయం జారడం
వయస్సు పెరగడం, ఎక్కువమంది పిల్లలకు జన్మ నివ్వడం అనే కారణాల వల్ల కొంతమంది మహిళల్లో కటి ప్రదేశంలోని కండరాలు, లిగమెంట్లు, కండర బంధనాలు వదులుగా అవుతాయి. పర్యవసానంగా గర్భాశయం స్వస్థానంనుంచి జారి మూత్రాశయం మీద ఒత్తిడిని కలిగిస్తుంది.
అంతే కాకుండా, యోనిలోకి చొచ్చుకుని వెళ్లే అవకాశం ఉంది. ఈ స్థితితో ఇబ్బంది పడేవారు హిస్టరెక్టమీ గురించి ఆలోచిస్తుంటారు.
అయితే, ఒక మోస్తరు స్థాయిలో ఉన్నంత వరకూ కొన్ని ఆయుర్వేద స్థానిక చికిత్సల తోనూ, కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలతోనూ తగ్గించుకోవచ్చు.

సూచనలు
ఈ సమస్య కలిగిన వారికి కటివలయపు కండరాలను శక్తివంతం చేసే వ్యాయామాలు ఉపయోగపడతాయి. వ్యాయమాల్లో యోని, కటి వలయపు కండరాలను పలుమార్లు బిగపట్టి వదులు చేయడం ప్రధాన క్రియ.
వ్యాయామానికి ముందు మూత్ర విసర్జన చేయాలి. కండరాలను పది సెకన్లు బిగబట్టడం, పది సెకన్లు వదులు చేయడం చేయాలి.
ఇలా ఒక్కొక్క పర్యాయం 20 సార్లు చొప్పున రోజుకు అయిదు పర్యాయాలు చేస్తే ఫలితం ఉంటుంది.

  • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.