Sunday, May 2, 2010

పిల్లల్లో పక్క తడిపే అలవాటు, Nocternal Enuresis




పిల్లలో చాలా మందికి పగటిపూట మూత్ర విసర్జన మీద నియంత్రణ రెండు మూడు సంవత్సరాల మధ్య వచ్చే స్తుంది. రాత్రి సమయాల్లో మూత్రాన్ని అదుపు చేసుకోగలిగే శక్తి రెండు నుంచి అయిదు సంవత్సరాల మధ్య వస్తుంది.

అయిదో సంవత్సరం వచ్చే సరికల్లా 85 శాతం మందికి, పదవ సంవత్సరం వచ్చేసరికల్లా 95 శాతం మందికీ మూత్ర కోశం మీద నియంత్రణ - ముఖ్యంగా రాత్రి సమయాల్లో - వస్తుంది. దీనికి భిన్నంగా పాపాయి పక్క తడుపుతుంటే, ప్రధానంగా నరాల జబ్బులు, మూత్ర వ్యవస్థకు సంబంధిం చిన సమస్యలేవీ లేకపోయినప్పటికీ పక్కలో మూత్రం పోస్తున్నట్లయితే ఆ స్థితిని శయ్యామూత్రం లేదా నాక్టర్నల్‌ ఎన్యూరిసిస్‌ అంటారు.

కొంతమంది పిల్లలు పక్క తడపటం కొన్ని నెలలపాటు మానేసి తిరిగి మొదలు పెడుతుంటారు. అటువంటి స్థితిని సెకండరీ ఎన్యూరిసిస్‌ అంటారు. సాధారణంగా ఇలాంటి దానికి ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఉండే అవకాశం ఉంది.

శయ్యామూత్రం కొన్ని కుటుంబాలలో ఆనువంశికంగా నడుస్తుంటుంది. అంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా చిన్నప్పుడు నిద్రలో పక్క తడిపిన అలవాటు ఉంటే అదే లక్షణం పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది.

పిల్లల్లో కనిపించే ఈ పక్క తడిపే అలవాటు ప్రాథమి కమా? ద్వితీయకమా? ఉపేక్షించదగినదా? కాదా? అనేది సమగ్రంగా విశ్లేషించడం అవసరం. దానికి ఈ కింది అంశాలు దోహదపడుతాయి.

ప్రతిరోజూ రాత్రిపూట పక్క తడుపు తూనే ఉన్నారా?

మూత్ర విసర్జన మీద నియంత్రణ నరాల వ్యవస్థ అభివృద్ధి చెందే విధానం లేదా వేగం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతవరకూ అనువంశికత మీద కూడా ఆధారపడి ఉంటుంది.వయస్సు అయిదు సంవత్సరాలు దాటడం, రాత్రిపూట రోజూ పక్క తడుపుతుండటం, ఇతరత్రా ఆరోగ్యంగానే ఉండటం, శారీరక సమస్యలేవీ లేకపోవడం - ఇవన్నీ ఉన్నట్లయితే సమస్య ప్రాథమికమని (ప్రైమరీ ఎన్యూరిసిస్‌) అర్థం. ఈ సమస్య ఎదురైనప్పుడు తల్లిదండ్రులు కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది.
పక్క తడిపారనే కారణంగా పిల్లలను కొట్టకూడదు. తిట్ట కూడదు. పక్క తడిపే సమయంలో పిల్లలు గాఢ నిద్రలో ఉంటారు కనుక వారిని అదిలించినా ప్రయోజనం ఉండదు.
పిల్లలు తమ సమస్య గురించి తామే ఆందోళన చెందు తుంటారు కనుక వారికి వారి అలవాటునుంచి బైటపడేందుకు అవకాశాన్ని, సహకారాన్ని ఇవ్వాలి. సమస్యను అర్థం చేసుకుని వారికి ధైర్యాన్నీ, నమ్మకాన్నీ కలిగించాలి.
పక్క తడపని రోజును గుర్తించి మెచ్చుకోవాలి. వీలైతే స్టార్‌ను ప్రదానం చేయాలి. ఇలా మూడు స్టార్‌లు వచ్చిన తరువాత ప్రోత్సాహపూర్వకమైన బహుమతినివ్వాలి. ఈ పద్ధతిని పిల్లలు ఇష్టపడతారు.
కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను మంచినీళ్లు తాగ కుండా కట్టడి చేస్తుంటారు. దీనిని పిల్లలు ఒక శిక్షగా భావించి మరింత ఒత్తిడికి గురవుతారు. లేదా దప్పికకు, అలవాటుకూ మధ్య ఉండే వ్యత్యాసాన్ని గుర్తించలేని విధంగా తయా రవుతారు.

పాపాయి ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుందా?
ఇంతకు ముందు పక్క తడపకుండా ప్రస్తుతం పక్క తడు పుతూ, ఇతర సమయాల్లో ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుంటే మూత్ర విసర్జనకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌ గురించి ఆలోచించాలి.
ఇలా మగపిల్లలలో కంటే ఆడపిల్లలలో ఎక్కువగా జరుగు తుంటుంది. మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లలకు మూత్రనాళం (యురెత్రా) తక్కువ పొడవు ఉండటమూ, తదనుగుణంగా ఇన్‌ఫెక్షన్లు వేగంగా లోపలకు వ్యాపించడమూ దీనికి కారణం.
ఇతర లక్షణాల విషయానికి వస్తే మూత్రం పోసుకునేట ప్పుడు మంట, నొప్పి వంటివి ఉంటాయి. ఐతే మొట్టమొద టగా కనిపించే లక్షణం మాత్రం శయ్యామూత్రమే. కొన్ని సార్లు తీవ్రమైన జ్వరం, నడుము నొప్పి వంటివి సైతం కని పించే అవకాశం ఉంది. ఈ కారణం చేతనే ఐదు సంవత్స రాల వయస్సు దాటిన పిల్లలలో శయ్యామూత్రం ఉన్నప్పుడు మూత్ర మార్గానికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్ల గురించి పరీక్షించాలి.

మలబద్ధకం ఉందా?

మలబద్ధకం ఉండే పిల్లలలో పెద్దప్రేవు చివరనుండే పురీష నాళం (రెక్టం) పూర్తిగా మలంతో నిండిపోయి దాని ముందు భాగంలో ఉండే మూత్రకోశం మీద ఒత్తిడిని కలిగిస్తుంది. దీనితో మూత్రకోశం వాల్వ్‌ వదులై శయ్యామూత్రమ వుతుంది.

ఎప్పుడూ ఆందోళనగా కనిపిస్తారా?

పిల్లలకు ఏ మాత్రం భయం, ఆందోళనలు కలిగినా వెంటనే పక్క తడిపేస్తారు. మానసిక వత్తిడి, భయాల వలన మూత్రకోశపు కండరాలతో సహా శరీరంలోని కండరాలన్నీ అసంకల్పితంగా బిగుసుకుంటాయి. దీనితో పక్కలో మూత్రం పోస్తారు. రాత్రిపూట భయం కలిగించే కథలు, సినిమాలు, టీవీ కార్యక్రమాలనుంచి పిల్లలను దూరంగా ఉంచాలి.

ఎప్పుడూ దాహంగా ఉంటుందా? అకారణంగా బరువు తగ్గుతున్నారా?

కొంతమంది పిల్లలలో మధుమేహం (జువనైల్‌ డయాబె టిస్‌) శయ్యామూత్రంతోమొదలవుతుంది. ఇన్సులిన్‌ హార్మోన్‌ లోపం వలన శారీరక కణజాలాలు రక్తంలోని చక్కెరను సమర్థవంతంగా గ్రహించలేవు. ఫలితంగా రక్తంలోని చక్కెర రక్తంలోనే పెరిగిపోతుంటుంది.ఇలా పెరగడం ప్రమాదకరం కాబట్టి మూత్రపిండాలు మూత్రాన్ని పెద్ద మొత్తాల్లో తయారు చేస్తూ చక్కెరను విసర్జించే ప్రయత్నం చేస్తాయి. ఈ నేపథ్యంలో మూత్రకోశపు పరిమాణానికి మించి మూత్రం తయారవుతుంది కాబట్టి నిద్రలో అసంకల్పితంగా విడుదలవుతుంది. శరీరంనుంచి బైటకు వెళ్లిపోయిన నీరు తిరిగి భర్తీ కావాలి కనుక అధికంగా దప్పిక అవుతుంది. ఈ స్థితులన్నీ ఒకదానిని అనుసరించి మరొకటిజరుగుతుంటాయి. సరైన వ్యాయామం, సక్రమమైన ఆహారం, సమర్థవంతమైన ఔషధాలతో ఈ స్థితికి చికిత్స చేయాలి.

చికిత్స :
  1. మానషికం గా పిల్లలను తయారు చేయాలి . మంచిగా నచ్చజెప్పి వారి దృక్పదం లో మార్పు తేవాలి .
  2. రాత్రి భోజనకు తొందరగా అంటే 7-8 గంటలకే పెట్టాలి .
  3. రాత్రి పడికునే ముందు నీరుడు పోయించి నిద్రకు వెళ్ళమనాలి .
  4. మంచి పోషకాహారము ఇవ్వాలి .
మందులు :
Tab . Tryptomer (emitryptalin Hel) వయసును బట్టి 10 - 20 మి.గ్రా .రోజూ రాత్రి ఇవ్వాలి .
Anti spasmadics eg. diclomine Hel ( colimex ) తగు మోతాదులో ఇవ్వవచ్చును .
ఆయుర్వేదిక్ -- tab . Neo వయసును బట్టి రోజుకి 2- 3 మాత్రలు 3- 4 మాసాలు ఇస్తే మంచి ఫలితం ఉండును .

యూరినరీ ఇంఫెక్షన్‌ ఉన్నట్లయితే డాకటర్ని సంప్రదించి తగు వైద్యం తీసుకోవాలి .

update : 

Nocturnal enuresis (bedwetting),ఇంకా పక్కతడుపుతున్నారా?------
చిన్నపిల్లలలో చాలామంది 3-4 సంవత్సరాలు వయస్సుకు చేరుకునే సరి రాత్రిళ్లు పక్క తడపడం మానేస్తారు. తర్వాత అడపాదడపా ఎప్పుడో గాని తడపరు.

కొంతమంది మాత్రం తర్వాతా పక్క తడుపుతుండొచ్చు. దీనికి ప్రధాన కారణం మూత్రాశయం మూత్రంతో నిండిపోయినా దానినుండి వెలువడిన సంకేతాలు మెదడుకు చేరకపోవటమే. మూత్ర విసర్జనలో కేంద్రీయ నాడీమండలం, స్వయంచాలక నాడీమండలాల నియంత్రణ లోపమే దీనికి మూలం. దీని మూలంగానే పక్క తడపడంలో పిల్లల్లో వ్యత్యాసం కనపడుతుంది.

ఇన్పెక్షన్‌ కావచ్చు, చక్కెర వ్యాధి కావచ్చు, మూత్ర వ్యవస్థలో లోపాలు కావచ్చు... ఇలా కొన్ని వ్యాధుల మూలంగా కూడా పక్కతడిపే అవకాశముంది. కాబట్టి 4-5 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత కూడా పక్కతడుపుతున్నా లేక కొంతకాలంపాటు పక్క తడపడం మాని, తర్వాత తిరిగి పక్క తడపడం మొదలుపెట్టినా వైద్యుని సంప్రదించడం సముచితం.

నిశితంగా పరిశీలించినట్లయితే 3 సంవత్సరాల వయస్సు పిల్లల్లో నూటికి 50 మంది, 4 సంవత్సరాలు వయస్సున్న పిల్లలలో నూటికి 25 మంది, 5 సంవత్సరాలు వయస్సులో గూడా నూటికి ఐదుగురు పక్క తడుపుతున్నట్లు గుర్తించడం జరిగింది. ఆ వయస్సులో పిల్లలు పక్కతడుపుతుంటే తల్లిదండ్రులు చికాకుపడతారు. పిల్లల్లో కూడా ఆత్మన్యూనతా భావం చోటుచేసుకొంటుంది.

రాత్రిళ్ళు పక్కతడిపే పిల్లల్లో నూటికి పది మంది పగటి పూట కూడా నియంత్రణ లేకుండా మూత్ర విసర్జన చేయడం కద్దు. రాత్రిళ్ళు పక్క తడపకుండా పగలు మాత్రమే కంట్రోలు లేకుండా మూత్రవిసర్జన చేస్తుంటే మూత్రావయవాలలో గాని, నాడీమండలంలోగాని లోపాలున్నట్లు భావించనవసరం లేదు.

కంట్రోలు లేకుండా మూత్ర విసర్జన చేస్తుంటే దాన్ని వ్యాధుల పరంగా విశ్లేషించాల్సివుంటుంది. ఈ సమస్యను 'ఇన్యూరిసిస్‌' అని నిర్థారిస్తారు. మూత్రావయవాల ఇన్ఫెక్షన్‌, నాడీమండల వ్యాధులు, మూర్ఛలు, మానసిక ఎదుగుదల లోపాలు, వెన్నునాడుల లోపాల వంటివీ ఈ సమస్యకు కారణం కావచ్చు.

5 సంవత్సరాల వయస్సు తర్వాత పక్కతడుపుతుంటే మాత్రం, సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంలో వారసత్వం, వ్యాధి పరమైన కారణాలూ గుర్తుంచుకోవాల్సిందే.

ఈ పక్క తడిపే సమస్యను ప్రధానంగా ప్రభావితం చేసే అంశాలు మూడు. అవి- గాఢ నిద్ర, కలలు, పక్కతడుపుతున్న సమయం. కొంతమంది మొద్దు నిద్రలో మూత్ర విసర్జన చేసేస్తారు. కొంతమంది మూత్రవిసర్జన చేస్తున్నట్లుగా కలలుగంటూ మూత్రవిసర్జన చేస్తారు. కొందరు సమయాన్నిబట్టి, అంటే నిద్రపోవటం మొదలుపెట్టగానే మూత్ర విసర్జన చేయడం, లేదా మరి కొంతమంది వేకువజామున మూత్ర విసర్జనచేయటం కూడా జరుగుతుంటుంది.

Types of enuresis include:

    Nocturnal enuresis (bedwetting)
    Diurnal enuresis
    Mixed enuresis - Includes a combination of nocturnal and diurnal type. Therefore, urine is passed during both waking and sleeping hours.

  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.