Friday, November 13, 2009

Mythology and Health , ఆధ్యాత్మికం - ఆరోగ్యం




జీవితం లో ఏ దశలో ఉన్నా మనిషికి కావాలిసింది మానసిక ప్రశాంతత ,.. ఈ ప్రశాంతత కరువైతే డబ్బు , సంపద , హోదా, ఇతర సౌకర్యాలు ఏవీ మనిషిని ఆడుకోలేవు .జీవితం లో ఎటువంటి విజయాలు సాధించినా , ఎంతటి ఉన్నత స్థితికి చేరినా చివరిగా కావాల్సింది మానసిక ఆనందం , ప్రసంతట మాత్రమే .

జీవితం లో అనుకున్నది సాధిస్తే మానసిక ప్రశాంతత వస్తుందని భావించవచ్చు ... ఆ ఆలోచనతో పగలు , రేయి అనే తేడా లేకుండా , పోటీ ప్రపంచం లో కొట్టుకుని చవరికి అనుకున్నది సాధిస్తారు . విజయ గర్వం తో వెనుదిరిగి చూసుకుంటే విజయ శిఖరం మీద ఒంటరిగా మిగిలామన్న దుగులు మొదలవుతుంది .అక్కడ నుండి ఏదో తెలియని అలజడి , ఆశాంటి ... దానినుండి బయటపడి తిరిగి సాధారణ మనిషి గా జీవించేందుకు ప్రయత్నాలు మొదలౌతాయి .

టిప్స్ :
1. జీవితం లో ఎలా ఎదుగుతున్నా ఎంత వేగం గా లక్ష్యం వైపు పరుగులు తీస్తునా . . . తానూ ప్రాధమికం గా మనిషి నని , మానవత్వం మనిషి ముఖ్య గుణమని .. అనే విషయం మరువకూడదు .శారీరక , మానసిక ఆరోగ్యం , ప్రశాంతతను అందించేది వాస్తవానికి దగ్గర గా బ్రతకగలిగిననాడే .

2. తమ తమ వృత్తులలో బిజీ బిజీ గా గడిపే చాలా మందికి మానసిక ప్రశాంతత కరువవడానికి కారణం తన తోటివారికి దూరం గా జరగటమే . భౌతికం గా కాక మానసికం గా ఏర్పడుతున్న ఎడం వలన ఒంటరివరవుతున్నారు . ప్రకృతికి , తోటి మానవులు , జతువులకి మనిషికి విడదీయలేని బంధముంది .. .. అది ఎన్నటికీ వదల కూడదని చెప్పేందుకు ప్రతి జీవిలో ఉన్న ఆత్మా ఒక్కతేనన్న విశేష ఆలోచనను పెద్దలు మనకు అందించారు . మునులు , ఋషులు ఏన్తో ఆలోచించి , తమ జ్ఞానం రంగరించి అందించిన ఆధ్యాత్మిక చింతనా మార్గం తెలియక కొట్టుమిట్టాడుతున్న బిజీ మనుషులు మానవత్వం వైపు మళ్ళించేందుకు నిర్దేచించిన మార్గాలివి .

3. ఈ అనంత విశ్వాన్ని ఒక మహత్తర శక్తి నడిపిస్తోంది. అది భగవంతుడో లేక మరొకతో అనవసరం .. అయితే ప్రతి ఉదయం ప్రశాంత ఉదయం గా అందిస్తున్న ఆ శక్తికి నమస్కరించి రోజును మొదలు పెట్టండి . అడేవిధం గా ప్రతి రాత్రి పడుకునే ముందు ఆ రోజులో జరిగిన సంఘటనలను తలచుకొని వాటిని విజయవంతం గా నడిపింపచేసిన ఆ శక్తికి కృతజ్ఞతా వందనం చేయండి .

4. ప్రభాత కాలం లో 20 నిమిషాల పాటు చల్లని ప్రశాంత వాయువులను పేలుస్తూ అటు ఇటు నడవాలి . ముఖం మీద చిరునవ్వులు చిన్దిస్తుడాలి . నవ్వు అంతర్గతం గా ఎన్నో లోపాలును సరిదిద్దుతుంది .మనసును ప్రశాంత పరచగలిగిన శక్తి నవ్వుకుంది . దానిని ఉపయోగించుకోవటం మన చేతిలో పని .

5. ఆహారనుయమాలు పాటించాలి . ఏదితిన్నా అది తాజాగా వండినది ఉండాలి . అది కుడా పూర్తిగా ఉడికించినది కాక , ఓ మోస్తరు తక్కువగా ఉడికించినది ఉండాలి . మసాలా దినుసుల వాడకం తగ్గించాలి . మనం సృస్తించే మానసిక శక్తికి మూలము .. ఆహారము అందించే శక్తే . ఈ ములపదార్దము మేలుగా ఉంటే శక్తి కుడా చక్కనిది ఉంటుంది .

6. ఆహారపు నియమం తో పాటు నిద్రకి నియమం అవసరం . ప్రతిరోజూ నిర్ణీత సమయం లో పడుకుని వేకువజామునే లేవటం అలవాటు చేసుకోవాలి . అనంత విశ్వం లో మీరు ఒక భాగం .. ఆ అనంత విశ్వం లోని మిగిలిన అంశాలతో మీకు సంభంధం ఉంటుంది ... ఆ బంధాన్ని బద్రపరిచేది ఆధ్యాత్మిక చింతన . ప్రతి ఉదయం ప్రశాంత వాతావరణం లో శుభ్రం గా స్నానం చేసి ఆశ్యాత్మిక చింతను పెంచే గ్రంధాలను చదవండి . . . అవి మతపరమైనవైనా లేదా మహానుభావుల ప్రవచనాలైనా పరవాలేదు .

7. ప్రకృత లో మీ అనుబంధం మరింత గ పెంచుకోండి . ప్రక్రుతి ములాలనుండే జీవం పుట్టింది . అందులోనే మళ్ళీ జీవులు కలిసిపోతాయి . తాత్కాలికం గా లభించే ఆలోచనలు , విజయాలను చూసుకొని ప్రకృతికి వ్యతితేకం గా ఎవ్వరు తయారుకాకూడదు . ఉదయం వేల మొక్కలతో సమయం గడపండి . మొక్కలతో పాటు చుట్టూ కనిపించే చిన్న , పెద్ద జంతువులను గమనిస్తూ వాటికి ఆహారం అందిస్తూ మానసిక ప్రశాంతత అందుకోవడానికి ప్రయత్నించండి .

8. ధ్యానం కున్న శక్తిని మనుషులు మద్యలో మరచిపోయారు . ప్రతి రోజు ఉదయం ధ్యానం తో రోజు వారి పనులను ప్రారంభించటం ఏన్తో మేలుచేస్తుంది .మనసు పడుతున్న ఒత్తిడిని పక్కకు నేట్టివేయగలిగిన శక్తి ధ్యానానికి ఉంది . ముఖ్యం గా నేటి ఉద్యోగాలలో ఒత్తిడి భాగమైపోయింది .

9. ప్రతి రోజు ఉదయం , సాయంత్రం ప్రార్ధన చేయడం అవసరం . ప్రార్ధన అనగానే ఏదో ఒక మతపరమైన అంశం గా పరిగనించ కూడదు . ప్రార్ధనలు మనషును తేలికపరిచే సాధనాలు . మనం ఎంత వద్దనుకునా ఏదో ఒక రకమైన ఒత్తిడికి గురవుతుంటాం . మనసును వేధించే అంశాలలో కొన్ని అర్ధం లేనివి .. పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా పట్టించుకునేవి , అటువంటి వాటినని వదలించుకునే మార్గం , శక్తి ఒక ప్రార్ధలకే ఉన్నది . మనకందని ఎన్నో అంశాలను సాధించి పెట్టేలాగా చేస్తాయి ప్రార్ధనలు .

10. ప్రార్ధన బిగ్గర గా చేస్తాలు కొందరు , మౌనము గా చేస్తారు మరికొందరు . మౌనం లో చేసే పనుల్లో మరెంతో శక్తి ఉందనిపిస్తుంది . అందుకేనేమో మహాత్మా గాది వారం లో ఒకరోజు మౌనం పాటించేవారు . ప్రసిద్ధ గురువులు ఇదే పద్దతి పాటిస్తారు .. రోజంతా మౌనం గా ఉండటం సాద్యం కాకపోయినా కనీసం 20 నుండి ౩౦ నిముషాలు మౌనానికి కేటాయించాలి . కేవలం శ్వాసమీద దృష్తి నిలిపి చేసే ' మౌన వ్రతం ' ఇతర వ్రతాలన్నితికంటే మేలైనది .

11 . స్పందన అనేది సహజం . అయితే స్పందిచే తీరు అందరిలో ఒకేలా ఉండదు . మీకు ఒక ప్రత్యేకత తెచ్చేది మీ స్పందన విధానం . ఏఅంశం మీద అయినా తక్షణం స్పందించాలనుకోవద్దు . కొద్దిసేపు ఆగి స్పందించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది . స్పందనకు ముందు మీరుతీసుకునే సమయం రెండు నిమిషాలే కావచ్చు ... కాని ఆ కొద్దికాలమే అద్భుతమైన తేడాను తెస్సుంది . కొత్త ఆలోచనలనూ మీ ముందుంచుతుంది . మంచి చెడు లకు మధ్య ఉన్న తేడాను తెలుసుకుంటారు .

12. " నీ స్నేహితులెవరో చెపితే నీ గుణగుణాల గురించి చెపుతా"అన్నది తెలుగు నానుడి . ఇది అక్షరాల సత్యం . మంచి ఆలోచనలు , మంచితనం కలిగిన వారితోనే స్నేహం చేయండి . సహనము , దయ , కరుణ కలిగిన వారితోనే తిరుగుతుందండి . దీనినే మనపెద్దలు " సత్సంగం" అన్నారు . సత్సంగం లో అందరితో మీరు కలిసి అద్భుతం గా ఎదగాగాలుగుతారు .

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.