Saturday, November 7, 2009

కలరా ,Cholera


  • కలరా చిన్న పిల్లలకు సెలైన్ ----------------కలరా లో డీహైడ్రేషన్ --------------------------కలరా బాక్టీరియా


కలరా (Cholera) అనునది అతిసార వ్యాధి. ఈ వ్యాధి విబ్రియో కలరే అను బాక్టీరియా వలన కలుగుతుంది. ఇది నీరు ద్వారా లేదా ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రాణాంతక వ్యాధి. ఆతి విరోచనాలతో మొదలయ్యే ఈ వ్యాధి సోకిన వెంటనే వైద్య సహాయం అందకపోతే రోగి మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ప్రపంచంలో నమోదవుతున్న కలరా కేసులు ఎక్కువగా ఆఫ్రికా ఖండం నుంచి నమోదవుతున్నవే. ఇంకా పర్యవేక్షణా లోపం వల్ల చాలా కేసులు సకాలంలో అధికారుల దృష్టికి రాకుండా ఉన్నాయి. కలరా సోకిన తర్వాత ఆఫ్రికాలో 5% మంది చనిపోతున్నారు. అదే ఇతర దేశాల్లో అయితే ఇది కేవలం 1% మాత్రమే.
  • లక్షణాలు
* నీళ్ల విరెచనాలు అధికంగా కావడం.
* వాంతులవడం, మరియు
* కాళ్ల కండరాలు పట్టుకుపోవడం/తిమ్మిరెక్కడం.

  • కలరా ఎలా వస్తుంది?

కలరా బ్యాక్టీరియమ్‌ గల కలుషితమైన నీటిని తాగడం లేదా కలుషితమైన ఆహారం తినడం ద్వారా ఏ వ్యక్తికైనా రావచ్చు. అంటువ్యాధిసోకిన వ్యక్తి యొక్క మల విసర్జితంతో కలుషితమైన వాటి మూలంగా సమాజం లోని కూటమి ఒకే చోట నివసించే వారందరికిని కి సామాన్యంగా కలరా వస్తుంది. మురుగునీరు, మంచి నీటి సదుపాయాలు తగిన రీతిలో లేనప్పుడు శీఘ్రంగా ఈ వ్యాధి వా్యపిస్తుంది.

చవిటిగా ఉండి కొద్దిగా ఉప్పదనంగల నదులలోను, సముద్ర తీరపు నీటి వాతావరణంలో కూడ కలరా బ్యాక్టీరియమ్‌ నివసించగలదు.
శుభ్రంగాలేని లేదా సరిగా ఉడకని ఎండ్రకాయ, రొయ్యలు మెదలగు వాటిని తినడం మూలంగా కలరా రావచ్చును. ఈ వ్యాధి నేరుగా ఒకరి నుండి మరొకరికి వ్యాపించదు. కాబట్టి, సాధారణ స్పర్శ ద్వారా అంటువ్యాధి సోకిన వ్యక్తి నుంచి మరొకరికి వచ్చే ప్రమాదం లేదు.


చికిత్స

చాలావరకు కలరా కేసులను ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ ద్వారా నయం చేయవచ్చు.
తీవ్రమైన వ్యాధిగలవారిలో కూడ రక్తనాళాలకు నేరుగా ఈ ద్రవాన్ని చేరేటట్లుగా ఎక్కించాలి. శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి చేరేటట్లు చేయాలి. నిర్జలీకరణాన్ని లేకుండ చేయడం ద్వారా ఒక శాతం కన్నా తక్కువ మంది కలరా వ్యాధిగ్రస్తులు చని పోతున్నారు.

ఏంటీబయాటిక్స్‌ వల్ల చికిత్సా సమయం తగ్గించబడి, వ్యాధి తీవ్రత తగ్గుతుంది. తీవ్రమైన విరేచనాలు మరియు వాంతులతో బాధపడుతున్న వ్యక్తులకు తక్షణమే వైద్య చికిత్సను అందుబాటులోకి తేవాలి.
వ్యాది తీవ్రత బట్తి : 24 గంటలవర్కూ నోటి ద్వారా ఏమీ ఇవ్వకూడదు . సెలైన్లు ద్వారా కోల్పోయిన నీటిని, లవణాలను బర్తీచేయాలి. అదే సలైన్లలో IV యాంటిబయోటిక్స్ ఇవ్వాలి . సాదారణముగా
డాక్షిసైక్లిన్లు , టెట్రసైక్లిన్లు , సిప్రోఫ్లోక్షిన్లు , సెఫలోస్పోరిన్లు ఇస్తారు . వ్యాది తీవ్రత తగ్గిన తరువాత నోటిద్వారా ఫ్లూయిడ్స్ , యాంటిబయోటిక్స్ 2-3 రోజులు ఇవ్వాలి .

  • నివారణ

కలరా వ్యాధి ప్రాణాంతకమైనా దీన్ని మన దైనందిన కార్యక్రమాలన్నింటిలో పరిశుభ్రతను పాటించడం ద్వారా సులభంగా నివారించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో నీటిని శుద్ధం చేయడానికి మంచి సాంకేతిక పద్దతులు అమలులో ఉండటం వలన ఇది ఆ దేశాల్లో చాలా అరుదు గా కనిపిస్తుంది.
కలరా వాక్షిన్‌ తీసుకోవడము మంచిది .

  • తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు

* బూడిద సేకరణ గుంటలను శుభ్రపరచడం, స్వేచ్చగా గాలి ప్రసరించెటట్లుగానూ మరియు ఉంటున్న ప్రదేశంలో అంటు వ్యాధిసోకకుండా చేయడం.
* శారీరకంగా లేదా మానసికంగా అధిక అలసట చెందకుండా చూసుకోవాలి. శీఘ్రంగా ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులకు గురి కాకూడదు.
* గుంపులలో ఉండడం చేయకూడదు.
* మరగకాచిన నీటిని చల్లార్చి, ఒక సీసాలో సగం వరకు నింపి చక్కగా బిగించి ఉంచి తాగే కొద్దినిమిషాల ముందు సీసాను బాగా గిలకరించాలి. మంచి నీటితో నింపే సీసాతోబాటు, నీరు తాగే కప్పులను లేదా గ్లాసులను కూడ సలసల కాగే నీటిలో వేసి శభ్రం చేయాలి.
* మరగించని దేనినీ కూడ తాగకూడదు.
* అన్నీ ఆహార పదార్ధాలను బాగా వండాలి. కాచిన నీటిలో బాగుగా కడిగిన పండ్లనన్నింటినీ వేడి నీటిలో కడిగిన గిన్నెలలో మాత్రమే ఉంచాలి ; లేదా పండ్లను కడిగిన తర్వాత వాటిపైన గల తొక్కలను తొలగించడం, లేదా బట్టతో అన్ని రకాల పండ్ల పైన కప్పి ఉంచడం మెరుగైన పద్ధతి.
* సామాన్యంగా తీసుకునే రొట్టె , వెన్నకు బదులుగా వెచ్చ చేసిన (నిప్పుల ముందు కల్చిన) వాటిని తీసుకోవాలి.
* వేడి, వేడిగా భోంచేయడం చాలా మంచిది.
* అన్ని గిన్నెలు, గ్లాసులు, కత్తులు, ఫోర్కులు, చెంచాలు, పెనము/బాణలి, తినడానికి వినియోగించే అన్నింటినీ ఉపయోగించడానికి ముందు, వేడి నీటితో కడగాలి. ఏవేవిుటి తయారుచేస్తారో వాటిని అన్నింటిని వేడిపొయ్యి పై వేడిమితో ఉంచాలి.
* మరగకాచని నీటిలో దేనిని కడగరాదు.
* రోజులో చాలాసార్లు , భోజనానికి ముందు చేతులను, ముఖాన్ని కార్బాలిక్‌ ఆమ్లంతో కలిసిన కాచిన నీటితో శుభ్రం చేసుకోవాలి.
* వీలైతే ప్రతీసారి శుభ్రంగా ఉతికిన తువ్వాళ్ళనే వాడాలి.
* కడగడానికి వినియోగించే నీటిని మరిగే ఉష్ణోగ్రత వద్దకు వచ్చేటంత వరకు ఉంచి తర్వాత చల్లబరచాలి.
* పక్క బట్టలను, విసర్జన శాలలో ఉపయోగించే బట్టలను మరిగే నీటిలో వేసిన తర్వాత ఎండలో ఆరవేయాలి.
* వాడిన ప్రతీసారి కంచాలను/పళ్ళాలను శుభ్రపరచే బట్టలు, అన్నీ రకాల పొడిగా ఉంచే బట్టలను మరిగే నీటిలో వేయాలి. మరల వాడ వలసినప్పుడు బాగా ఆరబెట్టి, వేడిచేయాలి.
* కుటుంబంలో ఒక వ్యక్తికి గనక కలరా వేస్త అతనిని ఇతరులు నుండి విడిగా ఉంచాలి.
* కలరా రోగిగ్రస్తుల దేహాలను శుభ్రపరచడానికి లేదా వారి దుస్తులను మరియు మురికైన బట్టలను జాగ్రత్తగా తొలగించడానికి, నోటిని, ముక్కురంధ్రాలను అరంగుళం మందం మేరకు దూదిని/ బట్టతోదట్టించిన స్వచ్చమైన లోహపు బట్టతో తయారుచేసిన చిన్నపాటి ముసుగుతో కప్పి ఉంచుకోవడం తప్పనిసరిగా చేయాలి. ముసుగును /తొడుగును 150డిగ్రీల సెంటిగ్రెడ్‌ వేడిమికి గురిచెయ్యాలి . వినియోగించిన ప్రతిసారి అంతే వేడిమి ఉండేటట్లు చూడాలి. మంట కొలిమి యెదుట ముసుగును పట్టుకుని ఉంటె ఆ వేడిమి కల్గుతుంది. వాడిన ప్రతీసారి అదే వేడిమి చివరిదాకా ఉండాలి.
* కలరా రోగగ్రస్తులను ఉంచిన గదులను ముందుగా అనేక గంటలేసపు ఎవ్వరూ లేదా ఇతరులు ప్రవెశించకుండా మూసి ఉంచాలి.

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.