Sunday, August 16, 2009

పక్షవాతము , Paralysis




పక్ష వాతము మనిషి బ్రతికి ఉం అచేతనం గా ఉండే విచిత్ర స్థితి . శరీరము లో ఒక భాగము కాని , సగము కాని , పూర్తిగా కాని తమ కదేలే శక్తిని సంపూర్ణము గా కోల్పోతే దాన్ని పక్షవాతము (paralysis) అంటారు . ఇది వస్తే ఆ భాగము స్పర్శ , కదలిక ఏమీ ఉండవు .

పెరాలసిస్‌ (పక్షవాతం) అంటే మనలో అందరికీ దాదాపుగా తెలిసే వుంటుంది. ఎందుకంటే మన ఇంట్లో బామ్మలు, తాతయ్యలు వుంటారు కదా!వారిలో ఎవరో ఒకరికి పక్షవాతం రావడం ప్రస్తుతం సర్వ సాధారణంగా మారింది.

శరీరం అంతా బిగుసుకుపోవడం, మూతి అష్టవంకరలు తిరిగిపోవడం, కాళ్ళు చేతులు వెనుతిరగి పోవడం, ఒక్కోసారి గుండె కూడా పనిచేయకపోవడం ఇలా శరీరంలో ప్రతి అవయవం పై పక్షవాతం ప్రభావం ఏదో విధంగా తెలియ కుండా కనిపిస్తుంది.

వారు తినాలన్నా లేదా ఏదైనా పని చేసుకోలేరు. వేరొకరి మీద ఆదారపడవలసిన వుంటుంది. ఎందువలనంటే శరీరం బిగుసుగా వుండటం వలన మనకు అనువుగా శరీరం వుండదు కాబట్టి. పైగా చేతులు,కాళ్ళు వంకరలు తిరగటం వలన లేచి నడవలేని వాళ్ళు కూడా వుంటారు. నోటి నుంచి మాట్లాడటమే కష్టం అవుతుంది.

ఏదైనా మాట్లాడాలి అనుకుంటే గంటలకొద్ది వారితో మాట్లాడాల్సి వుంటుంది. కొంతమంది అదీ కూడా చేయలేరు. మంచం మీద పడుకునే వుంటారు. అన్ని కార్యక్రమాలు మంచం మీదనే ముగిస్తారు.

ఈ స్తితి వచ్చిన శరీర భాగాన్ననుసరించి ఐదు రకాలు ...

శరీరము లో సగ భాగము చచ్చుబడి పోతుంది -పక్షవాతము (Hemiplegia) , - .
రెండు కాళ్ళు గాని , రెండు చేతులు గాని చచ్చుబడి పొతే - పెరప్లీజియా (paraplegia)
రెండు కాళ్ళు + రెండు చేతులు కలిపి చచ్చుబదిపోతే -- క్వడ్రి ప్లీజియా (Quadriplegia),
ఏదేని ఒక అవయవము , అవయవము లోని భాగము చచ్చుబదిపోతే --మొనోప్లేజియా(Monoplegia),
ఒక్క ముఖమే చచ్చుబడి పొతే -- బెల్చిపాల్చి (Bel'spalsy) అంటారు ,

కారణాల వల్ల వస్తుంది :
స్ట్రోక్ : ఈ స్ట్రోక్ లో మెదడుకి రక్త ప్రసారము ఆగిపోతుంది .. . దానివల్ల మెదడు లో జీవకణాలు చచ్చిపోతాయి . ఈ స్థితి రెండు రకాలుగా ఉంటుంది .
ఒక దానిలో మెదడకు వెళ్ళే రక్తనాళాలలో రక్తము గడ్డకట్టడం .... దీన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాము .
రెండవది .. మెదడు లోని రక్తనలలో వత్తిడి పెరిగి పగిలి రక్తస్రావము జరగడం ... దీన్ని " హెమరేజిక్ స్ట్రోక్ అంటాము .
ఏది ఏమైనా మెదడులోని కొన్ని కణాలూ చనిపోవడం వలనే ... ఆ సంభదిత అవయవాలు చచ్చుబడి పక్షవాతము వస్తుంది
ఎలా గుర్తు పట్టడం :
హటాత్తు గా ముఖము , కాళ్ళు ,చేతులు నీరసపడి తిమ్మిరిగా ఉండడం.. అదీ ఒక వైపు , హటాత్తు గా భ్రమ , ఏమీ తెలియని స్థితి , మాట్లాడలేక పోవడం , సరిగా చూడ లేకపోవడం ,హటత్తు గా విపఫీతమైన తలపోటు రావడం , సరిగా నిలబడలేక , లేవలేక , తెలిసీ తెలియని స్తితి లో ఉండడం .

స్వభావ రీత్యా రెండు రకాలు :
స్పస్తిక్ పెరాలసిస్ : కదలికలలో నియంత్రణ లేక , కండరాలు బండబారి ఉండటం ,
ప్లాసిడ్ పెరాలిసిస్ : దీని లో కండరాలు సన్నబడవు . కండర శక్తి పూర్తిగా పోతుంది .

చికిత్స :
వ్యాదిని బట్టి నిపులైన వైద్యుల చేత ట్రీట్మెంట్ తీసుకోవాలి .

ఎవరికి వస్తుంది?

అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, అధిక బరువు ఉన్న వారికి, ధూమాపానం, మద్యపానం చేసే వ్యక్తులకు పక్షవాతం వస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌ ఉండే వారిలో వచ్చే అవకాశం ఎక్కువ. సాధారణంగా 50 నుంచి 60 ఏళ్ల వయసు మధ్య వ్యక్తులకు వచ్చే అవకాశముంది. కానీ ఈ మధ్య మనదేశంలో చిన్నవయసులోనే పక్షవాతానికి గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ధూమపానం, మద్యపానం అలవాట్లబారినపడడం, శారీరక శ్రమ తగ్గడం, ఆహారపు అలవాట్లలో మార్పు ముఖ్య కారణాలు. మన దేశంలో ముఖ్యంగా 'ఆర్టిరరీ అథిరోస్క్లిరోసిస్‌' వల్ల పక్షవాతం ఎక్కువ కనిపిస్తుంది. దీనికి కూడా పైన చెప్పికారణాలే అధికం. కొంత మందిలో మరీ చిన్న వయసులో పక్షవాతం కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వస్తుంది. అవి ఆటో ఇమ్యూన్‌ డిసిజ్‌ వంటి ఆంటి ఫాస్పో లిపిడ్‌ సిండ్రోం, ఎస్‌ఎల్‌ఇ. చిన్న పిల్లల్లో మోయ-మోయ డిసీజ్‌, గుండె జబ్బు వ్యాధులలో పక్షవాతం వచ్చే అవకాశముంది.

ఫిజియోథెరపీ పాత్ర

పక్షవాతానికి సంబంధించిన వైద్యంలో ఫిజియోథెరపి ముఖ్యపాత్ర వహిస్తుంది. చచ్చుబడిన అవయవాలను తిరిగి సాధారణ స్థాయికి తీసుకురావడానికి ఇది దోహదపడుతుంది. లేదంటే పక్షవాతం వచ్చిన భాగం బిగుసుకుపోయి కదలికలు మరీ తక్కువ అవుతాయి. పక్షవాతం వచ్చిన కండరాలు మరీ బిగుసుకుని కదలికలు తగ్గిన వారిలో బోటాక్స్‌ అనే ఇంజక్షన్‌ కండరాలను తీసుకోవడం వల్ల బిగుతు తగ్గి కదలికలు పెరిగే అవకాశముంది.

జీవనశైలి మారాల్సిందే

పక్షవాతం రాకుండా నివారించడంలో జీవనశైలిది కీలక పాత్ర. ధూమపానం, మద్యపానం, గుట్కా, మత్తుపదార్థాలు వాడే వారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారు కచ్చితంగావాటిని మానడం ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం అంటే నడక, జాగింగ్‌, సైక్లింగ్‌, ఈతకొట్టడం చేయాలి. అధిక కొలెస్ట్రాల్‌ కలిగిన ఆహారాలను మానాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, తాజాపండ్లు, విటమిన్‌-సి, విటమిన్‌ కలిగిన ఆహారపదార్థాలు తీసుకోవాలి. వీటి వల్ల పక్షవాతం వచ్చే అవకాశాన్ని నివారించొచ్చు. ఇప్పటినుంచైనా ప్రతి ఒక్కరూ తమ జీనవశైలిని మార్చుకోవాలి.

వంశపారంపర్యంగా వస్తుందా?

ఇంత వరకు మనకు అధిక రక్తపోటు, మధుమేహం వంశపారంపర్యంగా వస్తుందని తెలుసు. ఇప్పుడు ఇదే కోవలోకి పక్షవాతం చేరింది. పక్షవాతం వంశపారంపర్యంగా వచ్చే అవకాశముందని పరిశోధనలు తెలుపుతున్నాయి. కొన్ని వంశపారంపర్యంగా హై కొలస్ట్రాల్‌, హోమో సిస్టినిమియ వంటి వ్యాధులలో పక్షవాతం వచ్చే అవకాశముంది. కుటుంబంలో పక్షవాతం వచ్చిన వారు, 40 నుంచి 50 ఏళ్ల మధ్య కొన్నిసాధారణపరీక్షలలో పక్షవాతం వచ్చేకారణాలను గుర్తించి జాగ్రత్తపడొచ్చు.

నివారణ కూడా ముఖ్యమే

పక్షవాతాన్ని నివారించేందుకు ఇప్పుడు అధునాతన మందులు అందుబాటులో ఉన్నాయి. ఇస్కిమిక్‌ స్ట్రోక్‌ వచ్చిన వారిలో మెదడులో రక్తం తిరిగి గడ్డకట్టకుండా ఆస్ప్రిన్‌, క్లోపోడ్రిగిల్‌ వంటి మందులు జీవితాంతం వాడాలి. దీని వల్ల రెండోసారి పక్షవాతం రాకుండా కాపాడొచ్చు. బ్రెయిన్‌ హెమరేజ్‌ సాధారణంగా అధికరక్తపోటు వల్ల వస్తుంది. దాన్ని నివారించేందుకు కచ్చితంగా బిపి మాత్రలు వాడడం ముఖ్యం. కొంతమందిలో గుండె నుండి మెదడుకు రక్తం సరఫరా చేసే ధమనులు-కెరోటెడ్‌ ఆర్టరీల్లో బ్లాక్స్‌ ఏర్పడి పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అతి చిన్న పరీక్ష 'కెరోటెడ్‌ డాప్లర్‌'తో గుర్తిస్తారు. అటువంటివారు ఈ పరీక్ష చేయించుకుంటే మేలు. ఒక వేళ బ్లాక్‌ 70 వాతం కంటే అధికంగా ఉంటే ఆపరేషన్‌ ద్వారా ఆ బ్లాక్‌ను తొలగించిపక్షవాతాన్ని నివారించొచ్చు. మధుమేహం, కొలెస్ట్రాల్‌ వంటి వ్యాధులు ఉన్నవారు కచ్చితంగా డాక్టరు పర్యవేకణలో వ్యాధులకు చికిత్స తీసుకుని, పక్షవాతం వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. గుండె జబ్బు ఉన్నవారు కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువ. అటువంటివారు క్రమం తప్పకుండా మందులు వాడుతూ డాక్టరు పర్యవేకణలో ఆరునెలలకోసారి పరీక్షలు చేయించుకుంటే పక్షవాతాన్ని నివారించొచ్చు.

మూడు గంటల్లోనే ఎందుకు?

పక్షవాతం వచ్చిందని గుర్తించిన వెంటనే చేయడం మంచిది. అంటే వ్యాధి కనిపించిన మూడు గంటల్లోపు మాత్రమే ఇస్కిమిక్‌ స్ట్రోక్‌కు చికిత్స చేయాలి. ఆ 3 గంటలలోపు ప్రతేకమైన 'ఆర్‌-టిపిఎ' అనే ఇంజక్షన్‌ ఇవ్వడం వల్ల ఆ రక్తనాళాల్లోని బ్లాక్‌ తొలగించి తిరిగి రక్తప్రసారాన్ని మెదడుకు పునరుద్ధరించొచ్చు. దాని వల్ల పక్షవాతం పూర్తిగా నయమయ్యే అవకాశముంది. 3 గంటల తర్వాత మెదడులోని నాడీకణాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. కాబట్టి వాటిని తిరిగి కోలుకునేటట్లు చేయడం సాధ్యంకాదు. కొంత మందిలో పక్షవాతం వల్ల మెదడులో వాపురావడం, ఫిట్స్‌ రావడం, కోమాలోకివెళ్లిపోవడం వంటి లక్షణాలు కనిపించే అవకాశముంది. అటువంటి వారికి ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉంచి చికిత్స చేయాల్సిరావొచ్చు.
పక్షవాతం లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి చేర్చటం ఎంత కీలకమో.. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత కూడా ఎంత త్వరగా చికిత్స మొదలుపెడితే అంత మెరుగైన ఫలితాలుంటాయి. ముఖ్యంగా గంటలోపు టిష్యూ ప్లాస్మినోజెన్‌ యాక్టివేటర్‌ (టీపీఏ) ఇంజెక్షన్‌ ఇస్తే మరణించే అవకాశాలు గణనీయంగా తగ్గుతున్నట్టు అమెరికాలో చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆసుపత్రికి వచ్చాక చికిత్స చేసే సమయం తగ్గుతున్నకొద్దీ (ప్రతి 15 నిమిషాలకు) మరణించే అవకాశం 5 శాతం తగ్గుతున్నట్టు తేలింది. అలాగే మెదడులో తరచూ రక్తస్రావం కావటాన్నీ తగ్గిస్తున్నట్టు బయటపడింది. పక్షవాతం బాధితులు ఆసుపత్రికి వచ్చాక కేవలం 26.6 శాతం మందికే గంటలోపు టీపీఏని ఇస్తున్నట్టు పరిశోధకుల విశ్లేషణలో బయటపడింది. మూడు గంటల్లోపు చికిత్స మొదలుపెడితే మంచి ఫలితాలు ఉంటాయని ఇప్పటివరకు భావిస్తున్నారు. కానీ అంతకన్నా ముందే చికిత్స ఆరంభిస్తే మరింత మెరుగైన ఫలితం ఉంటుందని పరిశోధకులు వివరిస్తున్నారు.

పక్షవాతం రక్తపరీక్షతోనే నిర్ధారణ!
పక్షవాతం లక్షణాలు కనబడుతున్నాయి. అది పక్షవాతమేనా? కాదా? నిర్ధారించుకునేదెలా? ప్రస్తుతం దీనికోసం సీటీ లేదా ఎమ్మారై స్కానింగుల మీదే ఆధారపడుతున్నారు. మళ్లీ వీటిలో కూడా సీటీ స్కాన్‌లో కంటే ఎమ్మారైలోనే ఈ విషయం స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇది చాలా ఖరీదైన పరీక్ష, పైగా అన్ని ఆసుపత్రుల్లోనూ ఎమ్మారై సదుపాయం ఉండటం లేదు. ఒకవేళ రోగి ఇప్పటికే గుండెలో పేస్‌మేకర్ల వంటివి పెట్టించుకుని ఉంటే వారికి ఎమ్మారై చెయ్యటమూ కుదరదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని... పక్షవాతం సమస్యను తేలికైన రక్తపరీక్ష ద్వారా గుర్తించటం ఎలా? అన్నదానిపై పరిశోధకులు చాలా కాలంగా దృష్టిపెడుతున్నారు. తాజాగా తాము పురోగతి సాధించామని చెబుతున్నారు పెన్‌ స్టేట్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు. ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో.. మెదడులోని రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం మూలంగా వచ్చే పక్షవాతం ముప్పును కేవలం రక్తపరీక్ష ద్వారానే వీరు 98% వరకూ కచ్చితంగా గుర్తించగలిగారు. మన మెదడులోని 'గ్లుటమేట్‌' అనే రసాయనం మోతాదులను గుర్తించటమే ఈ రక్త పరీక్ష ప్రత్యేకత. మెదడులో రక్త ప్రవాహం దెబ్బతిన్నప్పుడు ఈ గ్లుటమేట్‌ ఒకేసారి పెద్దమొత్తంలో రక్తంలోకి విడుదలవుతుందని ప్రొఫెసర్‌ కెర్‌స్టిన్‌ బెటర్‌మన్‌ చెబుతున్నారు. అధ్యయనంలో భాగంగా పక్షవాతం తొలి లక్షణాలు కనిపించిన 24 గంటల్లోనే వారి రక్తంలో గ్లుటమేట్‌ మోతాదులను పరీక్షించారు. వీరికి పక్షవాతం వచ్చిన గంట తర్వాత గ్లుటమేట్‌ మోతాదు గణనీయంగా పెరిగినట్టు గుర్తించారు. పక్షవాతం నిర్ధారణలో మున్ముందు ఈ పరీక్ష కీలకం అవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

  • పక్షవాతం-తోడబుట్టిన ముప్పు

పక్షవాతం ముప్పు ఉందేమో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ అన్నాదమ్ములు, అక్కాచెల్లెలను ఓసారి గమనించండి. ఎందుకంటే పక్షవాతం ముప్పు విషయంలో తోడబుట్టిన వారి మధ్య పోలికలు కనబడుతున్నట్టు స్వీడన్‌ పరిశోధకుల అధ్యయనంలో బయటపడింది. మొత్తం 20 ఏళ్ల పాటు జరిగిన ఈ అధ్యయనంలో పక్షవాతం బారినపడ్డవారిని, వారి తోడబుట్టిన వారిని పరిశీలించారు. ప్రధానంగా రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడటం వల్ల సంభవించే 'ఇస్ఖీమిక్‌' పక్షవాతంపై ఇందులో దృష్టి పెట్టారు. గతంలో పక్షవాతం వచ్చిన అన్నాదమ్ములు, అక్కాచెల్లెల్లు గలవారికి పక్షవాతం ముప్పు 60% అధికంగా ఉంటున్నట్టు బయటపడింది. ముఖ్యంగా తోడబుట్టిన వారిలో ఎవరైనా చిన్న వయసులోనే పక్షవాతం బారినపడతే మిగతావారికి కూడా ఈ ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. ఇందుకు వారి మధ్య ఉండే జన్యుపరమైన పోలిక ఒక కారణం కావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఆయా కుటుంబాల్లో కనిపించే ఒకే రకమైన జీవనశైలి పద్ధతులూ దీనికి దోహదం చేస్తుండొచ్చని అనుమానిస్తున్నారు. జీవనశైలి పద్ధతులు మార్చుకునే వీలుండటం వల్ల ముందే జాగ్రత్త పడటం మంచిదని సూచిస్తున్నారు. మంచి పోషకాహారం తీసుకోవటం, వ్యాయామం చేయటం, అధిక బరువును తగ్గించుకోవటం వంటి వాటితో ఈ ముప్పును తప్పించుకోవచ్చు.

  • ఏడు సూత్రాలతో పక్షవాతం దూరం :



గుండెను ఆరోగ్యంగా కాపాడుకుంటుంటే పక్షవాతం ముప్పునూ తప్పించుకోవచ్చా? అవుననే అంటున్నారు పరిశోధకులు. గుండె ఆరోగ్యాన్ని తెలుసుకోవటానికి ఉపయోగపడే తేలికైన ప్రశ్నలు పక్షవాతం ముప్పును అంచనా వేయటానికీ తోడ్పడుతున్నట్టు తేలటమే దీనికి నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది మరణాలకు దారితీస్తున్నవాటిల్లో పక్షవాతానిది నాలుగోస్థానం. మెదడుకు రక్తసరఫరా చేసే రక్తనాళాలు చిట్లినా, వాటిల్లో అడ్డంకులు ఏర్పడినా పక్షవాతం ముంచుకొస్తుంది. గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయటానికి అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ 'లైఫ్స్‌ సింపుల్‌ 7 (ఎల్‌ఎస్‌7) ' పేరుతో కీలకమైన అంశాలతో ఒక జాబితా రూపొందించింది. ఇందులో శారీరకశ్రమ, ఆహారం, బరువు. రక్తపోటు, రక్తంలో చక్కెర మోతాదు, పొగతాగటం, కొలెస్ట్రాల్‌ను చేర్చింది. వీటి ఆధారంగా ఎల్‌ఎస్‌7 స్కోరును (మార్కులు) లెక్కిస్తారు. ఎక్కువ మార్కులు వచ్చినవారికి గుండె రక్తనాళాల జబ్బు, మరణించే ముప్పు తక్కువగా ఉంటుందన్నమాట. అయితే ఈ ఎల్‌ఎస్‌7 స్కోర్‌తో పక్షవాతం ముప్పునూ అంచనా వేయొచ్చోలేదోననీ పరిశోధకులు ఇటీవల పరీక్షించారు. ఇందులో మంచి మార్కులు తెచ్చుకున్నవారికి పక్షవాతం ముప్పు 25% తక్కువగా ఉంటున్నట్టు తేలటం గమనార్హం. శారీరకశ్రమ, ఆహారం వంటి ఏడు అంశాల్లో ఒకదానిలోనైనా మంచి మార్కులు వచ్చినా పక్షవాతం ముప్పు తగ్గుతుండటం విశేషం. అందువల్ల క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, ఆరోగ్యకర ఆహారం తీసుకోవటం, బరువును అదుపులో ఉంచుకోవటం, పొగ మానెయ్యటంతో పాటు కొలెస్ట్రాల్‌, రక్తపోటు, రక్తంలో గ్లూకోజు మోతాదులను నియంత్రణలో ఉంచుకోవటం అన్నివిధాలా మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇది గుండె ఆరోగ్యానికే కాదు.. పక్షవాతం ముప్పును నివారించుకోవటానికీ ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.

  • ====================
Visit my website : Dr.Seshagirirao.com

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.